గెలిచేదెవరు-ఓడేదెవరు


Sun,April 14, 2019 03:23 PM

katta-shekar-reddy
రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్తమయ్యే ఆత్మవిశ్వాసాన్ని, ఆనందా న్ని బట్టి గెలిచేదెవరో కూడా అంచనా వేయవ చ్చు. తెలంగాణకు సంబంధించి పంచాయితీ లేదు. ఎన్నికలు దాదాపు ఏకపక్షంగానే జరిగాయి. తెరాస నేతలు, శ్రేణులు చీమల దండులా ఊళ్లను కలియదిరిగారు. ఎన్నికలను పట్టించుకొని ప్రచా రం హోరెత్తించారు. కాంగ్రెస్, బీజేపీలు కొన్ని నియోజకవర్గాల్లో తప్ప చాలా నియోజకవర్గాల్లో చేతులెత్తేశారు. ఖర్చు దండుగ అన్న భావనకు వచ్చి కాడి పారేశారు. మొదటిసారి ఐదారు నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. కాం గ్రెస్ ఇంతటి దీనస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. అయినా ఏఐసీసీ నేత కుంతియా లాంటివారు ఇం కా ఏవేవో కోతలు కోస్తూనే ఉన్నారు. బహుశా పరిషత్ ఎన్నికల్లో శ్రేణులను ఉత్సా హపర్చడానికి గెలుపు కోత లు చేసి ఉంటారు. కానీ కాం గ్రెస్ కోలుకునే అవకాశాలు చాలా స్వల్పం. ఆంధ్రలో చంద్రబాబునాయుడు తాను గెలువడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. ప్రచారాన్ని అత్యంత అథమస్థాయికి తీసుకెళ్లారు. అబద్ధాలు, అభూత కల్పనలు, విద్వేష ప్రచారాలు యథేచ్ఛగా చేశా రు. ఎన్నికల వేళ ప్రజల వద్ద కు ఇన్ని వేళ కోట్ల ప్రభుత్వ ధనం కానీ, ప్రైవేటు ధనం కానీ చేరడం చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు. పాత పథకాల పేరుతో పోలింగుకు రెం డు రోజుల ముందు వరకు కూడా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో డబ్బును ఇంత విచ్చలవిడిగా ఖర్చుపెట్టే సంస్కృతిని ప్రవేశపెట్టిన ఖ్యాతి అప్పటికీ ఇప్పటికీ చంద్రబాబునాయుడిదే. సామాన్యులెవరూ ఎన్నికల వైపు చూడలేని స్థితి తీసుకొచ్చిన నాయకుడు ఆయన. అయినా డబ్బు ఒక్కటే గెలిపిస్తుందంటే అధికారంలో ఉన్నవారెవరూ ఎప్పటికీ మారరు. ప్రజల విశ్వాసం పొందడం కొనసాగించడం కూడా అతిముఖ్యం.


తెలంగాణలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. అందుకు ఇక్కడి రాజకీయ చైతన్యం ఒక కారణం కాగా, ఎన్నికల బరిలో బలమైన ప్రత్యర్థులు లేకపోవడం మరో కారణం. ఈ ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీ అనుసరించిన ఉదాసీన వైఖరి ఇవ్వాళ ఆ పార్టీని శాపమై వెంటాడుతున్నది. ఆ రోజు నిలబడి కొట్లాడినవారే నేడు హీరోలుగా నిలిచారు. ఆంధ్ర ఆధిపత్యవాదానికి ప్రతీక అయిన టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. తెలంగాణ ఏర్పడిన నాడే ఆ పార్టీకి ఇక్కడ మనుగడ ఉండదని తెలుసు. అయి నా కొందరు తెలుగు తమ్ముళ్లు ఇంకా ఆశ చావక అందులో కొనసాగారు. జార్ఖండ్‌లో ఆర్జేడీ, జేడీయూలకు పట్టిన గతే ఇక్కడ టీడీపీకి పడుతుందని విశ్లేషకులు ఎప్పటినుంచో చెబుతున్నదే.చంద్రబాబు ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఎందుకు నెత్తీనోరు కొట్టుకుంటున్నాడు? అంటే ఆయనకు తనపై తనకు విశ్వాసం లేదు. ప్రజల విజ్ఞతపై నమ్మకం లేదు. అందుకే సాకులు వెతికే పనిలో పడ్డారు. నోరు లేని ఈవీఎంలపై ముందుగానే ఒక నెపం వేసి పెట్టారు. ఒకవేళ ఓడిపోతే చూశారా నేను ముందుగానే చెప్పాను ఈవీఎంలు మోసం చేశాయని ఆరోపించవచ్చు. ఒకవేళ గెలిస్తే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు గెలిపించారని ప్రకటించుకోవచ్చు. ఇటువంటి నీతిలేని రాజకీయమే చంద్రబాబు విశ్వసనీయతను నాశనం చేసేది. చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ముందుగానే అమలు చేసి ఉంటే మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన ప్రజల విశ్వాసాన్ని సులువుగా పొంది ఉండేవారు. నాలుగున్నరేండ్లు కాలయాపనచేసి, ప్రజల్లో నమ్మకం పోయిన తర్వాత పథకాల అమలు, పింఛన్ల పెం పు వంటి చర్యలు తీసుకున్నారు. మమ్మల్ని చూసే చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రకటించుకునే అవకాశం వచ్చిం ది. రెండు పార్టీలూ పోటీ పడి పథకాలు, పింఛన్ల మొత్తం పెంచా యి. అందుకే పోలింగ్ బాగా పెరిగింది. పోలింగ్ పెరుగడానికి రెండు కారణాలు చెబుతారు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా ఉన్న సందర్భాల్లో ప్రజలు వెల్లువ లా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేస్తారు. రెండు, ప్రభుత్వ అనుకూలత బాగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్న పార్టీని కాపాడుకోవాలనుకున్నప్పుడు కూడా జనం పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటారు. వైఎస్‌ఆర్‌సీపీ మొదటి కారణం చేతనే ప్రజలు వెల్లువలా పోలింగ్ బూత్‌లకు వచ్చారని, పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనా అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు క్యూలలో ఉండి ఓటు వేశారని చెప్పుకుంటున్నది.

టీడీపీ రెండో కారణం చెప్పుకుంటున్నది. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడి అపరాత్రి వేళ కూడా ఓటు వేశారని టీడీపీ సంబురపడుతున్నది. అయితే అన్ని చోట్లా ఇది ఒకేవిధంగా ఉండకపోవచ్చు. ఆయా సామాజికవర్గాల ప్రభావాన్ని బట్టి కూడా పోలింగ్ ట్రెండ్ మారుతూ వచ్చి ఉండవ చ్చు. కర్నూలు నుంచి గుంటూరు దాకా ఒక విధంగా, కృష్ణా నుంచి తూర్పుగోదావరి దాకా మరోవిధంగా, ఉత్తరాంధ్రలో ఇంకో విధం గా పోలింగ్ సరళి ఉండే అవకాశ ఉంది. ఫలితాలలో కూడా అదే సరళి కనిపిస్తుండటం గతానుభవమే. రెండుపక్షాలూ ఈ సారి ఏ అవకాశాన్నీ వదలలేదు. వీరోచితంగా పోరాడాయి. ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి తలపడ్డాయి. అందుకే అనేకచోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతలు, హత్యలు జరిగాయి. ఎన్నికల ఫలితాల అం చనాలు కూడా అంతుచిక్కకుండా ఉన్నాయి. ఎప్పుడూ సర్వేలు, అధ్యయనాలు, అంచనాలు చేసే ఎన్నికల నిపుణ సంస్థలు వైఎస్‌ఆర్‌సీపీకి మొగ్గు చూపిస్తున్నాయి. కొందరు స్వల్ప ఆధిక్యతతో అయినా జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తారని అంచనా వేయ గా మరికొన్ని ఏజెన్సీలు మూడింట రెండొంతుల భారీ ఆధికత్యను సూచిస్తున్నాయి. ఇటు టీడీపీ శిబిరం కూడా భయం, ఆందోళన ప్రకటిస్తూనే ప్రజలు తమనే గెలిపిస్తారని చెబుతున్నది. చంద్రబాబును సమర్థించే మీడియా ఒక్క సీటు ఆధిక్యతతో అయినా చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారని అంచనా వేస్తున్నది. టీడీపీ శ్రేణుల్లో గెలుపు ధీమాను సజీవంగా ఉంచేందుకు ఆంతరంగికంగా రకరకాల సర్వేలు ప్రచారంలో పెడుతున్నది. మరో ఆరు వారాల దాకా ఈ సస్పెన్స్ తప్పదు. ఈ ఎన్నికల నిర్వహణ ఇన్ని దశలుగా ఇన్ని రోజులపాటు సాగదీయడం మాత్రం నరకప్రాయంగా కనిపిస్తున్నది.

ఇది అవసరమై చేస్తున్నారా, తీరుబడిగా జరుపుదామను కొని చేస్తున్నారా అర్థం కాదు. ఇన్ని రోజులపాటు దేశంలో పాలనా వ్యవస్థ అచేతనం కావడం మంచిది కాదు. దశలు, రోజులు పెరిగే కొద్దీ కొన్ని వేల కోట్ల ధనం బూడిదపాలవుతున్నది. పోటీచేసినవాళ్లు ఆర్థికంగా సర్వనాశనం అవుతున్నారు. అది ఎవరిదైనా కావ చ్చు. రెండు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని దేశంలోని అన్ని రాజకీయపార్టీలు కూడా ఆలోచించాలి. ఎన్నికల సం ఘం ఆలోచనా విధానాన్ని మార్చాలి. తెలంగాణలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. అందుకు ఇక్క డి రాజకీయ చైతన్యం ఒక కారణం కాగా, ఎన్నికల బరిలో బలమై న ప్రత్యర్థులు లేకపోవడం మరో కారణం. ఈ ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీ అనుసరించిన ఉదాసీన వైఖరి ఇవ్వాళ ఆ పార్టీని శాపమై వెంటాడుతున్నది. ఆ రోజు నిలబడి కొట్లాడినవారే నేడు హీరోలుగా నిలిచారు. ఆంధ్ర ఆధిపత్యవాదానికి ప్రతీక అయిన టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. తెలంగాణ ఏర్పడిన నాడే ఆ పార్టీకి ఇక్కడ మనుగడ ఉండదని తెలుసు. అయి నా కొందరు తెలుగు తమ్ముళ్లు ఇంకా ఆశ చావక అందులో కొనసాగారు. జార్ఖండ్‌లో ఆర్జేడీ, జేడీయూలకు పట్టిన గతే ఇక్కడ టీడీపీకి పడుతుందని విశ్లేషకులు ఎప్పటినుంచో చెబుతున్నదే. కానీ కొందరు కరడుగట్టిన తెలుగు తమ్ముళ్ల మెదళ్లకు మాత్రం అది ఎక్కలేదు. చంద్రబాబు ఇచ్చే ఆర్థిక తాయిలాల కోసం ఇంతకాలం ఆ జెండాను మోస్తూ వచ్చారు. ఆత్మాభిమానం, ప్రాంతీయాభిమానం ఇసుమంతైనా చూపలేదు. అందుకే టీడీపీ అంటే తెలంగాణలో ఈసడించుకునే పరిస్థితి వచ్చేసింది. తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గడానికి ఎన్నికలపై విసుగు (ఫాటిగ్) ఒక కారణం. మొన్న నే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు స్థానిక ప్రజల ఆత్మకు దగ్గరగా జరిగే ఎన్నికలు. ఎక్కువ ఉత్సాహం, ఊపు ఉం టుంది. పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది.

వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికలను ప్రజలు అంత దగ్గరగా చూడటం లేదు. పోలింగ్ తగ్గడానికి విసుగు ఒక కారణం అయితే, ఆంధ్ర ప్రాంతం లో కూడా ఇదే వేళకు ఎన్నిక జరుగుతుండటం వల్ల హైదరాబాద్ పరిసరాల్లోని లక్షలాది మంది ఈ సారి అక్కడికి ఓటేయడానికి వెళ్ల డం మరో కారణం. అక్కడా ఇక్కడా ప్రకటించిన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనాన్ని పోలింగ్ బూత్‌లకు నడిపించాయి. తెలంగాణ గ్రామీణ నియోజకవర్గాల్లో పోలింగ్ గతం కంటే తగ్గినా ఘనంగానే జరిగింది. రెండు రాష్ర్టాల్లో సంక్షేమ పథకాల డోసు ఎక్కువైందని, ఇది సర్వనాశనానికి దారి తీస్తుందని ఒక మేధావి, ప్రముఖ రచయిత రాసినట్టుగా చెబుతున్న ఒక వాట్సాప్ మెసేజ్ బాగా సర్క్యులేషన్‌లో ఉంది. మనవాళ్లు అన్నీ సగంసగం చూసి మాట్లాడుతారని ఈ మెసేజ్ చదివితే అర్థమైంది. సంక్షేమ పథకాలను అడ్డగోలుగా అమ లుచేసి వెనెజులా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన మెసేజ్ సారాంశం. వెనెజులా కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను, సామాజికభద్రత పథకాలను అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్నాయని ఆ పెద్దమనిషికి తెలిసి ఉండదు. అమెరికా 1935ల నుంచి సామాజిక భద్రతా పథకాలను అమలు చేస్తున్నది. కార్మికులు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక బీమా, ఆర్థిక సహాయ పథకాలను అమలు చేస్తున్నది. ఉద్యోగాలు కోల్పోయి ఆసరా కోసం చూస్తున్న అమె రి కా పౌరులకు కూడా ప్రభుత్వం మళ్లీ ఉద్యోగం దొరికే దాకా సహకారం అందిస్తున్నది. మెడ్‌కేర్, మెడ్‌కెయిడ్, పిల్లల ఆరోగ్య బీమా వంటి పథకాలు కూడా అమెరికా అమలు చేస్తున్నది. 2012 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాల కింద అమలు చేసిన మొత్తం అమెరికా బడ్జెట్‌లో 55 శాతం అని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

ప్రపంచంలో అత్యధిక అప్పు కలిగిన దేశం కూడా అమెరికానే. అర్థం చేసుకోవలసింది ఏమంటే, ప్రజలపై ఖర్చుపెడితే ఏదో కొంపలు మునుగుతాయని సూత్రీకరించడం తిరోగమనవాదం. అవినీతిని, దుబారాను, పెద్దలకు గద్దలకు దోచిపెట్టే సంస్కృతిని అరికట్టి పేదలకు, ప్రజలకు పంచితే అది ఆర్థిక స్వస్థతకు ఉపయోగపడుతుంది. పేదవారి చేతి డబ్బు మళ్లీ ఈ ఆర్థిక వ్యవస్థలోకే వస్తుంది. పరిశ్రమలు పెట్టే పేరిట వేల కోట్ల రుణాలు తీసుకొని ఎగవేసే వారి డబ్బు దుబాయ్ బుర్జ్‌ఖళీఫాలో విలాసవంతమైన నివాసమవుతుంది. సింగపూర్‌లో ఒక వాణిజ్య భవన సముదాయం అవుతుంది. ఇం కా స్వదేశంలో, విదేశాల్లో బినామీ ఆస్తులవుతాయి. స్వతంత్ర ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి ఒక దేశం చేసే ప్రయత్నాలను అమెరికా, దాని పారిశ్రామిక యంత్రాంగం ఎలా దిగ్బంధం చేస్తుందో, ఎలా విఫలం చేస్తుందో సోవియెట్ యూనియన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా, ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా, అల్బేనియా... ఎల్‌సాల్వడార్, పనామా వంటి దేశాల అనుభవాల దాకా చూసి అర్థం చేసుకోవచ్చు. చమురు ధరలతో అమెరికా ఆడుకునే విధానం ఆ మేధావికి అర్థం కాకపోయి ఉండవచ్చు. వెనెజులాకు ప్రాణాధారమైన చమురు ధరలను నేలమీదికి తీసుకొస్తే చాలు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయవచ్చునని అమెరికా భావించింది. అంతేకాదు ఆ దేశం నుంచి ఎవరూ చమురు కొనకుండా ఆంక్షలు విధించింది. అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టింది. వెనెజులాకు మనకు పోలికే లేదు.

2722
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles