నిజాయితీగా వ్యవహరించాలె

Thu,May 23, 2019 01:32 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తు న్న మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్టపరి హారం అందజేస్తున్న తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఉపాధి కోల్పోతున్నారని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు తగినవిధంగా నష్ట పరిహారం అందజేస్తున్నది. కొన్నిరోజులు గా ఈ విషయమై ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి. నిర్వాసితులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని వాపోతున్నాయి. కానీ వారు అంటున్నట్లు ప్రజల్లో అలాంటి దేమీ లేదు. గతంలో ఇచ్చిన వాటికన్నా ఇప్పుడు గొప్పగా సాయం అందుతున్నద ని స్వయంగా నిర్వాసితులే చెప్పటం గమ నార్హం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పట్ల నిజాయితీతో వ్యవహరిం చాలె.
- జె.సునీల్, కొమురవెల్లి, సిద్దిపేట

ఔషధ కంపెనీల ఆగడాలు

సగటు జీవి బతుకడానికి ఎంత ఖర్చవుతుందో, ఔషధాలకు అంతకన్నా ఎక్కువనే ఖర్చవుతున్నదంటే అతిశయోక్తి కాదు. కాలుష్య ప్రభావం కార ణంగా ప్రజలకు బీపీలు, షుగర్ లాంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులు చిన్నపిల్లలకు సైతం వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయకంపితులవుతున్నారు. ఈ క్రమంలోనే జీవితావసర ఖర్చుల కన్నా ఔషధాల ఖర్చులే ఎక్కువవుతున్నాయని రోగులు వాపోతున్నారు. దీనికి కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నా యి. దీనికి ప్రధాన కారణం ఔషధ కంపెనీలు డాక్టర్లతో కుమ్మక్కయి ఇష్టారీతిన మందులు కొనుగోలు చేయించటం జరుగుతున్నది. వైద్యులకు పర్సంటేజీల ఆశలు చూపిస్తూ ఔషధ కంపెనీలు రోగుల జీవితాలతో చెల గాటమాడుతున్నాయి. తమ ఔషధాలనే రోగులకు సూచించాలంటూ వైద్యులతో బేరసారాలాడుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న ఔష ధ కంపెనీలు ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తూ రోగులను కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనరిక్ మందులను అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఔషధ ధరలను పేద ప్రజలకు అం దుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
- బోడపట్ల కిషన్, కురిక్యాల, కరీంనగర్

153
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles