స్థానికసంస్థల బలోపేతానికి బాటలు


Tue,March 19, 2019 01:05 AM

Gramapanchayati-khammam
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. అసలైన భారతదేశం పల్లెల్లో నే దర్శనమిస్తుందన్నారు మహాత్మాగాంధీ. ఈ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం గ్రామాల రూపురేఖలను మార్చనున్నది. మారుతు న్న వాతావరణ పరిస్థితుల్లో చెట్ల పెంపకానికి మించిన పుణ్యకార్యం లేదని తెలంగాణ ప్రభుత్వం గ్రహించింది. అందుకే చెట్ల పెం పకాన్ని నిర్బంధ అంశంగా పంచాయతీరాజ్ చట్టంలో నిర్దేశించింది. దీని ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ తప్పనిసరిగా ఒక నర్సరీని ఏర్పాటుచే యాలి. ప్రతి ఇంటిలో ఆరు మొక్కలు సంరక్షించాలి. తెలంగాణ ప్రాంతం శిలలతో కూడుకొని దక్కన్ పీఠభూమిలో ఉన్నది. దీనివల్ల అన్ని క్షామాలకు విరుగుడు చెట్లను పెంచడమేనని ఈ విషయానికి అత్యంత ప్రాము ఖ్యం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అనుసరించి గ్రామాలకు కేంద్రం ఇచ్చే నిధులు గణనీయంగా పెరిగాయి. 2011 లెక్కల ప్రకారం కేంద్రం ఒక్కోవ్యక్తికి ఏడాదికి సుమారు 823 రూపాయలు ఇస్తుంది. దీనికి సమాన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లోనే కేటాయించడం విశేషం. దీన్నిబట్టి గ్రామాల అభివృద్ధి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని అంచనా వేయవచ్చు. అలాగే మిషన్ భగీరథ కింద ప్రభుత్వమే మంచినీటిని సరఫరా చేయనున్నది. దీంతో కొంతవరకు గ్రామ పంచాయతీలకు నిర్వహణ ఖర్చలు తగ్గుతాయి. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీకైనా ఏడాదికి కనీసం ఐదు లక్షల రూపాయలు అందనున్నాయి. దీనివల్ల గ్రామ పంచాయతీలు మునుపెన్నడూ లేనివిధంగా ఆర్థికంగా బలోపేతం అవుతాయి.


పర్యావరణ పరిరక్షణకు పంచాయతీరాజ్ చట్టం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. దేశంలో కాలుష్య తీవ్రత ఏటా పెరుగుతున్నది. రోడ్డు మీద చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించాలని చట్టంలో నిర్దేశించారు. ఇంటి నుంచే తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలి. వాటిని విద్యుత్ తయారీకి, కంపోస్టు ఎరువు తయారీకి వినియోగించాలి. దీనివల్ల పర్యావరణం బాగుండటమే కాకుండా వ్యర్థం నుంచి అర్థం కల సాకారమవుతుంది. దీన్ని సాధించడానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని ప్రభుత్వం గ్రామపంచాయతీలకు అందించాలి.


ఈ నిధులను సవ్యంగా పారదర్శకంగా వినియోగిస్తే గ్రామాలు అనతికాలంలోనే అభివృద్ధి బాటపడుతాయి. గ్రామాల అభివృద్ధిలో గ్రామసభ సమావేశాలు కీలకం. గ్రామంలోని ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులే. గతంలో ఏడాదికి కనీసం నాలుగు గ్రామసభలు నిర్వహించాలన్న నిబంధన ఉండేది. తాజా చట్టం ప్రకారం సంవత్సరానికి ఆరు సమావేశాలు తప్పకుండా నిర్వహించాలి. వాటిలో రెండు సమావేశాలు వికలాంగులు, మహిళల సమస్యల కోసం ఏర్పాటు చేయాలి. దీన్నిబట్టి గ్రామసభ సమావేశాలకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో అర్థమవుతుంది. అలాగే సాధారణ ప్రజలు గ్రామసభ సమావేశాల్లో పాల్గొనేందుకు విముఖత చూపుతున్నారన్న భావనతో కొత్త పంచాయతీరాజ్ చట్టంలో కోరం నిబంధన విధించారు. దీనిప్రకారం గ్రామ పంచాయతీ ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా చట్టం నిర్దేశించిన సంఖ్యలో ప్రజలు గ్రామసభకు హాజరుకాకుంటే గ్రామసభ సమావేశాన్ని వాయిదా వేస్తారు. అంటే సమావేశం జరుగనట్టే లెక్క. అలాగే గ్రామసభ సమావేశం జరిగే తేదీని, సమయాన్ని, స్థలాన్ని, అంశాన్ని ముందే ప్రజలకు తెలియజేయాలని చట్టంలో పేర్కొనడం శుభ పరిణామం. ఈ నిబంధన వల్ల గ్రామసభ నిర్ణయాల్లో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం పెరుగుతుంది. దీనివల్ల గ్రామాల్లో ని క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకొని వాటికి నివారణోపాయాలు కనుగొనవచ్చు. సమావేశ వివరాలను, తీర్మానాలను ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరుచాలి. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు, జాతీయ ఉపాధి హామీ పథకం పనుల గుర్తింపులోనూ, వాటి సమాజిక తనిఖీకి, కొత్తపన్నుల విధింపు, ఉన్న పన్నులను హేతుబద్ధీకరించడం, గ్రామ సంవత్సర బడ్జెట్ తయారీ వం టివాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి గ్రామసభే మంచి వేదిక.
srinivas-shaga
కాబట్టి చైతన్యవంతమైన ప్రజలు గ్రామ సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనాలి. గ్రామసభ ద్వారా వివిధ ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును, జవాబుదారీతనాన్ని ప్రశ్నించడం ద్వారా నియంత్రించవచ్చు. పర్యావరణ పరిరక్షణకు పంచాయతీరాజ్ చట్టం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. దేశంలో కాలుష్య తీవ్రత ఏటా పెరుగుతున్నది. రోడ్డు మీద చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించాలని చట్టంలో నిర్దేశించారు. ఇంటి నుం చే తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలి. వాటిని విద్యుత్ తయారీకి, కంపోస్టు ఎరువు తయారీకి వినియోగించాలి. దీనివల్ల పర్యావరణం బాగుండటమే కాకుండా వ్యర్థం నుంచి అర్థం కల సాకారమవుతుంది. దీన్ని సాధించడానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని ప్రభుత్వం గ్రామపంచాయతీలకు అందించాలి. మురికి కాలువల్లో చెత్త పేరుకుపోవ డం వల్ల పందులు, దోమలు, కుక్కలు గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్నా యి. దీనివల్ల అనేక అంటురోగాలు ప్రబలుతాయి. ఫలితంగా అనేక మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీన్ని అరికట్టడానికి స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏ విధంగా చూసినా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తేనున్నది. కాబట్టి ఈ చట్టం స్ఫూర్తిని అర్థంచేసుకొని ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు త్రికరణశుద్ధిగా పనిచేయాలి. తద్వారా గ్రామ స్వరాజ్యం స్థాపించి సురాజ్యం దిశగా అడుగులు వేయాలి.

628
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles