ఇంకుడు గుంతలే భరోసా

Sun,May 19, 2019 01:13 AM

నీరు మనిషికే కాదు, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికి ప్రాణాధారం. నీరు లేకపోతే ప్రపంచమే లేదు. భూమి మీదున్న నీటిలో 97శాతం సము ద్రపు నీరున్నప్పటికీ ఆ నీళ్లు తాగటానికి పనికి రావు. మరో 2శాతం నీరు మంచు పర్వతాల రూపంలో వుం ది. మిగిలింది ఒక శాతం మాత్రమే. భూ ఉపరితలంలోని నీరే సకల జీవరాసులకు ఆధారం. పెరుగుతున్న జనాభా అవసరాలకు ఈనీరు సరిపోవడం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం 165 దేశాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. దక్షిణాఫ్రి కాలోని కేప్‌టౌన్ నగరం నీరులేని నగరంగా మారిపోయింది. మనదేశంలోని పలు ప్రాంతాలు కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే వర్షపు నీటిని సంరక్షించుకోవడం మినహా మరొక మార్గం లేదు. ఏటా కురిసే వర్షపు నీటిని ఇంకుడు గుం తల ద్వారా తిరిగి భూమిలో కి ఇంకింపచేసినపుడు నీటి బాధలుండవు. ప్రజల భాగస్వామ్యంతో జరిగే అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. వాన నీటి సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలను ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతోనే నిర్మించింది. సహజంగా వీటి నిర్వహణ బాధ్యత స్థానిక నాయకులు, ప్రజలు, కార్యకర్తలు చూసుకోవాలి. ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఇం కుడుగుంతల నిర్వహణ స్థానిక సంఘాలు, నాయకు లూ, ప్రజలు పట్టించుకుంటే మంచినీటి ఎద్దడి మాయమవుతుంది. హైదరాబాద్ నగరంలో సుమారు 15 వేల ఇంకుడు గుంతలు మహానగర పాలక సంస్థ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ నిర్మించినవి ఉన్నాయి. పలు భవంతుల పరిసరాలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులకు ఇరువైపులా రీఛార్జ్ గుంతలు నిర్మించడం జరిగింది.

నగరం అందంగా,ఆకర్షణీయంగా ఉండాలంటే రోడ్లమీద చెత్త చెదారం వుండకూడదు. తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా మనం అందించినపుడు పారిశుధ్య కార్మికుల కు పనిభారం తగ్గుతుంది. అందుకే సాఫ్ హైదరాబాద్-శాందార్ హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ప్రజల భాగస్వామ్యంతోనే చేస్తున్నాం. మనిషి తనకుతాను ఎంత పరిశుభ్రంగా వుండాలనుకుంటాడో, నగరం కూడా పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం వున్నది.


ఇంకా పలు ప్రభుత్వ సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, గృహ యజమానులు, కాలనీ వాసు లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్మించిన ఇంకుడు గుంతలు ఎన్నో వున్నాయి. అయితే వీటి నిర్వహణలో చాలా లోపం ఉందని గమనించడం జరిగింది. నిర్మించినపుడున్న శ్రద్ధ నిర్వహణలో ఉండటం లేదు. చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా, పలు కాలనీలలో నిర్మించిన ఇంకుడు గుంతలను ప్రజలు పట్టించుకోవడం లేదు. వర్షపు నీటిని సంరక్షించే ఆశయంతో నిర్మించిన ఈ ఇంకుడు గుంతల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్, సీసాలు, తిని పారేసిన ఆహార పదార్థాల వ్యర్థాలు పడేస్తున్నా రు. దుమ్ము ధూళిని ఇందులో పడేస్తున్నారు. చెట్లు చేమ లు, పిచ్చి మొక్కలు ఈ గుంతల్లో పెరుగుతున్నాయి. దీంతో ఇంకుడు గుంతలన్నీ రోడ్డు లెవెల్‌కు రావడం వల్ల పారుతుండే వర్షపునీరు ఇందులోకి వెళ్లకుండా వృథాగా కిందకు పోతున్నది. దీంతో ఒక లక్ష్య సాధనతో నిర్మించిన ఇంకుడుగుంతల ప్రయోజనం నెరవేరడం లేదు. మరి కొద్దిరోజుల్లో రుతుపవనాలు ప్రారంభమయ్యేనాటికి ఈ ఇంకుడు గుంతల నిర్వహణను ఒకేరోజు పెద్ద ఎత్తున చేబట్టి వాటిని తిరిగి యథాస్థితికి చేర్చడానికి హైదరాబాద్ మహానగర పాలక సం స్థ, హైదరాబాద్ మహానగర మంచినీటి, మురుగు నీటి పారుదల మం డలి ప్రతిపాదించింది. ఇందుకోసం ఈ రెండు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది 2019 మే 18న అన్ని కాలనీసంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇంకుడు గుం తల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక కాలనీవాసుల సహకారంతో ఇంకుడు గుంతలను శుభ్రం చేయడం, తగినంత ఇసుక తిరిగి నింపడం జరిగింది. ప్రతి వర్షాకాలం ముం దు ఇసుక పొరను మార్చడం వల్ల వర్షపు నీరు ఆ ఇంకు డు గుంతల్లోకి సులభంగా చేరుతుంది. ఇకముందు వీటి నిర్వహణను ప్రజలే పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది.

ప్రతి వర్షపు నీటి చుక్కను ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకే విధంగా చేయడం వల్ల ఆ పరిసర ప్రాంతంలో భూగర్భ జలాలు పెంపొందుతాయి. తద్వారా అక్కడ నీటి ఎద్దడి సమస్య తలెత్తదు. ప్రజలు తమ ప్రాంతాల్లో నిర్మించిన ఇంకుడు గుంతల ను శుభ్రం చేసుకోవాలి. స్వంతంగా ఇంట్లో నిర్మించుకున్న ఇంకుడు గుంతలైతే తగినంత కంకర, ఇసుక ఉం డేలా గృహ యజమానులు చూసుకోవాలి. ఇంకుడుగుంతలు సరిగా ఉంటే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉండదు. ప్రతి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపితే పుడమి తల్లి పులకరిస్తుంది. కాబట్టి రాబోయే వర్ష పు నీటికోసం ఇంకుడు గుంతలను సిద్ధం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో నీటికోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఇంకుడు గుంతలు ఒక్కటే కాదు, నీటి వృథా ను తగ్గించుకోవడంలో కూడా ప్రజల భాగస్వామ్యం అవసరం. రోజుకు 20 మిలియన్ గ్యాలన్ల మంచినీరు వృథా చేస్తున్నారు. పైపులతో కార్లు, ఇతర వాహనాలు కడుగడం లాంటి చర్యలతో విలువైన నీరు వృథా అవుతున్నది. వృథా చేస్తున్న ఈ నీరు 4 నుంచి 5 లక్షల జనాభాకు సరిపోతుంది. ఈ వృథాను తగ్గిస్తే, మరో నాలుగు లక్షల మందికి మంచినీరు లభిస్తుందని గ్రహించాలి.
D-Kishore
నగరం అందంగా,ఆకర్షణీయంగా ఉండాలంటే రోడ్లమీద చెత్త చెదారం వుండకూడదు. తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా మనం అందించినపుడు పారిశుధ్య కార్మికుల కు పనిభారం తగ్గుతుంది. అందుకే సాఫ్ హైదరాబా ద్-శాందార్ హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ప్రజల భాగస్వామ్యంతోనే చేస్తున్నాం. మనిషి తనకుతాను ఎంత పరిశుభ్రంగా వుండాలనుకుంటాడో, నగరం కూడా పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం వున్నది. ఇం కుడు గుంతలతో నీటిని ఆదా చేద్దాం. నీటి వృథాను తగ్గిద్దాం. నగరాన్ని పరిశుభ్రంగా వుంచుకుందాం. ప్రజ ల భాగస్వామ్యం, నిబద్ధతతోనే ఏదైనా, ఎంత అద్భుత మైనా సాధించవచ్చు.
(వ్యాసకర్త: జలమండలి కమిషనర్, జీహెచ్‌ఎంసీ)

248
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles