HomeEditpage Articles

బాధ్యత తీసుకోవాలి

Published: Sat,February 11, 2017 12:55 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

పేరులోని ఒక అక్షరం మార్పు మీ జీవితా న్నే మార్చేస్తుందంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ కొందరు.., భూత వైద్యంతో పట్టిన శనిని వదిలిస్తా మంటూ ఇంకొక రు.. ఇలా రకరకాల మాయమాటలతో ప్రజలను నమ్మిస్తున్నారు. ఈ మాయ మాటలు విన్న ప్రజలు అనేక రకాలుగా మోసపోతున్నారు. ఇందులో భాగంగానే ఒక న్యూమరాలజిస్ట్‌పై కరీంనగర్‌లో కేసు నమోదైంది. ఇన్నిరోజులు సాగిన వీరి కప ట నాటకం బహిరంగమై ఛానళ్లలో ప్రసారమవుతున్నది. ఇప్పటికైనా పోలీసు లు ఇలాంటి మాయగాళ్ల ఆటలు కట్టించాలె.చర్యలు తీసుకోవాలి


ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చరి త్రాత్మక నిర్ణయమైన నోట్లరద్దుతో సామా న్యులకు ప్రయోజనం చేకూరిందో లేదో కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్స్ యజమా నులకు మాత్రం జేబులు నింపింది. ఇప్పటికీ స్వైపింగ్ మిషన్ల ద్వారా మద్యం విక్రయించి వినియోగదారుల వద్ద అధిక ధరలు వసూలు వేస్తూ మోసానికి పాల్ప డుతున్నారు. బాటిల్‌పై 5, 10 రూపాయ లు ఎక్కువ వసూలు చేస్తూ వినియోగదా రుడిపై భారం మోపుతున్నారు. ఇలాంటి అధిక ధరలు వసూలు చేస్తున్న మద్యం దుకాణాలను ఎక్సైజ్ శాఖాధికారులు సీజ్ చేయాలి.


ప్రభుత్వ పాఠశాలల పటిష్ఠత


రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడానికి వివిధ వర్గాలకు గురుకులాలను ఏర్పాటు చేయడం అభినందనీయం. దీంతోపాటే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి ప్రజానీకం వాళ్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపుతున్నారు. కాబట్టి కొత్తగా ఏర్పాటయ్యే గురుకులాల తో పాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పై కూడా దృష్టి సారించాలి. అందులో చదివే పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందేలా అన్నిరకాలు మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేయాలి.

1305
Tags
 ,