HomeEditpage Articles

అభివృద్ధి తెచ్చిన మార్పు

Published: Wed,April 19, 2017 11:54 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

నాడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా ఉద్యమ పార్టీని భుజానికెత్తుకున్నారో, నేడు అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ప్రజలు గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుంటున్నారు. అదీ స్వచ్ఛందంగా, అచ్చం భీమవరం
గ్రామ ప్రజల వలెనే..

venu
ఆ గ్రామం కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీకి పెట్టనికోట. మరో పార్టీకి చోటులేదు. ఆ ఊరు ఆం ధ్రా ప్రాంతానికి కిలోమీటర్ దూరంలోపే ఉంట ది. అక్కడి సంస్కృతి, భాషా వ్యవహారాలు, జీవ న విధానం పూర్తిగా ఆంధ్రా వాసనలతో అడుగడుగునా నిండి ఉంటది. అది ఆ ఊరి ప్రజల తప్పుకాదు. ఆ పరిసరాలతో పాటు, పక్కనున్న ప్రాంత ప్రభావం. అం దుకే తెలంగాణ అంటే ఏంటో కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేవరకు చాలామందికి తెలియదు. 2009-2014 వరకు జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆ ఊరి భాగస్వామ్యం గురించి చెప్పాలంటే దాదాపు శూన్య మే. ఆ గ్రామమే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం. ఆ ఊరు దాటితే అడుగుపడేది ఆంధ్రాలోనే.

నాడు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో యావత్ తెలంగాణ అంతా ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్ పక్షాన నిలిచింది. ఏవో ఆంధ్రా కు సరిహద్దు గ్రామాలు, ప్రాంతాలు తప్ప మిగిలిన వారంతా ఉద్యమం కోసం గులాబీ దండుకు అండగా నిలిచిన వారే. కారణం రాష్ట్రం వస్తే, బతుకులు బాగుపడతాయని. ఆ ఆశే నిజమైంది. ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ సంకల్పంతో సిద్ధించింది.

ఇక.. తెలంగాణ ఉద్యమ విస్తృతిలో భాగంగా మధిర టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మెర రామ్మూర్తి కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గమంతా తిరుగుతూ భీమవరం కూడా వచ్చారు. ప్రత్యేక రాష్ట్రం గురిం చి కళాకారులతో ఆటాపాటా పాడించడమే కాకుండా రాష్ట్రం ఎందుకు రావాలో గులాబీ దళాన్ని ఎందుకు గుండెల్లో పెట్టుకోవాలో దాదాపు గం టన్నరసేపు ఉపన్యాసమిచ్చాడు. కట్ చేస్తే.. కేసీఆర్ గురించి, కారు పార్టీ గురించి కారు కూతలు కూశారే తప్ప, కనీస ఆలోచన చేసిన వారు కనిపించలేదు ఆ రోజు. ఎవరో ఒకరిద్దరు తప్ప, తెలంగాణ సరిహద్దు గ్రామం కావడంతో నాటి పరిస్థితులు కూడా అక్కడ అంతే ఉండేవి.

ఇదంతా ఇప్పుడెప్పుందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. భీమవరం గ్రామం ఆది నుంచి కరుడుగట్టిన కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్. కానీ ఇప్పుడా గ్రామంలో తొలిసారిగా గులాబీ జెండా గద్దె వెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రెండున్నరేండ్ల తర్వాత గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. గులాబీ తీర్థం పుచ్చుకోవాలని ఆ గ్రామ ప్రజలకు ఎవరు చెప్పారు. కారు పార్టీలోకి ఎందుకు రావాలనుకున్నారు. వారిని ఎవరైనా బలవంతం చేశారా అంటే, అదీ లేదు. ఇంకా చెప్పాలంటే స్వచ్ఛందంగా భుజాన సగర్వంగా గులాబీ జెండాను వేసుకున్నారు. అయితే గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి కారణాలేంటి? సాధారణంగా అధికార పార్టీలోకి వద్దన్నా జంప్ జీలానీలు ఎక్కువగా కనిపిస్తుంటారు. అధికారం ఉందనే ఒకే ఒక్క కారణం. ఇక్కడ కారు పార్టీలోకి వచ్చిన వారు అధికారం కోసమో, పనుల కోసమో, పదవుల కోసమో గులాబీ జెండా కప్పుకోలేదు. అంతా స్వచ్ఛందంగానే టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. నిన్నటిదాకా కమ్యూనిస్టు, కాంగ్రెస్ జెండాలను మోసిన ఆ భుజాలు ఇప్పుడు గులాబీ జెండాను మోస్తున్నాయి.
ఇక కేసీఆర్, గులాబీ జెండా వాసనలే తగలని భీమవరం గ్రామ ప్రజ లు గులాబీ జెండా కప్పుకోవడం.. అదీ స్వచ్ఛందంగా ముుందుకురావడానికి గల కారణాలు ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది.

ఆ గ్రామానికి చిన్న చెరువు, పెద్ద చెరువు రెండున్నాయి. తొలి ఏడాది మిషన్ కాకతీయ కింద చిన్న చెరువు పూడిక పూర్తయింది. మరుసటి ఏడాది పెద్దచెరువును కూడా మిషన్ కాకతీయ కింద పూడిక తీయాలని మంత్రి హరీశ్‌రావుకు అప్లికేషన్ పెట్టగానే నిమిషం కూడా ఆలోచించకుండా అనుమతులిచ్చేశారాయన. అంతే మిషన్ కాకతీయ-2 కింద పెద్ద చెరువు కూడా బాగుపడింది. మా చెరువులను బాగు చేయండని మొత్తుకున్నా వినని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలకు, అడగ్గానే అనుమతులిచ్చిన తెలంగాణ సర్కా రుకు తేడా ఏంటో ఇట్టే తెలిసివచ్చింది భీమవరం గ్రామ ప్రజలకు. వాస్తవానికి పెద్ద చెరువు కింద నాలుగేళ్లుగా పంట పండటం లేదు. రైతులంతా పెద్దచెరువు కింద భూములను బీళ్లుగానే ఉంచుతున్నారు. మిషన్ కాకతీ య కింద చెరువు బాగుపడటం, వానలతో నీళ్లు రావడంతో ఈ సారి రైతులు తమ భూమిని సాగు చేసుకున్నారు. ఎకరానికి 40 బస్తాల దిగుబడి వచ్చింది. ఏటా కనీసం పశువులు తాగేందుకు కూడా నీళ్లు రాని పరిస్థితి నుంచి ఏకంగా ఎకరానికి 40 బస్తాల ధాన్యం పండించేంతగా సమృద్ధిగా పెద్దచెరువుకు నీళ్లు వచ్చాయి.

చిన్న చెరువు కింద అదే పరిస్థితి. రెం డుసార్లు చెరువు నిండనిదే పంట పండదు. కానీ ఈసారి పూడిక తీతతో ఒక్కసారి చెరువు నిండితేనే పంట గ్యారంటీ అనే పరిస్థితి రెండేళ్లలోనే అక్కడి రైతులకు కనిపించింది. ఈ ఒక్క కారణమే ఆ ఊరి ప్రజల ఆలోచనల్లో మార్పునకు నాంది పలికింది. కాలం గడుస్తున్నకొద్దీ ఆ మార్పు వేగంగా కనిపిస్తున్న ది. చెరువుల బాగుతోపాటు ఊళ్లో 65 సంవత్సరాలు దాటి న అర్హులందరికీ ఇప్పుడు ఆస రా పింఛన్ లభిస్తున్నది. అలా గే మండల కేంద్రానికి డబుల్ రోడ్డు పూర్తయింది. చకచకా ఊళ్లో సిమెంట్ రోడ్లు పూర్తవుతున్నాయి. చూస్తుండగానే అంటే 60 ఏండ్లలో కనిపించని మార్పు రెండున్నరేళ్లలోనే కళ్లముందు కనిపిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇంకో వందేళ్లు గడిచినా రాని నిధులు, అభివృద్ధి ఈ రెండున్నరేండ్లలోనే భీమవరం గ్రామంలో కనిపించింది. కేసీఆర్ అంటే ఎవరో తెలియని స్థితినుంచి ఆయన పాలన బాగుందనే పరిస్థితి వచ్చింది. అందుకే ఎవ్వరూ అడుగకుండానే స్వచ్ఛందంగా గులాబీ కండువాను గుండెల్లో పెట్టుకోవాలని ఆ గ్రామ ప్రజలు భావించారు. తొలిసారిగా భీమవరం గ్రామ సెంటర్లో గులాబీ జెండా గద్దె వెలిసింది.

ఇది అరుదైన సందర్భం. ఇటువంటి విషయాన్ని అన్ని సమయాల్లో నూ, అన్ని వేదికలపైనా గులాబీ పెద్దలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్న ది. అధికారమో, వరాల మూటలో, ఇతర ఆశలను చూపో ప్రజలను, లీడర్లను తమవైపునకు తిప్పుకుంటారు పాలకులు. కానీ కేవలం అభివృద్ధి, పాలన చూసే ఇలా స్వచ్ఛందంగా గులాబీ తీర్థం పుచ్చుకోవడం అరుదైన విషయం. భీమవరం గ్రామం లాంటి ఊళ్లు రాష్ట్రంలో చాలా ఉండి ఉండవ చ్చు. పూర్తిగా ఆంధ్రా వాసనలతో, ఆ సంస్కృతి, భాషతో నిండిపోయిన భీమవరం గ్రామం ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటపడుతున్నది. కమ్యూనిస్టు, కాంగ్రెస్ జెండాలను భుజాలకెత్తుకున్నంత మాత్రాన ఊరికి ఉపయోగం లేదని, అభివృద్ధికి కేరాఫ్ కారు పార్టీయే నని గ్రామ ప్రజలు గుర్తించేరోజు వచ్చింది. దీన్ని ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వానిదే.నాడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా ఉద్యమ పార్టీని భుజానికెత్తుకున్నారో, నేడు అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ప్రజలు గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుంటున్నారు. అదీ స్వచ్ఛందంగా, అచ్చం భీమవరం గ్రామ ప్రజల వలెనే..

480
Tags
 ,