HomeEditpage Articles

ప్రాంతీయతకు ప్రాణంపోసిన సిద్ధప్ప

Published: Sat,February 11, 2017 02:50 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ఆరు దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఆధునిక చరిత్రలో తెలంగాణ స్వరూ ప, స్వభావాలు ఇవి అని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. సామాజిక, సాంస్కృతిక, సాహి త్య, రాజకీయ, ఆర్థిక రంగాల చరిత్ర కూడా ఇదే స్థితిలో ఉన్నది. ఈ క్రమంలో హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టి తెలంగాణ అంతటా తిరిగి వందలాది మందిని ప్రభావితం చేసిన ప్రజాకవి వరకవి సిద్ధప్ప. గోల్కొండ కవుల సంచికలో కూడా ప్రాతినిధ్యం పొందిన కవి. ఆయన మొదట నిరక్ష్యరాస్యుడు. పుట్టింది కుమ్మరి కులంలో. సొంతంగా చదువుకొని రాణించారు. 1934లోనే వరకవి సిద్ధప్ప తత్త్వబోధిని పేరుతో నాలుగు సంపుటాలను వేశారు.

రీ ఇన్వెంటింగ్ తెలంగాణ అన్న భావన రూపుదిద్దుకుంటున్న నేటి కాలాన సిద్ధప్పతో పాటు ఆయన కవితాభివ్యక్తిని, తీర్చిదిద్దిన తత్త్వకవితా ఉద్యమాన్ని అవగతం చేసుకోవడం ద్వారా తెలంగాణ గతాన్ని సాకల్యంగా అర్థం చేసుకోవచ్చు. 1913లో జన్మించి 1984లో కాలంచేసిన ఆయన 30 పుస్తకాలకు పైగా వెలువరించారు. వానమామలై వరదాచార్యులు, పేర్వారం జగ న్నాథం, నీలా జంగయ్య వంటివారు ఆయనను స్వయంగా కలుసుకున్నారు. ఆయన కవితాశక్తిని చూసి ఆశ్చర్యపోయారు. 15వ శతాబ్దం ఆదిగా చూస్తే అచలయోగం ఆలంబనతో రూపుదిద్దుకున్న తత్త్వ వితా సంప్రదాయం తెలంగాణ సమాజపు సమగ్రతను పరిరక్షించడంలో విప్లవాత్మక పాత్రను పోషించింది. క్రీ.శ.తొలి దశకాలలో బౌద్ధం, మధ్యయుగాలలో దానికి మరో రూపంగా వచ్చిన వీరశైవం ఏ పాత్ర వహించిందో చైనాలో జెన్‌ఫిలాసఫీ, జపాన్‌లో టావోయిజం మధ్య ఆసియాలో సూఫీజం ఏ పాత్ర పోషించిందో అదే పాత్రను పోషించింది. తెలంగాణ మట్టిలో పుట్టిన గొప్ప తత్త్వశాస్త్రమది. పూర్తిగా దేశి. ఈ తత్త్వ శాస్త్రం తెలంగాణలో రైతాంగం, సామాన్యులంతా మార్గరూపంలో ఉన్నత, పాలక వర్గాలకు చెందిన వైష్ణవాన్ని, దాని దోపిడీ భావజాలాన్ని, భోగలాలసతను తిరస్కరించి తమవే అయిన భాషాసంస్కృతులను, సంగీత సంప్రదాయాల పరిరక్షణకు చేయూతనిచ్చింది. అచలతత్వాన్ని ప్రచారం లో పెట్టిన ఆయా కాలాల కవులు తెలంగాణ సమాజాన్ని తరచూ ఆవరించే సామాజిక, రాజకీయ సంక్షోభాల నుంచి గట్టెక్కించేందుకు కావాల్సిన మానసిక ైస్థెర్యాన్ని, నైతిక బలాన్ని సమకూర్చారు.

హైదరాబాద్ రాష్ట్రంలో వెట్టిచాకిరి, ఆడబాప వంటి సాంఘిక దురాచారాలు, అర్థం పర్థంలేని మూఢనమ్మకాలు, పరభాషలో పాలన ఉన్నకాలంలో వరకవి సిద్ధప్ప తెలంగాణ అంతటా తిరిగి విస్మృత వర్గాల్లో పెద్ద ఎత్తున సంస్కరణ భావజాల వ్యాప్తిని, కులాధిక్యతలను ప్రశ్నించి, వాటిని నిరసించా డు. దిగంబర కవుల వలే ఆయన ఇందుకు పరుష పదజాలాన్ని ఉపయోగించడానికి వెనుదీయలేదు. తన తత్త్వగీతాలలో మనిషికి ఉన్నత పీఠాన్నిచ్చాడు. సామాన్యులకు స్వాంతన చేకూర్చాడు. వర్తమాన తెలంగాణను పీడిస్తున్న ఆత్మహత్య వంటి సాంఘిక దురాచారాలకు విరుగు డు. తత్త్వకవితా సంప్రదాయంలోనే సంస్కరణ, విప్లవాత్మక పాత్ర ను నిర్వహించిన వరకవి సిద్ధప్ప రచనలకు కూడా ఆ శక్తి ఉన్నది. ఆయన హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా పర్యటించాడు. ఆయనకు నిజామాబాద్, మెదక్ వంటి ప్రాంతాల్లో రెడ్డి దొరలతో పాటు, వ్యాపారుల నుంచి సామాన్యుల వరకు మద్దతిచ్చారు. సామాన్యులు చందాలేసుకొని ఆయన పుస్తకాలను వెలుగులోకి తెచ్చారు. నీతి మంతుడైన సిద్ధప్ప తన పుస్తకాల ప్రచురణకు ఇచ్చిన చందాలను ఇచ్చినవారి పేర్లతోపాటు వారి ఊర్ల పేర్లను కూడా పొందుపరిచారు. అతన్ని చేరదీసి గౌరవించిన వాళ్లం తా శూద్ర కులాల వారు కావడం గమనార్హం.
19వ శతాబ్ది మొదటి పాదంలో సామాన్య సామాజిక వర్గంలో సిద్ధప్ప అయినా, కాకతీయుల కాలంలో కుమ్మరి మొల్ల అయినా బ్రాహ్మణేతర తత్త్వకవులైనా తెలంగాణలో పుట్టుక రావడానికి ఇక్కడ చరిత్ర పూర్వకా లం నుంచి పాదుకున్న జీవనరీతి.

Jaganreddyబౌద్ధం తీర్చిదిద్దిన వ్యవసాయ నాగరికత, జైనం, వీరశైవం, ప్రాచీనకాలపు బౌద్ధానికి మారు రూపంగా 15వ శతాబ్దంలో వచ్చిన అచలయోగం, సూఫీరీతి తీర్చిదిద్దిన సాంస్కృతిక సామాజిక, రాజకీయ పరిస్థితులే కారణం. వీటి నేపథ్యంలో తెలంగాణ చవిచూసిన సంక్షోభాలు, సామాజిక పరిణామంలో ఉన్నాయి. క్రీస్తు శకం నుంచి కాకతీయుల కాలం సహా తెలంగాణలో శూద్ర, వ్యవసాయ కులాలదే ఆధిపత్యం. మాదిగ, మాల కులాలకు చెందిన చిందు, డక్కలి కళాకారులు 18 కుల పురాణాలను గానంచేసే ఆయా ఉపకులాలు, సాహి త్య, సాంస్కృతిక రంగాలను తీర్చిదిద్దినవాళ్లంతా వాళ్లే. దేశంలోనే ఇంత టి విశిష్టమైన పరిస్థితి ఉన్నది తెలంగాణలోనే. ఇంతేకాదు కులీకుతుబ్ షా, అసఫ్ జాహీల పాలనలోనే తెలుగు భాషా సాహిత్యాల వికాసం బాగా జరిగింది. ఇప్పటి పరిభాషలో చెప్పుకోవాలంటే కల్చరల్ , లిటర రీ ఎంపవర్‌మెంట్ వీరి కాలంలోనే తెలంగాణలో ఉన్నతస్థాయికి చేరింది. బానిసత్వాన్ని, మూఢత్వాన్ని, ఛాందసత్వాన్ని బోధించే మత, భక్తిపరమైన ఆధ్యాత్మికత స్థానే సోషల్ స్పిర్చ్యువాలిటీ (సామాజిక చింతన లేదా ఆధ్యాత్మికత) రూపుదిద్దుకున్నది. ఈ తరహా వాతావరణంలోనే వరకవి సిద్ధప్ప కవిగా రూపుదిద్దుకున్నాడు. వరకవి సిద్ధప్ప కవిని సాకల్యంగా అవగాహన చేసుకోవడం వల్లే తెలంగాణ సమాజ నిజరూపం వెలుగులోకి వస్తుంది.
(నేడు ఉదయం 10 గంటలకు తెలుగు యూనివర్సిటీలో వరకవి సిద్ధప్ప తత్త్వకవిత ఆవిష్కరణ సభ సందర్భంగా)

949
Tags
 ,