యువతలో నాయకత్వ ప్రతిభాజాగృతి


Tue,January 22, 2019 12:54 AM

ప్రజాస్వామ్య రీతిలో ప్రభుత్వాలను ఎదిరిస్తూ, ప్రజల హక్కులను సాధించుకొంటున్న మహా వ్యక్తిత్వమున్న ధీశాలి అన్నాహజారే ఈ సదస్సును ప్రారంభించడం సముచితం. ప్రపంచానికి ఆయన ద్వారా మహాత్మాగాంధీని చూడలేని వారికి మరోమారు గాంధీజీని చూపినట్లు అయినది. అలాగే నీటి సమస్యతో అల్లాడుతున్న ప్రపంచానికి, వాటర్ మెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజేంద్రసింగ్ సదస్సుకు హాజరై ఎంతో వన్నె తెచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన తెలంగాణ జాగృతి సంస్థ, ఆ తర్వాతి కాలంలో తెలంగాణ రాష్ర్టా భివృద్ధిలో కూడా అంతే గొప్ప పాత్రను పోషిస్తున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఘనతను దేశ విదేశాల్లో చాటిచెప్పిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థది. అదేరీతిలో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో నెలకొన్న అనేక సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కునే దిశలో యువతను మేల్కొల్పేందుకు కార్యక్రమాలను తీర్చిదిద్దింది.

ప్రపంచానికి అహింసా సిద్ధాంత గొప్పదనాన్ని చాటిచెప్పి, కత్తికన్నా మనిషి సహనమే అన్నీ సమస్యలకు పరిష్కారమని చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఆయన 150 జయంతి సందర్భంలో, ఐరాస ఆలోచనల ప్రతిరూపమైన సుస్థిరాభివృద్ధి అజెండా-2030 లో భాగంగా ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన పరిష్కారం యువత ఆలోచనలలో మార్పు రావడంతోనే సాధ్యం, అందుకోసం గాం ధీ మార్గమే సరైదని భావించిన తెలంగాణ జాగృతి సంస్థ హైదరాబాద్ నగరంలో నిర్వహించిన తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు, జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవి త ఆలోచనలకు, ముందు చూపునకు ప్రతిరూపం.

ప్రపంచంలోని అన్నీ సమస్యలకు, ఉగ్రవాదానికి, రాజకీయ అనిశ్చితి కి, పేదరికానికి, వెనుకబాటుతనానికి కూడా మనిషి ఆలోచనలో వస్తున్న దుష్ట భావనలే కారణం, వాటిని రూపుమాపడానికి యువత నాయక త్వం అవసరమని గుర్తించి ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యువత తమ తమ దేశ రాజకీయ, ఆర్థిక భావనలను, పరిస్థితులను అర్థం చేసుకోకుండా తమ స్వేచ్ఛకే అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్న ఈ రోజుల్లో అన్నిరంగాల్లో యువత భావనలకు, ఆలోచనలకు చక్కని రూపం ఇవ్వాలని, వారి ఆలోచనలకు తగిన గౌరవాన్ని, తగిన గుర్తింపును తేవాలనే సదుద్దేశంతో ఈ యువ నాయకత్వ సదస్సును నిర్వహించారు.
సాంకేతికంగా ఎంతో ముందుకుపోతున్న ప్రపంచంలో మనిషికి మని షి పట్ల తగిన గౌరవం లేకపోవడంతో పాటు, తనకు బతుకునిస్తున్న ఈ భూమి, ప్రకృతి పట్ల నిర్లక్ష్య ధోరణి పెరుగడంతో అనేకరకాల సమస్యలతో ఈ ప్రపంచం రోజురోజుకూ ప్రళయం అంచుకు చేరుతున్నది. మనిషి బతుకడానికి కావల్సిన సహజ వాతావరణం కొరవడుతున్నదని గ్రహించిన యూఎన్‌ఓ మొదటిసారిగా బ్రెజిల్లోని రియో డి జెనెరో నగరంలో 1992లో నిర్వహించిన ఎర్త్ సమ్మిట్‌లో ఆవిష్కరించుకున్న సుస్థిరమైన అభివృద్ధికి అనుగుణంగా 2012లో మనం కోరుకొనే భవిష్యత్‌ను మనం నిర్మించుకోవడానికి రాజకీయ అత్యున్నతస్థాయిలో కృషి చేయడానికి ఏర్పాటైన ఐరాస విభాగం, దాదాపు అన్నిదేశాల్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

నేటి ప్రకృతి విధ్వంసానికి అడ్డుకట్టవేసి, రేపటి నూతన సుందర, ఆహ్లా దకరమైన ప్రశాంత ప్రపంచాన్ని భావితరాలకు అందించడానికి నిరంత రం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే వివిధ దేశాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వతంత్ర సంస్థలతో, వ్యక్తులతో జతకట్టి, సుహృద్భావ వాతావరణంలో ప్రజలందరూ జీవించడానికి నేటి ప్రభుత్వాలతో పాటు ప్రజలు, ముఖ్యంగా యువత ఆలోచించాల్సిన తీరు, చేయాల్సిన ఆవిష్కరణలు, చూపాల్సిన పరిష్కారాలను వెతుకుతున్నది.
తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు దేశవిదేశాల్లో ఎంతగానో ప్రచారం కల్పించిన తెలంగాణ జాగృతి ఒక స్వచ్ఛంద సంస్థలా విదేశాల్లో ఉన్న తెలంగాణ వారితో పాటు ఇతర భారతీయుల్లో, ముఖ్యంగా యువతలో తన ప్రత్యేక స్థానాన్ని గెలుచుకున్నది. జాగృతి అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలిగా తన ఐదేండ్ల రాజకీయ అనుభవంతో, ప్రపంచానికి కూడా ఒక చక్కని వేదిక కావాలనే సత్సంకల్పంతో ప్రపంచంలోని 130 కోట్ల యువతకు ఆలోచనను అందిస్తూ, వారి నుంచే తగిన పరిష్కార మార్గాలు వెతికేందుకు అనువైన వేదికగా, వారిలోని ఆలోచనలకు మరిం త పదునుపెట్టి కొత్త ఆవిష్కరణలకు తోడ్పడేందుకు ఉపయోగపడి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండేలా ఈ సదస్సు నిర్వహించారు.

అభివృద్ధి చెందిన దేశాల యువత సమస్యలు ఒకరకంగా ఉంటే, అభి వృద్ధి చెందుతున్న దేశాల యువత సమస్యలు మరో రకం. ఈ యువతలో నిరుద్యోగం ప్రధాన సమస్య. కానీ ఇక్కడ చదువుకున్న యువతనే అభివృ ద్ధి చెందిన దేశాలకు వలస వెళ్లి, అక్కడ సంపద సృష్టిస్తున్నారు. నిరుద్యో గులైనవారు నిరాశ, నిస్పృహలతో అరాచకశక్తుల చేతుల్లో కీలుబొమ్మలవుతున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ప్రబలుతున్న ఉగ్రవాదాని కి యువతలో నెలకొన్న నిరాశా, నిస్పృహలే కారణం కాగా, వాటిని కొంతమంది స్వార్థపరులు తమ రాజకీయ అవసరాల కోసం వాడుకొని, ప్రపం చశాంతికే ప్రమాదకరంగా మారుతున్నారు.
యువతలో ఉన్న శక్తిని గుర్తించి వారి శక్తి సామర్థ్యాలను శాంతిమార్గంలోకి మలుచుకుని, ప్రపంచశాంతికి తోడ్పడాలని, అందుకు అనువైన మార్గాలను రూపొందించుకుంటూ నూతన ప్రపంచాన్ని నడిపించాలనేదే ఈ సదస్సు సదాశయం. యువతలో ఉన్న ఆకాంక్షలకు అనువైన మార్గా లు వేస్తూ, వారి సునిశితమైన ఆలోచనలకు, ఆవిష్కరణలకు, సమస్యల కు పరిష్కారాలను కనుగొనే విధంగా వివిధ వేదికలను ఏర్పాటుచేసి, వాటి కి సముచితమైన గౌరవాన్ని కల్పించడంలో ఈ రెండురోజుల సదస్సు విజయవంతమైంది.
prabhakar
యువతలో సగ భాగమున్న యువతుల సమస్యలు చర్చిస్తూ పరిష్కారాలు వెతుకుతూ వారిలో నాయకత్వ భావనలను మేల్కొల్పారు. 16 నుంచి 30 ఏండ్ల లోపు ఉన్న యువతనే ఆహ్వానించి, వారు నివసించే దేశాల, ప్రదేశాల పరిస్థితులను ఇతరులతో పంచుకొంటూ ప్రపంచ ప్రఖ్యా తిగాంచిన వారితో జవాబులు ఇప్పించడం ఈ సదస్సు ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

ప్రజాస్వామ్య రీతిలో ప్రభుత్వాలను ఎదిరిస్తూ, ప్రజల హక్కులను సాధించుకొంటున్న మహా వ్యక్తిత్వమున్న ధీశాలి అన్నాహజారే ఈ సదస్సును ప్రారంభించడం సముచితం. ప్రపంచానికి ఆయన ద్వారా మహాత్మాగాంధీని చూడలేని వారికి మరోమారు గాంధీజీని చూపినట్లు అయిన ది. అలాగే నీటి సమస్యతో అల్లాడుతున్న ప్రపంచానికి, వాటర్ మెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజేంద్రసింగ్ సదస్సుకు హాజరై ఎంతో వన్నె తెచ్చారు.

ప్రపంచంలో ఉన్న అశాంతులతో పాటు, సాంకేతికంగా వస్తున్న మార్పులతో పర్యావరణానికి జరుగుతున్న నష్టానికి, ప్రకృతి సమతుల్యానికి మార్గాలను వెతుకడంలో ఈ సదస్సు ముందడుగు వేసింది. అలాగే రాజకీయ నాయకత్వం వహించడంలో యువత వెనుకంజ వేయడాన్ని నిరసిస్తూ, ప్రపంచాభివృద్ధికి యువత రాజకీయ నాయకత్వం స్వీకరించ డం ఎంత అవసరమో తెలిపింది. సదస్సులో పాల్గొన్న యువతీయువకు లు రాజకీయాల పట్ల తమలో ఉన్న దురభిప్రాయాలను రూపుమాపుకొని, అవినీతిని కడిగేయడం ద్వారా స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందించడానికి ఈ సదస్సులో అడుగులు పడటం విశేషం. ఈ సదస్సు విజయవంతమవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని తెలంగాణ జాగృతి సేవా నిరతిని ప్రపంచానికి చాటినట్లయింది.

632
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles