వృద్ధి చెందాలే తప్ప ద్వేషంతగదు


Tue,January 22, 2019 12:56 AM

తమకేం అవసరమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కోరుకోవాలి, సాధించుకోవాలి. 16-20 శాతం బీసీ రిజర్వేషన్లు ఇంకా ఖాళీగా ఉండి ఇతరుల పాలవుతున్నాయి. ఈ విషయంలో ఏమీ చేయకుం డా ఇతర పేదలకు 10 శాతం ఓపెన్ కాంపిటీషన్‌లో కొంత రిజర్వేషన్ ప్రవేశపెడితే వ్యతిరేకించడం దేనికి?.పాలితులుగా, డిపెండెంట్లుగా, ఆశ్రితులుగా ఆలోచించే విధానం నుంచి పాలకులుగా ఆలోచించే విధానంలోకి మలుపు తిరిగినప్పుడే ఎంపవర్‌మెంట్ ధ్యమవుతుంది. పూర్ డాడ్, రిచ్ డాడ్ అనే పుస్తకంలో పేర్కొన్నట్టు రిచ్‌గా ఆలోచించాలి. పేదరికం అనేది సంపదకు సంబంధించింది కాదు. ఆలోచనకు సంబంధించింది.సైకాలజీకి సంబంధించింది. వ్యక్తిత్వానికి సంబంధించింది. ఈ పేదరిక స్వభావం నుంచి అత్యున్నత కలలు కనడం సంపన్న స్వభావానికి ఎదిగినప్పుడే విద్య, ఉద్యోగ, విజ్ఞానశాస్త్ర, సామాజిక, రాజకీయ, ఆర్థికరంగాల్లో సాధికారికత సాధ్యమవుతుంది.

ఇటీవల బీసీల చైతన్యం వెల్లివిరుస్తున్నది. కులాలవారీగా ఆలోచిస్తున్న బీసీలు ఒక్కటిగా బీసీ చైతన్యాన్ని ప్రకటించడం హర్షణీయం. బీసీ, ఎస్సీ, ఎస్టీల కు కాకుండా, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఓపెన్ కాంపిటీషన్‌లోని 50 శాతంలో ఈ 10 శాతం కేటాయించడం పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి కొన్ని సందేహాలు, కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యాయి.. ఓపెన్ క్యాటగిరీలోని 50 శాతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గా లు 10-15 శాతం మేరకైనా అందుకోలేకపోవడం ఒక విచారకరమైన వాస్తవం. అంతేగాకుండా, బీసీలకు కేటాయించిన 27 శాతంలో 7-11 శాతం మాత్రమే అందుకొని మిగతా 16-20 శాతం రాజ్యాంగబద్ధంగా అందుకోగలిగిన రిజర్వేషన్లు కూడా అందుకోలేకపోవడం విషాదకరం. రిజర్వేషన్లు అనేది జీవించే హక్కు కన్నా తక్కువ కాదు. ఆత్మగౌరవంతో సమానావకాశాలతో జీవించడానికి రిజర్వేషన్లు ఒక సాధనం. సమాజ పరిణామానికి, పరివర్తనకు వీటి కొలతలు, లెక్కలు, ఒక ప్రమాణం కూడా. ఇంత ముఖ్యమైన ప్రాథమిక హక్కుల్లో, జీవించే హక్కుల్లో గౌరవంగా జీవించే హక్కు గురించి పౌరహక్కుల సంఘాలు, ప్రజా హక్కుల సంఘాలు సామాజిక చైతన్య వేదికలు పట్టించుకోకపోవడం, బ్యాక్‌లాగ్ పోస్టులుగా ఉంచి, నైపుణ్యాలను పెంచి నింపాలనే చైతన్యం, ఉద్యమాలు లేకపోవడం విషాదకరం. ఈ విషయంలో కులాలవారీగా కాకుండా, ఓటర్లుగా, ప్రజలుగా, పౌరులుగా ఆలోచించి అందరూ కలిసి ఈ రిజర్వేషన్లు 1993 నుంచి, 2005 నుంచి రాజ్యాంగబద్ధంగా అమల్లోకి తెచ్చిన వాటిని పొందే విధంగా కృషిచేయడం కనీస కర్తవ్యం. అప్పుడే అసమానతలు తగ్గి, సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు దిశగా సమాజం ముందుకు సాగుతుంది. కేంద్రంలో, రైల్వే, టెలిఫోన్, బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రభుత్వరంగ పరిశ్రమలు మొదలైనవాటిలో ఏటా నియమిస్తున్న 3 లక్షల ఉద్యోగాల్లో బీసీలు పొందుతున్నవి చాలా తక్కువ.

ఈ దశలో తమకూ రిజర్వేషన్లు కావాలని జాట్‌లు, గుజ్జర్లు, పటేళ్లు, కాపులు మొదలైన కులాలవారు ఉద్యమిస్తున్నారు. కొన్ని ఈశాన్య రాష్ర్టా ల్లో గిరిజనులకు 80 శాతం దాకా రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. కశ్మీర్‌లో రిజర్వేషన్లు కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం ద్వారా ఏర్పరుచబడ్డాయి. చంపకం దొరై రాజన్ అనే ఆమె తనకు విద్యారంగంలో సీటు అవసరం లేకపోయినా, ఒకవేళ నేను దరఖాస్తు చేస్తే నాకు ఈ రిజర్వేషన్లు అవరో ధం అని ఊహ మీద కేసు వేసింది. 1951లో మద్రాస్ హైకోర్టులో ఈ కేసు నడిచి విద్యావ్యవస్థలో బ్రాహ్మణేతరులకు కేటాయించిన విద్యా రిజర్వేషన్లు కొట్టివేశారు. దాంతో పెరియార్ రామస్వామి నాయకర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. నాటి ప్రధాని నెహ్రూ, న్యాయమంత్రి అంబేద్కర్, కేంద్ర మంత్రివర్గం చర్చించి భారత రాజ్యాంగంలో మొదటి రాజ్యాంగ సవరణ చేశారు. ఆ మొదటి రాజ్యాం గ సవరణలో భాగంగా 15, 16 ఆర్టికల్స్‌కు 15.4, 16.4 సబ్ క్లాజుల ను చేర్చారు. ఇది రాజ్యాంగ నిర్మాణం సభలో 10.3 ఆర్టికల్స్‌గా చర్చిం చి ఎలాంటి తీర్మానం లేకుండా వదిలివేసినవే. అంటే రాజ్యాంగ పరిషత్‌లో బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల వారు 298 మందిలో నాలుగిం ట మూడొంతులకు పైగా ఉండటం వల్ల ఇది రాజ్యాంగంలో చేర్చలేదు. చంపకం కేసుతో కోర్టు రాజ్యాంగం లేదని కొట్టివేయడంతో తమిళనాడు అంతటా ఉద్యమాలు పెల్లుబుకి కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు గురిపెట్టబడ్డాయి. అలా పెరియార్ రామస్వామి తమిళుల ఉద్యమాల తో బీసీలకు తొలిసారిగా రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ర్టాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్గం సుగమమైంది.

డ్బ్భై ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత చరిత్రను, చరిత్ర పరిణామాలను పక్కనబెట్టి సమకాలికులను, ఇరుగుపొరుగును పోల్చుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తక్కువ మార్కులు వచ్చినా సీట్లు, ఉద్యోగాలు వస్తున్నాయని ఆందోళన, ఆవేశం, కోపం క్రమంగా ఈర్ష్య, అసూయ, చివరకు ద్వేషం, వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఇలా కాదని తమకు కూడా రిజర్వేషన్లు అవసరమని గుర్తించి ఉద్యమించే మలుపు తీసుకున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఓపెన్ కాంపిటీషన్‌లో కూడా కొంతమేరకు క్రీమీలేయర్ ప్రవేశపెట్టినప్పుడే రిజర్వేషన్ క్యాటగిరీ కూడా లేని పేద కుటుంబాలకు కొంత మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా కులాలవారీగా ఆలోచించడమే కాకుండా, కుటుంబాల వారీగా ఆలోచించడం అవసరం. కుటుంబం అనేది రాజ్యాంగం నిర్వచించిన పరిధిలో స్వీకరించడం అవసరం. ఒక కులంలో పెట్టుబడిదారులు, సంపన్నులు, నాయకులున్నంత మాత్రాన ఆ కులంలోని పేదలకు ఒరిగిందేమీ లేదు. కాకపోతే కూటికి పేదోడ్ని కాని, కులానికి పేదను కాదనే అతిశయం ఉం టే ఉండవచ్చు. రాజ్యాంగబద్ధంగా అది ఉండటానికి వీల్లేదు. ఖండించదగినది. ఇందుకోసం ఏ కులం గొప్పది కాదు, ఏ కులం చిన్నది కాదు, అన్ని కులాలు సమానమేనని పాఠ్యపుస్తకాల్లో, నోట్‌బుక్ అట్టల మీద, గోడల మీద, రైళ్ల మీద, బస్సుల మీద ఎక్కడికక్కడ రాయించడం ప్రభుత్వాలు చేయాల్సిన పని. అది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ.

ఇలా తమకేం అవసరమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కోరుకోవాలి, సాధించుకోవాలి. 16-20 శాతం బీసీ రిజర్వేషన్లు ఇంకా ఖాళీ గా ఉండి ఇతరుల పాలవుతున్నాయి. ఈ విషయంలో ఏమీ చేయకుం డా ఇతర పేదలకు 10 శాతం ఓపెన్ కాంపిటీషన్‌లో కొంత రిజర్వేషన్ ప్రవేశపెడితే వ్యతిరేకించడం దేనికి?. ప్రజల మధ్య ఉండే నాయకత్వం అయితే బీసీ రిజర్వేషన్లు నింపే ఉద్యమాలను చేపట్టి ప్రభుత్వాల చేత అవి నింపేదాక నిద్రపోకుండా పెరియార్ రామస్వామి వలె ఉద్యమిస్తా రు. ప్రజల మధ్య, ప్రజలతో కలిసి లేకుండా చిన్నచిన్న గ్రూపులుగా ఉం డటం వల్లనే ఆయా కుల సంఘాలు, బీసీ సంఘాలు ఇలాంటి వాటిని సాధించి, సంఘటిత ఉద్యమాలుగా ఎదుగలేకపోవడం జరుగుతున్నది. అందువల్ల సంఘటిత శక్తిగా ఎదుగడం నేటి కర్తవ్యం. ఎస్సీ, ఎస్టీల వలె బ్యాక్‌లాగ్ పోస్టులుగా ఉంచేటట్టు చేసి, వాటిని నింపేటట్లు తీసుకోవాల్సిన అంబుడ్స్‌మన్ వ్యవస్థగా ఆయా సంఘాలు, సంస్థలు ఎదుగాలి. రాజ్యాంగ సమీక్ష కమిషన్ నొక్కిచెప్పినట్టు ప్రభుత్వమే ఇందుకు అంబుడ్స్‌మన్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటుచేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు వాటిని సమీక్షించి నింపే ఆదేశాలను జారీ చేయాలని కోరడం జరిగింది.
ramulu
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఉన్నత ఉదాత్త సంస్కారం అవసరం. ఫలానా వారికి తిండి పెట్టరు. అవకాశాలివ్వరు. ఆకలికి మాడ్చి చంపు, పేదరికంలోనే ఉంచు. ఆఖరికి మలమలా మాడి చావు అని, హీనంగా చూడు అని చెప్పే హక్కు, కోరే హక్కు ఎవరికీ లేదు. తమకేం కావాలో కోరుకునే హక్కున్నది. ఉద్యమించి సాధించుకునే హక్కున్నది. ఈ మౌలికాంశాన్ని 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకించేటప్పుడు చాలామంది మర్చిపోతున్నారు. సరిగ్గా రిజర్వేషన్లను అగ్రకులాలు ఇంతదాకా ఎలా వ్యతిరేకించారో, సరిగ్గా అలాంటి భాష, వ్యతిరేకతలే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ప్రకటించడం విచారకరం. పాత్రలు, పాత్రదారులు అటునుంచి ఇటు, ఇటునుంచి అటు మారడం తప్ప సమ్మేళనం సాధించిది ఎక్కడా లేదు. రాజ్యాంగంలో వారికి అవకాశం లేదు అని అంటే, ఒకటవ రాజ్యాంగ సవరణతో ఎలా బీసీలను చేర్చడం జరిగింది. అలాగే అన్ని ఆర్టికల్స్‌లో ఎకనమికల్లీ వీకర్స్ సెక్షన్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ఏరియాస్ అని ఎక్కడికక్కడ ఈ పదాలను చేర్చితే సరిపోతుంది. కంపార్ట్‌మెంటల్ ఆలోచనావిధానం నుంచి బయటపడటం అవసరం. పాలితులుగా, డిపెండెంట్లుగా, ఆశ్రితులుగా ఆలోచించే విధానం నుంచి పాలకులుగా ఆలోచించే విధానంలోకి మలుపు తిరిగినప్పుడే ఎంపవర్‌మెంట్ సాధ్యమవుతుంది. పూర్ డాడ్, రిచ్ డాడ్ అనే పుస్తకంలో పేర్కొన్నట్టు రిచ్‌గా ఆలోచించాలి. పేదరికం అనేది సంపదకు సంబంధించింది కాదు. ఆలోచనకు సంబంధించింది. సైకాలజీకి సంబంధించింది. వ్యక్తిత్వానికి సంబంధించింది. ఈ పేదరిక స్వభావం నుంచి అత్యున్నత కలలు కన డం సంపన్న స్వభావానికి ఎదిగినప్పుడే విద్య, ఉద్యోగ, విజ్ఞానశాస్త్ర, సామాజిక, రాజకీయ, ఆర్థికరంగాల్లో సాధికారికత సాధ్యమవుతుంది. ఈ విషయం పట్ల గ్రామగ్రామాన శిక్షణా తరగతులు అవసరం.

723
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles