జనాశీర్వాదం!

Wed,December 12, 2018 10:40 PM

కూటములు
బల ప్రదర్శనకే పరిమితమైతే
విజ్ఞతను ఓడించలేవు!
ఆత్మవిశ్వాసం కోల్పోయి
పరాయిని నమ్మిన ఫలితమే
ఈ ఘోర పరాజయం!
జనం గుండల్లో
కొలువుదీరిన ప్రభుత్వాన్ని
సెక్రటేరయట్లో వెతికినందుకే ఈ నిరాశ!
జలాశయాలు నిలదీస్తున్నా
కుబుద్ధితో వెక్కిరించిన ఫలితమే
ఈ దిమ్మ తిరిగే చెంపదెబ్బ!
పగలూ రేయీ వెలుగులు విరజిమ్ముతున్నా
కళ్ళు మూసుకుని నటించినందుకే
ఈ చీకటిరోజుల దాపురింత!
నోటికి కూటికి
దూరాలు చెరిపేస్తున్న వేళ
పల్లెంలో మట్టి జల్లినందుకే ఈ మరణ శిక్ష!
రాకాసుల నుంచి కాపాడిన
రైతు బంధువును తూలనాడిన ఫలితమే
ఈ అధికార స్వప్న భంగం!
ఇంకా ఓటమిని అంగీకరించకపోతే
ఇకపై విష కూటములకు
అధికారం ఒక పగటి కలే!
ఇప్పుడిప్పుడే పాలనా ఫలాలు
పల్లెపల్లెకు చేరినందుకే
ఇన్ని గలాబీ జెండాల రెపరెపలు!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261

242
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles