కమ్యూనిస్టు ఉద్యమ దీపస్తంభం

Tue,December 10, 2013 12:51 AM

తన తొలితరం నేతల్ని కోల్పోతున్న భారత కమ్యూనిస్టు ఉద్యమం డిసెంబర్9న మరో వీరపువూతున్ని కోల్పోయింది. విప్లవక్షిశేణుల్లో ఎంఎన్‌ఎస్‌గా ప్రసిద్ధిగాంచిన మాదాల నారాయణస్వామి గుంటూరులో అనారోగ్యంతో మరణించారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడిగానే గాకుండా మాదాల ఒకసారి ఎమ్మెల్యేగానూ, ఎంపీగాను పనిచేశారు. 99ఏళ్ల వయస్సు గల ఎంఎన్‌ఎస్ ఉత్తమ కమ్యూనిస్టుగా, నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. ఆయన ‘భారత- చైనా మిత్ర మండలి’ వ్యవస్థాపక అధ్యక్షులుగానూ పనిచేశారు. ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన నారాయణస్వామి చివరి ఊపిరివరకూ పేదల పక్షాన నిలిచారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష స్వరాష్ట్ర ఏర్పాటును దృఢంగా బలపరిచాడు. అంతే దృఢంగా పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించాడు. రైతుకూలీ సమస్యల పరిష్కారంతోపాటు దున్నేవాడికి భూమి దక్కాలని అవిక్షిశాంతంగా పోరాడారు.

మాదాల నారాయణస్వామి నేటి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు తాలూకా మైనంపాడు గ్రామంలో జన్మించారు. ఆయన బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ డిగ్రీ తీసుకున్నారు. అక్కడ విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అక్కడే వామపక్ష భావాలు ఏర్పరుచుకున్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత 1936లో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. 1946-1951 మధ్య సాగిన వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో రహస్య జీవితం గడిపారు. ఆ సమయంలోనే తన సోదరుడు మాదాల కోటయ్యను ప్రభు త్వం బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపినా ఆయ న తన పోరాటాన్ని వదులుకోలేదు.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆగ్ర నాయకత్వం తెలంగాణ సాయుధ పోరాట విరమణ ప్రతిపాదన చేసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. కమ్యూనిస్టుపార్టీపై నిషేధం తొలగించిన తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా ఒంగోలు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1962లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. శాసనసభ్యుడిగానూ, పార్లమెంటు సభ్యుడిగానూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేశారు. రైతు కూలీల సమస్యలనూ, కార్మిక సమస్యలనూ చట్ట సభల్లో ప్రస్తావించి, వాటి సాధన కోసం పోరాడారు.1936లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్న దగ్గర నుంచీ నేటిదాకా ఆయన రివిజనిజానికీ, పార్లమెంటరీ పంథాకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు. 1964లో రివిజనిజానికి వ్యతిరేకంగా సీపీఎం వైపు వచ్చి, 1968లో సీపీఎం నయారివిజనిజానికి వ్యతిరేకంగా విప్లవ కమ్యూనిస్టుల వైపు వచ్చారు.

నక్సలబరీ, శ్రీకాకుళం ఉద్యమాలను దృఢంగా బలపర్చారు. 1969నుంచి 2013 ఆఖరి శ్వాసవరకూ గోదావరిలోయ ప్రతిఘటనోద్యమాన్ని దృఢంగా బలపర్చారు. ఆవిధంగా ఆయన రాజీలేని నిజమైన కమ్యూనిస్టుగా, నిజమైన మార్క్సిస్టు- లెనినిస్టుగా తుది శ్వాసవిడిచారు. ఆయన మరణం సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమాక్షికసీకీ, భారత విప్లవోద్యమానికీ తీరని లోటు. ఉత్తమ పార్లమెం స్వాతంత్య్ర సమరయోధునిగా అన్నింటికీ మించి విప్లవయోధుడిగా చరివూతలో నిలిచిపోయారు. ఆయన కమ్యూనిస్టు ఉద్యమ దీపస్తంభం అయ్యారు.
-కె. గోవర్ధన్
సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమాక్షికసీ(చంవూదన్నవర్గం) రాష్ట్ర మిటీసభ్యులు

623
Tags

More News

VIRAL NEWS