HomeEditpage Articles

వ్యవసాయ సంస్కరణలకు నాంది

Published: Fri,April 21, 2017 04:17 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

Farmers
తెలంగాణ రైతాంగానికి ఎనలేని ఆశ్వాసాన్నిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తీసుకున్న నిర్ణయం తెలంగాణలో
సమగ్ర వ్యవసాయ సంస్కరణకు నాందిగా భావించాలి. ప్రజలకు సబ్సిడీలు ఇవ్వడం తిరోగమన విధానంగా వరల్డ్ బ్యాంక్ తదితర సంస్థలు ప్రకటిస్తున్న దశలో నూతన ఆర్థిక సంస్కరణల మౌలిక భావజాలానికి భిన్నంగా కేసీఆర్
తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రైతుల సంక్షేమానికి బాటలు వేస్తున్నాయి.


తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న చిన్న రైతాంగ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవాలంటే ప్రభుత్వం
సమగ్ర వ్యవసాయ సంస్కరణలను చిత్తశుద్ధితో అమలుచేయాలి. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి,
తెలంగాణను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన కేసీఆర్ ఇప్పుడు చేపడుతున్న విధానాలు, కార్యక్రమాలు
ఈ సమగ్ర వ్యవసాయ సంస్కరణలలో అంతర్భాగమే.

మౌలిక వసతుల కల్పనలో భాగంగా వ్యవసాయ ఉత్పాదకాలైన విత్తనాలు, ఎరువులను సకాలంలో సజావుగా లభించేటట్లు ప్రభుత్వం సమర్థవంతమైన పాలనాచర్యలు తీసుకున్నది. వ్యవసాయ విస్తరణ సేవలు పెంచేందుకు వ్యవసాయశాఖను పునర్వ్యవస్థీకరించి పెద్ద ఎత్తున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది. రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రతి మండలానికి ఐదువేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగులను ప్రభుత్వం నిర్మించింది.

deshapati-srinivas
తెలంగాణ రాష్ట్ర అవతరణ జరుగకముందే టీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ఒక లక్ష రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సుమారు 16 వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను మాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంతగా రుణాలను మాఫీ చేసిన ఘనతను సొంతం చేసుకుంది. తెలంగాణ వ్యవసాయానికి మూలధారమైన విద్యుత్ సరఫరాను మెరుగుపరచడం ఆశ్చర్యకరమైన ప్రగతిని సాధించింది.

చరిత్ర పొడుగునా వ్యవసాయ అభివృద్ధి కోసమని ఇప్పటివరకూ ప్రభుత్వాలు తీసుకున్న విధానాలు, నిర్ణయాలు, ప్రణాళికలు ఏవైనా అరకొరగా జరిగిన భూ పంపిణీ అంశానికి మాత్రమే పరిమతమైనాయి. కొంత భూ వసతి ఉన్నా బర్కత్ ఉండేవిధంగా వ్యవసాయం కొనసాగించడానికి కావలసిన వనరుల కల్పన మీద గత ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకమైన విస్మరణను ప్రదర్శించాయి.

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న రైతుల ఆర్థిక వ్యవస్థ ను రక్షించి, దాన్ని చలనశీలమైన, సాంకేతికస్థితి స్థాపకత్వం (Techni -cally resilient) కలిగిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటే ప్రాంతీయ నిర్దిష్టతను అనుగుణమైన, వికేంద్రీకృతమైన వ్యవసాయ సంస్కరణలను అమలుచేయాలి.
తెలంగాణలో సాగు యోగ్యమైన భూమి, వ్యవసాయానికి అనుగుణమైన వాతావరణ సమతౌల్యం, కష్టించి పనిచేసే రైతాంగం ఉన్నప్పటికీ తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం తలెత్తింది. హృదయ విదారకంగా రైతు లు బలవన్మరణాల పాలయ్యారు. ఈ సంక్షోభానికి మూలాలు ప్రకృతి వైపరీత్యంలో కంటే ప్రభుత్వ విధానాలలోనే ఉన్నాయి.
చారిత్రక వారసత్వంగా వచ్చిన సాంప్రదాయ సాగునీటి వ్యవస్థలతో, రైతులు తామే విత్తనాలు, ఎరువులు స్వయంగా తయారు చేసుకొనే స్వయం ఆధారిత వ్యవసాయ సమాజం క్రమక్రమంగా విచ్ఛిన్నమైపోయింది.

నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత రైతాంగం వ్యవసాయానికి అవసరమైన అన్ని అంశాలలోనూ పరాధీనతకు ముఖ్యంగా మార్కెట్‌పైన ఆధారపడవలసిన అగత్యానికి గురైంది. ప్రభుత్వ మద్దతు లేకుండా వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఎగిసిపడిన రైతాంగ పోరాటాలు, ఏదో ఒకమేరకు జరిగిన ప్రభుత్వ భూ పంపిణీ కార్యక్రమాలతో భూమి వికేంద్రీకృతమైంది. దీంతో చిన్న కమతాలు ఏర్పడి చిన్న రైతాంగం ఆర్థిక వ్యవస్థ క్రమంగా రూపొందింది.

పారిశ్రామిక రంగం కానీ, సేవారంగం కానీ చదువుకున్న గ్రామీణ యువతకు కావాల్సినంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ దగ్గర లుంగీలు కట్టుకుని పనిలేక నిస్తేజంగా గడిపే యువతను చూస్తున్నాం. వీళ్ళే వివిధ రాజకీయపార్టీలకు కార్యకర్తలు చూస్తున్నాం. వీళ్ళే వివిధ రాజకీయ పార్టీలకు కార్యకర్తలు కొంతవరకు అభిప్రాయ నిర్మాతలు కూడా అయిన వీళ్ళే ఎలక్షన్ ఏజెం ట్లు. వీళ్ళే తెలంగాణ ఉద్యమంలో ఉద్విగ్న భాగస్వాములు. వీళ్ళందరికీ వ్యవసాయమే జీవనాధారం అయింది. ఈ ఒత్తిడి ఫలితంగా అసంఘటిత కౌలు రైతుల వ్యవస్థ కూడా ప్రబలింది.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయిక నిర్దిష్టతలను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. పాలకులు ఎంతసేపు ఆంధ్రా ప్రాంతంలో ప్రాజెక్టుల కింద కాలువల ద్వారా సాగయ్యే వ్యాపార పంటల గురించి మాత్రమే ఆలోచించారు. మెట్ట ప్రాంతాల వ్యవసాయానికి అనుగుణమైన పంటలపై పరిశోధనలు జరుపలేదు. ఇక్రిశాట్ వంటి సంస్థలు తెలంగాణకు అనుగుణమైన పంటలు విధానాన్ని పరిశోధించి చేసిన సూచనలు ఆంధ్రా ప్రభుత్వాల కంటికి ఆనలేదు. ఇక యథేచ్ఛగా సాగిన సాగునీటి దోపిడీ చరిత్ర తెలిసిందే. చెరువుల విధ్వంసకాండ తెలంగాణ ను ఎట్లా కుంగదీసిందో ఉద్యమం పొడుగునా చర్చ జరిగింది. విత్తనాల కోసం ఎరువుల కోసం రాత్రింబవళ్ళు లైను కట్టి, సమయానికి అందక ధర్నాలు చేసి, లాఠీదెబ్బల పాలయిన రైతాంగం అగచాట్లు యాదికొస్తే కడుపు తరుక్కుపోతది. భూగర్భ జలాలు అడుగంటుతుంటే బోర్ల మీద బోర్లు వేస్తూ రైతులు తమ కష్టార్జితాన్ని నేలపాలు చేసుకోవాల్సి వచ్చిం ది. కరెంటు మీద ఆధారపడి వ్యవసాయం చేయవలసిన స్థితికి రైతులను ఈడ్చిన ప్రభుత్వాలు ఆ కరెంటును కూడా సరిగా సరఫరా చేయకపోగా ప్రశ్నించిన రైతులను తీవ్రవాదులుగా ముద్రవేశారు. బషీర్‌బాగ్‌లో రైతు ల్ని కాల్చి సృష్టించిన నెత్తుటి విషాదం తెలంగాణ గుండెలను మండించింది. అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోయిన రైతులు పాము కాటుతో నే, కరెంటు షాకుతోనో మరణించడం సర్వసాధారణమైపోయింది. రాత్రి కరెంటు రావడంతో పొలానికి పోతున్న రైతులను నక్సలైట్లుగా భ్రమించి పోలీసులు కాల్చి చంపిన దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి.

పరపతి సౌకర్యం కల్పించే దగ్గర వివక్షపూరిత విధానాలనే గత ప్రభుత్వాలు అమలుచేయటంతో పంట అదనుకు రుణాలు దొరుకక తెలంగాణ రైతాంగం అల్లల్లాడిపోయింది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ సం స్థల ద్వారా వచ్చే రుణ సౌకర్యాలు మొదట ఆంధ్రా ప్రాంతానికి తరలించారు. తెలంగాణ రైతులు సమయానికి రుణ సహాయం అందక ప్రైవేటు అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక అలవికాని బాధలు అనుభవించారు.

సహకార సంఘాలు ఇచ్చిన రుణం ఆఖరికి ప్రైవేట్ అప్పులకు వడ్డీ లు కట్టడానికే సరిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలోంచే తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది.ఎక్కడైతే సుస్థిర సాగునీటి వసతి ఉండి వ్యవసాయం అభివృద్ధి చెం దిన ప్రాంతాల్లో ఏవైతే హరిత విప్లవ ప్రాంతాలుగా భావిస్తున్నామో అక్కడ వెనుకబడ్డ ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులకు పూర్తిగా వ్యతిరేకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతాల్లో ఒకవైపు పెద్ద కమతాల ఏకీకరణ మరోవైపు చిన్న రైతులు తమ చిన్న కమతాలను పెద్ద రైతులకు కౌలుకిచ్చి పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆర్థికశాస్త్ర పరిభాషలో దీన్ని రివర్స్ టెనెన్సీ అంటున్నారు.

తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న చిన్న రైతాంగ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవాలంటే ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ సంస్కరణలను చిత్తశుద్ధితో అమలుచేయాలి. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన కేసీఆర్ ఇప్పుడు చేపడుతున్న విధానాలు, కార్యక్రమాలు ఈ సమగ్ర వ్యవసాయ సంస్కరణలలో అంతర్భాగమే.

తెలంగాణ రాష్ట్ర అవతరణ జరుగకముందే టీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ఒక లక్ష రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప‌ద‌హారువేల కోట్ల‌ రూపాయల రుణాలను మాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంతగా రుణాలను మాఫీ చేసిన ఘనతను సొం తం చేసుకుంది. తెలంగాణ వ్యవసాయానికి మూలధారమైన విద్యుత్ సరఫరాను మెరుగుపరచడం ఆశ్చర్యకరమైన ప్రగతిని సాధించింది. అన తి కాలంలో విద్యుచ్ఛక్తి వ్యవస్థను చక్కదిద్ది రైతాంగానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను చేయటం ద్వారా రైతులను కరెంటు కష్టాలనుంచి పూర్తిగా దూరం చేసింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం వల్ల దక్కిన ఈ ప్రయోజనంతో తెలంగాణ గ్రామ సీమల్లో ఉన్న నిరాశ నిస్పృహలను ప్రభుత్వం తొలిగించగలింది. భవిష్యత్తు పట్ల ఆశావహస్థితిని పెంచింది.

తెలంగాణ వ్యవసాయానికి ప్రాణాధారాలైన చెరువులను బాగు చేసేందుకు రూపొందించిన మిషన్ కాకతీయ పథకం ద్వారా ఇప్పటికే దాదా పు పదిహేడున్నర వేల చెరువులను పూర్తిగా పునరుద్ధరించింది. నిజాం కాలంలో నిర్మించిన కట్టలు, మత్తడి, కట్టుకాల్వలు శిథిలమై చెదిరిపోయిన చెరువులకు తిరిగి పూర్వ వైభవం తెచ్చింది. 46 వేల చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా కొనసాగుతున్న మిషన్ కాకతీయ భిన్నమైన అభివృద్ధి నమూనాకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ పరిణామం సహజంగానే రైతాంగంలోనూ ఇంకా మత్స్యకారులు, రజకులు, గౌడులు వంటి వృత్తికులాల వారిలోనూ ఉత్సాహాన్ని నింపింది. గత సంవత్సరం సమృద్ధిగా వానలు కురిసి నిల్వ సామర్థ్యం పెరిగిన చెరువులలో జలకళను సం తరించుకున్నాయి. దీంతో భూగర్భ జలమట్టం పెరుగుతున్నదని అధ్యయనాలు తేలుస్తున్నయి.

మౌలిక వసతుల కల్పనలో భాగంగా వ్యవసాయ ఉత్పాదకాలైన విత్తనాలు, ఎరువులను సకాలంలో సజావుగా లభించేటట్లు ప్రభుత్వం సమర్థవంతమైన పాలనాచర్యలు తీసుకున్నది. వ్యవసాయ విస్తరణ సేవలు పెంచేందుకు వ్యవసాయశాఖను పునర్వ్యవస్థీకరించి పెద్ద ఎత్తున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది. రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రతి మండలానికి ఐదువేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగులను ప్రభుత్వం నిర్మించింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో 4.14 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం 17.07 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణం చేపట్టింది. ఆశించిన ధర లభించినప్పుడు రైతులు తమ ధాన్యాన్ని గోదాముల్లో భద్రపరుచుకొని నిల్వ ఉంచిన ధాన్యం విలువలలో 75 శాతంలోను పొందే వీలును కల్పించే రైతుబంధు పథకం కింద ఇచ్చే ఋణానికి వడ్డీ మినహాయింపు ఇవ్వటమేకాకుండా ఋణం గరిష్ఠ పరిమితి గతంలో లక్ష వుంటే దానిని రెండు లక్షలకు పెంచింది.

మద్దతు ధర ఇప్పించే దగ్గర ప్రభుత్వం క్రియాశీల జోక్యాన్ని ప్రదర్శించింది. కందులకు మద్దతు ధర కోసం కేంద్రంతో చర్చించి సాధించటమే కాకుండా మార్క్‌ఫెడ్ మాఫెడ్‌లను రంగంలోకి దింపి 21 లక్షల క్వింటాళ్ల కందులను కొనుగోలు చేయించి దేశం మొత్తం మీద కందుల కొనుగోలు అత్యధికంగా జరిపిన రాష్ర్టాల్లో తెలంగాణ రెండవస్థానంలో నిలిచింది. గోనె సంచుల కొరత తలెత్తి ధాన్యం కొనుగోళ్ళు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన 15 లక్షల గోనె సంచులను అప్పటికప్పుడు సమకూర్చింది. దేశవ్యాప్తంగా జాతీయ మార్కెట్ విధానం ద్వారా మధ్య దళారుల ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌లో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేవిధంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఈనామ్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 44 మార్కెట్లలో అమలు ప్రారంభించింది. మరో 16 మార్కెట్లలో అమలు ప్రారంభం కానుంది.

చిన్న రైతుల ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి సమకూర్చుకోవడమే పెద్ద సమస్య. పరపతి సౌకర్యం కల్పించడమే కీలకం. సాగు మొదటి దశలో అవసరమయ్యే విత్తనాలను ఇప్పటికే ప్రభుత్వం సబ్సిడీ మీద అందిస్తున్నది. ఎరువులను కూడా ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం రైతుల గుండెలమీది బరువును పూర్తిగా తేలిక పరిచింది. ఎకరానికి 4000 చొప్పున నేరుగా రైతుల ఖాతాలలో జమచేసి ఇచ్చేవిధంగా సరికొత్త పథకాన్ని ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. చిన్నరైతులు ఇవాళ పెట్టుబడి సమకూర్చుకోవడానికి పడుతున్న పాట్లను ఈ పథకం చాలామేరకు నివారిస్తుంది. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు చేసి వడ్డీలతో సతమతమై ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజుల నుంచి రైతులు బయటపడే విధంగా ప్రభుత్వం సహకారం అందించబోతున్న ది. దుక్కిదున్నినప్పటి నుంచీ రైతులకు వివిధ దశలలో అవసరమయ్యే డీఏపీ, యూరియా, నత్రజని ఎరువులను ప్రభుత్వం ఉచితంగా అందించడం అనేది సస్యరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ప్రభా వం ఫలసాయం అందేంతవరకూ ఉంటుంది. కనుక ఈ నిర్ణయానికి చాలా ప్రాధాన్యం వుంది. అందుకే ఇవాళ ప్రతి రైతు కేసీఆర్ నిర్ణయం పట్ల సంతోషాన్ని సంబురాన్ని వ్యక్తం చేస్తున్నడు. ఎకరానికి 4000 రూపాయలు ఇస్తే ఎరువులు కొనుక్కోవడమే కాక కొంతమేరకు కూలీ కోసం పెట్టే ఖర్చు కూడా ఇందులోనే మిగులుతుందని కొంతమంది రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నరు.

ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటున్నటువంటి ప్రజా కేంద్రిత నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నది. చిన్న రైతులను బతికించే విధంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశం ముందు ఒక ఆదర్శాన్ని నిలబెట్టింది.తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత చొరవను ప్రదర్శించి కేంద్రంతో చర్చించి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయించగలిగితే రైతులకు కూలీల వ్యయభారం కూడా తగ్గి మరింత మేలు జరుగుతుంది.

వ్యవసాయ సంస్కరణలను సమగ్రంగా అమలుచేసే బాధ్యతతో తెలంగాణ ప్రభుత్వం క్రాప్ కాలనీలు అనే విధానాన్ని కూడా ముందుకు తీసుకువస్తున్నది. ఈ విషయం మీద వ్యవసాయ శాస్త్రవేత్తలతో సంప్రదించి ప్రత్యామ్నాయ పంటలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలను కూడా ప్రోత్సహించాలి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అడుగులు వేసింది. విత్తనోత్పత్తి భాండాగారంగా తెలంగాణను మలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రయత్నాలను మరింత విస్తృతపరుచాల్సి ఉన్నది.

ఉద్యాన ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీ లు కల్పిస్తున్నది. గ్రీన్ హౌజ్ కల్టివేషన్, సూక్ష్మబిందు సేద్యం వంటి విధానాలను బాగా ప్రోత్సహిస్తున్నది. సౌర విద్యుత్ వాడకాన్ని పెంచితే రాను న్న రోజుల్లో విద్యుచ్ఛక్తి భారం కూడా తగ్గుతుంది.

359
Tags
 ,