HomeEditpage Articles

అందరి సౌభాగ్యం కేసీఆర్ సందేశం

Published: Wed,April 19, 2017 12:00 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

తెరిజర్వేషన్ల పెంపును అట్టడుగువర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చటంతో పాటు సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయటంగా భావించవచ్చు. రిజర్వేషన్ల సమస్యను రాజకీయకోణంలో కాకుండా ఆర్థిక, సామాజిక కోణంలో చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి అంతటికీ గొప్ప సందేశం అందించారు.

లంగాణ అభివృద్ధి అంటే అన్నివర్గాల, కులాల అభివృద్ధి అని, అణగారినవర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం అంటే వారి భవిష్యత్తుకు బాటలు వేయటమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనుగుణంగానే వాల్మీకి బోయ ఉపకులాలను ఎస్టీలలో చేర్చి రిజర్వేషన్ ను 6 నుంచి 10 శాతానికి, ముస్లింల రిజర్వేషన్‌ను 4 నుంచి 12 శాతానికి పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్ పెంపు బిల్లు శాసనసభ, శాసన మండలిలో ఆమోదం పొందటం చరిత్రాత్మకమైనది.

వాల్మీకి బోయ ఉపకులాల వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వీరికి ప్రత్యేకమైన వృత్తి అంటూ ఏదీ లేదు. అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు. వీరిని ఎస్టీలలో చేర్చుతామని గతం లో ఎన్నో పార్టీలు హామీలు ఇచ్చాయి. ఆ హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ నిశ్చయంతో, నిబద్ధతతో ఈ వర్గాలను ఎస్టీలలో చేర్చి, ముస్లింల రిజర్వేషన్ శాతం కూడా పెంచి దేశంలోని మిగతా రాష్ర్టాలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. విప్లవాత్మకమైన, చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనీయులు. ఆయనకు వాల్మీకి బోయ ఉపకులాల తరఫున కృతజ్ఞతా వందనాలు.

వెనుకబడిన తరగతుల సంక్షేమం కోరి నూతన పథకాలు రూపొంది స్తున్న ఉద్యమనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, నిబద్ధత, ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారానే రాష్ట్ర ప్రజలకు తెలిసింది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఆయన వ్యవహరిస్తున్నారు. వెనుకబడిన తరగతులవారు ఉన్నత చదు వులు చదివి సమాజ నిర్మాణంలో ప్రభుత్వ వ్యవస్థలలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నారు. పరిశ్రమల స్థాపనలో భాగస్వాములు కావా లని, నిపుణులుగా ఎదుగాలని తద్వారా కుల, మత భావనలు తొలిగిపో తాయని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు.

రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న బీసీలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ, వారి మేధోసంపత్తిని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అందులో భాగంగానే గత ప్రభుత్వాలకు భిన్నంగా అత్యంత వెనుకబడిన తరగతుల భావనకు అంకురార్పణ జరి గింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి రాష్ట్ర బీసీ ప్రజ ల అభిమానాన్ని చూరగొన్నది.
కులవృత్తులు ఉన్నవారిని, లేనివారిని ఆయా వృత్తులకు మాత్రమే పరి మితం చేయకుండా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా చైతన్యపరుచాలె. మారుతున్న సమాజానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి అందించి, ప్రతి మనిషి ఆర్థికంగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచే స్తున్నది. దానికి అనుగుణంగా పలు పథకాలను ప్రవేశపెడుతూ ముందు కుసాగుతున్నది.
2014 ఆగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్నివర్గాలు అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక ప్రణాళికను రచించింది. ఇందులో భాగంగా నే అన్నికులాలకు, వర్గాలకు నిధులు కేటాయిస్తూ వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజున సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక కులాలకు అసలు కులవృత్తే లేదనే విషయం వెల్లడైంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఎల్లాపి కుటుంబాల సంఖ్య 2650, బోయ కుటుంబాల సంఖ్య 2698, వాల్మీకి కుటుంబాల సంఖ్య 696, బీదర్ కుటుంబాల సంఖ్య 46, కిరాతక కుటుంబాల సంఖ్య 16, నిషాది కుటుంబాల సంఖ్య 12గా ఉన్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. పై ఉప కులాల మొత్తం కుటుంబాల సంఖ్య 5518. వీరందరికి ప్రత్యేకంగా ఎలాంటి కులవృత్తి లేదు. వీరంతా తమ జీవనోపాధి కోసం రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు.

వాల్మీకి బోయ, బీదర్, ఎల్లాపి, యల్లాపు, నిషాది, పెద్దబోయ తదిత ర తెగలన్నీ బోయకులంలోని ఉపకులాలు. పెత్తందారులు, రాజులకు వీరంతా పల్లకీలు మోసేవారు. వారి ఇళ్లల్లో పనులు చేస్తూ జీవనం సాగిం చేవారు. తెలంగాణలో వాల్మీకి కులస్తులు, ఎల్లాపి కులస్తులు, రాయలసీమలో బోయలుగా పిలువబడుతున్నారు.ఎల్లాపి కులస్తులు శారీరక దారు ఢ్యం కలిగి ఉండటం వల్ల రాజులు, సంస్థానాధీశులు తమ ఆస్థానాలలో సేవకులుగా నియమించుకునేవారు. ఊరిని కాపలా కాస్తూ ఊరి జనం, సంస్థానాధీశులు ఇచ్చే డబ్బుతో ఎల్లాపి కులస్తులు బతికేవారు. ఈ కులం వారు ఇతర వెనుకబడిన కులవృతుల వారితో, సేవాకులాల వారితో, సం స్థానధీశులు, పాలకులతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని క్రమంగా సంస్కృతీకరించబడ్డారు.

బోయలో భాగమైన ఎల్లాపి కులస్తులు అధికంగా తెలంగాణలో స్థిరపడ్డారు. వీరు బొగ్గుబాయి కార్మికులుగా, బీడీ కార్మికులు గా, భవన నిర్మాణ కార్మికులుగా, చిన్న వ్యవసాయదారులుగా, వ్యవసా య కార్మికులుగా, షోలాపూర్, భీవండి, ముంబై తదితర ప్రాంతాల్లో మిల్లు కార్మికులుగా ఉన్నారు. అలాగే సౌదీ, దుబాయ్‌లాంటి దేశాల్లో వివి ధరకాల వృత్తి కార్మికులుగా జీవనం గడుపుతున్నారు. ఈ కులస్తులు ప్రత్యే క వృత్తిలేక అత్యంత వెనుకబడి, ఉపాధి లేక పేదరికంలో మగ్గుతున్నారు. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ సేవారంగంలో, చిన్న చిన్న ఉద్యోగులుగా స్థిరపడటం వల్ల వారి పిల్లలు ఇప్పుడిప్పుడే మొదటితరం విద్యాధికులవుతున్నారు. తెలంగాణలో ఉన్న సుమారు 3 లక్షల 50 వేల బోయ కులస్తుల్లో భాగమైన ఎల్లాపి కులస్తులు సుమారు 40 వేలకు పైగా ఉన్నా రు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో వీరి పాత్ర మరువలేనిది. ప్రస్తుతం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అన్నివర్గాల అభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉన్నది. అందువల్ల వీరి ఆర్థిక, రాజకీ య, సామాజిక ఎదుగుదలకు ప్రత్యేక దృష్టిపెడుతారని ఆశిస్తున్నారు.

అత్యంత వెనుకబడిన కులాలలో 56 సంచార జాతుల వారికి ప్రభు త్వం పెద్దపీట వేయడం అంటే పేదలకు సేవ చేయాలనే సీఎం బలీయమై న సంకల్పానికి దర్పణం. అత్యంత వెనుకబడిన 106 కులాల్లో భాగమైన ఎటువంటి కులవృత్తిలేని వాల్మీకి బోయ ఎల్లాపి కులస్తుల జీవన స్థితుల ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. వారికి చేయూతనిచ్చి వివిధ పనుల్లో, వృత్తుల్లో శిక్షణానైపుణ్యాన్ని అందిస్తున్నది. అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ నుంచి నిధులను కేటాయించి ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా చేయూతనందించాల్సిన అవసరం ఉన్నది.
ఈ రిజర్వేషన్ల పెంపును అట్టడుగువర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చటంతో పాటు సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయటంగా భావించవచ్చు. రిజర్వేషన్ల సమస్యను రాజకీయకోణంలో కాకుండా ఆర్థి క, సామాజిక కోణంలో చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి అంత టికీ గొప్ప సందేశం అందించారు.

712
Tags
 ,