ఎన్డీయేకు మెజారిటీ సాధ్యమేనా?

Wed,May 22, 2019 01:10 AM

ఇదేదో నేను మోదీ మీదనో, ఎన్డీయే మీద కోపంతోనో, యూపీఏ మీద ప్రేమతోనో రాయడం లేదు. సాధ్యాసాధ్యా ల మీద విశ్లేషణ మాత్రమే. గురువారం నాడు ఫలితాలు ఎలాగూ వస్తాయి. ఈ విశ్లేషణ నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ, కాస్త ఆలోచించే విశ్లేషకుడిగా నా అభిప్రాయాన్ని రాస్తున్నాను. నిన్ననే ఎగ్జిట్‌పోల్స్ వచ్చాయి. దాదాపు అన్ని సంస్థలు ఏకగ్రీవంగా ఎన్డీయే కూటమికి తిరుగులేని మెజార్టీని కట్టబెట్టాయి. గరిష్ఠంగా మూడు వందల ఆరు సీట్లు వస్తాయని అంచనాలు వెల్లడించారు. కానీ, ఒక్కరు కూడా బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని ప్రకటించలేదు. లేదా నేను గమనించలేదేమో? బీజేపీకి కూడా ఇన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉన్నదని ఎం దుకు చెప్పలేదు. ఢిల్లీలోని కొందరు సీనియర్ జర్నలిస్టులు అందించిన సమాచారం ప్రకారం ఎన్డీయే కూటమికి సంబంధించి ఈ ఎగ్జిట్‌పోల్స్ ఒక భయంక రమైన కుట్ర. దీనివెనుక బీజేపీ అగ్రనాయకుల హస్తం ఉన్నది. ఎన్డీయే గెలుపు మీద కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నది. అంతేకాకుండా, ఎన్డీయే కూటమికి మెజార్టీ రాదని ప్రకటించే పక్షంలో కూటమిలోని కొన్ని పార్టీలు జారుకొని యూపీఏ వైపు వెళ్లే అవకాశం ఉన్నది. బీజేపీ మిత్రపక్షంతో కలుపుకొని) గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో 73 సీట్లు గెల్చు కున్నది. ఈసారి నలభై స్థానాలు వస్తా యని చెబుతున్నారు. అక్కడే ఎన్డీయేకు 32 సీట్లు తగ్గుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లో కూడా మెజార్టీ స్థానాలు బీజేపీకే కట్టబెట్టాయి ఎగ్జిట్‌పోల్స్. ఇందు లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఆ రాష్ర్టా ల్లో బీజేపీ గణనీయంగా సీట్లను కోల్పోతున్నది. ఇక ఢిల్లీలో ఏడు, హర్యా నాలో పది సీట్లు బీజేపీకే అన్నా రు. ఇందులో యాభై శాతం అబద్ధం. మొత్తం ఊడ్చిపెట్టేంత బలం ప్రస్తు తం బీజేపీకి లేదు. గత ఎన్నికలకన్నా బీజేపీ సొంతంగా కనీసం అరువై, డ్బ్బై సీట్లు కోల్పోతున్నది. ఇన్ని సీట్లను ఎక్కడ భర్తీ చేస్తారు? బెంగాల్లో బీజేపీకి పదో పన్నెండో ఇచ్చారు సర్వే శ్వరులు.

బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించుకోవడం అనేది కలలోని మాట. ఎన్డీయే కూటమికి 225 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశాల్లేవు. టీఆర్‌ఎ స్, వైసీపీ, బీజేడీ మద్దతు లేనిదే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం అసాధ్యం. రాబోయేది సంకీర్ణప్రభుత్వమే కానీ, ఏక పార్టీ ప్రభుత్వం కాదు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం నిద్రలేచింది. ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టింది.


ఇంతకన్నా హాస్యం మరొ కటి ఉండబోదు. మమతాబెనర్జీ ప్రభా వం బెంగాల్ మీద అణువంత కూడా తగ్గలేదు. అక్కడ బీజేపీ రెండు మూడు గెలిస్తే గొప్ప. ఇక తెలంగాణలో రెండు నుంచి నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి బీజేపీ ఖాతాలో వేశారంటే ప్రజల విజ్ఞత మీద వీరికి ఎంత చులకన భావం ఉన్న దో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ జర్నలిస్టులు చెబుతున్న దాన్నిబట్టి బీజేపీకి సొంతంగా 170 సీట్లకంటే ఎక్కువ రావు. ఎన్డీయే కూటమి మొత్తానికి 225 లోపలే వస్తాయి. మూడు వందలు వస్తాయని దిక్కులు పిక్కటిల్లేలా అరిస్తే యూపీఏలోని కొన్నిపక్షాలు కూడా తమతో వస్తాయని, ఇక ఆ తర్వాత మద్దతు కోసం ప్రతి గడపకు ఎక్కే అవసరం ఉండదని బీజేపీ అధినాయకత్వం వేసిన స్కెచ్‌లో భాగమే ఎన్డీయే కూటమికి మెజార్టీ అని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. స్టాక్‌మార్కెట్‌లో కూడా బీజేపీ గెలుస్తుందనే అంచనా మీద భారీ ట్రేడింగ్ జరిగింది. ఈ ఎగ్జిట్‌పో ల్స్ వెనుక మార్కెట్ శక్తులు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక యూపీఏ కూటమికి 128 వస్తాయని చెప్పడం కూడా ఒక మాఫి యా లెక్కే. యూపీఏ కూటమికి 150 దాకా వస్తాయని సీనియర్ జర్నలి స్టులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎన్డీయే కూటమికి ఎవరెన్ని సీట్లు ఇవ్వాలో సర్వేశ్వరులకు ముందుగానే బీజేపీ పెద్దలు సమాచారం ఇచ్చా రు. ఆ ప్రకారమే ఎగ్జిట్‌పోల్స్ వచ్చాయని జర్నలిస్టులు చెబుతున్న మాట. 2014లో మోదీ మీద ఎలాంటి మచ్చల్లేవు. ఆయన మహా పరిశుద్ధు డు. గుజరాత్ ముఖ్యమంత్రిగా గోద్రా అల్లర్ల కారణంగా అపఖ్యాతి పాలైన ప్పటికీ తన మీడియా మేనేజ్‌మెంట్‌తో ఆ మరకలను ప్రజలకు కనిపించ కుండా జాగ్రత్త వహించారు. యూపీఏ-2 పలు కుంభకోణాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నది. ఆ అవకాశాన్ని మోదీ బృందం తెలివిగా సొమ్ము చేసుకున్నది. ఫలితంగా బీజేపీకి సొంతంగా 282 సీట్లు వచ్చాయి. మొత్తం ఎన్డీయేకు 336 స్థానాలు వచ్చాయి.

పాతికేళ్ల తర్వాత దేశంలో సంకీర్ణదశ నుంచి సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని దేశ ప్రజ సంతోషించిం ది. కానీ, ఐదేండ్ల పాలనలో మోదీ దేశ ప్రజానీకానికి ఒరగబెట్టింది ఏమి టి? పెద్దనోట్ల రద్దు లాంటి తుగ్లక్ చర్యలతో మోదీ ప్రభావం మసకబార టం మొదలుపెట్టింది. ఆ తర్వాత యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా పరాజయం పాలైంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అయిదు రాష్ర్టాల ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ర్టాల్లో అధికారం కోల్పోయింది. కర్ణాటకలో ఒకరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి నవ్వులపాలైంది. ఏ విధం గా చూసినా గత ఐదేండ్లలో బీజేపీ తన ప్రాబల్యాన్ని చాలావరకు పోగొట్టు కున్నదనేది యదార్థం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి సొంతంగా మూడు వందల సీట్లు రావడం సాధ్యమా? ఇక కాంగ్రెస్ పరిస్థితి గతంలో కన్నా చాలా మెరుగుపడింది. దాన్ని గుర్తించడానికి ఎవరూ ముందుకురావడం లేదు. కాంగ్రెస్ కనీసం వంద సీట్లు సొంతంగా సాధిస్తుందని తలపండిన విశ్లేషకులు అభిప్రాయప డుతున్నారు. అన్ని రాకపోయినా, కాంగ్రెస్ ఎనభై మార్క్ దాటే అవకా శాలు ఎక్కువ. ఇక ఫెడరల్ ఫ్రంట్ లేదా తృతీయ కూటమి ఏదైనా ఉంటే... దానికి 150 రావడం తథ్యం. టీఆర్‌ఎస్, వైసీపీ, డీఎంకే, బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్ కలిసి వంద సీట్లపైనే సాధిస్తాయి. ఇంకా బీజేపీ వ్యతిరేకపక్షాలు మరొక యాభై వరకు సాధిస్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి మూడు వం దలు రావడమనేది కేవలం ఊహాజనితం. ఇదంతా సర్వేశ్వరుల మాయా జాలం. బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించుకోవడం అనేది కలలోని మాట.
murali-mohan-Ilapavuluri
ఎన్డీయే కూటమికి 225 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశాల్లేవు. టీఆర్‌ఎ స్, వైసీపీ, బీజేడీ మద్దతు లేనిదే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం అసాధ్యం. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే కానీ, ఏక పార్టీ ప్రభుత్వం కాదు. ఈ విష యాన్ని ఆలస్యంగా గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం నిద్ర లేచింది. ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. బీజేపీ నేతృత్వం కావచ్చు, కాంగ్రెస్ నేతృత్వం కావచ్చు.. తృతీయపక్షం సహకారం లేనిదే ప్రభు త్వాన్ని ఏర్పాటు చెయ్యలేదు. ఇది నిజమో కాదో తేలాలంటే 23వ తేదీ దాకా వేచి చూడక తప్పదు.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles