HomeEditpage Articles

ప్రగతి ప్రస్థానం

Published: Fri,April 21, 2017 01:58 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

చరిత్ర గమనంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఉద్యమ నెలబాలుడే. ఒక రాష్ట్ర చరిత్రను తీసుకుంటే పదిహేడేళ్ల ప్రాయం ఒక పార్టీకి, అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల కాలం పెద్దదేం కాదు. అయినా చిరకాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాల రూపకల్పనలో తనదైన ముద్రను వేసింది. ఇతర రాష్ర్టాల ప్రభుత్వ ప్రతినిధులు మిషన్ కాకతీయ, భగీరథ పథకాల అధ్యయనం కోసం ఇక్కడికి రావటం ప్రజారంజక పాలనకు తార్కాణం. అయితే ఒక సామాజిక మార్పుకోసం ఉద్యమాన్ని నడుపటం, దానిలో విజయం సాధించటం కన్నా, సుపరిపాలన దిశగా సుస్థిర పాలన అందించటం క్లిష్టమైనది. కష్టసాధ్యమైనది. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి సుస్థిర పాలన ఎంతో అవసరం.

తెలంగాణ రాష్ట్ర సమితి తన పదిహేడేళ్ల ప్రస్థానంలో మరో అడుగు ముందుకు వేయబోతున్నది. పార్టీ ఆవిర్భవించి పదహారేండ్లు పూర్తిచేసుకుని పదిహేడో ఏట అడుగిడబోతున్న శుభ తరుణంలో ఇవ్వాళ హైదరాబాద్‌లోని కొంపల్లిలో ప్లీనరీ నిర్వహణతో పాటు, పార్టీ ఆవిర్భావదినం ఏప్రిల్ 27న వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించుకోవటానికి సకల సన్నాహాల తో సమాయత్తమైంది.

అధికారం చేపట్టిన రెండున్నరేండ్ల కాలంలో సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచేందుకు ఈ పదిహేడవ వార్షికోత్సవ సభను వేదికగా చేసుకున్నది. దానికి అనుగుణంగానే సభకు ప్రగతి నివేదన సభగా నామకరణం చేశారు. ఈ సభను భారీ జనసమీకరణతో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సమరోత్సాహంతో కృషిచేస్తున్నారు. నేడు కొం పల్లిలో జరిగే ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల నుంచి ఎంపికచేసిన పార్టీ ప్రతినిధులు సుమా రు పదిహేను వేల మంది హాజరయ్యే అవకాశాలున్నాయి. దీనికి 60 ఎకరాల విశాల స్థలంలో సకల ఏర్పాట్లుచేశారు. హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 33 నెలల కాలంలో చేసిన అభివృద్ధికి సూచికగా ప్లీనరీ సభకు ప్రగతి ప్రాంగణం అని పేరు పెట్టారు. ప్లీనరీలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిశానిర్దే శం చేసేవిధంగా ఏడు తీర్మానాలు చేసే అవకాశం ఉన్నది.
ఉద్యమపార్టీగా టీఆర్‌ఎస్‌ది ఆధునిక చరిత్రలో విశిష్ట స్థానం.

రాష్ట్రసాధన ఉద్యమాన్ని, ప్రజల సంస్కృతి, సంప్రదాయాలతో మిళితం చేసి ఉద్యమాలకు సరికొత్త రూపాన్ని, అర్థాన్ని చెప్పిన ఘనత ఉద్యమ నాయకత్వానిది. ఈ క్రమంలో పదమూడేళ్ల ఉద్యమ గమనమంతా త్యాగాల ప్రస్థానం. 2001 ఏప్రిల్ 27న పిడికెడుమందితో ఆవిర్భవించిన పార్టీ, రాష్ట్రసాధన దాకా పదమూడేళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నది. పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో పార్టీపై హేళనలు, నాయకుడు కేసీఆర్‌పై వ్యక్తిగత నిందలు, తప్పుడు ప్రచారాలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ అయితే మూడునాళ్ల ముచ్చట అన్నా రు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌పై చేసిన వ్యక్తిగత నిందలకు అంతులేదు. తెలంగాణ వ్యతిరేకులు ఎన్నిరాళ్లు విసిరినా వాటినే పునాదిరాళ్లుగా చేసుకొని ఉద్యమానికి వ్యూహరచన చేసిన ఘనత కేసీఆర్‌ది. శాంతియుత తెలంగాణ ఉద్యమాన్ని హింసామార్గం మళ్లించి అణచివేయాలని కలలుగన్న సమైక్యవాదుల ఆటలు సాగనీయలేదు.

ఉద్యమ వ్యతిరేకులు ఎంతగా, ఎన్నివిధాలుగా రెచ్చగొట్టినా రెచ్చిపోలేదు. శాంతియుత ఉద్యమపథాన్ని వీడలేదు. చివరికి గమ్యాన్ని ముద్దాడిన పార్టీగా రాష్ర్టాన్ని సాధించి, అధికారాన్ని చేపట్టి సుస్థిరపాలనతో సుస్థిర అభివృద్ధి దిశగా పయణిస్తున్నది. ఎప్పుడూ, ఎక్కడా సాధ్యంకాని 22 శాతం వృద్ధి రేటుతో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలుస్తున్నది. పారిశ్రామిక విధానంలో టీఎస్‌ఐపాస్‌తో సులభ వాణి జ్య విధానంలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచింది. రైతుల కు 17వేల కోట్ల రుణాలు మాఫీ చేయడంతో పాటు, వచ్చే ఏడాది నుంచి ఉచితంగా ఎరువుల పంపిణీకి కూడా సిద్ధమైంది. ఇలా అధికారం చేపట్టిన ముప్పై మూడు నెలల్లోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తో నలుదిశలా ఖ్యాతిగాంచి న పార్టీగా ఇవ్వాళ దేశంలోనే ఆదర్శంగా సగర్వంగా నిలిచింది. తెలంగాణ అభివృద్ధి పట్ల భవిష్యద్దర్శనం ఉన్న నేతగా కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నాయి, ఆదర్శంగా నిలుస్తున్నాయి.

చరిత్ర గమనంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఉద్యమ నెలబాలుడే. ఒక రాష్ట్ర చరిత్రను తీసుకుంటే పదిహేడేళ్ల ప్రాయం ఒక పార్టీకి, అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల కాలం పెద్దదేం కాదు. అయినా చిరకాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి సంక్షేమపథకాల రూపకల్పనలో తనదైన ముద్రను వేసింది. ఇతర రాష్ర్టాల ప్రభుత్వ ప్రతినిధులు మిషన్ కాకతీయ, భగీరథ పథకాల అధ్యయనం కోసం ఇక్కడికి రావటం ప్రజారంజక పాలనకు తార్కాణం. అయితే ఒక సామాజిక మార్పుకోసం ఉద్యమాన్ని నడుపటం, దానిలో విజయం సాధించటం కన్నా, సుపరిపాలన దిశగా సుస్థిర పాలన అందించటం క్లిష్టమైనది. కష్టసాధ్యమైనది.

రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి సుస్థిర పాలన ఎంతో అవసరం. సుస్థిర పాలన అందించటానికి పటిష్టమైన నిర్మాణాలు కలిగిన పార్టీ అత్యావశ్యకం. పటిష్టమైన పార్టీగా నిలబడటానికి పార్టీనాయకత్వం పాత్ర, విజన్ ఎంత ముఖ్యమో, అంతకన్నా ప్రాధాన్యం కలిగినది సుశిక్షితులైన పార్టీ యంత్రాంగం, కార్యకర్తల బలం ఎంతో అవసరం. దీనికోసం గ్రామ స్థాయినుంచి పార్టీని సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కార్యకర్తలతో పార్టీని బలోపేతం చేయాలి. త్యాగపూరితమైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయినుంచి అంచెలంచెలుగా తీర్చిదిద్దాలి. రాష్ట్రసాధన దాకా సాగిన ప్లీనరీలు, వార్షిక సభలకు, రాష్ట్రసాధన తర్వాత జరుపుకొనే సభలకు గుణాత్మక తేడా ఉన్నది. ఉద్యమకాలంలో ప్రజల్లో సమరోత్సహాన్ని నింపేందుకు ప్లీనరీలు, బహిరంగ సభలను వినియోగించుకుంటే, నేడు అవి రాష్ట్రసుస్థిరాభివృద్ధికి పథనిర్దేశం చేసేవిగా ఉండాలి. ఈ చారిత్రక అవసరాన్ని నెరవేర్చే క్రమంలో ఈ ప్లీనరీ పునాది వేయాలి.

478
Tags
 ,