శూన్య పరంపర ముగియునా?

Wed,June 5, 2019 11:17 PM

narendra-Modi
ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ మే 25వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ, మన రాజ్యాంగం విలువలతో, సమ్మిళిత దృష్టితో కూడుకున్నది. స్వాతంత్రోద్యమకారులు దేశం కోసం కన్న కలలు నిక్షిప్తమై ఉన్న సుసంపన్నమైన, విస్తృతమైన సామాజిక పత్రం అది. అటువంటి రాజ్యాంగానికి, అందులోని విలువలకు మాత్రమే మనం విధేయులమై ఉండాలి అని తమ పార్టీ నాయకత్వాన గల ఎన్డీయే కూటమి ఎంపీలతో అన్నారాయన. తర్వాత మరికొన్ని నిర్దిష్టమైన అంశాల్లోకి వెళ్లారు. తమ మొదటి విడుత పాలనలో పేదరికాన్ని దెబ్బతీశామని, ఈ రెండవ విడుతలో ఆ కృషిని కొనసాగించటంతో పాటు, దేశంలోని అల్ప సంఖ్యాక వర్గాలను ఆవరించిన ఉన్న భయాందోళనలను పారదోలాలని కోరారు. బహుశా ఈ రెండవ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే కావచ్చు, మనం ఒక ప్రభుత్వంగా చాలా మంచి పనిచేసినా, అందువల్ల వచ్చిన మంచిపేరు ఒక్క పొరపాటు మాటతో చెడిపోగలదు అని హెచ్చరించారు. తన ప్రభు త్వంలోని, పార్టీలోని కొందరు హిందూ మతతత్వ తీవ్రవాదులు తమ ప్రకటనలతో గత అయిదేండ్ల పొడువునా సృష్టించిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ హెచ్చరిక చేశారేమో తెలియదు. తర్వాత రెండు రోజులకు 27వ తేదీన వారణాసిని సందర్శించిన ప్రధానమంత్రి, మేము విచ్ఛిన్నకారులం కాము. ఐక్యత అనే మం త్రంతో ముందుకు సాగుతాము అని ప్రకటించారు. అప్పటికి ఆమెరిక న్ మేగజైన్ టైమ్ ఆయనను, భారతదేశపు ప్రధాన విచ్ఛిన్నకారునిగా అభివర్ణిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

భారతదేశం గత 70 సంవత్సరాలుగా ఒక శూన్య పరంపరంలో కొనసాగుతూ వస్తున్నది. స్వాతంత్య్రోద్యమ ఆకాంక్షలు, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చగలమని పాలకులు హామీ ఇచ్చి విఫలం కావటం, దాని పర్యవసానంగా శూన్యం ఏర్పడటం, అవే హామీలతో అధికారానికి వచ్చినవారు కూడా విఫలమై తిరిగి శూన్యాన్ని సృష్టించటం పలుమార్లు జరిగింది. సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలు ఆ విధంగా విఫలమయ్యాయి. ఈ పరంపరలో నరేంద్ర మోదీ మొదటి విడుత ప్రభుత్వం కూడా ఒక భాగమైంది. అందుకు ఆయన రెండవ ప్రభుత్వం ముగింపును పలుకగలదా?


ఇదంతా ఇంతగా రాయటం ఎందుకంటే, ప్రధాని మోదీ ప్రస్తావించిన స్వాతంత్రోద్యమకారుల కలలు, రాజ్యాంగపు సామాజిక లక్ష్యాలు మొదలైన వాటిని తనకన్న ముందు పరిపాలించినవారు ఏ విధంగా భం గపరిచి శూన్యాలను సృష్టించారో, తన మొదటి విడుత పాలనలో ఆయ న కూడా అదే పనిచేశారు. పైన అనుకున్న కలలు, లక్ష్యాలన్నవి ఏదో ఒక రూపంలో లేవు. అవి పేదరికం నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, సామాజిక సంస్కరణలు, సామాజికంగా సమ్మిళిత దృష్టి, సమర్థవంతమైన పాలన, అవినీతి నిరోధం, అన్నివర్గాల అన్ని ప్రాంతాల సమతులనాభివృద్ధి, అల్పసంఖ్యాక వర్గాలూ ఇతర బలహీన వర్గాల పరిరక్షణ, సర్వమత సమానత్వం వంటి అనేకానేక రూపాల్లో ఉన్నాయి. గత 70 ఏండ్ల పాటు దేశాన్ని, రాష్ర్టాలను పరిపాలించిన వివిధ పార్టీలు, ఐక్య సంఘటనల వారు ఇందులో ఏదో ఒకమేరకు అన్నింటిలోనూ విఫలమైనవారే. అందువల్లనే శూన్యాలు ఏర్పడ్డాయి. ఒకరు సృష్టించిన శూన్యం తర్వా త మరొకరి శూన్యం వచ్చి, అదొక శూన్యపరంపరగా మారింది. ఇందులోని ప్రధానమైన దశలను చెప్పుకోవాలంటే, మొదటి ప్రధాని నెహ్రూ తన శక్తిమేరకు కృషిచేసినా అప్పటి ఫ్యూడల్-పెట్టుబడిదారీ-అంతర్జాతీ య వ్యాపార వర్గాల బలిమి వల్ల, తను మరణించిన కొద్దికాలానికే మొద టి పెద్ద శూన్యం ఏర్పడింది. ఆయన తర్వాత ప్రధాన మంత్రులు అయిన లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీల గురించి దేశానికి కొన్ని రాజకీయాలు, కొన్ని అట్టహాసపు నినాదాల గురించి మాత్రమే తెలుసు. అంతే తప్ప వారి పొలిటికల్ ఎకానమీ గురించి తెలియదు. అటువంటి విధానాలు,పరిపాలనా ఫలితంగా రెండవ శూన్యం ఏర్పడింది.

1984లో కేవలం 2 సీట్లుండిన బీజేపీ ఇప్పుడు 2019లో 303కు చేరింది. ఈ మూడు దశాబ్దాలలో ఇతరులు తమకు తమ దిద్దుబాటు చర్యలు ఏవీ చేపట్టలేదు. 2004, 2009లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వ కూటమి తిరిగి విఫలమై తన వెనుకటి శూన్యాన్ని మరొకమారు సృష్టించింది. మొదటి మారు శూన్యం విషాదం కాగా, తర్వాతి శూన్యాలు ప్రహసనంగా మారాయి. ఇదే సమయంలో మరొకవైపు గమనించదగిన ఆసక్తికరమైన పరిణామం ఒకటుంది. అది వాజపేయి నాయకత్వాన ఏర్పడిన మితవాద-మత వాద ప్రభుత్వానిది.


వీరికన్న ఎక్కు వ ప్రజాస్వామిక వాదులమని, ప్రజలకు అనుకూలమైన వారమని, నైతిక విలువలు కలవారమని హామీనిస్తూ వేర్వేరు దశలలో అధికారానికి వచ్చిన వివిధ ఫ్రంట్‌లు అనేక విషయాల్లో అంతే దారుణంగా విఫలమై దేశంలో మూడవ శూన్యం ఏర్పడింది. మొత్తంమీద పార్టీలు మారినా, 1952 నుంచి వాజపేయి కాలం వరకు పాలించినవి అన్నీ స్థూలంగా లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ పొలిటికల్ ఎకానమీ వైఖరి గలవే. స్వాతంత్య్రోద్యమ ఆశయాలను, రాజ్యాంగ లక్ష్యాల ను వారు చిత్తశుద్ధితో నెరవేర్చబూనితే వారికి ప్రజలు అండగా నిలిచి ఉండేవారు. దేశంలో శూన్యత అంటూ ఏర్పడేది కాదు. ఒకవేళ కాంగ్రెస్ వల్ల శూన్యత ఏర్పడినా దానిని వివిధ ఫ్రంట్‌లు, వామపక్షాలు కలిసి పూరించగలిగేవి. కానీ, మాటలలో ఎవరేమి చెప్పినా, చేతతలలో అరకొర పనులు కొన్ని చేసి ఉండినా, మొత్తంమీద చూసినప్పుడు విఫలమై శూన్యాలను సృష్టించారు. ఆ వరుస శూన్యాలలోకి ఆ దశలో మొదటిసారిగా మితవాదం-మతవాదం బీజేపీ రూపంలో ప్రవేశించటాన్ని చూడవచ్చు. ఇది ఇప్పటికి సరిగా ముప్పయ్యేళ్ల కథ. 1984లో కేవలం 2 సీట్లుండిన బీజేపీ ఇప్పుడు 2019లో 303కు చేరింది. ఈ మూడు దశాబ్దాలలో ఇతరులు తమకు తమ దిద్దుబాటు చర్యలు ఏవీ చేపట్టలేదు. 2004, 2009లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వ కూటమి తిరిగి విఫలమై తన వెనుకటి శూన్యాన్ని మరొకమారు సృష్టించింది. మొదటి మా రు శూన్యం విషాదం కాగా, తర్వాతి శూన్యాలు ప్రహసనంగా మారాయి. ఇదే సమయంలో మరొకవైపు గమనించదగిన ఆసక్తికరమైన పరిణామం ఒకటుంది. అది వాజపేయి నాయకత్వాన ఏర్పడిన మితవాద-మత వాద ప్రభుత్వానిది.

భారతదేశ ఎన్నికల చరిత్ర లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ ప్రభుత్వాల వరుస వైఫల్యాల తర్వాత మొదటిసారిగా వాజపేయి నాయకత్వాన బీజేపీకి అధికారాన్ని ఇవ్వగా, శూన్యాన్ని పూరించటంలో ఆ శక్తులు కూడా విఫలమయ్యాయి. పైన పేర్కొన్న ఏ శక్తులైతే జవహర్‌లాల్ ప్రభుత్వాన్ని విఫలం చేసాయో ఆశక్తుల పట్టు ఆర్థిక-రాజకీయ-పరిపాలనారంగాలపై ఆ తర్వాత కొనసాగటమే గాక మరింత పెరిగింది. అందుకు బీజేపీ కాలంలో మతవాదం, మితవాదం అదనంగా వచ్చిచేరాయి. వాజపేయి ప్రభుత్వం కొన్ని తళుకుబెళుకులను చూసుకొని ఇండియా షైనింగ్ నినాదాన్ని ఇచ్చింది. కానీ స్వాతంత్రోద్యమ కాలపు ఆకాంక్షలకు, రాజ్యాంగ లక్ష్యాలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో గమనించలేకపోయింది. అట్లా గమనించనందువల్లనే తనకు ముందటి ప్రభుత్వాలన్నీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి శూన్యాలు ఏర్పడగా, తిరిగి అవే వైఫల్యాలకు తాను కూడా పాల్పడింది. తర్వాత వరుసగా రెండు ఎన్నికలలో (2004, 2009) బలాన్ని కోల్పోయి తనకు తాను శూన్యాన్ని సృష్టించుకుంది. విశేషమేమంటే, వాజపేయికి ముందు వరకు విఫలమైన లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ శక్తులు 2004-14 మధ్య అవకాశం వచ్చికూడా ఆ శూన్యాన్ని పూరించలేకపోయాయి. అనగా, మొద ట పేర్కొన్న సామాజిక-ఆర్థిక-అంతర్జాతీయ శక్తుల ప్రాబల్యాన్ని వదిలించుకోకపోవటమేగాక, అందుకు స్వప్రయోజనాల కోసం లోబడిపోయాయన్నమాట. దాని ఫలితంగా ఏర్పడిన మరొక శూన్యంలోకి బీజేపీ అనే మితవాద-మతవాద శక్తి 2014లో రెండవసారి ప్రవేశించింది.
Ashok
అట్లా ప్రవేశించి 2019 వరకు ఐదేండ్ల పాటు పరిపాలించిన తీరు స్వాతంత్రోద్యమకాల పు ఆకాంక్షలను, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చగల విధంగా సాగిందా అన్నది అన్నింటికన్న ముఖ్యమైన ప్రశ్న. ఆ పని జరిగితే అప్పటికి గల శూన్యాన్ని తను పూరించినట్లే. కానీ నరేంద్ర మోదీ అయిదేండ్ల పాలన ను నిర్వికారంగా మదింపుచేసినట్లయితే, అది స్వాతంత్య్రోద్యమకారుల ఆకాంక్షలను, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చగల విధంగా సాగినట్లు తోచ దు. అనగా శూన్యం కొనసాగుతున్నదన్నమాట. పైన పేర్కొన్న సూత్రాలను చెప్పిన మోదీ రెండవ విడుతలోనూ బెంగాల్‌లో మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మత నినాదాలు, దాడులకు గురవుతున్న ముస్లిం లు, హిందీ సమస్యలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆయన 2014 కన్నా ఘన విజయం సాధించి ఉండవచ్చు గాక. గెలిచిన తర్వాత ఢిల్లీలో, వారణాసిలో ఏమైనా మాట్లాడవచ్చు గాక. కానీ వాస్తవ పరిస్థితులకు అవి 2014-19 మధ్య గీటురాళ్లు కాలేదు. 2019 నుంచి అవుతాయా? మహా శూన్యం అంతరిస్తుందా? సందేహమే.

267
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles