ఆన్‌లైన్‌లో ప్రైవేట్ నిఘా


Sat,January 12, 2019 10:53 PM

2011 నాటి ఐటీ నిబంధన ల స్థానంలో కొత్త ఐటీ (సంధానకర్త మార్గదర్శకాలు) నిబంధనలు (2018) వేశపెట్టదలుచుకున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గత నెల 25వ తేదీన ప్రకటించింది. ఇందుకు సం బంధించిన ముసాయిదాపై చర్చలు ప్రారంభమైనట్టు వెల్లడించింది. మంత్రిత్వ శాఖల మధ్య చర్చల తర్వాత ఫేస్‌బుక్, గూగుల్, యాహూ, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తోనూ, సం ధానకర్తలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలతోనూ చర్చ లు సాగుతున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన అన్నిపక్షాలతోనూ చర్చలు సాగించాలనుకుంటున్నామ నీ, తమ అభిప్రాయాలను 2019 జనవరి 15లోగా సమర్పించాలని కోరింది. ఆన్‌లైన్ సంధానసంస్థల (ఇంటర్మీడియరీస్)ను నియంత్రించే నిబంధనలు ఇప్పటికే అస్పష్టంగా ఉన్నా యి. ఇక ఇప్పుడు ఐటీ మంత్రిత్వ శాఖ ఇంటర్‌నెట్ కం పెనీలతో చర్చలను గోప్యంగా సాగిస్తున్నది. దీంతో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే అధికారాలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. సోషల్ మీడియాను ఇప్పుడు వేధిస్తున్న సమస్యలు - అప్రజాస్వామికం, భద్రతారాహిత్యం. దీన్ని సవరించడానికి బదులు ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై నిఘా వేసే, సెన్సార్ చేసే అధికారాన్ని శక్తిమంతమైన ప్రైవేట్ కంపెనీల చేతిలో పెట్డడం ప్రమాదరకం. ప్రభుత్వం వెంటనే అస్పష్టంగా ఉన్న ముసాయిదా నిబంధనలను ఉపసంహరించుకోవాలె. ఐటీ చట్టంలోని సెక్షన్-79 సంధానకర్తలకు ఎంతో రక్షణ కల్పిస్తున్నది. టెలికం కంపెనీల వంటి సర్వీస్ ప్రొవైడర్లకు, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌కు వీరి సేవలను ఉపయోగించుకునేవారు (ఇతరు లు) చేసే వ్యాఖ్యలకు సంబంధించిన బాధ్యత ఉండదు.

ఈ సెక్షన్ 79 రక్షణ లేకపోతే, ఎవరైనా చట్టవ్యతిరేక కం టెంట్‌ను పోస్ట్ చేస్తే, ప్రభుత్వం ఈ సంధానసంస్థల (ఇంటర్మీడియరీస్)పై సివిల్ , క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సంధానసంస్థలను కనుక బాధ్యులుగా చేస్తే, ఆ సంస్థలు చట్టపరమైన చర్యలనుంచి తప్పించుకోవడానికి నిఘా పెంచి కఠినంగా సెన్సార్ చేస్తాయి. దీనివల్ల ప్రజల భావస్వేచ్ఛపై ప్రైవేట్ సంస్థల నిఘా, కట్టడి ఏర్పడుతుంది. అయితే చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను అరికడుతాయనే హామీతో మాత్ర మే సంధానసంస్థలకు 2011 నాటి మార్గదర్శక నిబంధనల ద్వారా ఈ సెక్షన్ 79 రక్షణ లభించింది. అయితే ఏయే అంశాలకు సంబంధించి ప్రైవేట్ సంస్థలు కట్టడి చేయాలనే విషయంలో స్పష్టత లేదు. దీనివల్ల ఈ సం స్థలు కఠినంగా వ్యవహరించడానికి ఆస్కారం ఏర్పడ్డది. దీంతో శ్రేయా సంఘాల్- భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌పై వచ్చే కంటెంట్ చట్టబద్ధత ను నిర్ధారించడం ప్రమాదకరమని భావించింది. న్యాయస్థానం లేదా సంబంధిత ప్రభుత్వ అనుమతి ఉం డాలని నిర్దేశించింది. తాజాగా ప్రభుత్వం వెల్లడించిన ముసాయిదా నిబంధనల వల్ల భావ స్వేచ్ఛపై ప్రైవేట్‌సంస్థల కట్టడి పెరిగిపోతుంది. ముసాయిదాలోని 3(9) నిబంధన ప్రకారం సంధానసంస్థ చట్టవిరుద్ధమైనదిగా భావించిన కం టెంట్‌ను గుర్తించి తొలిగించడానికి అవసరమైన సాంకేతిక ఆటోమేటె డ్ టూల్స్ ఉపయోగించవలసి ఉం టుంది. సమాచారం ఎవరి నుంచి వచ్చిందీ తెలుసుకొని వెల్లడించవలసి ఉంటుంది. ఈ సందర్భంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఎటువంటి రక్షణలు పొందుపరుచలేదు. దీనివల్ల గోప్యత హక్కు హరించుకపోతున్నది. ఇది రాజ్యాంగానికి, సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధం.
divij-joshi
ఈ ఆటోమేటెడ్ టూల్స్ చట్టవిరుద్ధమైన పోస్టులను వదిలి, చట్టబద్ధమైన వ్యక్తీకరణలను తొలిగించవచ్చు.
ఫేస్‌బుక్, ట్విటర్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ తాము నిష్పాక్షికంగా ఉంటామని అంటాయి. కానీ ఏయే అం శాలను వడబోయాలె, సెన్సార్ చేయాలనే కాకుండా, వేటికి ప్రాధాన్యం ఇవ్వాలనే విషయంలో వీటి పాత్ర కీలకమైనది. ఫేస్‌బుక్ తప్పుదోవపట్టించే రాజకీయ ప్రకటనలకు ప్రాధాన్యం ఇచ్చింది. బలహీనవర్గాలపై దాడులకు సంబంధించిన అంశాలను ట్విటర్ కట్టడి చేయలే దు. అందువల్ల ఈ సంస్థలకు జవాబుదారీతనం లేని అధికారాలు అప్పగించకూడదు. ప్రభుత్వం ముసాయి దా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌కు పారదర్శకత, జవాబుదారీతనం పెంచేవిగా లేవు. ఈ సంస్థల విధానాల నుంచి సత్వర న్యాయపరమైన రక్షణ ఉండాలె. ఇవి ఎప్పటికప్పుడు పారదర్శకత నివేదికలు విడుదల చేయాలె. చట్ట విరుద్ధమైన, దౌర్జన్యపూరితమైన సమాచారాన్ని యూజ ర్లు వెంటనే సంధాన సంస్థల దృష్టికి తేవడానికి ఏర్పాటు ఉండాలె. కంటెంట్‌పై చర్యలకు సంబంధించి జవాబుదారీతనంతో వ్యవహరించే ఏర్పాటు ఉండాలె. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్‌ను కట్టడి చేయడంలో ఆన్‌లైన్ సమాజాలు ముందుండాలె తప్ప ప్రభుత్వం లేదా కంపెనీల అధికారులు కాదు. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ నెల 15వ తేదీలోగా ఐటీ మంత్రిత్వ శాఖకు వెల్లడించాలె. నిఘాను, సెన్సార్‌షిప్‌ను వ్యతిరేకిస్తూ, ప్రజాస్వామిక ఆన్‌లైన్ సమాజాల కోసం గొంతు విప్పాలె.
(వ్యాసకర్త: బెంగళూరులోని విధి సెంటర్ ఫర్
లీగల్ పాలసీలో రిసెర్చి ఫెలో)
(సౌజన్యం: ది వైర్ )

621
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles