HomeEditpage Articles

కులవృత్తుల రక్షణ, విముక్తి

Published: Tue,February 14, 2017 01:26 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

కులవృత్తులు శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. నూతన ఆవిష్కరణలతో ఆధునిక పారిశ్రామిక ఉత్పత్తి విధానం, మార్కెటింగ్, ప్రజాస్వామిక వ్యవస్థలు ఆధునిక విద్య ఆవశ్యకతను పెంచాయి. నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు, నూతన ఉపాధి అవకాశాలకు, నైపుణ్యాలకు దారివేశాయి. ఈ క్రమంలో కులవృత్తులు శిథిలమయ్యాయి.

కులవృత్తులు వదిలేసి ఆధునిక విద్య, ఆధునిక వైజ్ఞానిక రంగాలను అందిపుచ్చుకున్నవారే నేటి అభివృద్ధిని, సమస్థ అవకాశాలను అందుకొని మధ్య తరగతిగా, సంపన్నులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఉన్నతాధికారులుగా, నాయకులుగా ఎదుగుతున్నారు. అందువల్ల ఆయా కులవృత్తుల కుటుంబాల్లోని బాలబాలికలను ఆ వృత్తులకు పరిమితం చేయకుండా సమస్త నూతన అవకాశాలు అందుకోవడానికి కృషిచేయాలి.


ఈదశలో కూడా దేశంలో కులవృత్తులు సంప్రదాయిక వృత్తులుగా కొనసాగుతూ వస్తున్నా యి. అందువల్ల ఏకకాలంలో కుల వృత్తుల రక్షణ కులవృత్తుల నుంచి విముక్తి సాగాలి. ఇది కొందరికి వైరుధ్యంగా కనిపించవచ్చు. ఇప్పుడు ఆయా వృత్తులపై ఆధారపడిన వారికి నైపుణ్యాల అభివృద్ధి, ద్విగుణీకృత ఉత్పత్తి, సంపద ఉత్పత్తి ఒక లక్ష్యం. యువతరాలు, భవిష్యత్తరాలు ఆధునిక అభివృద్ధిని, విద్య, వైజ్ఞానిక రంగాల ద్వారా సమస్త రంగాల్లో ఎదుగడానికి కేజీ టు పీజీ రెసిడెన్షియల్ ఉచిత విద్య ద్వారా ఆయా కులవృత్తుల నుంచి విముక్తి అంతిమ లక్ష్యం. ఒకటి వర్తమాన అవసరాలు తీర్చుతుంది. మరొకటి భవిష్యత్ తరాలను నిర్మిస్తుంది.

ఇలా ఏకకాలంలో కులవృత్తుల రక్షణ, కులవృత్తుల అభివృద్ధి, కులవృత్తుల నుంచి విముక్తి ముందుకు సాగడాన్ని తెలంగాణ ప్రభుత్వం కృషిచేయడం గమనించవచ్చు. 1990లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఉత్పత్తి విధానానికి వ్యతిరేకంగా స్మాల్ ఈజ్ బ్యూటీ అని ఉద్యమాలు ముందుకొచ్చాయి. దేశంలో మారోజు వీరన్న వంటి సామాజిక ఉద్యమకారులు కులవృత్తులకు సంబంధించిన పరిశ్రమలన్నీ ఆయా వృత్తి కులాల వారికే చెందాలని చెప్పుల పరిశ్రమ శతాబ్దాలుగా చెప్పులు చేసి న వారికే కేటాయించాలని.. ఇలా అన్ని కులాలకు సంబంధించిన ఆధునిక పరిశ్రమలన్నీ ఆయా కులాల వారికే చెందాలని, హక్కుభుక్తం కావాలని ఉద్యమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ క్రమం ప్రారంభమైందనిపిస్తున్నది.

కులవృత్తులకు ప్రత్యేకంగా నైపుణ్యాల అభివృద్ధి కోసం, శిక్షణ కోసం ఆధునిక విద్యా, శిక్షణా రంగాల్లో ప్రత్యేకంగా కోర్సులంటూ పెద్దగా ఉం డేవి కావు. కులం, కుటుంబం, వారసత్వం ప్రాతిపదికగా చిన్నప్పటినుంచి చూసి, విని, ప్రత్యక్షంగా పనిచేస్తూ నేర్చుకోవడం కొనసాగుతూ వచ్చింది. కాలక్రమంలో కొన్ని వృత్తిశిక్షణా కోర్సులు ప్రారంభించడం జరిగింది. ఆధునిక విజ్ఞానం వ్యవసాయంలోని కోళ్ళు, పశువుల పెం పకం, పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి, పత్తి, పట్టు, ఉన్ని, నేత ఉత్పత్తులు, భవన నిర్మాణం, చర్మ ఉత్పత్తులు, వడ్రంగం, ఇత్తడి, కంచు, ఇనుము, రాగి తదితర ఉత్పత్తుల విశ్వకర్మ ఉత్పత్తులు మొదలైన సమ స్థ ఉత్పత్తులు, సేవలు మార్కెటింగ్ అనేక మార్పులను అనివార్యం చేసింది. అధికోత్పత్తి లక్ష్యంగా సంప్రదాయ వృత్తులు కూడా అభివృద్ధి చెందక తప్పలేదు. నేతలో బట్టల మిల్లులు, పవర్‌లూవ్‌ులు ఇత్తడి, ఇనుము, వెండి, అల్యూమినియంలలో ప్రత్యేక భారీ పరిశ్రమలు; చర్మ ఉత్పత్తుల్లో భారీ పెట్టుబడులు, పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ వచ్చా యి. కాలక్రమంలో వ్యవసాయంలో, కోళ్ళ పెంపకంలో, పశువుల పెం పకంలో, పాల ఉత్పత్తుల్లో, మాంసం కోసం పెంచే కోళ్ళు, మేకలు, గొర్రెలు, పందులు మొదలైన వాటి పెంపకంలో కూడా అనేక మార్పు లు చోటు చేసుకున్నాయి.

ఆధునిక సమాజంలో పేదరికానికి కారణాలను వర్గీకరించడం అవసరం. అప్పుడే పేదరికం నిర్మూలించి, వారి వృత్తి, ఉపాధి నైపుణ్యాల ను పెంచడం సాధ్యపడుతుంది. సంపద పెంచినప్పుడే సంపద పంపిణీ చేయవచ్చు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో చాలామంది విద్యావంతు లు, ట్రేడు యూనియన్ ఉద్యమకారులు సంపద పంపిణీ గురించి, జీతభత్యాల పెంపుదల గురించి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేస్తుంటారు. ప్రజలను కదిలిస్తుంటారు. సంపద, పెంపుదల, ఉత్పత్తి నైపుణ్యాల పెంపుదల, మార్కెటింగ్ నైపుణ్యాల పెంపుదల ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ పెంపుదల ఆవశ్యకతను పట్టించుకున్నప్పుడే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. పేదరికం అనేక రకాలు. పని లేకపోవడం ద్వారా పేదరికం.. పనిచేయకపోవడం ద్వారా పేదరికం.. పనిలో, ఉత్పత్తిలో గిట్టుబాటు లేకపోవడం ద్వారా పేదరికం.. తన సేవలను, ఉత్పత్తులను, తనకు తాను కూలీ ధర గిట్టుబాటు కోరుకొని సాధించుకునే అవకాశాలు లేకపోవడం వల్ల పేదరికం.. నైపుణ్యాలు చాలక ఉత్పత్తి సేవారంగాల్లో వెనుకబాటుతనం కారణంగా పేదరికం.. ఉదాహరణకు ఆదివాసులు మొదలుకొని ఎన్నో కులాలు ఉత్పత్తి నైపుణ్యాలు పెరుగక పోవడం వల్ల పేదరికంలో మగ్గుతున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి వల్ల కొందరు ఆధునిక ఉన్నత విద్య, ఉపాధి కరువై పేదరికంలోకి నెట్టివేయబడటం.. మరికొందరు వారి శ్రమశక్తి, అదనపు పరాయీకరించబ డి, ఇతరులకు లాభాలు సౌకర్యాలు సమకూరుస్తూ, తాము పేదలుగా ఉండిపోవడం.. వీటన్నిటిలో కొందరు పేదరికానికి ఈ చివరిదొక్కటే కారణమని ప్రచారం చేస్తుంటారు. ఇది తప్పుడు ప్రచారం. ప్రజలను తప్పుదారి పట్టించడం.

కొన్నిరంగాల్లో తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ సంపద ఉత్పత్తి సాధ్యమే. ఉదాహరణకు పశువుల పెంపకం, పాల ఉత్పత్తులు, మాం సం ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, కూరగాయలు మొదలైనవి పల్లెల్లో సంప్రదాయిక కులవృత్తుల్లో భాగంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటిద్వారా జీవన ప్రమాణాల పెరుగుదలకు అనుకూలంగా గిట్టుబాటు ధర ఉండటంతో పాటు అధికోత్పత్తికి సం బంధించిన వంగడాల సరఫరా, పరిశోధనలు అవసరం. వీటన్నిటిని ఒక సమన్వయంలో మేళవిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రజలు వలస వెళ్లకుండా ఉన్నచోటనే, ఉన్న ఊర్లోనే, ఉన్న వృత్తుల్లోనే ఎదుగడానికి అనువుగా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. చేపల పెంపకంలో కొన్ని కులాలు మాకంటే మాకని సంఘర్షిస్తున్నాయి.

తెలంగాణ రుచులు ఉత్పత్తులు, మార్కెటింగ్ చేయడంలో అనేక కులాలవారు చేరుతున్నారు. సకినాలు, గారెలు, గరిజెలు, పొడి అటుకులు, గవ్వలు, లడ్డులు, కారప్పూస, బోంది, పకోడి, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, జొన్నరొట్టె, చేపల పులుసు, బిర్యానీ, సర్వపిండి, బక్షాలు, మాంసం పచ్చ ళ్ళు, రకరకాల శాఖాహార పచ్చళ్ళు మొదలైన ఉత్పత్తులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నా యి. వ్యవసాయోత్పత్తులు హైబ్రేడైజేషన్‌తో గ్రీన్ రెవెల్యూషన్ వేగవంతమైంది. పశువుల పెంపకం, వాటి సామర్థ్యం పెంచడంతో పాల విప్లవం వేగవంతమైంది. కోళ్ళ, కోడిగుడ్ల ఉత్పత్తుల్లో కోళ్ళ ఫారాలు పెరుగుతూ వచ్చా యి. మాంసం ఉత్పత్తుల్లో సీమ పందుల పెం పకం పెరిగింది. గొర్రెలు, మేకలు, చేపల ఉత్పత్తుల రంగంలో ఇలాంటి భారీ ఉత్పత్తులు, హైబ్రీడ్ ఉత్పత్తులు, మార్కెటింగ్ బాగా తక్కు వ. ఇటీవల వీటి ఉత్పత్తుల ఆవశ్యకతను గుర్తించడం జరిగింది. ఇందులో ఉపాధి అవకాశాలతో పాటు, గిట్టుబాటు ధర పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాంసం, పాలు మొదలైన ఉత్పత్తులు ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణ దిగుమతి చేసుకుంటున్న లెక్కలు నిర్దిష్టంగా ఇటీవలే తెలిశాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకంలో, మాంసం ఉత్పత్తుల్లో, పాల ఉత్పత్తుల్లో భారీ ఉత్పత్తిని గ్రామీణ వికేంద్రీకరణ స్థాయిలో సాధించడానికి ప్రత్యక్షంగా పూనుకోవడం జరుగుతున్నది. తద్వారా ఆయా కులాల వాటికోసం పోటీ పడుతున్నాయి.

అయితే కొన్నివృత్తులు కాలం తీరిపోతున్నాయి. వెదురుబొంగు నారతో బుట్టలు అల్లడం, తడికలు అల్లడం, మట్టితో కుండలు చేయ డం, చర్మం చదును చేయడం వంటి సంప్రదాయిక వృత్తులు ఆధునిక ప్లాస్టిక్ అల్యూమినియం, భారీ చర్మశుద్ధి పరిశ్రమలు, ఉత్పత్తులు ఈ సంప్రదాయిక వృత్తులను వెనక్కి నెట్టాయి. ఇలా అనేక కులవృత్తులు కాలం తీరిపోతున్నాయి. కొన్నివృత్తులు పోటీ లేకుండా కొనసాగుతున్నాయి. మరికొన్ని కులవృత్తులు పోటీలో నిలబడి కొనసాగుతున్నాయి. వ్యవసాయం, పశుపోషణ, వడ్రంగం, కల్లుగీత, మేకలు, గొర్రెలు, చేప లు, పందులు పెంపకం మొదలైనవి పోటీలో నిలదొక్కుకొని కొనసాగుతున్నాయి. ఇలాంటి ఉత్పత్తుల్లో, కులవృత్తుల్లో, మార్కెటింగ్‌లో కూడా నూతన నైపుణ్యాలు అవసరం. అందువల్ల వ్యవసాయ విశ్వవిద్యాల యం మొదలైన కోర్సులు మొదలయ్యాయి. పల్లెల నుంచి వలసలు ఆగాలంటే స్థానిక ఉపాధి స్వయం పోషకంగా సాధించడం అవసరం. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు కావలసిన డబ్బు కన్నా, స్థానికంగా ఉన్నప్పుడు అందులో సగం సాధించుకున్నా సరిపోతుంది. అందువల్ల స్థానిక ఉపాధి కల్పన ఆవశ్యకత ఎంతో ఉంది. దీన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా కులవృత్తుల ఉత్పత్తులను, సేవలను, మార్కెటింగ్‌ను గ్రామీణ స్థాయిలో పెంచడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుకు తీసుకురావడం జరుగుతున్నది.

ఆయా కులవృత్తుల్లో గిట్టుబాటు పెరిగినప్పుడు ఆయా కులాలవారికి ప్రయోజనం లభించే విధంగా కృషి చేయడం అవసరం. అయితే ఎల్లకాలం ప్రజలు ఆయా కులవృత్తుల్లోనే ఉండిపోవాలని ఎవరూ ఆశించకూడదు. అలాంటి వెనుకబాటు చూపుతో ఉండేవారి మైండ్‌సెట్ మార్చడం అవసరం. కులవృత్తులు వదిలేసి ఆధునిక విద్య, ఆధునిక వైజ్ఞానిక రంగాలను అందిపుచ్చుకున్నవారే నేటి అభివృద్ధిని, సమస్థ అవకాశాలను అందుకొని మధ్య తరగతిగా, సంపన్నులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఉన్నతాధికారులుగా, నాయకులుగా ఎదుగుతున్నారు. అందువల్ల ఆయా కులవృత్తుల కుటుంబాల్లోని బాలబాలికలను ఆ వృత్తులకు పరిమితం చేయకుండా సమస్త నూతన అవకాశాలు అందుకోవడానికి కృషిచేయాలి. అందుకు కేజీ టు పీజీ ఉచిత రెసిడెన్షియల్ విద్య అందరికి అందుబాటులోకి తీసుకురావ డం అవసరం. ఇది గుర్తించి తెలంగాణ ప్రభు త్వం పలు పథకాలు అనేకవిధాలుగా ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండ టం హర్షణీయం ఈ క్రమంలో కులవృత్తులనుంచి విముక్తం చేయ డం అంతిమ లక్ష్యం. అప్పుడే అన్నికులాలు సమానంగా ఎదుగుతా యి. ఆధునిక అభివృద్ధిలో వాటాను అందుకుంటాయి.
Ramulu

953
Tags
 ,