స్థానిక విజయం

Thu,June 6, 2019 01:12 AM

పరిషత్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించి, తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదనేది ఇప్పటికే స్పష్టమైనప్పటికీ, లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఆశించినట్టు పదహారు స్థానాలు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రజలు మళ్ళా టీఆర్‌ఎస్‌కు అసాధారణ విజయా న్ని కట్టబెట్టారు. ఎన్నికలు జరిగిన మొత్తం 32 జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్ పూర్తి పట్టు సాధించింది. 32 జిల్లాల్లో 5, 817 ఎంపీటీసీ, 538 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 158 ఎంపీటీసీ, నాలుగు జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకున్నది. ఏకగ్రీవంతో కలిపి మొత్తం 3,571 ఎంపీటీసీ, 449 జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకొని తెలంగాణ వ్యాప్తంగా తన శక్తిని చాటుకున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్షాలకు పరిషత్ ఎన్నికలపై కొంచెం ఆశ పుట్టిన మాట వాస్తవం. కానీ కాంగ్రెస్, బీజేపీ ఇతర రాజకీయపక్షాలు చెప్పుకోదగిన బలాన్ని ప్రదర్శించలేకపోయాయి. కాంగ్రెస్ 75 జడ్పీటీసీలను మాత్రమే దక్కించుకున్నది. 1380కి పైగా ఎంపీటీసీలలో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు ఏ ఒక్క జిల్లాలోనూ జడ్పీటీసీ బలం సింగిల్ డిజిట్‌కు దాటలేదు. ఐదు జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీని గెలుచుకోలేకపోయింది. ఎనిమిది జిల్లాల్లో ఒకే ఒక్క జడ్పీటీసీ వంతున గెలుచుకున్నది. ఆరు జిల్లాల్లో ప్రతిపక్షాలకు ఒక్క జడ్పీటీసీ కూడా దక్కలేదు. పరిషత్ ఎన్నికలలో బీజేపీ బలహీనత స్పష్టంగా బయటపడ్డది. ఎనిమిది జడ్పీటీసీలను, 206 ఎంపీటీసీలను మాత్రమే గెలుచుకోగలిగింది.

పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసి, స్థానిక సంస్థలకు విధులు, బాధ్యతలు అప్పగించాలనేది ముఖ్యమంత్రి సంకల్పం. ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతతో వ్యవహరించాలనేది కేసీఆర్ దృక్పథం.
ఈ నేపథ్యంలో ప్రజలు స్థానిక సంస్థలలో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టడానికి ప్రాధాన్యం ఏర్పడ్డ ది. స్థానిక సమరం ముగియడంతో ఎన్నికల ఘట్టం ముగిసింది. కానీ కేసీఆర్ చేపట్టబోయే కార్యాచరణ ముందున్నది. ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా ముఖ్యమంత్రి మార్గదర్శనం మేరకు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలె.


టీడీపీ 21, వామపక్షాలు 71 ఎంపీటీసీ స్థానాలను మాత్రం గెలుచుకోగలిగాయి. ఓటింగ్ యంత్రాల ద్వారా కాకుండా బ్యాలట్ పత్రాల ద్వారా ఈ ఎన్నికలు జరిగాయి. దీనివల్ల కొందరు నాయకులు తమ పార్టీ పరాజయానికి ఈవీఎంలు కారణమనే అవకాశం లేకుండాపోయింది. తెలంగాణ పోరాటంలో కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలు దృఢమైన విశ్వాసాన్ని ప్రదర్శించా రు. సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ తెలంగాణ రాజకీయాలను శాసించడానికి కార ణం ప్రజల అండదండలే. గత ఐదేండ్లలో పరిపాలనా దక్షుడిగా కేసీఆర్ ఖ్యాతి దేశవ్యాప్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రజలు ఏకపక్ష తీర్పు ఇవ్వడం మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా టీఆర్‌ఎస్ గెలుపు అపూర్వమైనదే. 12, 751 గ్రామాలలో ఎన్నికలు జరిగాయి. ఇందు లో 2,134 గ్రామాలలో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే, అందులో 1,869 టీఆర్‌ఎస్‌కే లభించా యి. మొత్తంగా 9,156 గ్రామాలలో టీఆర్‌ఎస్ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలలోనూ ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల అసాధారణ అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాలను గెలుచుకున్నంత మాత్రాన బలపడినట్టు కాదని ఈ పరిష త్ ఎన్నికలతో స్పష్టమైపోయింది. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలలో బీజూ జనతాదళ్ నాయకు డు నవీన్ పట్నాయక్‌కు ఐదోసారి విజయం అందించిన ప్రజలు లోక్‌సభ ఎన్నికలలో మాత్రం కొంచెం మోదీ వైపు మొగ్గుచూపడం గమనార్హం. తెలంగాణలోనూ మోదీ ప్రభావం కొంత పడినప్పటికీ, బీజేపీ శ్రేణులు ఊహిస్తున్నంత గొప్పగా ఏమీ లేదు. బీజేపీ, కాంగ్రెస్ గెలుచుకున్న లోక్‌స భ స్థానాల పరిధిలోనూ పరిషత్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.

కేసీఆర్ పట్ల ప్రజలకున్న దృఢమైన విశ్వాసం పట్ల ఎవరికి అనుమానాలు లేవు. కానీ టీఆర్‌ఎస్ ఒక పార్టీగా పటిష్టమైన నిర్మాణంతో గ్రామ స్థాయిలో వేళ్ళూనుకున్నదా అనే సందేహాలుండేవి. గ్రామపంచాయతీ, పరిషత్ ఎన్నికల తీరును గమనిస్తే, టీఆర్‌ఎస్ నిర్మాణం బలంగా ఉన్నట్టు బోధపడుతున్నది. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి వ్యవసాయం, పరిశ్రమలు, విద్య మొదలైన ప్రతిరంగంలో మౌలిక మార్పులు తేవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. పరిపాలనారంగంలో కూడా భారీ మార్పులు చేపడుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి పరిపాలనారంగం ప్రజలకు చేరువైన తర్వాత జరిగిన మొదటి స్థానిక ఎన్నికలు ఇవి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక సంస్థలు కీలకమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఏ కార్యక్రమమైనా గ్రామస్థాయిలో అమలుపైనే ఆధారపడి ఉంటాయని ముఖ్యమంత్రి చెబుతుంటారు. బడ్జెట్ రూపకల్పన కూడా గ్రామస్థాయి అవసరాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసి, స్థానిక సంస్థలకు విధులు, బాధ్యతలు అప్పగించాలనేది ముఖ్యమంత్రి సంకల్పం. ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతతో వ్యవహరించాలనేది కేసీఆర్ దృక్ప థం. ఈ నేపథ్యంలో ప్రజలు స్థానిక సంస్థలలో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టడానికి ప్రాధాన్యం ఏర్పడ్డ ది. స్థానిక సమరం ముగియడంతో ఎన్నికల ఘట్టం ముగిసింది. కానీ కేసీఆర్ చేపట్టబోయే కార్యాచరణ ముందున్నది. ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా ముఖ్యమంత్రి మార్గదర్శనం మేరకు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలె.

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles