కొత్త పుస్తకాలు

Mon,September 26, 2016 01:14 AM

తెలంగాణ చరిత్ర-సంస్కృతి వారసత్వం


(చారిత్రక పూర్వయుగం నుండి ఆధునిక యుగం 2014 జూన్ 2 వరకు)
ఇన్నాళ్లు మన చరిత్ర మనకు తెలియకుండానే మనం గడి పాం. కనుక మన చరిత్ర తెలు సుకోకుంటే భవి ష్యత్తును నిర్మించుకోవడం అసాధ్యం. కాబట్టి పెద్దలు చెప్పి నట్లు మన జ్ఞాపకాల దొంతర లను కదిలించి మనచరిత్ర మూలా లు తెలుసుకోవాలి. ఆ అవస రం తీర్చే క్రమంలో చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం. చరిత్రలో ఎంతో కాంతులీనిన మన చరిత్రలోకి తొంగి చూద్దాం. మన వైభవాన్ని తెలు సుకుందాం.


పర్ఫెక్ట్-27(అనువాద కథలు)


ముక్తవరం పార్థసారథి సీనియర్ రచయిత. ఎన్నో నవలలు, కథలు, అనువాద రచనలు చేశారు. సమకాలీన సమాజంలోని మనిషి పోకడలు, మానసిక ధోరణులు, వికారాలను తెలియజేస్తూ అనేక రచనలు చేశారు. మానవీయ మనిషి అనుభవిస్తున్న మానసిక సంఘర్షణలను, తన్లాటను వ్యక్తీకరించే కథలు ఇవి.


గెలిచి నిలిచిన గళం


అధికారం కోసం ఏమైనా చేస్తారు దోపిడీ దారులు. పదవీ వ్యామోహంతో అమాయకుల్ని బలిచేస్తూ అందలమెక్కే నైజం వలసవాదులది. ఈ వలసవాద వివక్షా అణిచివేతలనుంచి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ ఎంతటి త్యాగనిరతితో పోరాడిందో, ఎన్ని బలిదానాలు చేసిందో రచయిత తన కవత్వంలో చెప్పారు.


రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం కోసం కథా సంపుటాలకు ఆహ్వానం


2016 సంవత్సరానికి గాను రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కా రం ఎంపిక కోసం 2014,15,16 సంవత్సరాల్లో ప్రచురించిన తెలుగు కథా సంపుటాలు 5 ప్రతులను 2016 అక్టోబర్ 31లోపు పంపించాల్సిందిగా రచయితలను కోరుతున్నాం. అవార్డుగా 15వేల రూపాయల నగ దు, జ్ఞాపిక, పురస్కార పత్రం రంగినేని ట్రస్టు ఆధ్వర్యంలో సిరిసిల్లలో జనవరి 2017లో నిర్వహించే కార్యక్రమంలో అందజేయబడుతాయి. కథా సంపుటాలు పంపాల్సిన చిరునామా: అధ్యక్షులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం-2016, రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్, బాలాజి నగర్, సిరిసిల్ల-505301, కరీంనగర్ జిల్లా.


దేశీయ పటాల ప్రదర్శన- కథాగానం (మూడు రోజుల జాతీయ సదస్సు)


హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని దళిత-ఆదివాసీ అధ్యయన కేంద్రం వ్యవస్థాపక ఆచార్యులు ప్రొఫెసర్ వి. కృష్ణ నేతృత్వంలో 2016 సెప్టెంబర్ 26,27,28 తేదీల్లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని డీఎస్‌టీ ఆడిటోరియంలో మూడు రోజుల జాతీయ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో 12 పటాల ప్రదర్శకులు, కథాగాయకులు తమ కళారూపాలను ప్రదర్శిస్తారు. ప్రదర్శనలను ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సమన్వయ పరుస్తారు.

సదస్సును తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు. గౌరవ అతిథులుగా ప్రముఖ మరాఠీ రచయిత లక్ష్మణ్ గైక్వాడ్, తెలంగాణ మ్యూజియంలు, పురావస్తుశాఖ డైరెక్టర్ ఎన్‌ఆర్ విశాలాక్షి హాజరవుతారు. ప్రొఫెసర్ మొదలి నాగభూషణశర్మ ప్రారంభ సభలో కీలకోపన్యాసం చేస్తారు. అలాగే ఈ సదస్సులో ప్రముఖ హిందీ ఆదివాసీ కథా రచయిత్రి నిర్మలా పుతుల్, గుజరాత్ ఆదివాసీ అకాడమి పూర్వ అధ్యక్షులు డాక్టర్ భగవాన్ దాస్ పటేల్, ఆదివాసీ రచయిత హరిరామ్ మీనా, పరిశోధకుడు, చిత్రకారుడు డాక్టర్ మదన్ మీనా పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.

2285
Tags

More News

VIRAL NEWS