కేసీఆర్ విజన్ గెలిచి నిలిచింది

Tue,December 11, 2018 11:02 PM

ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల్లో లక్షలాది మందికి నూతన అవకాశాలు సృష్టిస్తుంది తెలంగాణ. చైనా, జపాన్‌లతో పోటీపడి అన్నిరంగాల్లో అత్యున్నత అభివృద్ధిని సాధిస్తుంది. జనాభా దామాషా మేరకు ముస్లిం రిజర్వేషన్లు 12 శాతం, గిరిజనుల రిజర్వేషన్ల 12 శాతం అమల్లోకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం, బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఫెడరల్ ఫ్రంట్ త్వరలోనే పార్లమెంట్‌లో సాధిస్తుంది. తమిళనాడులోని 69 శాతం రిజర్వేషన్ కన్నా అధిక రిజర్వేషన్ సాధిస్తుంది తెలంగాణ. దేశానికి మార్గదర్శకత్వం వహించడానికి ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ నాయకత్వంలో సాకారమవుతుంది. ఒక తల్లిలా, ఒక తండ్రిలా ప్రజల విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి కల్పనలకు హామీ ఇస్తుంది. ఆదుకుంటుంది. అందని ఆకాశాన్ని కిందికి దించింది కేసీఆర్ విజన్. తెలంగాణ సాధకుడా..! తెలంగాణ అధినేతా..! అందుకో ఇవే అభివందన చందనాలు.

ముదస్తు ఎన్నికల్లో తెలంగాణ గెలిచింది. భూమి పుత్రులు గెలిచిండ్రు. కేసీఆర్ గెలిసిండు. కేసీఆర్ విజన్ గెలిచింది. కేసీఆర్ పథకాలు నిలిచి గెలిచినయి. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ గెలువడం ఒక చారిత్రక అవసరమని గుర్తించింది తెలంగాణ! ఢిల్లీ, అమరావతి జోహుకుందార్లు ఓడిండ్రు. తెలంగాణ ప్రజల ఐక్య త అజేయంగా నిలిచింది. ఒక వీరుడు వంద తుపాకులను ఎదిరించి నిలిచిండు. ఒకే ఒక్కడు నూరగురై నిలిచి గెలిచిండు. అబద్ధాలు ఓడిన యి. అవకాశవాదం ఓడింది. ద్వేషం ఓడింది. ప్రజల అభిమానం గెలి చింది. సామాన్యులు అసమాన్యులుగా విజేతలుగా నిలిచిండ్రు. ప్రజలు అసాధారణ గెలుపు సాధించిండ్రు. ఇది ప్రజాగెలుపు. ఇది ప్రజాస్వా మ్యం గెలుపు. తెలంగాణ పతాకం దేశం గర్వించేలా తలెత్తుకొని నిలిచిం ది. బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఒక్కటై నిలిచిండ్రు. ఆ గట్టున ఉన్నవాళ్లు ఈ గట్టుకు వచ్చిండ్రు. మనమంతా ఒకటేనని కదం తొక్కిండ్రు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక విప్లవం నిశ్శబ్దంగా సాగింది. తెలంగాణ సామాజిక, సంక్షేమ విప్లవం స్థిరపడిందని గెలుపు కోడై కూసింది. తెలంగాణ సమాజం, తెలంగాణ విన్‌తో ఎన్నికలను చూసిం ది. ఇంటింటికి ఏదో ఒక పథకం ఇల్లిల్లు చేరింది. ఊరూరి చెరువు నిండిం ది. ప్రజల హృదయం ఉత్సాహంతో ఉప్పొంగింది. ఉద్వేగం కట్టలు తెం చుకున్నది. నిశ్శబ్ద ప్రజలు జల ప్రవాహమై, జలపాతమై, సముద్రపుటల లై గెలుపు సునామి సృష్టించిండ్రు. మాతృదేవతలు హర్షించిండ్రు. పల్లె పడుచులు ఆసరా నిల్చిండ్రు. ఒంటరి మహిళలకు మాకు ఒక అన్న ఉన్నడని మదిలో తలిచిండ్రు. కేసీఆర్ మాకు పెద్ద కొడుకంటూ వృద్ధులు నిం డుగా ఆశీర్వదించిండ్రు. వృత్తికులాల వాళ్లు గుండెలకు హత్తుకున్నరు. ముస్లిం తల్లులు తమ పిల్లల భవిష్యత్తును మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల్లో చూసుకుండ్రు. నాలుగేండ్లుగా ప్రజలు శాంతి సౌభాగ్యాలను కర్ఫ్యూ లేని పరిపాలనను చూసిండ్రు. సుఖశాంతులతో బతుకొచ్చని నమ్మిండ్రు. రైతులు వ్యవసాయానికి ఆసరా ఉండటాన్ని ఊహించని పరంగా భావించిండ్రు. భూముల పట్టాలు, పాస్‌బుక్కులు, భూ పంపకాలు చేసుకున్నవన్నీ రికార్డు చేసి ఇంటికి తెచ్చిచ్చిన విషయం కలో, నిజ మో అనుకుని గిచ్చి చూసుకొని నిజమేనని తెలుసుకున్నరు. ఇంటింటికీ మంచినీరు, నల్లా నీళ్లతో మిషన్ భగీరథ శరవేగంగా ఇంటి ముందుకు వచ్చిన సంగతి చూసిండ్రు.

కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ కల్వకుర్తి మీదుగా పాలమూరు, శ్రీరాంసాగర్ దాకా చేపలు ఎదురెక్కుతున్నట్టు నీళ్ల ప్రాజెక్టుల నిర్మాణం చూసిండ్రు. ఆనందంతో రైతులు ఉర్రూతలూగిండ్రు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతున్నది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ మహానగరాలుగా ఎదుగుతున్నయి. ఎదుగనున్నయి. రహదారులు అభివృద్ధికి సంకేతాలుగా ముందుకు సాగుతున్నయి. మెట్రో రైళ్లు, ైఫ్లె ఓవర్లు నగరాన్ని ట్రాఫిక్ సమస్య లేని నగరంగా మార్చుతున్నయి. మార్చనున్నయి. రూపుదిద్దుకున్న తెలంగాణ జాతి స్థిరపడుతున్నది. తెలంగాణ జాతీ య సమైక్యత పెల్లుబుకుతున్నది. తెలంగాణ సంస్కృతి విస్తరిస్తున్నది. తెలంగాణ సమాజం ఆత్మవిశ్వాసంతో, ఆత్మ బలంతో విస్తరిస్తున్నది. తెలంగాణ బతుకమ్మ విశ్వవాప్తమై నిలుస్తున్నది. తెలంగాణ కీర్తి బావుటా దేశదేశాల్లో తలెత్తుకొని నిలిచింది. మెత్తుంగా తరంగ సముద్ర గంభీర ఘోష నిశ్శబ్దంగా గుండెల్లోంచి ఎగసింది. ఓట్ల సునామిగా నిలిచింది. ప్రజా అభిమానం కుంభవృష్టిలా కురిసింది. బతుకలేక ఉన్న ఊరు వదిలిన వాళ్లు మళ్లా నా ఊరు, నా పిల్లలంటూ వస్తుండ్రు. సుఖ ప్రసవం. సుఖ నిద్ర. సుఖః సంతోషాలు. నిశ్శబ్ద విప్లవం.. సాక్షాత్కరించింది. ప్రసవానికి శస్త్ర చికిత్స అక్కర్లేదని చాటి చెప్పిన విజయం. నూతన సమాజ నిర్మాణానికి చాల్లు పోసిన బంగారు తెలంగాణ స్వప్నం. వేర్లు తెగిన చెట్టు ఎండిపోతున్నది. మహావృక్షాల కాలం తీరి కూలిపోయాయి. అంతులేని నిరాశలో ఆకాశం హద్దుగల ఆశలు అడుగంటిన యి. అంతులేని చర్చలకు ప్రజలు ఇచ్చిన ముగింపు ఈ విజయం. ప్రజ లు ప్రజాస్వామ్యానికి జై కొట్టిండ్రు. భారత ప్రజాస్వామ్యమా వర్ధిల్లు..! ప్రజలు ఎంత గొప్పవారో ప్రజాస్వామ్యం నిరూపించింది. ప్రజలు ఎమర్జెన్సీని ఈడ్చిపారేసిన చరిత్ర. కాంగ్రెస్ కోట గోడలను పగులగొట్టిన చరి త్ర. తెలుగుదేశం కాళ్లువిరిగి రెండు కండ్ల సిద్ధాంతం చూపు కోల్పోయిం ది. కలలుగన్న కమ్మరాజ్యం, వెన్నుపోటులకు ప్రజలు సమాధి కట్టిండ్రు. ప్రజలకు దూరమైన పార్టీలు బొక్కబోర్ల పడ్డయి. వలసవాదుల పెత్తనం మాకు వద్దని ఊరూరా చెప్పిండ్రు. బతుకు వేటలో బంగారు తెలంగాణ స్వప్నం సాకారమైంది. బంగారు తెలంగాణ సాకారమవుతుందని టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టిండ్రు. నిలువెత్తు నమ్మకంతో కేసీఆర్ విన్‌కు మంగళహారతులు పట్టిండ్రు.

వీర తిలకం దిద్దిండ్రు. తెలంగాణ తల్లి దీవించింది. పోచమ్మ బోనం ఎత్తింది. పోతురాజు ఎగిరి గంతేసిండు. బతుకమ్మ ఆడిపాడింది. కాళో జీ, దాశరథి రంగాచార్య కన్న కలలు కళ్ల ముందు వాస్తవాలై నిలిచినయి. ఆచార్య జయశంకర్ ఆనందంతో ఆశీర్వదించిండు. అభినందించిండు. ఆర్.విద్యాసాగర్‌రావు తెలంగాణ ప్రజల వివేకానికి నివాళులు అర్పించిండు. తెలంగాణ ధీరులకు మొగసాలరా అన్న రావెళ్ల వెంకట్రావు గుం డె నిండింది. పుడితే ఒక్కటి సస్తె రెండు అన్న గూడ అంజయ్య గుండె నిండింది. నేను బతుకుతానే! బతుకుతే మళ్లా ఆత్మహత్య చేసుకుంట అన్న శ్రీకాంతాచారి ప్రాణంతో లేచిండు. అమరవీరులు ఆనందంతో గంతులేసిండ్రు. జయహో అంటూ, జయహే అంటూ తెలంగాణ దిక్కు లు పిక్కటిల్లినయి. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల్లో లక్షలాది మందికి నూతన అవకాశాలు సృష్టిస్తుంది తెలంగాణ. చైనా, జపాన్‌లతో పోటీపడి అన్నిరంగాల్లో అత్యున్నత అభివృద్ధిని సాధిస్తుంది. జనాభా దామాషా మేరకు ముస్లిం రిజర్వేషన్లు 12 శాతం, గిరిజనుల రిజర్వేషన్ల 12 శాతం అమల్లోకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం, బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఫెడరల్ ఫ్రంట్ త్వరలోనే పార్లమెంట్‌లో సాధిస్తుంది. తమిళనాడులోని 69 శాతం రిజర్వేషన్ కన్నా అధిక రిజర్వేషన్ సాధిస్తుంది తెలంగాణ. మహాత్మా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలు మరోసారి రెట్టింపవుతయి. త్వరలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు పది లక్షల మంది బాల, బాలికలతో కళకళలాడుతూ మారుతయి. అంగన్వాడీలు, ప్లే స్కూల్, డే కేర్ సెంటర్లుగా, నర్సరీలుగా ఉన్నత ప్రమాణాలతో ఎదుగుతయి. ఇక పారిశ్రామిక విప్లవం పరిఢవిల్లుతుంది. ఉపాధి అవకాశాలు విస్తరిస్తయి. నిరుద్యోగులకు ఆసరా అందుతుంది. చిరుద్యోగులకు ఆసరా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్నయి లభిస్తయి. విదేశాల కు ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు మరింత ఎక్కువమందికి ఆసరా ఇస్తుంది తెలంగాణ. సామాజిక అభివృద్ధి రెక్కలు తొడుక్కుని మరింత ఎదుగుతుంది. 17 శాతం అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. డబుల్ బెడ్‌రూంలు ఇప్పుడు కడుతున్నవి గాక, కడుతున్నవాటికి తోడు రెట్టింపుగా మళ్లీ ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కళాశా ల, వైద్యశాలకు దక్షణాదికి ఆదర్శంగా నిలుస్తుంది.
ramulu-bs
ఘట్కేసర్, బీబీనగ ర్, నీవ్‌‌సు మరో ఆణిముత్యమై వెలుగుతుంది. ఐటీ సెక్టార్ దేశానికే గర్వకారణంగా ముందుకు సాగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌తో దేశంలో పారిశ్రామిక విధానం తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటుంది. కేసీఆర్ విజన్ మార్గదర్శకత్వంలో నిజమైన సెక్యులరిజం అంటే ఏమిటో తెలంగాణ చూపించింది. దేశానికి మార్గదర్శకత్వం వహించడానికి ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ నాయకత్వంలో సాకారమవుతుంది. ఒక తల్లిలా, ఒక తండ్రిలా ప్రజల విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి కల్పనలకు హామీ ఇస్తుంది. ఆదుకుంటుం ది. అందని ఆకాశాన్ని కిందికి దించింది కేసీఆర్ విజన్. తెలంగాణ సాధకుడా..! తెలంగాణ అధినేతా..! అందుకో ఇవే అభివందన చందనాలు. జయహో తెలంగాణ! శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లు తెలంగాణ..!
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)

599
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles