బాబూ.. ఇక్కడ మేం బాగున్నాం


Sun,June 28, 2015 12:10 AM

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ర్టాల ప్రజల మధ్య ఘర్షణలు జరిగిన దాఖలాలు లేవు. ఆ మాటకొస్తే తీవ్రమైన అభద్రతా భావనలు కుల సమస్య వల్ల ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. కారంచేడు, చుండూరు, నీరుకొండ, పదిరి కుప్పం, లక్ష్మీంపేటల్లో జరిగిన దళితుల ఊచకోత వివిధ రూపాల్లో అక్కడ నిత్యం వికృతంగా నాట్యం చేస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పాలక కులాలకు, దళితులకు మధ్య నిరంతరాయంగా ఎడతెగని ఉధ్రిక్తత నడుస్తున్న మాట నిజం కాదా? పాలక కులానికి చెందిన పసిపిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా చెలాయిం చడం, వారి ముందు బడుగు, బలహీనవర్గాల వారు చేతులు కట్టుకొని బిక్కు బిక్కుమంటూ కాలం గడపడం వాస్తవం కాదా? ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముసుగు లో నడుస్తున్నది పచ్చి కులస్వామ్యం కాదని ఎవరైనా చెప్పగలరా?

ఓటుకు నోటు వివాదాన్ని రెండు రాష్ర్టాల ప్రజల మధ్య ఘర్షణగా చూపించి పబ్బం గడుపుకునే ప్రయత్నం గతంలో జరిగిన కుల, మత ఘర్షణను గుర్తుకు తెస్తున్నది. ఒకరిద్దరు వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఒక సమస్యను సృష్టించి దాన్ని మొత్తంగా ఒక కులం మీదనో, మతం మీదనో రుద్ది ఘర్షణలు రెచ్చ గొట్టి మారణహోమం సృష్టించిన సందర్భాలు చరిత్రలో అనేకం. అలాగే ఓటుకు నోటు కేసును మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యగా చిత్రీకరించి రెండు రాష్ర్టాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రమాదకరం. వివేకవంతులైన ప్రజలు ఈ రాజకీయ ఎత్తుగడలను గమనిస్తూనే ఉన్నారని, వారి మనోభావాలు ఏ మాత్రం ఈ సందర్భంగా దెబ్బతినలేదని గుర్తించాల్సిన అవ సర మున్నది.

స్వరాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులు కొంత అభద్రతాభావానికి గురైన మాట వాస్తవం. అయితే రాష్ట్ర విభ జన తర్వాత ఊహించిన దానికంటే వేగంగా సీమాంధ్రులు ఆ అభద్రతాభావం నుం చి బయటపడిన సంగతి ఆనందాన్ని కలిగించే ఒక చారిత్రక సత్యం. సీమాంధ్ర నుం చి వచ్చి తెలంగాణలో నివసిస్తున్న వారు, తెలంగాణ స్థానిక ప్రజలు, రాష్ట్ర ప్రభు త్వం శాంతియుతంగా ఒకరికొకరు దగ్గరవుతున్న తరుణంలో ప్రజల మధ్య విద్వే షాలు రగిలించే దిశలో రాజకీయాలు తయారవడం శోచనీయం. దీన్ని రెండు రాష్ర్టా ల ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇది తాత్కాలికంగా కొందరు రాజకీయ నాయ కులకు ఉపశమనం కలిగించినా దీర్ఘకాలంలో ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీసే అవకాశన్నది.

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ర్టాల ప్రజల మధ్య ఘర్షణలు జరిగిన దాఖలాలు లేవు. ఆ మాటకొస్తే తీవ్రమైన అభద్రతా భావనలు కుల సమస్య వల్ల ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. కారంచేడు, చుండూరు, నీరుకొండ, పదిరి కుప్పం, లక్ష్మీంపేటల్లో జరిగిన దళితుల ఊచకోత వివిధ రూపాల్లో అక్కడ నిత్యం వికృతంగా నాట్యం చేస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పాలక కులాలకు, దళితులకు మధ్య నిరంతరాయంగా ఎడతెగని ఉధ్రిక్తత నడుస్తున్న మాట నిజం కాదా? పాలక కులానికి చెందిన పసిపిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా చెలాయిం చడం, వారి ముందు బడుగు, బలహీనవర్గాల వారు చేతులు కట్టుకొని బిక్కు బిక్కు మంటూ కాలం గడపడం వాస్తవం కాదా? ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముసుగు లో నడుస్తున్నది పచ్చి కులస్వామ్యం కాదని ఎవరైనా చెప్పగలరా? అధికారం, పద వులు ఒక కులం చేతిలో బందీలైపోతే మిగతా కులాలు సంబురాలు చేసుకుంటా యా? మౌనం అన్నిచోట్లా అంగీకారం కాదు.

కక్కలేక మింగలేక కళ్లు మూసుకొని వెళ్లిపోవడం తుఫాన్‌కు ముందు ప్రశాంతత లాంటిదే. నిజానికి ఆంధ్రప్రదేశ్ కుల ఘర్షణలను, దాడులను ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న నిండు చూలాలుగా కనిపి స్తున్నది. కాకపోతే ఈ ఘర్షణలు, దాడులు అనేక రూపాల్లో వుంటాయి. నిజంగా సీమాంధ్రులు తెలంగాణలో అభద్రతా భావంలో ఉన్నారా? అభద్రతా భావంలో ఉంటే అనేకమంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలోనే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నట్టు? పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, రాజకీయ నాయకులు హైద రాబాద్‌నే తమ సొంత ఇల్లుగా ఎందుకు భావిస్తున్నట్టు? వారంతా తెలంగాణ సమా జంలో అంతర్భాగమైపోయి దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిపోయింది కాబట్టే.

నిజా నికి తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులు తెలంగాణ పౌరులుగా గుర్తింప బడాలని కోరుకుంటున్నారు. అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు కూడా. సెటిలర్స్ అనే మాటనుకూడా వారు ఆమోదించరు. ఆ పదం వారిని తెలంగాణ సమాజానికి బయటి వారిని చేస్తుందని ఆందోళన ఉన్నది. ఈ సందర్భంలోనే ఇక్కడ సెటిలర్స్ ఎవరూ లేరు. అందరూ హైదరాబాదీలే అన్న కేసీఆర్ మాటలు గమనార్హం. ఇంత గా తెలంగాణలో అంతర్భాగమైన వారిని ఈ వివాదంలోకి లాగడం, తెలంగాణ సమాజం నుంచి వేరు చేసి చూపడం అత్యంత ప్రమాదకరం. ఐదు, పది కేసులే అభద్రతకు మూలాలైతే ఆంధ్రప్రదేశ్ కోర్టుల్లో మగ్గుతున్న లక్షలాది కేసుల మాటే మిటి? ప్రజలు అమాయకులు కారు. ఎవరి సమస్యలో ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయని రాజకీయ నాయకులు టీవీల్లో ఊదరగొడుతుంటే దాని వెనుక అసలు మర్మం తెలుసుకొని నవ్వుకుంటున్నారు.

ఇక విభజన చట్టంలోని సెక్షన్ 8 విషయానికి వస్తే.. గత సంవత్సర కాలం నుంచి అది అమల్లోనే ఉంది. ఆ సెక్షన్‌లో పేర్కొన్న విధంగా శాంతిభద్రతల సమస్యలు తలె త్తితే, గవర్నర్ తన సలహాదారులైన ఇద్దరు కమిషనర్లతో చర్చించి నిర్ణయం తీసుకుం టారు. ఇక్కడ శాంతిభద్రతలకు భంగం కలగలేదు. కాబట్టి గవర్నర్ ప్రత్యక్షంగా రం గంలోకి దిగే అవకాశమే లేదు. శాంతిభద్రతల సమస్యలు వచ్చి ఉంటే గవర్నర్ ఆటోమేటిక్‌గా చర్య తీసుకొని ఉండేవాడే. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ చర్య తీసు కుంటే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 356లోని రాష్ట్రపతి పాలన లాగా ఉంటుంది. గవర్నర్‌కు ఇటువంటి అపరిమితమైన అధికారాలు రెండు రాష్ర్టాలకు ప్రమాదకరం గా పరిణమించవచ్చు కూడా. గవర్నర్ పదవినే ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పిన ఎన్టీఆర్ మాటలు ఇక్కడ గమనించాలి.

ముఖ్యంగా సంవత్సరం క్రితమే అమల్లోకి వచ్చి కొనసాగుతున్న విభజన చట్టం లోని సెక్షన్8ను అమల్లోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నాయకులు, అమ ల్లోకి తేవద్దని తెలంగాణ నాయకులు వాదించుకోవడం విడ్డూరంగా ఉన్నది. సెక్షన్ 8ను అమలు చెయ్యమని ఆంధ్రప్రదేశ్ నాయకులు అడిగినప్పుడు, అది సంవత్స రం నుంచి అమల్లోనే ఉందని తెలంగాణ నాయకులు చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నాయకులతో దాన్ని అమల్లోకి తేనివ్వమని వారు ఘర్షణలో భాగమయ్యారు. ఒకరకంగా టీడీపీవారి ఉచ్చులో ఈ నాయకులు పడ్డారేమోనని ప్రజలు అనుకుంటున్నారు. అప్పటికే అమల్లో ఉన్న చట్టాన్ని తెమ్మని ఒకరు, తేవద్దని ఇంకొకరు ఘర్షణ పడుతుంటే ఇద్దరి మధ్య ఇంకేదైనా లోతైన, రాజ కీయం ఉందేమోననే కోణంలో కూడా చర్చ జరుగుతున్నది.

ఇకపోతే.. బడా బడా నాయకులు సమస్యలో భాగస్వాములు కాబట్టి ఏ స్థాయి లోనైనా వారి మధ్య రాజీ కుదరొచ్చనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినపడుతున్న ది. పాలక కుల కేంద్ర మంత్రులు, మీడియా నోటుకు ఓటు కేసును చిన్న వివాదంగా చిత్రించడం ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నది. రాజీ కోసం తెరవెనుక తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నట్టు చర్చ జోరుగా సాగుతున్నది. ఈ అవగాహనతోనే అధి కారంలో ఉన్న వారి మనోభావాలు దెబ్బతిన్న స్థాయిలో సామాన్య ప్రజలు ఫీల్ కావడం లేదు. గతంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పదే పదే చెప్పిన నాయకులు ఇప్పుడు చట్టాన్ని వదిలేసి జనం మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం అవకా శవాద రాజకీయాలకు నిదర్శనం. ఓటుకు నోటు కేసు, తర్వాత వచ్చిన ఫోన్ ట్యాపిం గ్ కాని, సెక్షన్ 8 కాని ప్రజలు రాజకీయ ఎత్తుగడలు గానే చూస్తున్నారు తప్ప నాయ కుల మాటలు నమ్మడం లేదని వారు అర్థం చేసుకోవాలి.

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles