ఫెడరల్ స్ఫూర్తి గెలువాలె

Thu,May 23, 2019 01:34 AM

ఎన్నికల్లో గెలువాల్సింది పార్టీలు కావు, ప్రజల ఆకాంక్షలు.. అనే సీఎం కేసీఆర్ మాటలు నిజం కావాలంటే నేటి ఫలితా ల తర్వాత జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు వోడినా గెలిచినా ప్రాంతీయపార్టీలు మాత్రం తమ ఫెడరల్ స్ఫూర్తి వోడిపోకుండా చూసుకోగలగాలె. ఇన్నాళ్లూ అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్‌కు మద్దతునిస్తూ వారిని దించి వీరిని, వీరిని దించి వారిని అధికారంలో కూసోబెట్టిన ప్రాంతీయ పార్టీలు తమ దృక్పథాల్లో గుణాత్మక మార్పును సాధించాలె. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ, బీజేడీ, జనతాదళ్ (ఎస్), డీఎంకే, అన్నాడీఎంకే, వంటి కీలక పార్టీలు ఇకనైనా అధికారమే పరమావధి కాకుండా సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టాలె. పొత్తు లు కట్టడంలో వారివారి రాష్ర్టాల ప్రజల ఆకాంక్షలే ప్రధానమై ఫెడరల్ స్ఫూర్తే కేంద్రంగా ఉండాలె. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు మొత్తం 15 మంది ప్రధా నులు 72 ఏండ్ల పాటు దేశాన్నేలినారు. కాంగ్రెస్ పార్టీ (యూపీఏ) నుంచి ఏడుగురు ప్రధానులు నేటికీ మొత్తం 54 ఏండ్లు దేశాన్నేలినారు. బీజేపీ (ఎన్డీయే కలిపి) పార్టీ నుంచి ఇద్దరు ప్రధానులు 11 ఏండ్లు.. వీరి నడుమ వచ్చిపోయిన జనతా పార్టీ తరఫున ఇద్దరు రెండేండ్లు, నేషనల్ ఫ్రంట్ పేరుమీద ఇద్దరు రెండేండ్ల ఆర్నెల్లు, యునైటెడ్ ఫ్రంట్ పేరుమీద మరో ఇద్దరు రెండేండ్లు దేశ ప్రధానులైనారు. 72 ఏండ్ల పాలనలో ఫెడరల్ స్ఫూర్తి ఉన్నదా: దేశ మొట్టమొదటి ప్రధా నిగా జవహర్ లాల్ నెహ్రూ 1947-1964 (తాను చనిపోయే) వరకు, 17 ఏండ్లు కొనసాగినారు. అటు తర్వాత గుల్జారీలాల్ నందా రెండు దఫా లుగా ఒకసారి 14 రోజులు, మరోసారి 13 రోజులు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు. ఆయన తర్వాత లాల్‌బహదూర్‌శాస్త్రి 1964-66 దాకా ప్రధా నిగా పనిచేసినారు. తర్వాత రంగప్రవేశం చేసిన ఇందిరాగాంధీ 1966-77 దాకా ప్రధానిగా పనిచేసి ఎమర్జెన్సీ వల్ల ఓడిపోయింది. ఇక్కడిదాకా అంటే 35 ఏండ్లు కాంగ్రెస్ పార్టీనే అప్రతిహతంగా దేశాన్నేలింది.

కేసీఆర్ దృష్టి అంతా తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధే.. నేడు దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నా తెలంగాణ క్షేత్రం నుంచి నిలవడే మాట్లాడుతున్నడు. ఇదీ ప్రాంతీయ రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇన్నేండ్లు వారు ఎక్కడ విఫలమైనారో అక్కడి నుంచే కార్యాచరణ ప్రారంభించాలె.


ఎమర్జెన్సీ సందర్భంగా ప్రజావ్యతిరేకత ద్వారా మొట్టమొదటిసారి దేశంలో కాంగ్రేసేతర జనతా ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ 1977-79 దాకా రెండేండ్లు మాత్రమే జనతా ప్రభుత్వం నడిచి.. మూడేండ్ల అనతి కాలంలోనే అంతర్థానమైంది. 1980 ఎన్నికల్లో మల్లా కాంగ్రెసే గెలిచింది. 1980 నుంచి 84 దాకా ఇందిరా గాంధీ ప్రధానిగా చేసింది. ఆమె మరణం తర్వాత జరిగిన 1984 ఎన్నికల్లో సానుభూతితో ప్రధాని పదవిని అలంకరించిన రాజీవ్‌గాంధీ 84 నుంచి 89 వరకు ప్రధానిగా కొనసాగారు. 1989 ఎన్నికల్లో బీజేపీ 88 సీట్లను గెలుచుకున్నది. కానీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ లేని పరిస్థితిలో జనతాదళ్‌కు మద్దతిచ్చి నేషనల్ ఫ్రంట్ కూటమిగా వీపీ సింగ్ ప్రధానిగా ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటుచేసింది. అట్లా 1989 నుంచి అక్టోబర్ 1990 దాకా నడిచిన వీపీసింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్ద తు ఉపసంహరించుకున్నది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజీవ్ గాంధీ సహకారం తీసుకున్న చంద్రశేఖర్ యునైటెడ్ ప్రంట్ నేతృత్వంలో 1990-91 నడుమ ఏడు నెలల కాలం పాటు ప్రధానిగా కొనసాగారు. ఆ తర్వాత 1991లో రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. అదే సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1991 నుంచి 1996 వరకు మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపి ఘనత సాధించినాడు పీవీ. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు రాష్ట్రపతి ఆహ్వానించగా బల నిరూపణ చేసుకోలేకపోయింది. అట్లా 13 రోజుల ప్రభుత్వాన్ని బీజేపీ కోల్పోయింది. బీజేపీ పతనం తర్వాత ప్రాం తీయ పార్టీలన్ని కలిసి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుచేసి దేవెగౌడను ప్రధా నిగా నిలబెట్టినయి. దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. అట్లా జూన్ 1996-97 ఏప్రిల్ దాకా దేవెగౌడ భారత ప్రధానిగా పనిచేశారు. ఆయ నకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడం, ఆ తర్వాత జరిగిన ఒప్పందంలో భాగంగా ఐకే గుజ్రాల్‌ను ప్రధానిగా కాంగ్రెస్ మద్దతు పలుకడం, తద్వారా 1997 ఏప్రిల్ నుంచి 1998 మార్చి దాకా ఆయన కొనసాగారు.

అట్లా కేవలం రెండేండ్ల కాలానికి మాత్రమే యునైటెడ్ ప్రంట్ ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాన్ని అందించగలిగినయి. తిరిగి 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పలు ప్రాంతీయపార్టీల మద్దతు తో ఎన్డీయే కూటమిగా తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ తర్వాత తలెత్తి న పరిణామంలో అవిశ్వాస పరీక్షను నెగ్గాల్సి వచ్చింది. కాగా నెగ్గలేక ఒక్క వోటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయింది. 1999లో 13వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని అటల్ బీహారీ వాజపేయి ప్రధానిగా 2004దాకా నడిపించింది. 2004లో జరి గిన సార్వత్రిక ఎన్నికల్లో వాజపేయి నుంచి ప్రభుత్వాన్ని హస్తగతం చేసు కున్న కాంగ్రెస్ పార్టీ యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి రెండు దఫా లు అంటే 2004 నుంచి 2009-2014 దాకా ప్రభుత్వాన్ని నడిపించిం ది. 2014లో 16వ లోకసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి మోదీని ప్రధానిగా మోస్తూ వస్తు న్నది. ఈ మెత్తం ప్రక్రియలో మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే.. కాం గ్రెస్ లేదా బీజేపీలు మాత్రమే ఇతర పార్టీలను వినియోగించుకొని కేం ద్రంలో అధికారం చెలాయిస్తున్నాయి. ప్రత్యామ్నాయ పార్టీలుగా ముందు కువచ్చిన కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు మొత్తంగా ఆరేడేండ్లకు మించి దేశాన్ని పాలించలేకపోయినాయి. ఎక్కడుందీ లోపం?: ఈ మొత్తం నేపథ్యాన్ని పరిశీలించిన ట్లయితే ఒక జాతీయపార్టీకి ప్రత్యామ్నాయంగా మరో జాతీ యపార్టీనే తయారైంది తప్పితే రాష్ర్టాల ప్రయోజనాలు కాపాడే ఫెడరల్ కూటమి కరువైందీ. దీనికి కారణం కూటమి కట్టేవారి నడుమ ఉండాల్సిన ఫెడరల్ స్ఫూర్తి లేకపోవడమే. దానికి బదులు కేవలం రాజకీ య అవసరాలు, అవకాశవాద పొత్తులు కావడమే. ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీలు కండ్లు తెరువాలె: ఈ నేపథ్యంలో 30 ఏండ్ల నుంచి కూటములు కడుతున్న ప్రాంతీయపార్టీలు ఇప్పటికైనా గుణ పాఠం తీసుకోవాలె. సీఎం కేసీఆర్ ముందుకు తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ నుంచి నేర్చుకోవాలె.
ramesh-hazari
కేసీఆర్ దృష్టి అంతా తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృ ద్ధే.. నేడు దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నా తెలంగాణ క్షేత్రం నుంచి నిలవడే మాట్లాడుతున్నడు. ఇదీ ప్రాంతీయ రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇన్నేండ్లు వారు ఎక్కడ విఫలమైనారో అక్కడి నుంచే కార్యాచరణ ప్రారంభించాలె. మనమే కొత్త నిర్మాణాన్ని మొదలుపెడితే ప్రజలు తప్పకుంటా వెన్నంటి ఉంటారనే చారిత్రక వాస్తవాన్ని సీఎం కేసీ ఆర్ తన రాజకీయ కార్యాచరణ ద్వారా చాటుతూనే ఉన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్: రాష్ర్టాల పట్ల కేంద్రం కన్నతల్లి మాదిరి సానుకూల ధోరణితో వ్యవహరించాలె. సామంతులను చూసినట్టు చూడ కూడదు. కానీ ఏండ్ల తరబడి జరుగుతున్నదిదే. ఈ నేపథ్యంలో విభజన చట్టంలోని హక్కులను సాధించుకునేందుకు తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్, తెలంగాణ బాగు పడాలంటే కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం కాదు, కేంద్రం లో ఏ ప్రభుత్వం ఉన్నా తమ దారిలోకి తెచ్చుకోవాలె అనే తలంపుతో ఉన్నారు. నేటి తుది ఫలితాల తర్వాత రాష్ర్టాల ప్రయోజనాలను కాపాడే కూటమికే మద్దతు పలికి తమ హక్కులను సాధించుకునే ఆలోచనను ముందుకుతీసుకురానున్నారని విశ్లేషకులు భావిస్తున్నరు. సీఎం కేసీఆర్ బాటలోనే ఇతర ప్రాంతీయపార్టీలు కూడా కలిసివస్తే రాష్ర్టాల ప్రయోజనా లను కాపాడుకోవచ్చు. లేదంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా తన హక్కులను ఎట్లా కాపాడుకోవాల్నో, పోరాటాల తెలంగాణకు వెన్నతో పెట్టిన విద్య.

227
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles