రెవెన్యూ నియంతృత్వం

Sun,May 19, 2019 01:18 AM

katta-shekar-reddy
రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడుపేదల నుంచి పెద్దపెద్ద పదవులు నిర్వహంచినవారూ ఉన్నారు. ఒక మాజీ ఆర్డీవో, ఒక మాజీ జడ్జి, మరో ఎమ్మార్వో, మాజీ గెజిటెడ్ ఆఫీసర్లు, హెడ్మాస్టర్లు, టీచర్లు, మాజీ పోలీసు అధికారులు, జవాన్లు అందరూ బాధితులే. పేదవాళ్లు ఎక్కువమంది, ఎక్కువ బాధితులు. పెద్దవాళ్లు తక్కువ మంది, తక్కువ బాధితులు. అన్నీ కన్నీ ళ్లు, చెమటతో తడిసినవే.ఇది రెవెన్యూ నియంతృత్వం సార్. మా ఇష్టమొచ్చినప్పు డు చేస్తం. నువ్వు రాంగనే చెయ్యాలనుందా. మాకు లక్ష పనులుంటయ్ అని ఒక రెవె న్యూ అధికారి తమ ముఖం మీదనే అన్నడని ఓ రైతు చెప్పుకున్నడు. సోమవారం ఒక రైతు ఆదరబాదరాగా నమస్తే తెలంగాణ ఆఫీసుకొచ్చిండు. మాసిన బట్టలు. అలసిన ముఖం. వగపోస్తూ మాట్లడుతుండు. కొన్ని నీళ్లియ్యయ్య అడిగిండు. నీళ్లు తాగి మళ్లీ చెప్పడం మొదలుపెట్టిండు. మానుకోట పక్కన ఒక పల్లెటూరు నుంచి వచ్చిండట. సగం బాధ చెప్పి ఉన్నట్టుండి ఆకలయితుంద య్యా అన్నడు. అప్పుడు మధ్యాహ్నం పన్నెండయిం ది. ఇంకా తిన లేదా అడిగాం. లేదయ్యా. పైసల్లేవు. సికింద్రబాద్ టేషన్నుంచి నడుచుకుంట వచ్చిన అని ఆయన చెప్పాడు. అందరం హతాశులమయ్యాం. మరి మానుకోట నుంచి ఎలా వచ్చావు? అని అడిగితే, రైలులో టికెట్ లేకుం డా. టాయిలెట్లో దాక్కొని వచ్చిన అని దీనంగా చెప్పాడు. ముందుగా ఆఫీసు క్యాంటీన్లో భోజనం పెట్టించాం. అతని సమస్యనంతా విని, పత్రికలో రాస్తామని చెప్పి, బస్సు కిరాయిలు ఇచ్చి పంపాం.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనా సౌలభ్యం కోసమే, అధికార వికేంద్రీకరణ కోసమే పెద్ద ఎత్తున జిల్లాలను ఏర్పాటుచేశారు. ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటయ్యాయి. నాలుగైదు జిల్లాలు మినహా మిగిలిన ఏ జిల్లా ఒకటిన్నర రెవెన్యూ డివిజన్లకు మించదు. అక్కడ ఒక కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓ, ఆర్డీఓలు, మండల రెవెన్యూ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఇంతమంది ఉన్నారు. ఒక్కో జిల్లాలో మండలాల సంఖ్య కూడా తక్కువే. మండలాలు కూడా చిన్నచిన్నవి ఏర్పడ్డాయి. ఈ అధికారులంతా దృష్టిని కేంద్రీకరిస్తే ఎన్ని సమస్యలైనా నెలరోజులకు మించి కొనసాగుతాయా? రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిగిన రెండేండ్ల తర్వాత కూడా రైతులు పట్టాదారు పాసు పుస్తకాల కోసం, రికార్డులలో తప్పులు సరిచేయడం కోసం పడిగాపులు గాయాల్సిన అవసరం ఏమిటి?


అతనిది ఎంత విషాదమంటే, ఐదెకరా ల ఆసామి. ఆయన భూమి పోయింది. ప్రత్యామ్నాయంగా పరిహా రం ఇస్తామని అధికారికంగా లేఖ ఇచ్చారు. ఆ తర్వాత అదికూడా మార్చి ఎక్కడో రెండెకరాల భూమి రాసిచ్చారు. ఆ భూమిలో అప్పటికే మూడు పెద్ద బావులున్నయి. అది తనకు ఎందుకూ పనికిరా దు. మళ్లీ అధికారులను అడిగితే ఇన్నేండ్లుగా తిప్పుతున్నరు. ఐదెకరాల ఆసామి, చేతిలో పైసలేక, తిండికి లేక, రైలు టికెట్ కొనలేక, మాసిన బట్టలతో దేశమ్మీద పడి వచ్చాడంటే ఆ పాపం ఎవరిది? అక్కడి అధికారులు తలుచుకుంటే అది అర్ధగంటలో పరిష్కారమ య్యే పని. తలుచుకోకపోతే ఆ రైతు జీవితకాలం తిరుగడంతో సరిపోతుంది. రెవెన్యూ యంత్రాంగం అంతా ఇలాగే ఉందని కాదు. చాలా మంది అధికారులు రైతుల పట్ల పక్షపాతంతో పనిచేస్తున్నవారున్నా రు. నమస్తే తెలంగాణలో ధర్మగంటలో వార్తా కథనాలు మొదలవగానే కొందరు అధికారులు తమంతట తాముగా ముందడుగు వేసి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి పల్లెపల్లెలో సదస్సులు నిర్వహించారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కీసర, మోర్తాడ్, మరికొన్ని మండలాల్లో, మరికొన్ని జిల్లాల్లో అధికారులు పూనికగా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నా రు. కానీ ఇంకా సగానికిపైగా అధికార యంత్రాంగం జడత్వంతో వ్యవహరిస్తున్నది. సాకులు వెదుకుతున్నది. వార్తా కథనాలకు ఖం డనలు ఇస్తున్నారు. తమ తప్పేమీ లేదని, కోర్టులో పరిష్కరించుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఇంకొందరయితే కేసులు పెడుతామని రైతులను బెదిరిస్తున్నారు. మాకు మీరొక్కరేనా. ఎన్ని గ్రామాలున్నాయో తెలుసా. మీరు రాంగనే పరిష్కరించాలనుందా అని దబాయిస్తున్న అధికారులున్నారు. మాకు ఎన్నికల డ్యూటీ ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాపో అని తరిమేసిన అధికారులున్నారు. ఒక్క బాధ కాదు.


రైతులు చెబుతున్న కష్టాలు వింటుంటే మనసు వికలమవుతుంది. ఇప్పటిదాకా నాలుగైదు వేల ఫిర్యాదులు వచ్చాయి. వాట్సాప్ ద్వారా, మెయిళ్ల ద్వారా, పోస్టు ద్వారా కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా నమస్తే తెలంగాణ కార్యాలయాలకు కనీసం పదిమందైనా వస్తున్నారు. ఇంత రాష్ట్రంలో నాలుగైదు వేలు ఎక్కువ కాకపోవచ్చు. కానీ అవి కూడా ఎందుకు రావాలన్నదే ప్రశ్న. రైతు బాధితుడిగా ఎందుకు మారాలన్నదే ప్రశ్న. భూమి కలిగిన ప్రతి రైతు సగర్వంగా జీవించడానికి హక్కు ఉన్నవారు. అటువంటి రైతు బాధితుడిగా మారడం ఏమిటి? ఆ రైతుకు సేవ చేయడం కోసం ఏర్పాటైన రెవెన్యూ వ్యవస్థ ఆ రైతుపై స్వారీ చేయడం ఏమిటి? ప్రజలు ఏర్పాటుచేసుకున్న వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండకపోతే ఎలా? రెవెన్యూ సిబ్బంది ప్రజాకంటకులుగా వ్యవహరిస్తే ఎలా? ఇదెంతకాలం? పటేల్, పట్వారీ వ్యవస్థ గ్రామాలలో దాష్టీ కం చేస్తున్నదని ముద్ర వేసి నాడు టీడీపీ ప్రభుత్వం రద్దుచేసింది. నిజానికి ప్రజలకు దగ్గరగా పనిచేసిన వ్యవస్థ అది. ప్రజలకు అన్యా యం చేయడానికి భయపడిన వ్యవస్థ అది. ఇప్పుడు ఏర్పాటైన వ్యవస్థ అంతకంటే బాధ్యతారహితంగా, కర్కశంగా, కరడుగట్టిన విధంగా రైతులను సతాయిస్తున్నది. ఇప్పుడు నాలుగైదు గ్రామాల కో రెవెన్యూ అధికారి. ఆయన ఎప్పుడు దొరుకుతారో తెలియదు. ఎక్కడ దొరుకుతారో తెలియదు. ఏదైనా సమస్యను నివేదిస్తే ఎన్ని రోజుల్లోగా పరిష్కరిస్తారో తెలియదు. అన్నింటికీ మించి లంచమిస్తే తప్ప పనులు జరుగని దుస్థితి. ఒక్కోసారి లంచం తీసుకొని కూడా పనిచేయని పరిస్థితి. ఇచ్చిన డబ్బులు అడిగితే మరింత వేధించే పరిస్థితి. ఆశ్చర్యకరమేమంటే కింద రెవెన్యూ అధికారి ఏం చెబితే పైన మండల రెవెన్యూ అధికారి వరకు ఒకేరకమైన సమాధానం. భలే కట్టుబాటు.

అందరూ బదురుకున్నట్టు, గోడకట్టినట్టు మాట్లాడుతారు. రైతు తల గోడకు కొట్టుకోవడం తప్ప దారితెలియని పరిస్థితి. ఇది నిజంగా రెవెన్యూ నియంతృత్వమే. రైతులు పడుతున్న బాధలు ఎటువంటివి? ఒక్కటి కూడా మం డలస్థాయిలో పరిష్కరించలేనివి కాదు. అధికారులు తల్చుకుంటే ఏ సమస్యకూ ఒక్క గంటకు మించి సమయం పట్టదు. పట్టాదారు పుస్తకాలు ఇవ్వకపోవడం, ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం, ఉన్న భూమిని తగ్గించి రికార్డుల్లో నమోదు చేయడం, ఒకరి భూమి ని మరొకరికి రాయడం, రైతుబంధు ఇవ్వకపోవడం, రైతు బీమా పత్రాలు రాకపోవడం, సర్వేచేసి హద్దులు గుర్తించకపోవడం, వేరే సర్వే నంబర్ల భూములను మరో సర్వే నంబర్‌లో గుర్తించి అక్కడి రైతులను బయటికి తరమడం అన్నీ సాధారణ సమస్యలే. ఇవన్నీ మండల రెవెన్యూ అధికారి స్థాయిలో చొరవ చేస్తే పరిష్కరించదగినవే. రెవెన్యూ అధికారులకు ఇతర విధులు ఉండే మాట వాస్తవం. వారిపై పనిభారం కూడా ఉండవచ్చు. కానీ ప్రాథమిక విధులు రెవె న్యూ పరమైనవి. వాటిని పరిష్కరించిన తర్వాతనే ఏ విధులైనా. పనిభారం ఒక కారణం లేక సాకు మాత్రమే. లోపించిందల్లా సం కల్పం. చిత్తశుద్ధి. మనం ప్రజల కోసమే ఉన్నామన్న స్పృహ. పాల నావ్యవస్థ మునుపటిలా లేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనా సౌలభ్యం కోసమే, అధికార వికేంద్రీకరణ కోసమే పెద్ద ఎత్తున జిల్లాలను ఏర్పాటు చేశారు. ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటయ్యాయి. నాలుగైదు జిల్లాలు మినహా మిగిలిన ఏ జిల్లా ఒకటిన్నర రెవెన్యూ డివిజన్లకు మించదు. అక్కడ ఒక కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓ, ఆర్డీఓ లు, మండల రెవెన్యూ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఇం తమంది ఉన్నారు. ఒక్కో జిల్లాలో మండలాల సంఖ్య కూడా తక్కు వే. మండలాలు కూడా చిన్నచిన్నవి ఏర్పడ్డాయి. ఈ అధికారులం తా దృష్టిని కేంద్రీకరిస్తే ఎన్ని సమస్యలైనా నెలరోజులకు మించి కొనసాగుతాయా? రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిగిన రెండేండ్ల తర్వాత కూడా రైతులు పట్టాదారు పాసు పుస్తకాల కోసం, రికార్డులలో తప్పులు సరిచేయడం కోసం పడిగాపులు గాయాల్సిన అవసరం ఏమిటి? రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి కుటుం బం వీధిన పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి రైతుబీమా పథ కం ప్రవేశపెట్టారు.

పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడం, బీమా పథకంలో పేరు నమోదు చేయకపోవడం వల్ల చాలా రైతు కుటుంబాలు ప్రయోజనం పొందలేకపోతున్నాయి. ఈ పని చేయడానికి అధికారులకు అదనంగా పడే భారం ఏమీ లేదు. అధికార వికేంద్రీకరణ, పాలనా సౌలభ్యం ప్రజల కోసమా? అధికారులకు పదవుల కోసమా? జిల్లా ఆఫీసుకు వచ్చి ప్రజలకు దూరభారాలు తగ్గించాలన్న సంకల్పంతోనే కదా ఈ వికేంద్రీకరణ జరిగింది. అధికార వికేంద్రీకరణ తర్వాత కూడా రైతులు వెనుకటి బాధలనే పడితే వికేంద్రీకరణకు అర్థం ఏముంది? ఇటువంటి వ్యవస్థను ఎన్నాళ్లయినా ఏమీ చేయకుండా ఎలా కొనసాగిస్తుంది ఏ ప్రభుత్వమైనా? ఈ జడత్వాన్ని వదిలించకపోతే ప్రజల కష్టాలు తీరేదెలా? భూమి అమ్మకాలు, కొనుగోళ్లు, సవరణలకు సంబంధించిన మార్పులు రికార్డుల్లో ఎప్పటికప్పుడు చట్టప్రకారం జరుగకపోతే రైతాంగానికి, భూమి యజమానులకు ఈ కష్టాలు తప్పవు. ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిన దుస్థితి నుంచి భూమి రికార్డులకు ముక్తి కల్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి పనికి ఒక గడువు ఉండాలి. ప్రతి అధికారి జవాబుదారు కావాలి.

1800
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles