జాతీయపార్టీలకు బుద్ధి చెప్పాలె

Wed,March 20, 2019 01:02 AM

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని ఇప్పటికే అనేక సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒక విమర్శలు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ అనేక ప్రజా సమస్యలు పక్కదోవపట్టాయి. కాబట్టి ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయపార్టీల కూటమి బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశగా సీఎం కేసీఆర్‌తో పాటు ఉత్తరాది రాష్ర్టాల ముఖ్య మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇప్పటికే కొన్ని సార్లు సమావేశమయ్యారు. ఇది ప్రారంభ దశ మాత్ర మే. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏకపక్షంగా ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. ఇప్పటివరకు సమాఖ్య స్ఫూర్తిని విస్మరిం చిన కాంగ్రెస్, బీజేపీలు తమ సొంత రాష్ర్టాల పట్ల ఆద రణ చూపిస్తూ, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నాయి. జాతీయపార్టీలుగా చెలామణి అవుతున్న ఈ పార్టీలు ఒక స్పష్టమైన విధా నం లేకుండా రాష్ర్టానికో విధంగా వ్యవహరిస్తున్నాయి.

దశాబ్దాలుగా ఇదే విధానం కొనసాగుతున్నది. కాబట్టి ఈ పద్ధతి మారాలి. అందుకు ఒక వేదిక అవసరం. ఎన్నికలకు ముందు ప్రారంభమైన ఈ చర్చలు రేపటి రోజున ప్రాంతీయపార్టీల కూటమి కేంద్రంలో కీలకపా త్ర పోషిస్తుందన్న అభిప్రాయం అందరిలో ఉన్నది. ఐదేండ్లు విభజన సమస్యలు పరిష్కరించలేని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, మాట్లాడితే ఏపీ గురించి తప్పా తెలంగాణ గురించి ఎన్నడూ మాట్లాడని కాంగ్రెస్‌పార్టీ కి తగినవిధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజల ఈ లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణయాత్మకం గా వ్యవహరించాలి. ఎన్నికల సమయంలో తప్పా రైతు సంక్షేమ గురించి ఆలోచించని ఈ పార్టీలు అవలంబిస్తు న్న ద్వంద్వ విధానాన్ని ఎండగట్టాలి. కేంద్రంలోని పాల కులు పంటల గిట్టుబాటు ధరల విషయంలోనూ దక్షి ణాది రాష్ర్టాలపై వివక్ష చూపుతున్నారు. దేశంలో ఒక మౌలిక మార్పు రావాలంటే ప్రాంతీయపార్టీలు బలోపే తం అవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కీలక సంద ర్భంలో వస్తున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమ చైత న్యాన్ని చూపెట్టాలి.
- గెల్లు రాజశేఖర్, హిమ్మత్‌నగర్, కరీంనగర్

174
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles