ఆధునిక సమాజంలో శాస్త్ర సాంకేతికరంగాల అభివృద్ధి కారణంగా ఎంతో మేలు జరుగుతున్నా, చెడు కూడా అదేస్థాయిలో విజృంభిస్తున్నది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల కారణంగా తీవ్రమైన హాని జరుగుతున్నది. తెలిసో, తెలియకో తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరం లేకున్నా ఫోన్లు కొనిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లలో విశృంఖలత్వ వీడియోలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో పాఠ శాలస్థాయి విద్యార్థులు కూడా ఈ వీడియోల ప్రభావంతో తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతున్నారు. అవాంఛనీయ చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి తల్లిందండ్రులు జాగరూకతతో వ్యవహరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగు చర్యలు తీసుకోవా లి. నెట్, సామాజిక మాధ్యమాల వికృతాల ను అరికట్టాలి.
- బత్తిని లక్ష్మయ్య, వాడపల్లి, మిర్యాలగూడ
ప్రపంచకప్‌కు సిద్ధం కావాలె
ఆస్ట్రేలియా పర్యటనలో పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి, టీమిండియా ఇటు వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్‌లు కైవసం చేసుకోవడం శుభపరిణామం. ప్రపంచకప్‌కు ముందు ఈ విజయం బలాన్ని చ్చేదే. అయితే ముందున్నది న్యూజిలాండ్ పర్యటన. ఈ పర్య టనలో కూడా భారత జట్టు పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించి ప్రపంచకప్‌కు సిద్ధం కావాలె.
- మాసాని సురేష్, సయ్యద్‌పల్లి, పరిగి, వికారాబాద్ జిల్లానిరుద్యోగ భృతి హర్షణీయం
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని నిర్ణయించటం శుభసూచకం. నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యల్లో నిరుద్యోగ సమస్య తీవ్రమైనది. నిజానికి ఈ నిరుద్యోగ సమస్యతోనే అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. యువతలో ఉన్న నిరాశ, నిస్పృహల కారణంగా హింసా, నేర ప్రవృత్తి పెరుగుతున్నది. ఇలాంటి సామాజిక వాతావరణంలో నిరుద్యోగులకు భృతి ఇవ్వాలనే నిర్ణయం సముచితమైనది.
- ఉప్పల ఉదయ్‌కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా