కుట్రలన్నీ పటాపంచలు

Tue,December 11, 2018 11:01 PM

విజయాన్ని వినమ్రంగా స్వీకరించిన కేసీఆరే సరికొత్త పరివర్తనకు సారథి అవుతారు. ప్రజలు కేసీఆర్ మార్గాన్ని నిష్కంటకంగా మార్చారు. వెయ్యేనుగుల బలాన్నిచ్చారు. ఆయన కోరినట్లు మార్గం సుగమం చేశారు. ఈ ఘన విజయం ఒక గురుతర బాధ్యతను గుర్తుచేస్తున్నది. రైతు కంట కన్నీరు ఒలకనివ్వని రాజ్యం కోసం, కులవృత్తులు కుదుటపడే కాలం కోసం భిన్న సంస్కృతుల ప్రజలు ప్రశాంతంగా సహజీవనం చేసే సమాజాన్ని కాపాడటం కోసం పునరంకితం కావాలన్నదే ఈ విజయ పరమార్థం.
KCR_MEET
పురివిప్పి ఆడుతున్నది తెలంగాణ. పేద జనం సగర్వంగా ఎగురవేసిన జెండాతో గగనం గులాబీ వర్ణం పులుముకున్నది. నాగ ళ్లు నవ్వుతున్నయ్, మగ్గాలు ఆడుతున్నయ్, చెరువులు మత్తడి దుంకుతున్నయ్, చేపలు చిందులేస్తున్నయ్, గోదావరి, కృష్ణమ్మలు ఉప్పొంగుతున్నయ్. జై తెలంగాణ.. జయహో కేసీఆర్.. అని నినదిస్తూ.. ఒక నూతన సందర్భంలోకి సంరంభంగా అడుగుపెడుతున్నది తెలంగాణ. ఇది పేదవాడి ఎజెండాకు దక్కిన పెద్ద విజయం. ట్రికిల్ డౌన్ థియరీ లు, కాన్సెంట్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌లు, మీడియా మేనేజ్‌మెంట్లు ప్రజల చైత న్యం ముందు చతికిల పడ్డయ్. ప్రజల యధార్థ తత్వం గ్రహించారు. రేపు రూపుదిద్దే సమగ్ర దర్శనాన్ని వరించారు. ఎవ్వరి గుండెలో నిజాయితీ ఉందో, ఎవరి గొంతులో నిబద్ధత ధ్వనించిందో ఆ నాయకుడినే విజయ తీరాలకు చేర్చారు. తెలంగాణ ప్రజలు మానవీయమైన అభివృద్ధిని ఆకాంక్షించారు. ఆధిపత్యాన్ని పొలిమేర ఆవలి దాకా తరిమికొట్టారు. సంక్షేమ ఎజెండాను ఆశీర్వదించారు. స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు. ఉద్యమకా లం నాటి చైతన్యాన్ని, ఐక్యతను పునరావృతం చేశారు. ఉద్యమకాలంలో ఏ శక్తులైతే తెలంగాణ కేంద్రంగా కాకుండా కేసీఆర్ మీద గుడ్డి వ్యతిరేకత నే కేంద్రంగా పనిచేశారో అవే శక్తులు అదే తరహాలో మరోసారి ప్రయత్నిం చి అభాసుపాలయ్యాయి. ఎంతమంది కూడినా ఏ ఆశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వలేకపోయారు. ఉద్యమకాలంలో పోరాటంలో కలిసిరాక విశ్వసనీయత కోల్పోయిన వెన్నెముక లేని కాంగ్రెస్ నాయకత్వం, వలసవాద దోపి డీకి నిలువెత్తు ప్రతీక అయిన చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణను ఉద్ధరిస్తామంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు కదా? ఉద్యమకాలంలో తెలంగాణ కట్టబెట్టిన కాస్త గౌరవాన్ని కూడా కాలదన్నుకొని చంద్రబాబు పంచన చేరిన మేధావులు ఘోరమైన అవమానాన్ని మూటగట్టుకున్నారు. తెలంగాణ వాదానికి తామే సిసలైన ప్రతినిధులమని చెప్పుకుంటూ చంద్రబాబు నీడలో తెలంగాణ కోసం ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందిస్తామని ప్రగల్భాలు పలికారు.

తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి విరుద్ధంగా ప్రవర్తించి పరాజయం పాలయ్యారు. ఎం తటి మేధావులైనా తమ స్వీయ మానసిక ధోరణిని సిద్ధాంతంగా చెబితే ప్రజలు స్వీకరించరని ఇప్పటికైనా వాళ్లు గ్రహిస్తారని ఆశించడం అత్యాశ కాదు. ఉద్యమ సందర్భంలో తన వికృత ప్రవర్తనతో తెలంగాణ ప్రజల మనసులను చిత్రవధ చేసిన నాయకులు మళ్లా దిగబడటం తెలంగాణ ప్రజల పాత గాయాలను తిరిగి రేపినట్టయింది. గైరోంకి షాదీమే అబ్దుల్లా దీవానా అన్నట్లు తమకు ఏ మాత్రం సంబంధం లేని తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చి సర్వేల పేరుతో చేతబడి చేసి తెలంగాణ ప్రజలను మానసిక విభ్రమకు గురిచేద్దామని ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఈ సర్వేల వెనుకున్న సర్వాంతర్యామి ఎవరో అర్థమైన తర్వాత తెలంగాణ ప్రజలు మరింత పట్టుదలతో ఓట్లు వేసేందుకు కదిలారు. నగరాల నుంచి పల్లెల కు బయల్దేరిన ప్రతి తెలంగాణ బిడ్డ తమకు మేలు చేకూర్చిన పథకాలను తలుచుకుంటూనే తెలంగాణను పరాధీనం చేసేందుకు సాగుతున్న పన్నాగాలను పటాపంచలు చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రజల స్వాభిమాన చైతన్యాన్ని గుర్తెరిగిన వారెవరైనా ఈ వికృత విదూషకుడి విపరీత చేష్టలు తమకు వికటిస్తాయని అంచనా వేయగలుగుతారు. గుడ్డి వ్యతిరేకతతో కళ్లు మూసుకుపోయినవారు మాత్రమే ఇటువంటి ప్రయ త్నాల సాయంతో గెలువచ్చునని భ్రమించారు. భిన్నాభిప్రాయాలు వాంఛనీయమే. వైరుధ్యాలు సహజమే. ఘర్షణ ఆహ్వానించదగిందే.నిజాయితీ కలిగిన నిర్మాణాత్మకమైన ప్రయత్నాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తరు. ప్రతిపక్షం ఉండటమే ప్రజాస్వామ్యానికి ప్రతీక. కానీ తెలంగాణ మౌలిక సిద్ధాంతానికి వ్యతిరేకంగా సాగిన ప్రయ త్నాలను ఆధిపత్య శక్తులతో చేయి కలిపి చేసే చర్యలను ప్రజలు ద్రోహంగా నే పరిగణిస్తారని, సదరు మేధావులు తెలుసుకోకపోవటం విషాదం. ఏ చంద్రబాబు అయితే తెలంగాణ నేల మీద నెత్తుటేరులు పారించా డో, నరహంతక ముఠాలను అడ్డుపెట్టుకొని సామాజిక కార్యకర్తలను నరికించాడో ఆ చంద్రబాబు సరసన చేరి ఓ నా అమరులారా.. అని పాటలు పాడటం పాటను అవమానించడమే తప్పా వేరే కాదు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా పాతరేసి రాజకీయాలను నేరపూరితం చేసిన చంద్రబాబు చేయి పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే ద్వంద్వ నీతిని తెలంగాణ ప్రజలు బొంద పెట్టిన్రు.
deshapathi-srinivas
సబ్బండ వర్ణాలు కలిసిమెలిసి బతికే తెలంగాణ సమాజాన్ని కులాల ప్రాతిపదికన చీల్చాలనే చంద్రబాబు పన్నాగాన్ని అమలు పరిచేందుకు చేసిన ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు సరిగ్గా పోల్చుకున్నారు. ఉనుక మీద రోకలోలే దుంకులాడిన నాయకులు మళ్లా లేవకుండా మట్టి కరిపించిన్రు. అతి తెలివితో, వదురుబోతు తనంతో వికృతమైన దూషణలతో అకటావికట ప్రసంగాలతో సమాజాన్ని వంచించగలమనుకోవటం దురహంకారం మాత్రమే కాదు, ఉత్త మూర్ఖత్వం కూడా. నిరంతరం నీలాపనిందలు వేసేవాళ్లు కాదు, మా పొలాల నీళ్లు మలిపే నాయకులు కావాలెనని పాలమూరు ప్రజలు ఢంకా బజాయించి చెప్పిన్రు. ఇది రాజకీయాలను పరిశుభ్రం చేసే మలుపు. ప్రజలు కేంద్రంగా గంభీరమైన దృక్పథంతో రాజకీయాలను చూడాలి. అంతే తప్పా చీప్ ట్రిక్స్ పనిచేయవని చాటిచెప్పిన గెలుపు. రాబోయేరోజుల్లో తెలంగాణ ప్రజా హృదయం ప్రతిబింబించే పాలనారీతికి ఆదర్శవంతమైన నమూనాను అందిస్తుంది. విజయాన్ని వినమ్రంగా స్వీకరించిన కేసీఆరే సరికొత్త పరివర్తనకు సారథి అవుతారు. ప్రజలు కేసీఆర్ మార్గాన్ని నిష్కంటకంగా మార్చారు. వెయ్యేనుగుల బలాన్నిచ్చారు. ఆయన కోరినట్లు మార్గం సుగ మం చేశారు. ఈ ఘన విజయం ఒక గురుతర బాధ్యతను గుర్తుచేస్తున్నది. రైతు కంట కన్నీరు ఒలకనివ్వని రాజ్యం కోసం, కులవృత్తులు కుదుటపడే కాలం కోసం భిన్న సంస్కృతుల ప్రజలు ప్రశాంతంగా సహజీవనం చేసే సమాజాన్ని కాపాడటం కోసం పునరంకితం కావాలన్నదే ఈ విజయ పరమార్థం. తిరుగులేని ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి పెట్టని కోటగా నిలుస్తుంది. తెలంగాణ నిశ్చయంగా దేశానికి పథ నిర్దేశనం చేస్తుంది.

584
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles