గులాబీ పార్టీ వికసించింది

Thu,June 6, 2019 01:11 AM

cm-kcr-trs
కారు జోరుకు బ్రేకులు పడినాయి
కేసీఆర్ ఖతమైండు
కేటీఆర్ పనయిపోయింది
గులాబీ వాడిపోయింది..
ఇక రాబోయే ఎన్నికల్లో అధికారం మాదే!
అరెరెరె.. సంబురపడినంత సమయం పట్టలేదే వారి ఆశలు అడియాసలు కావడానికి!
గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రికా ర్డు స్థాయిలో ఆధిక్యత సాధించి అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బతిన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం మాత్రమే గెలుచుకున్న బీజేపీ, పందొమ్మిది స్థానాలు గెలిచిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా వరుసగా నాలుగు, మూడు ఎంపీ సీట్లను గెలిచాయి. రాజకీయ పరిశీలకులు కూడా ఆ పార్టీ లు అన్ని స్థానాలను గెలుస్తాయని ఊహించలేకపోయారు. కేవలం ఆరు మాసాలలోనే అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఇంత వ్యతిరేకత ఎలా వచ్చిందో అంతుబట్టలేదు. వ్యతిరేకత రావడానికి ఈ ఆరు నెలల్లో కేసీఆర్ చేసిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలు ఏమీ లేవు. ఆయన పాలన యథావిధిగా ప్రజాపక్షానే సాగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పుంజుకునేంతగా చేసి న ఉద్యమాలు ఏమీ లేవు. కారుకు పదహారు సీట్లు గ్యారంటీ అని అం దరూ నమ్మారు. కానీ, కారు తొమ్మిది స్థానాలు మాత్ర మే గెలువగలింది. కాంగ్రెస్, బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో అన్ని సీట్లను సాధించడానికి అభ్యర్థుల ఎంపిక కొంతమేర ఎదురుతన్నింది. టీఆర్‌ఎస్ అతివిశ్వాసం, స్థానిక నాయకులను గుడ్డిగా నమ్మడం, వారు సమన్వయం తో పనిచేయకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే టీఆర్‌ఎస్ స్థానాలు తగ్గాయని పార్టీ వారు విశ్లేషించారు. అంతేకాకుండా, పరస్పరం విమర్శలు చేసుకునే కాం గ్రెస్, బీజేపీలు లోక్‌సభ ఎన్నికల విషయం వచ్చేసరికి అంతర్గతంగా రహ స్య ఒప్పందాలు చేసుకున్నాయని, ఓట్ల మార్పిడి చేసుకున్నాయని ఆనాడే కొందరు వ్యాఖ్యానించారు. నిన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది నిజ మేనని రుజువైంది.

పల్లెలు, పట్టణాలు, నగరాలు గులాబీకే జై కొట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు క్లీన్‌స్వీప్ చేసింది. మొన్న లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోవడంతో మళ్ళీ అవే ఫలితాలు వస్తాయని ఆశించిన ప్రతిపక్షాల కలలు చెదిరిపోయాయి. జిల్లా మొత్తం గులాబీకి పట్టం గట్టింది. రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాలే గాక అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో కూడా గులాబీ ప్రభంజనమే వీచింది. కమలం సంపూర్ణంగా వాడిపోగా, హస్తానికి రిక్తహస్తం మాత్రమే మిగిలింది.


మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం స్థానాలు గెలిచిన గులాబీ పార్టీ కైవసం చేసుకొని రెండురోజులు తిరుగకుండానే, దేశ చరిత్రలో తొలిసారిగా నూటికి నూరు శాతం జిల్లా పరిషత్తులను కైవసం చేసుకొని చరిత్రను సృష్టించింది. ముప్ఫై రెండుకు గాను ముప్ఫై రెండు జిల్లా పరిషత్తు భవనాలపై గులాబీ జెండా రెపరెపలాడింది. అలాగే మండల పరిషత్తులో అరువై రెండు శాతం స్థానాలను కొల్లగొట్టి ప్రతిపక్ష పార్టీలను నిరుత్తరుల ను చేసింది. 538 జడ్పీటీసీ స్థానాలకుగాను కాంగ్రెస్ 76 స్థానాలను మాత్రమే గెలుచుకోగా, బీజేపీ మరీ ఘోరంగా రెండంకెల సీట్లు కూడా గెలువలేకపోయింది. ఇక 5817 ఎంపీటీసీ స్థానాలకుగాను కాం గ్రెస్ 1377 స్థానాలు మాత్రమే గెలిచింది. బీజేపీ ఇంకా ఘోరంగా 211 సీట్లు మాత్రమే గెలిచి తన ఉనికి నామమాత్రమేనని చాటుకున్నది. పల్లెలు, పట్టణాలు, నగరాలు గులాబీకే జై కొట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు క్లీన్‌స్వీప్ చేసింది. మొన్న లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోవడంతో మళ్ళీ అవే ఫలితాలు వస్తాయని ఆశించిన ప్రతిపక్షాల కలలు చెదిరిపోయాయి. జిల్లా మొత్తం గులాబీకి పట్టం గట్టింది. రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాలే గాక అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో కూడా గులాబీ ప్రభంజనమే వీచింది. కమలం సంపూర్ణంగా వాడిపోగా, హస్తానికి రిక్తహస్తం మాత్రమే మిగిలిం ది. కేసీఆర్ పాలనకు జనం మరోసారి జేజేలు కొట్టారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొంచెమైనా ఆస్వాదించకుండానే ఓటర్లు ఇచ్చిన తీర్పుతో హస్తం, కమలం ఒక్కసారిగా విషాదయో గంలోకి జారుకోవాల్సి వచ్చింది. మొన్నటి ఆ రెండు పార్టీల విజయం వాపే తప్ప బలం కాదని తేలిపోయింది!
murali-mohan-Ilapavuluri
ఏకపక్షంగా వచ్చిన ఈ చరిత్రాత్మక తీర్పుతో తెలంగాణ మొత్తం కేసీఆ ర్ వెంట నిలిచారన్న వాస్తవం మరోసారి స్పష్టమైంది. మధ్యలో ఇచ్చినది ఒక చిన్న కుదుపు మాత్రమేనని, ప్రజల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలూ ప్రజా క్షేమం కోసమే పాటుపడాలని సీఎం కేసీఆర్‌కు ఓటర్లు సూచించారు. ఇంకా చెప్పుకోవాలంటే సీఎం కేసీఆర్‌కు మొన్నటి తీర్పు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని, వెయ్యేనుగుల బలాన్ని ప్రసాదించింది. ఈ విజయం పట్ల పొంగిపోకుండా, తమ కోసం ఎప్పుడూ పనిచేస్తే విజయం మీదేనని బోధించారు. రాజకీయరంగం ఒక నిరంతర రణక్షేత్రం. పోరాటంలో ఏ మాత్రం అలసత్వం పనికిరాదు. అందునా, చిత్తశుద్ధి, ప్రజాక్షేమం పట్ల అనురక్తి కలిగిన కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి పాలన మీదే గాక ఎన్నికల వ్యూహాల మీద కూడా ఎల్లప్పుడూ ఒక కన్ను వేసే ఉంచాలని నిన్నటి ప్రజా తీర్పు ద్వారా వెల్లడైంది.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)

213
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles