నిషేధిత భూములకు మోక్షం

Tue,May 21, 2019 01:35 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని సర్వే నం. 103లో సుమారు 140 ఎకరాలకు ఖాస్ర పహాణిలో పట్టాగా నమోదైంది. అయినప్పటికీ సేత్వా రీ ప్రకారం సర్కారీ అని నమోదు అయినందున సెక్షన్ 22-ఏ (నిషేధిత జాబితా) నుంచి తొలిగించడానికి వీలుపడదని ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తమ ఉత్తర్వు ద్వారా రైతుల అభ్యర్థనను తోసిపుచ్చారు. వాస్తవంగా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఖాస్ర పహాణికి చట్టబద్ధత ఉందని, వాటిలోని ఎంట్రీలను టైటిల్‌గా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు తమ తీర్పులో పేర్కొన్నది. అయినప్పటికీ వాటిని జిల్లా కలెక్టర్లు పరిగణనలోకి తీసుకోకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. అదేవిధంగా మాజీ సైనికులకు, రాజకీయ బాధితులకు అసైన్ చేసిన ప్రభుత్వ భూమిని కేటాయించిన తేదీ నుంచి పదేండ్ల తర్వాత అన్యాక్రాంతం చేయవచ్చని, ఎన్‌వోసీ అవసరం లేదని ఉత్తర్వు ఉన్నది. అయినా వాటినికూడా నిషేధిత జాబితాలో చేర్చారు. దీనివల్ల వాటి ఎన్‌వోసీ పొందడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. కిందిస్థాయి అధికారుల పొరపాట్ల వల్ల న్యాయంగా, చట్టరీత్యా పట్టా భూమి అయినప్పటికీ వాటిని సెక్షన్ 22-Aలో చేర్చడం, వాటిని పేరా-బీ (భూ ప్రక్షాళన)లో పెట్టడం వంటి కేసులు ప్రతి జిల్లాలో ఉన్నాయి. తద్వారా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి జాబితాలను వ్యతిరేకిస్తూ, వాటిని సవాల్ చేస్తూ అనేక రిట్ పిటిషన్ల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. వాటిపై Single Judges తమ తీర్పును వెలువలరించారు. అయినప్పటికీ వాటిపై తగిన స్పష్టత లేదు. దీనివల్ల హైకోర్టు W.A.NO 343 /15 బ్యాచ్ కేసులో చీఫ్ జస్టిస్ దిలీప్ బి.బోస్లే నేతృత్వంలోని ఫుల్ బెంచ్ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులను, ఇతర రాష్ర్టాల కోర్టులు ఇచ్చిన తీర్పులను, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను, సీనియర్ కౌన్సిల్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని 23/12/15 నాడు సుదీర్ఘ తీర్పును వెలువరించింది.

తెలంగాణలో చాలావరకు పేదలకు పంచిన భూములు అన్యాక్రాంతం అయ్యాయి. పేపర్‌పై ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అయినప్పటికీ ఇప్పటికి అవి చాలావరకు కొనుగోలు చేసిన వారి స్వాధీనంలో ఉన్నా యి. వాటిని ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రెగ్యులరైజ్ చేసిన ఎడల ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం రావడమే కాకుండా పార్ట్-బీలో ని భూములకు మోక్షం కలుగుతుంది.


ఇందులో ప్రభుత్వానికి నిషేధిత జాబితా గురించి, తగిన సూచనలను, ఆదేశాలను జారీ చేసింది. తీర్పులోని ముఖ్యాంశాలు: ప్రభుత్వం నిర్దేశించిన నియమావళి ప్రకారం సంబంధిత అధీకృత అధికారులు సెక్షన్-22 ఏ (I)(ఏ) నుంచి (డి) వరకు సంబంధించిన నిషేధిత జాబితాను కలెక్టర్ల ద్వారా తగిన ఆధారాలతో రిజిస్ట్రేషన్ అధికారులకు తీర్పు వెలువడిన నాలుగు నెలల్లో పంపాలి. అంతేకాకుండా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టాలి. సెక్షన్-22 ఏ (I)(ఏ) నుంచి (డి)వరకు ఎటువంటి నోటిఫికేషన్ అవసరం లేదు. కానీ సెక్షన్-22 ఏ (I)(ఇ)కు సంబంధించిన జాబితాను ప్రభుత్వం నోటిఫై చేయడమే కాకుండా, వాటిపై వచ్చిన ఆక్షేపణలను, అభ్యంతరాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలి. సెక్షన్-22 ఏ (1)(ఏ) నుంచి (డి) వరకు భూములను జాబితా నుంచి తొలిగించడానికి జిల్లా కలెక్టర్లకు అధి కారం ఉన్నది. రిజిస్ట్రేషన్ అధికారులు, అధీకృత అధికారులు పంపిన నిషేధిత జాబితాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. పై తీర్పును అనుసరించి ప్రభుత్వం Memo. No. 7797/ Reg-1-A/2016-17 తేదీ 27/5/17 ద్వారా జాబితా తయారు చేయడానికి (ప్రొఫార్మలతో సహా) తగు మార్గదర్శకాలను జారీచేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాన్ని తిరిగి హైకోర్టుకు పంపించారు. ప్రస్తుతం ఆ కేసు హైకోర్టు పరిశీలనలో ఉన్నది. గతంలో ఇచ్చిన తీర్పుపై ఎటువంటి స్టే లేదు. లోపాలు: విచారించదగిన విషయం ఏమిటంటే హైకోర్టు ఇచ్చిన గ డువు నాలుగు మాసాలు (తీర్పు తేదీ 23/12/15) అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జాబితాలను జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ అధికారులకు పంపకపోగా, రిజిస్ట్రేషన్ అధికారులు పాత జాబితాను పరిగణనలోకి తీసుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

వాస్తవానికి హైకోర్టు తాజా తీర్పు అనంతరం పాత జాబితాకు ఎటువంటి చట్టబద్ధత లేదు. (చట్ట ప్రకారం) సెక్షన్-22 ఏ (I)(ఇ) జాబితాను ఇంతవరకు ప్రభుత్వం నోటిఫై చెయ్యకపోగా, వాటిపై వచ్చిన అభ్యంతరాలను, ఆక్షేపణలను పరిశీలించడానికి జీవో నెం. 185 తేదీ 28/7/16 ప్రకారం ఉన్నతస్థాయి కమిటీ వెయ్యడం కాకుండా జీవో 194 తేదీ 1/9/17 ప్రకారం రిటైర్డ్ జడ్జి Syed Latest-ur-Rahmanని నియమించింది. సెక్షన్-22 ఏ (I)(ఇ) జాబితానే ఇంతరకు నోటిఫై చేయనప్పుడు ఆ కమిటీ ఏం పనిచేస్తుందో అధికార్లకే తెలియాలి. అంతేగాక కమిటీ ముందు ఆక్షేపణలను తీసుకు రాకముందు, వాటిని జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పరిశీలించాలని ఇటీవల సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీచేయడం మరో ఆశ్చర్యకరమైన విషయం. సూచనలు: ఇప్పటికైనా హైకోర్టు తీర్పును అనుసరించి జిల్లా కలెక్టర్లు వెంటనే నిషేధిత జాబితాను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలి. వాటిని తయారుచేసేటప్పుడు Spr Laoni రూల్స్ 1950 కింద జారీచేసిన 9 (y) సర్టిఫికెట్లను చట్ట ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చా లా? లేదా అన్న విషయాన్ని పరిశీలించాలి.
అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీ య బాధితులకు కేటాయించిన భూములు పదేండ్లు దాటితే వాటిని నిషేధిత జాబితాలో చేర్చకూడదు. ఎన్‌వోసీ కూడా అడుగరాదు. ముఖ్యంగా సెత్వార్ ఆధారంగా చేసుకుని నిషేధిత జాబితా తయారుచేయకుండా. ఖాస్ర పహాణి ఆధారంగా నిషేధిత జాబితా తయారు చేయా లి. ఎందుకంటే సేత్వారీలో సర్కారీ నమోదు అయినప్పటికీ, ఖాస్రలో అట్టి భూమికి ఖాతాదార్‌గా నమోదు అయితే దాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించకుండా, పట్టా భూమిగా పరిగణనలోకి తీసుకుంటే, ఇటీవల భూ ప్రక్షాళనలో పార్ట్-బీలో చేర్చిన భూములకు చాలావాటికి మోక్షం దొరుకుతుంది. తెలంగాణలో ఖాస్ర పహాణి విశిష్టత గురించి చట్టబద్ధత గురించి సుప్రీంకోర్టు తన కేసు నం CA/325-326/15 తేదీ 13/1/2015 వెలువరించిన తీర్పును ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది.
suresh-poddhar
అలాగే తెలంగాణలో 1958కి ముందు అసైన్ చేసిన ప్రభుత్వ భూమికి Pot వర్తించదని పలు తీర్పులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని కూడా నిషేధిత జాబితాలో చట్ట ప్రకారం చేర్చాలా ? లేదా న్యాయ సమీక్ష ద్వారా చర్య తీసుకోవాలి. ఇటీవల పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును అనుసరించి 1954కు ముందు అసైన్ చేసిన భూములకు సెక్షన్-22 ఏ నుంచి తొలిగించమని గతేడాది నవంబర్‌లో ఉత్తర్వులు జారీచేసింది. అం తేగాకుండా తగిన మార్గదర్శకాలను 2018 నవంబర్ 29న జారీ చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న ఎన్‌వోసీ ఫైల్‌కు మోక్షం కలిగే విధం గా తగిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో చాలావరకు పేదలకు పంచిన భూములు అన్యాక్రాంతం అయ్యాయి. పేపర్‌పై ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అయినప్పటికీ ఇప్పటికి అవి చాలావరకు కొనుగోలు చేసిన వారి స్వాధీనంలో ఉన్నా యి. వాటిని ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రెగ్యులరైజ్ చేసిన ఎడల ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం రావడమే కాకుండా పార్ట్-బీలో ని భూములకు మోక్షం కలుగుతుంది. ఈ విషయమై న్యాయపరంగా ప్రభు త్వం తగిన ఆలోచన చేసి చర్య తీసుకోవాలి. లేదా వాటిని ప్రభు త్వం కచ్చితంగా స్వాధీనంలోకి తీసుకోవాలి.
(వ్యాసకర్త: రిటైర్డ్ జాయింట్ కలెక్టర్)

233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles