మంచినీటికే ప్రాధాన్యం ఇవ్వాలె

Thu,March 21, 2019 11:25 PM

ఎండాకాలం ప్రారంభం నుంచే ఎండలు దంచుతున్నా యి. గత మూడు నాలుగేండ్ల నుంచి ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వివిధ దినపత్రికల్లో ఏటా ఎండ వేడి తాపాన్ని తట్టుకోలేక చనిపోతున్న వారి సంఖ్య చూస్తున్నాం. పరిస్థితులు ఇలాగే ఉంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఆటలకు అలవాటుపడి ఎండలో ఆడితే సాయంత్రం వేళకు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. ఇక వృద్ధులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. పనిమీద బయటకి వెళ్ళినవారు కూడా వివిధ ఇబ్బందులకు గురికావల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎండాకాలంలో కనీస జాగ్రత్తలతో వ్యవహరించ టం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు నీళ్ల బాటిల్‌ను కొంత ఉప్పుగానీ, లేదా గ్లూకోజ్ పౌడర్ కానీ వేసుకుని తీసుకొని పోతే చాలా మంచిది. ఎండవేడికి శరీరం నుంచి చెమట రూపంలో నీరంతా ఆవిరైపోతుంది. శరీరంలో నీటి శాతం, లవణాల శాతం తక్కువైతే వ్యక్తి డీ హైడ్రేషన్‌కు గురై చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉప్పు కలిపిన నీటితో వేసవీ కాలం లో పూర్తి రక్షణ పొందవచ్చు.

ఎండాకాలం వచ్చిదంటే చాలు శీతలపానీయాల కంపెనీలు వివిధ పేర్లతో శీతలపానీయాలను తయారుచేసి మారుమూల గ్రామాలకు సైతం తరలించి వ్యాపారాలు చేస్తుంటాయి. చాలామంది ఈ శీతల పానీయాలను తాగటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఇవి అంతగా ఆరోగ్యానికి మంచిది కాదు. కనీసం మన ఉప్పు కలిపిన నీరంత సురక్షితమైవీ కావు. కాబట్టి ప్రజలు దాహం తీర్చుకోవటానికి నీటికే ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగే చిన్న పిల్లలకు ఎండాకాలం ఐస్‌క్రీమ్‌లను ఇప్పిం చటం చాలామంది చేస్తారు. కానీ ఐస్ క్రీమ్‌లు ఆరోగ్యా నికి అంతగా మంచివి. అలాగే ఐస్ క్రీములను పరిశుభ్ర మైన నీరు వాడుతున్న పరిస్థితి ఉండటం లేదు. కాబట్టి వాటిని ఇవ్వకుంటేనే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవి కాలపు సమస్యల నుంచి బయటపడటానికి వీలవుతుంది
- డాక్టర్ పోలం సైదులు

127
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles