స్త్రీల అస్తిత్వ సాధికారత పునర్నిర్వచనం విముక్త..

Mon,December 21, 2015 12:10 AM

పౌరాణిక పాత్రల్లోని ఉదాత్తత, సహనశీలత, సంపూర్ణత వారి జీవితాల్లోని ఆయా సందర్భాల్లో వారనుభవించిన మౌన సంఘర్షణలోంచి రూపుదిద్దుకున్నవే! సామాజిక కట్టుబాట్లు, నైతిక, నిర్దేశిక
సూత్రాలననుసరించి పితృస్వామ్య ఆధారిత కుటుంబ వ్యవస్థ తన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఆదేశిక సూత్రాల అంతర్వాహినియే ఆయా పాత్రల గుణగణాలు. ఆ విధంగా, స్త్రీల అణచివేత, లింగ వివక్ష కొంతమంది చేతుల్లో రూపుదిద్దుకున్న మార్గదర్శక సూత్రాల ముసుగులో చాపకిందినీరులా సమాజాన్నంతా విస్తరించి, పితృస్వామ్య వ్యవస్థను పదిలపరిచి, ఓ నిర్బేధ్యమైన గోడను రక్షణగా ఏర్పరుచుకొంది.

ధర్మ సంరక్షణ యథాస్థితివాదం అయితే న్యాయపోరాటం ప్రగతిశీల తిరుగుబాటుకేంద్ర సాహిత్య అకాడెమీ ప్రముఖ తెలుగు ఫెమినిస్టు రచయిత్రి ఓల్గా కథల సంపుటి విముక్తకు 2015 సంవత్సరానికి సాహితీ అవార్డు ప్రకటించి తన ప్రతిష్ఠను మరోసారి నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు యాభై నాలుగు మంది తెలుగు రచయితలను ఈ అవార్డు వరిస్తే, అందులో రచయిత్రులలో ఓల్గా ఐదవవారు. అంతకుముందు అబ్బూరి ఛాయాదేవి, ఐ.సరస్వతీదేవి, మాలతీ చందూర్, కాత్యాయని విద్మహే ఈ అవార్డునందుకున్నారు. ఓల్గాకు ఈ గౌరవం దక్కడం రచయిత్రులందరికీ దక్కిన గౌరవంగా భావించొచ్చు.

ఓల్గా అనే కలం పేరుతో రాసే ఈ రచయిత్రి అసలు పేరు లలితకుమారి; ఊరు గుంటూరు. తెలుగు అధ్యాపకురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఓల్గా బహుముఖ ప్రజ్ఞాశాలి. రచనా వ్యాసంగంలో కథ, నవల, విమర్శనా వ్యాసాలు, అనువాదం మున్నగు ప్రక్రియల్లో మాత్రమే గాక, సినిమాలకూ, బుల్లితెర సీరియల్స్‌కు స్క్రిప్టు రైటర్‌గా పనిచేసి, తనను తాను నిరూపించుకున్న ఓ గొప్ప కవయిత్రి. అంతేకాక వంటింటి మసి అనే స్త్రీవాద ప్రచురణ సంస్థ సంపాదక వర్గంలో ఒకరిగా, అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్‌కు ఫౌండర్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ముఖ్యంగా, అస్మిత సంస్థ ద్వారా, ఒక ఉద్యమకర్తగా, స్త్రీల అభ్యుదయమే లక్ష్యంగా పనిచేసిన తీరు ఆమె సిద్ధాంతాల పట్ల ఆమెకున్నా నిబద్ధతను తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మధ్య నిషేధం కోసం ఆమె చేసిన ఉద్యమం ఎంతో కీలకమైంది. ఇలాంటి అనేక సామాజిక, రాజకీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె సమాజ మార్పుకు తనవంతు పాత్ర పోషించాలని కలలు గన్నాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రముఖ రచయితలు చలం, కొడవటిగంటి కుటుంబరావుగార్ల ప్రభావం ఆమెపై ఉన్నప్పటికీ, తన విభిన్నశైలితో తెలుగు సాహిత్యంలో తనకంటూ ఓ సముచిత స్థానం సంపాదించుకున్నారు. ఆమె రచనల్లోని పాత్రలన్నీ తరతరాలుగా లింగవివక్ష కారణంగా, అన్యాయానికి గురవుతున్నా స్త్రీలను ప్రతిబింబిస్తాయి. సహజ, స్వేచ్ఛ, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, ఆకాశంలో సగం గులాబీలు ఆమె రాసిన నవలలు. ఇవేగాక ఇంకా రాజకీయ కథలు, ప్రయోగం, భిన్న సందర్భాలు, మృణ్మయ నాదం ఇతర కథా సంకలనాలు. ఆమె సంపాదకత్వంలో అనేక పుస్తకాలు ప్రచురణకు నోచుకున్నాయి, అనువాదాలు, విమర్శనా వ్యాసాలు సంకలనాలు కూడా ఆమె స్థానాన్ని పదిలపరిచాయి.

విముక్త సంకలనంలోని కథలు రామాయణ కథా నేపథ్యం లో సీత సూత్రధారిగా నడిచేవి. పురాణ కథలను తీసుకొని స్త్రీవాద దృక్కోణంతో మాత్రమే గాక, ఓ నూతన ఒరవడితో తిరగరాయడమనేది అద్భుత విషయమైతే ఆ అద్భుతాన్ని తనదైన శైలిలో అలతి అలతి పదాలతో సరళంగా, క్లుప్తంగా రాయడం ఓల్గా గారికే చెల్లింది. ఈ కథలన్నీ కూడా చదువరుల హృదయాలను హత్తుకొని, ఏకబిగిన చదివిస్తాయి.
పౌరాణిక పాత్రల్లోని ఉదాత్తత, సహనశీలత, సంపూర్ణత వారి జీవితాల్లోని ఆయా సందర్భాల్లో వారనుభవించిన మౌన సంఘర్షణ లోంచి రూపుదిద్దుకున్నవే! సామాజిక కట్టుబాట్లు, నైతిక, నిర్దేశిక సూత్రాలననుసరించి పితృస్వామ్య ఆధారిత కుటుంబ వ్యవస్థ తన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఆదేశిక సూత్రా ల అంతర్వాహినియే ఆయా పాత్రల గుణగణాలు.

ఆ విధంగా, స్త్రీల అణచివేత, లింగ వివక్ష కొంతమంది చేతుల్లో రూపుదిద్దుకున్న మార్గదర్శక సూత్రాల ముసుగులో చాపకిందినీరులా సమాజాన్నంతా విస్తరించి, పితృస్వామ్య వ్యవస్థను పదిలపరిచి, ఓ నిర్బేధ్యమైన గోడను రక్షణగా ఏర్పరుచుకొంది. అయితే, ధర్మరక్షకులు పురాణాలను తమ భావజాలవ్యాప్తికి ఉపయోగించుకుం టే, దళిత, స్రీ వాద రచయితలు పురాణల్లోని పాత్రల సంఘర్షణలను సమకాలీన సమస్యలతో అన్వయించి ప్రజల్లో తమ వాద న బలంగా విన్పించగలుగుతున్నారు. కళాకారులూ ఇందుకు మినహాయింపు కాదు.

ధర్మాలు, సంప్రదాయాలు, ఆచారాలు మార్పునకు గురవుతూనే ఉంటాయి. కాలనుగతంగా ఒకప్పటి ధర్మాలు ఇప్పుడు అర్థరహితమైనవి, అన్యాయమైనవి అని చెప్పడానికి చాలామంది పురాణ కథలను తిరగరాస్తున్నారు, పునర్‌వ్యాఖ్యానిస్తున్నారు, పునర్నిర్వచిస్తున్నారు.పురాణ పాత్రల ద్వారా ఇప్పటి నీతులపై లోకరీతులపై విమర్శపెడుతూ మానవుడు ఈ సంకుచిత సరిహద్దులను, అహంభావాలనూ దాటాలనే స్పృహ కలిగించాలనే ధ్యేయంతో ఈ కథలను ఓల్గా రాసినట్టన్పిస్తుంది. ఈ పుస్తకానికి ముందుమాటగా రాసిన తన మాటల్లోనే ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా.

ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ, అవమానాలకూ, హింసలకూ గురై వాటినధిగమించి వేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో- తమను హింసించే భర్తల నుంచి విము క్తం కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తూనే, అసహ్యించుకుంటూనే వారిని గట్టిగా పట్టుకొనే స్త్రీలు ద్వేషంతో తమను తాము హింసించుకోవడం అలవాటైన స్త్రీలు- ఆ స్త్రీల కోసం ఈ కథలు మన యుద్ధానికి మనమే కత్తిని పట్టాలని, మనల్ని మనమే - అనే నమ్మకాన్ని ఇందులోని నాలుగు కథల్లో ఐదు స్త్రీ పాత్ర లు- సీత, శూర్పణఖ, అహల్య, రేణుక, ఊర్మిళను ఓ నవీన పంథాలో పునరుజ్జీవింపజేసి, స్త్రీల అస్తిత్వ సాధికారతకు కొత్త సొబగులద్దిన ఓల్గాకు ఈ పురస్కారం దక్కడం ఎంతైనా సమయోచితం; సమర్థనీయం. డాక్టర్ యు.వింధ్య, డాక్టర్ యు. సుధాకర్ ముందుమాట రాసిన ఈ విముక్త కథా సంకలనానికి, కవి సీతారాం గారు చివర రాసిన వ్యాఖ్యానం వన్నె తెచ్చింది.

నిజానికి, ఇందులోని ప్రతీ కథా ఓ కొత్త అనుభవం, అనుభూతి చదువరుల ముందుంచుతుంది. మనకు తెలియని భిన్న కోణాల్లోంచి ఓ సత్యం మన ముందు సాక్షాత్కరిస్తుంది. పితృస్వామ్య భావజాలానికి బలై, తమ అనుభవాల్లోంచి సంఘర్షించి, రాటుదేలి, తమకోసం తాముగా, తమను తామే ఓ నవీన పంథాలో నూతనంగా, ప్రత్యేకంగా ఆవిష్కరించుకోవడం ఈ కథల్లోని పాత్రల వైశిష్ట్యం.సమాగమం కథలో, రాముడు త్యజించిన పిదప, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో తన కుమారులతో నివసిస్తున్న సీత, అనుకోని పరిస్థితుల్లో రామలక్ష్మణులచే చెవులు కోయబడి కురూపిగా మారిన శూర్పణఖను కలుసుకుంటుంది. తన భర్త హింసకు గురిచేసి కురూపిని చేసిన శూర్పణఖను సీత కలవడమేంటి అని అన్పించొచ్చు. ఇందులో ఏ రాజకీయమూ లేదు. స్త్రీల మధ్య ఇలాంటి సహకారం ఉండాలని బలంగా కోరుకునే స్త్రీ వాద రచయిత్రి అయిన ఓల్గాకు స్త్రీల మధ్య ఇలాంటి సహకారం ఆలంబన అనేవి ప్రియమైన భావనలు.

విముక్త కథలో, రాముడితో పద్నాలుగేళ్ల వనవాసానికి అతని వెంట వెళ్తున్న తన భర్త లక్ష్మణుడు తనకు మాట మాత్రం చెప్పకుండా వెళ్లడం ఊర్మిళ అహాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. అం దుకే ఆ పద్నాలుగేళ్ళు ఆమె తనలోకి తాను తొంగిచూసుకుంటూ నే ఉంటుంది. నా చుట్టూ ఉన్నవారితో నాకున్న సంబంధంలో ని అధికారాన్ని గుర్తించినపుడు నాకు సమస్తం తెలిసిన భావన కలిగింది. సర్వ దుఃఖాలకుమూలం అధికారం- ఈ అధికారం మనం పొందాలి. ఒదులుకోవాలి. నేను ఎవరి అధికారానికీ లొంగను. నా అధికారంతో ఎవరినీ బంధించను. అపుడు నన్ను నేను విముక్తం చేసుకున్న భావన నాలో ఇక ఒకే ఆనందం. గొప్ప శాంతి. ఎంతో ప్రేమ, అందరి మీద జాలి.

పాపం ఈ అధికార చట్రాలలో పడి ఎలా నలుగుతున్నారో గదా విముక్తం అయ్యే దారి తెలియక... ఊర్మిళ ద్వారా సీతతో చెప్పించిన ఈ మాటలద్వారా ఓల్గా స్త్రీలకు సాధికారత అవసరం చెప్పకనే చెప్పారు. ప్రతీ పరీక్షా నిన్ను రాముడి నుంచి విముక్తం చెయ్యడానికే. నిన్ను నీకు దక్కించడానికే. యుద్ధం చెయ్యి. తపస్సు చెయ్యి. లోపలికి చూడు నీవనే యథార్థం కనపడేదాకా చూడు ఊర్మిళ సీతతో అనే ఈ మాటలు సీతకు ధైర్యాన్ని ైస్థెర్యాన్ని ఇచ్చి, తానెదుర్కోబోయే కష్టాలకు, వేదనలకు సంసిద్ధం చేసినట్టన్పిస్తుంది. ఆ మాటకొస్తే మిగతా కథల్లో రేణుక ద్వారా పాతివ్రత్యం అనే సైకత కుంభం గూర్చి, అహల్య ద్వారా తన జీవితంలో రాబో యే సంఘటనలకు, విచారణలకు ముందుగానే పాఠాలు నేర్చుకోవడం మనం చూస్తాం. మిగతా పాత్రల ద్వారా కథను నేర్పుగా అనుసంధానించి, సీత లోపల ఒక చైతన్యం, ఒక ఎరుక కల్గిస్తుం ది ఓల్గా.

ఈ నాలుగు కథలతో పాటు, బంధితుడు అనే శ్రీరాముడి దుఃఖాన్ని తెలిపే, అతని వివేచనను తెలిపే అంశం కూడా జోడింపబడింది. నా జీవితంలో సీతతో హాయిగా గడిపిన సమయం కైకేయి వరప్రసాదితం. ఆమెకు నేనెంతో ఋణపడి ఉన్నాను రాముడి ఈ మాటలు చదువరులకు ఊరటనిస్తాయి. పురాణాల్లో విలన్‌గా చూపబడిన కైకేయికి ఓ Positive touch ఇవ్వడం ద్వారా ఓల్గా ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. నేనూ, సీతా వేరు కాదు లక్ష్మణా... ఆమె భూపుత్రి సమర్థురాలు. సుపుత్రులను కని పాపల పెంపకంతో మాధుర్యాన్ని ఆసాంతం అనుభవిస్తుంది. నేను అసమర్థుడిని. నా పురుషోత్తమత్వమే నా అసమర్థత. ఈ రాజ్యాధికారంతో నేను నా మీది అధికారాన్ని పోగొట్టుకున్నాను. నా సీతను పోగొట్టుకున్నాను. నా పుత్రుల దూరం చేసుకున్నాను. ఈ గుర్తింపు, ఈ ఎరుక స్త్రీలపై అధికారం కలిగివున్న పురుషులకు కలగవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

1199
Tags

More News

VIRAL NEWS