‘తెలుగు పీత’కు.. వాత

Wed,December 12, 2018 10:41 PM

సీసాలో ఉన్న ఓ పీత పైకెక్కాలని ప్రయత్నిస్తుం టే.. మరో పీత దాన్ని కిందకు లాగేస్తుంది. తెలుగువారి స్వభావంపై ఓ వ్యంగ్య కథనం వాడుకలో ఉన్నది. బహుశా ఏపీ సీఎం చంద్రబాబును చూసే ఈ తెలుగు పీత కథను అల్లి ఉంటారు. ఎందుకంటే అలెగ్జాండర్‌నే అధి కారంలోకి తీసుకురాగలిగిన ఆయ న.. ఎన్ని విచిత్రాలైనా చేయగలరు మరి. 2004లో ఎన్డీయే ప్రభుత్వం కూలిపోవడం దగ్గరి నుంచి తెలంగాణలో ఓటుకు నోటు వరకు ఆయన పీత స్టోరీలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ప్రజా కూటమితో జట్టుకట్టిన చంద్రబాబు అదే స్టోరీని మరోసారి రిపీట్ చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధఃపాతాళానికి తొక్కేశారు. అందుకే చైనాలోని జియాంగ్సూ మాదిరిగా భారతదేశంలో ఆయనకో పీత స్మారక భవనం కట్టాలన్న డిమాండ్ తెరపైకి తేవాల్సిందే. అభివృద్ధి అంతా నాదేనంటూ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా చంద్రబాబు తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోలేదు. మొదటి నుంచీ పక్కవాడిని ముంచి గద్దెనెక్కే మనస్తత్వం ఉన్న చంద్రబా బు ఎప్పుడూ అదే ఫార్ములాతో ముందుకుసాగుతున్నారు. రాజకీయ జీవితం ఇచ్చి మంత్రిని చేసిన మామకే వెన్నుపోటు పొడిచి తొలిసారి తెలుగు పీత ను తెరపైకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి తెలుగు పీత ఫార్ములాను పక్కాగా అమలుచేస్తూ వస్తున్నారు. 2004లో అలిపిరి దాడిని అవకాశంగా చేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడ్డాడు. కానీ.. అదే సమయంలో తనతోపాటు కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కార్‌ను కూడా ముందస్తుకు తీసుకె ళ్లి వారిని నట్టేట ముంచి తెలుగు పీత స్టోరీ మరోసారి చూపించాడు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రేవంత్‌రెడ్డి ద్వారా ఓటుకు నోటు వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తనకు దక్కని అధికారం కేసీఆర్‌కు ఉండకూడదన్న అక్కసుతో కుట్రలకు తెరలేపాడు. పూర్తిస్థా యి మెజార్టీతో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేల ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.
Nagarjuna-Gajula
కానీ, రేవంత్‌రెడ్డి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు పీత స్టోరీ ఫెయి ల్ అయ్యింది. తెలంగాణలో సైకిల్ పార్టీ కనుమరుగైపోయింది. ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని ప్లాన్ వేసిన చంద్రబాబు.. ప్రజా కూటమిలో భాగస్వామిగా చేరాడు. చాలామందికి తెలియని విషయమేమంటే ఇక్కడా తెలుగు పీత స్టోరీ ఉంది. తమ పార్టీ లేని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎలా భూస్థాపితం చేయాలి? ఇక్కడే చంద్రబాబు బ్రీఫ్డ్ మైండ్ బాగా పనిచేసింది. కాంగ్రెస్‌లో ఉన్న తన శిష్యుడు రేవంత్‌రెడ్డికి ఆ పీత బాధ్యతలు అప్పగించాడు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును నమ్మరు. సో.. కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్ట డం వల్ల నష్టపోయేది హస్తం పార్టీయే. తెలంగాణలో సీఎం కేసీఆర్‌కున్న క్రేజ్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కారణంగా తిరుగులేని మెజార్టీతో గులాబీ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక్కడ చంద్రబాబు పీత ప్లాన్ కూడా బాగా పనిచేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజల ఆగ్రహానికి గురైంది. ఫలితంగా సీఎం అభ్యర్థులమని చెప్పుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఓటమిపాలయ్యారు. మొత్తంగా చంద్రబాబు పీత ప్లాన్ ముచ్చటగా మూడోసారి సక్సెస్ అయ్యింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఇటు తెలంగాణలో, అటు ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. తన స్కెచ్ వర్కవుట్ అయినందుకు లోలోన చం ద్రబాబు సంతోషపడుతున్నా.. ఈ తెలుగు పీతకు తెలంగాణ ప్రజలు పెట్టిన వాత మాత్రం పచ్చబొట్టు లా ఎప్పటికీ చెరిగిపోదు. అలాగని చంద్రబాబు పీత స్కీమ్ ఇంకా అయిపోలేదు. తెలంగాణ ఫలితాలకు ముందే బీజేపీయేతర కూటమి పేరుతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీని కిందకు లాగేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దటీజ్ తెలు గు పీత చంద్రాలు.

630
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles