మన కవి కులతిలకం
Updated : 12/5/2014 1:28:08 AM
Views : 1113
సామాన్యమైన కుటుంబంలో పుట్టి, గురువుల క్రమశిక్షణలో ప్రకాశించి రాజాస్థానాలు చేరి ఉన్నతమైన విలువను పొందిన వారిలో తెల్కపల్లి రామచంద్రశాస్త్రి గారు ఒకరు. వీరు మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం రాజాపురం గ్రామంలో డిసెంబర్ 6న, 1902లో జన్మించారు. తల్లిదండ్రులు శేషమాంబ, సుబ్రమణ్యం. ఇంటి దగ్గరే వేదవిద్యను అభ్యసించి ఆ తదుపరి వనపర్తి, కర్నూ లు, కాళహస్తి, ఆకిరిపల్లి, చిట్టిగూడూరు, బందరులలో ఎంతో మంది పండితప్రకాండుల వద్ద సుమారు పన్నెండేళ్లు సంస్కృత విద్యను అభ్యసించి విశేష జ్ఞానాన్ని సంపాదించారు. వీరు రాజాపురం శాస్త్రులుగా ప్రసిద్ధులు.

ramachandra-shastri

తాను చదువుకొన్న బందరు జాతీయ కళాశాలలో 1923లో ఒక సంవత్సరం అధ్యాపకులుగా పనిచేసి ఆనాటి విద్యార్థులైన మరుపూరు కోదండరామిరెడ్డి, వై.బి.రెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కౌతా ఆనందమోహన్, కౌతా రామమోహన్ వంటి ఉద్ధండుల మెప్పును పొందారు. కర్నూలులో వెల్లాల శంకరశాస్త్రి వీరు ప్రియశిష్యులు. బందరు జాతీయ కళాశాలలో వీరు ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ వీరికి సహాధ్యాయులు. తెల్కపల్లివారు వారికి గీతాగోవిందాన్ని చెప్పారు. ఉన్నవ లక్ష్మీనారాయణ కుమారుడైన అర్జునరావుకు శాస్త్రిఇంటి వద్ద సంస్కృతం చెప్పారు. 1921లో బెజవాడలో గాంధీని చూశారు. గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ పిలుపుననుసరించి ఖద్దరు ధారణ చేశారు.

1924లో స్వగ్రామానికి తిరిగివచ్చి గద్వాల రాణి ఆది లక్ష్మిదేవమ్మ ఆస్థానంలో సంస్కృత విధ్వాంసులుగా జాఫ్తా అందుకున్నారు. వనపర్తి, ఆత్మకూరు, కొల్లాపురం సంస్థానాలలో చాలాసార్లు సన్మానింపబడ్డారు. వీరు గద్వాల మహారాణికి ఆంతరంగికులు. గద్వాల రాణికి కుటుంబ, పాలనాపర సమస్యలు వచ్చినప్పుడు వీరు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. కంచికామకోటి, శృంగేరి, పరకాల, పుష్పగిరి, మాణిక్యప్రభు పీఠాలలోని అధిపతులను తన పాండిత్యం, కవిత్వంతో మెప్పించి సత్కారాలు అందుకున్నారు. కలము గిరగిర త్రిప్పితి తెలివికొలది వాణి కొలువుననె గడచె ప్రాయమెల్ల అని సురవరం ప్రతాపరెడ్డి చెప్పుకున్న విధంగా శాస్త్రి వయసంతా వాణీసమార్చనలోనే సాగింది. వారి ఇంటిపేరే వాణీవిలాస నిలయం.

వీరు బహుముఖీన ప్రతిభావంతులు. కేవలం సంస్కృత రచనలేకాక ఆయుర్వేదంలో వీరు దిట్ట. వీరి ఆయుర్వేద చిట్కాలు, ప్రసంగా లు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమైనాయి. ఎంతో మంది రోగులకు స్వయంగా ఆయుర్వేద మందులను తయారు చేసి ఇచ్చి స్వస్థత చేకూర్చారు. అంతేగాక వడ్రంగి, కంసలి వంటి వృత్తులలో కూడా వీరికి ప్రవేశం ఉంది. తన ఇంటి తలుపులకు తానే స్వయంగా చెక్కిన వాణీ విలాస నిలయః అన్న అందమైన అక్షరాలు, తన ఇంటిలో స్వయంగా తయారు చేసుకున్న కర్ర స్టాండ్లకు చెక్కిన మామిడి పిందెల అలంకరణ వీరి ప్రతిభకు నిదర్శనాలు. వీరు 1959లో రాజాపురం గ్రామానికి మొదటి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై కిరోసిన్‌తో నడిచే వీధి దీపాలను ఏర్పాటు చేయడమేకాక పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించి వచ్చిన డబ్బును దుర్వినియోగపరచకుండా గ్రామ అభివృద్ధికి ఉపయోగించిన గొప్ప ప్రజానాయకుడు, ప్రజల మనిషి. పసరికలు, పక్షవాతం, సంతానలేమి, వాతరోగాలు మొదలగు వాటికి వీరిది తిరుగులేని వైద్యం.

1922- 23 సంత్సరం నుంచి వీరి సాహిత్య ప్రస్థానం ప్రారంభమైనది. వీరి మొదటి రచన 27 ఆర్యావృత్తాలతో కూడిన భారతీ తారామాల అనే శారదాస్తుతి. దీనిని వారు బందరులో ఉన్నప్పుడే రచించారు. మాణిక్యప్రభు పీఠాన్ని దర్శించి ఆశువుగా కవితా కాంతా స్వయంవరము అను ఖండకావ్యాన్ని చెప్పారు. ఇది 1926లో ముద్రించబడినది. ఇందలి కవిత్వం సిద్ధహస్తుని రచనా విశేషము వలెనే ఉన్నది అని కేశవపంతుల నరసింహశాస్త్రి దీనిని సమీక్షించారు.

శృంగేరీ పీఠానికి వెళ్లి అక్కడ శారదాదేవిని చూడగానే తెల్కపల్లివారు శారదా నవరత్నమాలికను ఆశువుగా చెప్పడమే కాకుండా లలితాస్తవఝరి అనే పేరుతో మరో 50 శ్లోకాలను చెప్పారు. మైసూరులోని పరకాల మఠాన్ని దర్శించి అక్కడి హయగ్రీవస్వామిపై హయగ్రీవ శతకాన్ని రచించి పండితుల మెప్పును పొందారు. తర్వాత కాలంలో శారదానవరత్నమాలికను పొడిగించి శారదాస్తుతి శతకాన్ని రచించారు. ఇవేకాక ఉమామహేశ్వర సుప్రభాతం, శ్రీహనుమత్సుప్రభాతం, మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ సుప్రభాతం, గురుపీఠతత్త్వదర్శనం, శివానందాష్టకం, గణేశ పంచరత్నాలు, అయ్యప్పస్తుతి వంటి ముద్రిత రచనలతోపాటు కలిశతకం, రవీంద్రతపఃఫలము, ధూమశకట ప్రమాదం, చ్యవనోపాఖ్యానం, సుకన్యాస్తవం, మృత్యుశకటం వంటి అముద్రిత రచనలను చేశారు. వీరి కావ్యలక్ష్మి రచనను గోలకొండ కవుల సంచికలో చూడవచ్చు. సింగంపల్లె సిద్ధాంతి భూభ్రమణ భ్రాంతి నిరసనం ను రచించడం వెనుక తెల్కపల్లి శాస్త్రుల వారి రెండు సంవత్సరాల కృషి దాగి ఉంది.

తెల్కపల్లి రామచంద్రశాస్త్రి సంస్కృత కవిత లు, సాహిత్యోపన్యాసాలు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమైనాయి. కామకోటి, ఆంధ్రభూమి, సనాతన మత ప్రచారిణి, సమాలోచన మొదలైన పత్రికలు వీరి రచనలను ప్రచురించాయి. వనపర్తికి చెందిన విక్రాల నరసింహాచార్యులతో కలిసి వీరు జంట కవిత్వం చెప్పారు. ఆమనగల్లు మండ లం సింగంపల్లెలో వీరు అష్టావధానం చేశారు. దేశాటనం పండిత మిత్రతాంచ అన్న ప్రకారం దేశంలోని ఎన్నో ప్రదేశాలను చూశారు. 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్కృ త సలహా సంఘం సభ్యులుగా నియమితులైనారు. 1977 నుంచి కళాకారుల గౌరవ వేతనాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1979 సంవత్సరపు ఉత్తమ సంస్కృత విద్వాంసునిగా వీరిని సత్కరించింది. 1931వ సంవత్సరంలో వీరికి కవి కులతిలక, 1932లో బులుసు అప్పన్న శాస్త్రిచే అభినవ కాళిదాసు, సురవరం ప్రతాపరెడ్డిచే అలంకార నటరాజ మొదలగు బిరుదులు వీరిని వరించినవి. సాహిత్య కల్పద్రుమ అనెడి బిరుదు కూడా వీరికి కలదు.

దేశ అఖండత్వానికి ప్రతీకగా నిలిచి, అతిక్లిష్ట విషయాలను సైతం ఒక నిశ్చిత పద్ధతిలో అత్యల్పమైన మాటలతో ప్రసాదించే సంస్కృత భాషాసేవ తన జీవితమంతా చేసిన మహాపండితులు తెల్కపల్లె రామచంద్రశాస్త్రి 1990 ఏప్రిల్ 30న మరణించారు. మహబూబ్‌నగర్ సాహిత్య చరిత్రలో వీరికి దక్కాల్సిన స్థానం దక్కలేదు. వీరి రచనలన్ని సుమధురభావ బోధక పదబంధములతోడను, మనోహరములగు శ్లేషలతోడ విలసిల్లుచున్నవి. వీరి రచనలపై విస్తృతమైన పరిశోధన జరిగి తెలంగాణ సంస్కృతకవుల చరిత్రలో వీరికి పెద్దపీట వేయాల్సిన అవసరమున్నది. లభ్యమవుతున్న వీరి రచనల మీద నిశితమైన అధ్యయనం చేయడం మనందరి కర్తవ్యంగా భావించాలి.

దీక్షా దక్షతలకే ప్రజల దీవెనలు
Posted on:12/16/2018 2:03:49 AM

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చారిత్రక విజ యం సాధించింది. రెండుకోట్లమంది ఓటర్లలో సుమారు కోటిమంది మద్దతుతో విజయకేతనం ఎగురవేసింది. విపక్షాలను ఆమడ దూరం నెట్టేసి స్పష్టమైన ఆధిక్యతతో ...

గడ్డి పరకల ఘంటారావం
Posted on:12/16/2018 2:02:26 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ విభిన్న ఆలోచనలతో, ముందుచూపుతో ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర భవిష్యత్తుకు గట్టి పునాదులు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆత్మవిశ్వాస...

సంక్షేమానికి దక్కిన ఫలం
Posted on:12/16/2018 2:01:17 AM

తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించిన వారికి ప్రజలు తగిన విధంగా జవాబు చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నర ఏండ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలు గుర్తించారు, ఆదరించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి న...

వీరోచిత విజయం
Posted on:12/15/2018 12:27:02 AM

నేర్చుకోవాలన్న తపన, జిజ్ఞాస, త్రికరణశుద్ధి ఉన్నట్లయితే నిన్నటి తెలంగాణ ప్రజల తీర్పుతో ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, ప్రయోజనాలకు భంగం కల్గించే వారెవరైనా, ఎన్ని చక్రా...

సన్నాఫ్ తెలంగాణ.. ప్రౌడ్ ఆఫ్ ఇండియా
Posted on:12/14/2018 10:24:43 PM

సిరిసిల్ల గల్లీ నుంచి అంతర్జాతీయ వేదికల దాకా తనదైన ముద్రను వేసుకున్న యువనేత తెలంగాణ రాజకీయ యవనికపై ఇప్పుడు మరోకొత్త పాత్ర పోషించడం యువతకు పాలనా రంగంలో కల్పిస్తున్న స్థానానికి నిదర్శనం. అందుకు కారణమై...

రైతులు అందించిన విజయం
Posted on:12/13/2018 10:56:42 PM

వ్యవసాయరంగ అభివృద్ధే అజెండాగా ప్రభుత్వం గత నాలున్నర ఏండ్ల కాలంలో అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. అందుకే భారత ఆహార పితామహుడు డాక్టర్ స్వామినాథన్ తెలంగాణ పథకాలు రైతుకు అత్యంత ఉపయోగకరంగా ఉన్నాయన్నా...

పడిన ప్రతి ఓటు సఫలం
Posted on:12/14/2018 12:54:01 AM

తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలుపు ఎన్నికల రాజకీయాల్లో ఒక కొత్త పాఠం నేర్పింది. ఇప్పటివరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అవడం మాత్రమే తెలిసిన పార్టీలకు ప్రభుత్వ అనుకూల ఓటు కూడా కన్సాలిడేట్ అవుతుందని ప్రజల...

అప్రమత్తంగా ఉందాం
Posted on:12/14/2018 12:52:26 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలువడం వల్ల మన తెలంగాణకు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రజలు కనుక కాంగ్రెస్- టీడీపీ కూటమికి ఓటు వేస్తే వాళ్ళు రాష్ర్టాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర త...

తెలంగాణకు ఇక నిశ్చింత
Posted on:12/12/2018 10:42:21 PM

నాలుగున్నరేండ్ల పాటు ఆశల మధ్య ఊగిసలాడుతూ బతికిన తెలంగాణ ఇక వచ్చే ఐదేండ్లు నిశ్చింతగా జీవించవచ్చు. తమ ఆశలు, ఊగిసలాటల అనుభవాలపై తమపై తామే ఒక తీర్పు చెప్పుకున్న ప్రజలు, తమ రాష్ర్టాన్ని తిరిగి అవే చేతుల్ల...

‘తెలుగు పీత’కు.. వాత
Posted on:12/12/2018 10:41:36 PM

సీసాలో ఉన్న ఓ పీత పైకెక్కాలని ప్రయత్నిస్తుం టే.. మరో పీత దాన్ని కిందకు లాగేస్తుంది. తెలుగువారి స్వభావంపై ఓ వ్యంగ్య కథనం వాడుకలో ఉన్నది. బహుశా ఏపీ సీఎం చంద్రబాబును చూసే ఈ తెలుగు పీత కథను అల్లి ఉంటారు. ...

ప్రజా పట్టాభిషేకం
Posted on:12/12/2018 10:40:59 PM

ఏమిది! ఏమీ తీర్పు!! కేసీఆ ర్ మీద ప్రేమా? చంద్రబా బు మీద కక్షా! తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటనా? ఏమైనా కానీ, నాలుగున్నరేండ్ల కేసీఆర్ పాల న మీద ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు ఇది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీ...

కేసీఆర్ విజన్ గెలిచి నిలిచింది
Posted on:12/11/2018 11:02:46 PM

ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల్లో లక్షలాది మందికి నూతన అవకాశాలు సృష్టిస్తుంది తెలంగాణ. చైనా, జపాన్‌లతో పోటీపడి అన్నిరంగాల్లో అత్యున్నత అభివృద్ధిని సాధిస్తుంది. జనాభా దామాషా మేరకు ముస్లిం రిజర్వేషన్లు 12 శాత...

కుట్రలన్నీ పటాపంచలు
Posted on:12/11/2018 11:01:49 PM

విజయాన్ని వినమ్రంగా స్వీకరించిన కేసీఆరే సరికొత్త పరివర్తనకు సారథి అవుతారు. ప్రజలు కేసీఆర్ మార్గాన్ని నిష్కంటకంగా మార్చారు. వెయ్యేనుగుల బలాన్నిచ్చారు. ఆయన కోరినట్లు మార్గం సుగమం చేశారు. ఈ ఘన విజయం ఒక గ...

కేసీఆర్‌ది విలక్షణ వ్యక్తిత్వం
Posted on:12/11/2018 12:59:29 AM

మొదటగా చెప్పుకోవాల్సినది కేసీఆర్ భాషాభిమానం, సాహి త్యం పట్ల వారి ఆసక్తి. నోమ్ చామ్‌స్కీ అనే అమెరికన్ భాషావేత్త అంటాడు. ఒక వ్యక్తి భాషా నైపుణ్యాలు, అతని ఇతర నైపుణ్యాలన్నింటినీ నిర్ణయిస్తాయి అంటే భాష మీ...

జీవించేహక్కును హరించవద్దు
Posted on:12/11/2018 12:57:44 AM

సైనికాధికారులు తాము చేపట్టిన చర్యలను తప్పుపడుతూ, విచారణ చేపట్టడాన్నీ, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయటాన్నీ తీవ్రంగా నిరసిస్తున్నారు. తమ పిల్లలనే తాము చంపుకుంటామా అని కోర్టుకు విన్నవించారు. కానీ వారి వాదనల్లోని...

ఏమి నటన! ఎంత గొప్ప నాటకం!!
Posted on:12/9/2018 2:59:36 AM

తెలంగాణ సమాజమంతా ఎటువైపు ఉన్నదో కనిపిస్తూనే ఉన్నది. అయినా సరే, ఆంధ్రా నాటకాలు సాగుతూనే ఉంటాయి. నాటకాలను నాటకాలుగానే చూడాలె. పాత్రధారులను నటులుగానే అర్థం చేసుకోవాలె. కొద్దిరోజుల కింద ఒక దోస్తు అడిగిండు...

యూజీసీతోనే ఉన్నత విద్య
Posted on:12/9/2018 3:00:21 AM

ఎంఫిల్, పీహెచ్‌డీ చెయ్యాలంటే దాదాపు 20, 30 ఏండ్లు పడుతుంది. ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏ రకంగానూ వెనకబడి లేదని విఫలం కాలేదని చెప్పవచ్చు. సమస్య అంతా ప్రైవే ట్ స్కూల్స్ , కళాశాలలు, విశ్వవిద్యాలయాలు...

అమానవీయ ఫిర్యాదులు
Posted on:12/8/2018 10:23:27 PM

నాటి హైదరాబాద్ రాష్ట్రంలో గ్రావిటీ ద్వారా మహబూబునగర్‌కు నీటిని తేవల్సిన ప్రాజెక్టులను, శ్రీశైలం నుంచి టన్నెల్ ద్వారా 150 టీఎంసీల శ్రీశైలం ఎడమకాలువ ప్రాజెక్టును రానివ్వకపోవడం వల్ల, ఇంకా అనేక నీటి పారుద...

పెట్టెలో ఏముంది?
Posted on:12/8/2018 1:26:49 AM

ముక్కుపచ్చలారని తెలంగాణ రాష్ట్రం బిడ్డను ముద్దాడి, భుజాన మోసి, ఆలించి, లాలించి, పాలించి ప్రగతి మంత్రం నేర్పింది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్. అది తెలంగాణ పార్టీ, పచ్చగడ్డి కోసం అక్కడికి, ఇక్కడికి పర...

పేదలను కాటేస్తున్న గాలి కాలుష్యం
Posted on:12/8/2018 1:25:58 AM

ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల మాదిరిగానే కాలుష్యంతో భారత్ కూడా సతమతమవుతున్నది.దేశంలో ప్రజలు గాలికాలుష్యం కారణంగా నాలుగేండ్ల ఆయు ప్రమాణాన్ని కోల్పోతున్నారు. ఢిల్లీలోనైతే ప్రజలు ఏకంగా పదేండ్ల జీవితకాలాన్న...

మూడు అంశాలే గెలుపు బాటలు
Posted on:12/7/2018 12:45:14 AM

ఒక పాపులర్ గవర్నమెంట్ పట్ల ప్రజల్లో పాజిటివ్‌నేస్ రావాలంటే పై ముడు అంశాలే కీలకమవుతాయి. ఈ మూడు అంశాల్లో విఫలమైన ప్రతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. మూడు సా ర్లు తెలుగుదేశం ఓటములు, ఐదుసార్లు కాంగ్రెస్...

ప్రతిభతో ఎదిగిన ప్రకాశితుడు
Posted on:12/7/2018 12:43:16 AM

తృప్తిగా కాళ్లు చాపుకొని విశ్రాంతి తీసుకునే నాయకుడు కాదు కేసీఆర్. యాగం చేసినంత నిష్టగా,నిబద్ధతగా, రాష్ర్టాన్ని పాలిస్తున్నాడు. ప్రపంచం నిబిడాశ్చర్యంతో చూసే విధంగా తెలంగాణ గౌరవాన్ని నిలబెడుతున్నాడు. తమ...

మన చైతన్యమే మనకు రక్ష
Posted on:12/6/2018 10:41:59 PM

తెలంగాణ కాలపరీక్షకు నిలబడిన ప్రతి సందర్భంలో ఇక్క డి ప్రజల చైతన్యమే దాన్ని నిలబెట్టింది. రాష్ట్రం సాధించుకోవడమే కాదు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఈ నాలుగున్నరేండ్లలో చాలా రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శ...

‘భూమిపుత్ర’ పార్టీయే గెలువాలె
Posted on:12/5/2018 11:01:35 PM

తెలంగాణ అసెంబ్లీకి రేపు జరిగే ఎన్నికలో భూమిపుత్ర పార్టీయే గెలువాలి. అటువంటి పార్టీ మాత్రమే తనకు తెలంగాణ ప్రయోజనాలు తప్ప బయటివి ఏవీ లేకుండా పాలించగలదు. ఆ విధమైన పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటే. కాంగ్రెస్, సీపీ...

కేసీఆర్ తత్వం మానవత్వం
Posted on:12/5/2018 11:00:42 PM

ఆశావర్కర్లు, అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, హోంగార్డులు, బీడీ కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడిపే పద్ధతిలో కేసీఆర్ పింఛన్లను, వేతనాలను సమకూర్చటంతో ఆయా వర్గాల్లోని 80 శాతం గ...

తెలంగాణపై మూకుమ్మడి దాడి
Posted on:12/4/2018 10:49:48 PM

ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా జ్ఞాపకం చేసుకోండి.. ఈ చంద్రబాబు, ఆయన తైనాతీలు, ఇప్పుడు ఎన్నికల సమయాన ఆయనను నెత్తికెక్కించుకున్న కొందరు కూటమి నాయకులు, తెలంగాణ ఉద్యమకాలంలో ఎంత అసహనంతో ఊగిపోయిన వాళ్లే! తెలంగాణ...

లబ్ధిదారుల ఓట్లు టీఆర్‌ఎస్‌కే
Posted on:12/4/2018 10:48:27 PM

యువత భవితవ్యం కేసీఆర్ చేతిలో భద్రంగా ఉంది. జవాబుదారీతనం, విజన్ లేని ప్రతిపక్షాల మాటలు నమ్మితే మోసపోయేది విద్యార్థులు, యువతే. పొరపాటున మాయకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ యాభై ఏండ్లు వెనక్కి వెళ్తుంది. ...

తెలంగాణ అస్తిత్వంపై బాబు కుట్ర
Posted on:12/3/2018 11:17:38 PM

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడుకోవటం ప్రధానం. పెట్టుబడిదారీ వ్యవస్థపై శ్రామికవర్గ నియంతృత్వాన్ని సాధించుకున్న తర్వాత కూడా దాని పవర్ లేకపోతే మింగేస్తారని మార్క్స్ చెప్పార...

గద్దర్ ఏం చేయాల్సింది?
Posted on:12/3/2018 11:16:09 PM

ఒకానొక విధమైన స్థితిగతులు మన సమాజంలో వందల ఏండ్లుగా ఉన్నాయి. మునుముందు కొనసాగనున్నాయి. అవి సృష్టించే ప్రకంపనలు, భూకంపాలు ఒకే విధమైన, నిర్దిష్టమైన స్వరూప స్వభావాలతో, సిద్ధాంతాలతో ఉంటాయని ఏమీ లేదు. ఆ స్థ...

బాబు మనకు అవసరమా?
Posted on:12/2/2018 12:19:36 AM

చంద్రబాబును కేసీఆర్ బూచిగా చూపిస్తున్నారని కొందరు మేధావులు సన్నాయి నొక్కులు వినిపిస్తున్నారు. కేసీఆర్ బూచిగా చూపించడం ఏమి టి? చంద్రబాబు ఆధునిక తెలంగాణ సృష్టికర్తను నేనే, తెలంగాణలో నాకు ఎదురులేదు. నన్న...

రాజకీయ ‘అపరిచితుడు’
Posted on:12/2/2018 12:18:55 AM

2014లో సంపద స్థానంలో ఉన్న శని వల్ల అధికారం కోల్పోయిన చంద్రబాబుకు ఇప్పుడు అష్టమ శని (కష్టకాలం) జరుగుతున్నది. ఈ శనిగ్రహం ఆయన్ని కాంగ్రెస్ వైపు తోసింది. రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలుండవు అంటారు. అంద...

కూటమి మహాకుట్ర
Posted on:12/2/2018 12:17:37 AM

తెలుగుదేశం తరపున నిలబడిన చుండ్రు సుహాసినితో సహా ప్రజల మధ్య పెద్దగా ప్రాచుర్యం లభించడం లేదు. సుహాసిని గెలువడం అసంభవమని కూకట్‌పల్లి నియోజకవర్గంలో బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయట. కేవలం తమ సామాజికవర్గం వా...

తెలంగాణ గెలువాలె
Posted on:11/30/2018 10:46:43 PM

ఈ సోకాల్డ్ జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల హక్కులు ముఖ్యం కాదు. తమ ఇతర ప్రయోజనాల కోసం ఇవి తెలంగాణను బలిచేయడానికి వెనుకాడవు. రేపు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మంటగలిపి తన రాష్ట్ర ప్రయోజన...

అనేక రూపాల్లో ఆధిపత్య శక్తులు
Posted on:11/30/2018 10:43:57 PM

ఎన్నికలను అవకాశంగా తీసుకొని తెలంగాణ వ్యతిరేకులు, ఆధిపత్యశక్తులు అనేక రూపాల్లో, రంగుల్లో వస్తున్నాయి. వాటిని గుర్తెరిగి తగిన గుణపాఠం చెప్పాలి. ఇప్పుడు సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలన ఇంకా కొనసాగాల్సి...

ఒకే ఒక్కడు కేసీఆర్
Posted on:11/29/2018 11:04:46 PM

తెలంగాణ ఉద్యమం మొదలు అయినపుడు కేసీఆర్ ఒక్కడే. తరువాత అందరూ ఆయన దారిలోకి వచ్చారు. ఇవాళ మహాకూటమి పేరుతో అందరూ ఒక్కటై మళ్ళీ కేసీఆర్ మీదకు వస్తున్నారు. నిజానికి చంద్రబాబు లాంటి నాయకుడితో పొత్తు ఎలా పెట్ట...

బాబుగారి తెలుగుజాతి
Posted on:11/29/2018 11:02:15 PM

కొత్త రాజధానికి శంకుస్థాపన చేసుకుంటే.. మీకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం వేరుచేసి చూడలేదు. చంద్రబాబు మాదిరిగా తెలుగుజాతి ఐక్యతారాగాన్ని ఓట్ల కోసం అవక...

‘సెంటిమెంట్’ గాలిలో తేలియాడదు
Posted on:11/28/2018 11:53:45 PM

చంద్రబాబు జోస్యాన్ని పురస్కరించుకొని కేసీఆర్, హైదరాబాద్ ప్రసంగంలో సోనియా గాంధీ రేకొల్పజూసిన తెలంగాణ సెంటిమెంట్ గురించి తర్కవితర్కాలు చాలా జరుగుతున్నాయి. కానీ ఈ చర్చ చేస్తున్నవారంతా గుర్తించని విషయం ఒక...

ఏ మొహం పెట్టుకొని..!?
Posted on:11/28/2018 11:47:05 PM

మునుపెన్నడూ చూడని ఒక మేధావి చేతిలో రాష్ట్రం ఉన్నది. పకడ్బందీ ప్రణాళికతో ప్రతీ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి పరిష్కారం వెతికే పెద్దరికంలో రాష్ట్రం ఉన్నది. మా కోసం కొత్త గాంధీ వచ్చాడని మురిసిపోతున్న రాష...

కేసీఆర్ విజన్‌తో సకల కళల వికాసం
Posted on:11/27/2018 11:50:21 PM

ప్రపంచ తెలుగు మహాసభల్లో అంతా తానై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన పాత్ర తెరవెనుకే ఉండిపోయింది. అప్పుడే పుట్టిన శిశువు తెలంగాణ సాహిత్య అకాడమీని ముందు నిలిపి తాను అన్నీ ఒక తల్లిలా సవరించి, తెరవె...

కూటమి కుట్రలు తిప్పికొట్టాలె
Posted on:11/27/2018 11:47:46 PM

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్, టీడీపీల ముందు మోకరిల్లిన టీజేఎస్‌ను ప్రజలు విశ్వసించరు. సీట్ల కోసం, పదవుల కోసం కమ్యూనిస్టులు మహా కూటమిలో చేరటాన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఇలా...