ప్రజా పట్టాభిషేకం

Wed,December 12, 2018 10:40 PM

ఏమిది! ఏమీ తీర్పు!! కేసీఆ ర్ మీద ప్రేమా? చంద్రబా బు మీద కక్షా! తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటనా? ఏమైనా కానీ, నాలుగున్నరేండ్ల కేసీఆర్ పాల న మీద ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు ఇది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ తప్పు చేశారని, టీఆర్‌ఎ స్ ఓటమి తథ్యమని హేళన చేసినవారి నోళ్లు మూయించిన అద్భుత మైన తీర్పు.. అభివృద్ధి, సంక్షేమం జోడుగుర్రాల సారథిగా తెలంగాణ ను ఉరకలెత్తించిన కేసీఆర్ బంగారు పాలనకు ప్రజలు తెలిపిన హర్షామోదాలుగా ఈ తీర్పును పరిగణించాల్సి ఉన్నది. ఆ మధ్య కొంచెం బలం పుంజుకున్నట్లు కనిపించి న కాంగ్రెస్ పార్టీ దురాశకు పోయి, ఏపీ సీఎం చంద్రబాబు విసిరిన డబ్బుమూటల వలలో పడి ఆత్మగౌరవాన్ని అమ్మేసుకొని, ఆయనతో చేతులు కలిపి తామే దో మహా బలులమైపోయామని భ్రమించి, విర్రవీగి న ఫలితం.. తెలంగాణ ప్రజలు ముఖం మీద గుద్దిన ట్లు కూటమిని చెత్తబుట్టలో విసిరారు. తెలంగాణలో ని పాత పది జిల్లాల్లో ఎక్కడచూసినా కారు ప్రభంజనమే కనిపించింది. కారుకు ఆరో గేరు ఉంటుందో లేదో తెలియదు కానీ, గులాబీ కారుకు ఏడు గేర్లు దినకరుని సప్తాశ్వరథాలుగా పరుగులు తీసి తెలంగాణ గోళం మొత్తాన్ని చుట్టేసింది. కాంగ్రెస్‌లోని అతిరథ మహారథులు, తలపండిన సీనియర్ నాయకులు, సీఎం పదవి కోసం ముందస్తు దస్తీలు వేసిన నాయకులు అందరూ కారు టైర్ల కింద నేలకరిచారు. మళ్లీ లేవకుండా నలిగిపోయారు. ఇంత ఘనవిజయం ఎలా సాధ్యమైంది? కేసీఆర్ చాణక్యం, ఎన్నికల వ్యూహం ఎవరూ అందుకోలేనం త స్థాయిలో ఉంటాయని ప్రజా తీర్పు మరోసారి ఢం కా కొట్టి చాటింది. ఒకేసారి 105 మంది పాత అభ్యర్థులనే ప్రకటించడం కొంప ముంచుతుందని భయపడినవారూ నివ్వెరపోయేలా వారు ఘనవిజయం సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు సాధించిన మెజార్టీలు కూడా సామాన్యమైనవి కావు. ఎక్కువమంది ఐదంకెల ఆధిక్యతలను సాధించారు. కేసీఆర్ సాధించిన అసామాన్యమైన విజయాలను తక్కువచేసి చూపి, అమలుచెయ్యలే ని ఒకటో రెండో పథకాలను పదేప దే హైలైట్ చేసి లబ్ధి పొందాలని, ఆంధ్రా మీడియా సహకారంతో విపరీతంగా ప్రయత్నాలు చేసిన బాబు వ్యూహం తిప్పికొట్టింది.
ilapavuluri
చంద్రబాబు ఉనికిని తెలంగాణ ప్రజలు ఏ మాత్రం సహించలేరని స్పష్టమైంది. చంద్రబాబు, బాలకృ ష్ణ డాబులు, హెచ్చులు సీమాంధ్ర ఓటర్లకు కూడా అసహ్యం కలిగించాయి. టీడీపీ అభ్యర్థులను గెలిపించినా, చంద్రబాబు ఇక్కడ సీఎం కాలేడు. అలాంటి వ్యక్తికి ఓట్లు వేసి తమను కంటికి రెప్పలా కాపాడుతు న్న కేసీఆర్‌ను ఎందుకు దూరం చేసుకోవాలన్న స్పృహ సీమాంధ్ర ఓటర్లను కూడా ఆలోచింపజేసిం ది. అందుకే చుండ్రు సుహాసినిని పారద్రోలారు. ఈ తీర్పు బాబుకు చెంపదెబ్బ. మరోసారి తెలంగాణలో అడుగుపెట్టాలంటేనే భయపడేలా కూకట్‌పల్లి ఓటర్లు తీర్పు ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడాని కి కారణం కేవలం స్వయంకృతాపరాధం. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడైన పొరుగింటి పార్టీ నేత బాబుతో అనైతిక పొత్తు పెట్టుకొని సాటి తెలంగాణ నాయకుడి మీద పోటీకి దిగిన కాంగ్రెస్‌కు తీవ్ర పరాభవం మిగిలింది. బాబుతో పొత్తు లేకపోతే కాంగ్రెస్ ఒంటరిగా కనీసం పాతిక సీట్లు గెలుచుకొని ఉండేది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్, అంభి, జయచంద్రులను గుర్తుకుతె చ్చి తన చదువు, సంస్కారం, విద్యావివేకాలు బూడిదలో పోసిన పన్నీరు అనిపించుకున్నారు. ఈ తీర్పు కేసీఆర్ సాధించిన అభివృద్ధికి సంకేతం, ఈ తీర్పు కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలకు పట్టాభిషేకం, ఈ తీర్పు తెలంగాణ ఆత్మగౌరవానికి అభిషేకం, ఈ తీర్పు కేసీఆర్ విధానాలకు, సిద్ధాంతాలకు, మంచితనానికి క్షీరాభిషేకం, రాబోయే ఐదేండ్ల కేసీఆర్ పాలన మరింత జనరంజకంగా, అభివృద్ధే లక్ష్యంగా కొనసాగాలని ఆశిస్తూ.. కేసీఆర్‌కు అభినందనలు, శుభాకాంక్షలు.

314
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles