ఈసారి ప్రభావిత అంశం ఏమిటి?

Sun,May 19, 2019 01:14 AM

ఇప్పటివరకు దేశంలో జరిగిన 16 సాధారణ ఎన్నికల్లో ప్రజలు ప్రతిసారి ఒక్కో నిర్దిష్టమైన అంశానికి ప్రభావితమై ఓటు వేశారు. కొన్ని రాష్ర్టాల్లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రజలు విభిన్నమైన తీర్పు ఇవ్వవచ్చు కానీ, స్థూలంగా దేశ ప్రజలందరి ఆలోచన ఒకే రకంగా ఉంటూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఈ సారి ప్రజలను ఏ అంశం ఎక్కువగా ప్రభా వితం చేసిందనే విషయం పై రాజకీయపార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. దేశ భవిష్యత్తు, సమస్యల పరిష్కారం ప్రాతి పదికన జనం తీర్పు ఇస్తారా? భావోద్వేగాలకు లోనవుతా రా? అనే విషయం అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారో తేలితే, దాన్నిబ ట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించవచ్చు. కానీ జనం నాడిని అంచనా వేయడమే గగనమైపోతున్నది. అందుకే రాజకీయపక్షాలు తమకు అనుకూలంగా ఉండగ లవని భావిస్తున్న అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రచారం సాగించాయి. దేశ రాజకీయ పార్టీలు ఇప్పుడు మూడు ప్రధాన శిబిరాలుగా విడిపోయి, వారికి అను కూలంగా ఉండే అంశాలను, వాదనలను ఎంచుకొని ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నించాయి. ఎన్నో ఆశలతో 2014లో నరేంద్రమోదీ ప్రధాని కావాలని జనం తీర్పు ఇచ్చా రు. బీజేపీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరాయో జనం బేరీజు వేసుకున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలైన డీ మానిటైజేషన్, జీఎస్టీ వల్ల తమకు లాభం కలిగిందా? నష్టం కలిగిందా? అనే విషయంపై కూడా ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు. బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొచ్చిన రామ జన్మభూమి, కశ్మీర్, తలాఖ్ తదితర అంశాలు జనం పరిశీలనలో ఉన్నా యి. ఇవన్నీ తమకు అనుకూలంగానే ఉంటాయని బీజేపీ నమ్ముతున్నది. దేశ భద్రత విషయంలో తాము రాజీ పడటం లేదనే విషయం నొక్కిచెప్పడం ద్వారా ప్రజల మద్దతు కూడగట్టడానికి బీజేపీ ప్రయత్నించింది.

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మోదీ వ్యతిరేకతపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. మోదీ మాటలు మాత్రమే చెప్పారు, చేతల్లో విఫలమయ్యారని కాంగ్రె స్ శిబిరం ప్రచారం నిర్వహించింది. తీసుకొస్తామన్న నల్లధనం ఏమైందని వారు ప్రశ్నించారు. పెరిగిపోయిన పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయరంగంలో సంక్షోభం మోదీ ప్రభుత్వ వైఫల్యాలుగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. డీ మానిటైజేషన్, జీఎస్టీ ప్రజలను ఇబ్బందిపెట్టిన నిర్ణయాలను గుర్తుచేసింది. ఈ సమస్యలను పరిష్కరించడంలో మోదీ విఫలమయ్యారని చెపుతూనే, తాము అధికా రంలోకి వస్తే ఒనగూరే ప్రయోజనం గురించి గట్టిగా హామీలిచ్చింది.


ప్రజలు కూడా ఈ అం శానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని బలంగా నమ్ముతున్నది. ఇక కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మోదీ వ్యతిరేకతపై ఎక్కువగా ఆశలు పెట్టు కున్నాయి. మోదీ మాటలు మాత్రమే చెప్పారు, చేతల్లో విఫలమయ్యారని కాంగ్రె స్ శిబిరం ప్రచారం నిర్వహించింది. తీసుకొస్తామన్న నల్లధనం ఏమైందని వారు ప్రశ్నించారు. పెరిగిపోయిన పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయరంగంలో సం క్షోభం మోదీ ప్రభుత్వ వైఫల్యాలుగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. డీ మానిటైజే షన్, జీఎస్టీ ప్రజలను ఇబ్బందిపెట్టిన నిర్ణయాలను గుర్తుచేసింది. ఈ సమస్య లను పరిష్కరించడంలో మోదీ విఫలమయ్యారని చెపుతూనే, తాము అధికా రంలోకి వస్తే ఒనగూరే ప్రయోజనం గురించి గట్టిగా హామీలిచ్చింది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ లాంటి హామీలిచ్చింది. రాఫెల్ అవినీతి గురించి పదే పదే మాట్లాడి మోదీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పింది. ఈ రెండు పార్టీలు బలంగా లేని రాష్ర్టాల్లో పరిస్థితి మరొకవిధంగా ఉన్నది. దేశ ప్రజల సమస్యలన్నింటికీ ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని ప్రాంతీయపార్టీలు ప్రచారం చేశాయి. దేశాన్ని ఎలా ముం దుకుతీసుకుపోవాలనే విషయంపై ఈ రెండు పార్టీలకు సరైన ప్రణాళికే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాదన ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీతో కలు వని మమతాబెనర్జీ, మాయావతి, అఖిలేశ్ యాదవ్, నవీన్ పట్నాయక్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ వాదనను సమర్థిస్తున్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రాంతీయ పార్టీలనే నమ్ముకొని ఎక్కువ సీట్లు అప్పగిస్తారని వారు ఆశిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను కాదని ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు కట్టబెట్టి 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్ప డటానికి, 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులే 201 9లో కూడా ఏర్పడుతాయని ప్రాంతీయపార్టీలు నమ్ముతున్నాయి. ప్రజలు ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారనే విషయమే, ఎవరు అధికారంలోకి వస్తారో తేలుస్తుంది.

1951 నుంచి ఎన్నికల సరళిని గమనిస్తే బోధపడే విష యం అదే. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో 1951-52లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. వ్యవ సాయ అభివృద్ధికి, పారిశ్రామికీకరణ కు నెహ్రూ తీసుకుం టున్న చర్యలు, నవభారత నిర్మాతగా ఆయనకున్న చరిష్మా, సామ్యవాద ఆర్థిక విధానాలు 1956, 1962లో ప్రధాన అం శాలుగా మారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణ మయ్యాయి. ఇందిరాగాంధీ సమర్థవంతంగా నడుపగలరనే నమ్మకమే 1967లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడానికి కారణమైంది. 1971 ఎన్నికల్లో పేదరిక నిర్మూలన ప్రధాన ఎజెండాగా గరీబీ హటావో నినాదం ఇచ్చిన ఇందిరా గాంధీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 1975లో ప్రవేశపెట్టిన ఎమర్జె న్సీ ఇందిరాగాంధీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకడానికి కారణమైంది. అందుకే 1977లో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఓడిపోయింది. ఎమర్జెన్సీలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారి నాయకత్వంలోని జనతాపార్టీ అధికారం లోకి వచ్చింది. జనతా పార్టీ నాయకుల్లో వచ్చిన స్పర్థలు, అస్థిరత పట్ల ప్రజల్లో విసుగు వచ్చి, 1980లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఇందిరాగాంధీ నాయక త్వం వైపు మొగ్గుచూపారు. ఇందిరాగాంధీ హత్యతో వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. బోఫోర్స్ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణ లు, పంజాబ్, కశ్మీర్, తమిళనాడు, అస్సాం తదితర రాష్ర్టాల్లో అశాంతి చెలరేగడం లాంటి కారణాల వల్ల రాజీవ్‌గాంధీ పాల నపై వ్యతిరేకత వచ్చింది. దీంతో 1989లో కాంగ్రెస్ పార్టీని ఓడించారు. రామ జన్మభూమి వివాదంతో బీజేపీ పుంజుకున్నది. వీపీ సింగ్ తదితరుల నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయగ లిగింది. అయితే కాంగ్రెసేతర పక్షాలకు వచ్చిన రెండో అవకాశాన్ని కూడా సరిగ్గా వినియోగించుకో లేకపోయారు.

అస్థిరత రాజ్యమేలింది. దీనికితోడు 1991 ఎన్నికల మధ్యలో రాజీవ్ గాంధీ హత్య కాంగ్రెస్ పట్ల సానుభూతిగా మారింది. పీవీ నరసింహారావు నాయకత్వంలో వచ్చిన ఆర్థిక సంస్కరణల ప్రయోజనం ప్రజలకు వెంటనే అనుభవంలోకి రాలేదు. పీవీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు బాట లు వేస్తున్నదనే భావన, పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం, బాబ్రీ మసీ దు కూల్చివేత, రామ మందిర వివాదం, చాలా రాష్ర్టాల్లో అంతర్గత పోరాటాలు పీవీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడటానికి కారణమయ్యాయి. దీంతో 1996 ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు కట్టబెట్టారు. కొన్నాళ్లు బీజేపీ, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభు త్వాలు ఏర్పడ్డాయి. కానీ నిలదొక్కుకో లేకపోయాయి. కాంగ్రెస్ మద్దతుతో ఏర్ప డిన ప్రభుత్వాలది కూడా మున్నాళ్ల ముచ్చటే అయింది. దీంతో 1998లో బీజే పీకి ప్రజలు మరిన్ని ఎక్కువ సీట్లు ఇచ్చారు. అయినా అవి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోకపోవడంతో ఇతర పక్షాలపై ఆధారపడి నెట్టుకురా వాల్సి వచ్చింది. చివరికి 13 నెలల తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో వాజపేయి ప్రభు త్వం ఒక్క ఓటుతో ఓడిపోయింది. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం వచ్చింది. కార్గిల్ యుద్ధం, ఒక్క ఓటుతో వచ్చిన సానుభూతితో 1999లో బీజేపీ అధికా రంలోకి రాగలిగింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల 2004 ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారు. మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం విజయవంతంగా సాగడంతో పాటు, ఉపాధిహామీ పథకం లాంటి ప్రయోజనకర పథకాలను ప్రవేశపెట్టింది. దీంతో 2009లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చింది.
Gatika-vijay-kumar
పదేండ్ల కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతతో పాటు, గుజరాత్ సీఎంగా విజయవం తమైన మోదీ ప్రభావం వల్ల 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు ప్రజలు ఐదేండ్ల మోదీ పాలనను చూశారు. వారి వాదనను వి న్నారు. కాంగ్రెస్ చేసిందీ చూశారు. చెప్పిందీ విన్నారు. ప్రాంతీయ పార్టీల వాదననూ ఆలకించారు. వారు ఏ అంశానికి ప్రభావితమయ్యారనేది మాత్రం ఫలితాల తర్వాతే తేలుతుంది.

236
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles