తెలంగాణం

Tue,December 11, 2018 11:00 PM

సముద్రాన్ని
కూలగొట్టాలనుకున్నరు
ఉప్పెనలో
వాళ్ళే కొట్టుకుపోయిండ్రు
వృక్షాన్ని
నేల కూల్చాలనుకున్నరు
వీచీన గాలిలో
వాళ్ళే ఊడ్చుకుపోయిండ్రు
పర్వతాన్ని
పడగొట్టాలనుకున్నరు
అఖండ కాంతికి
వాళ్ళే భూమిలో మకిలి పోయారు
ఇక్కడ
మట్టిని ముట్టుకుంటవా
ఉద్యమమై మట్టిచేస్తది
ఇక్కడ
మాటను ఎక్కిరిస్తవా
పలుగై గుండెలను పల్గోస్తది
ఇక్కడ
పాటను బానిసను చేస్తవా
ప్రవహించే తూటై పొతం చేస్తది
ఇక్కడ
ఆత్మగౌరవంతో చెలగాటమాడుతవా
ఓటు బూటై బుద్ధి చెప్తది
జాగ్రత్త!
ఇది తెలంగాణం
- వనపట్ల సుబ్బయ్య
94927 65358
(తెలంగాణ అఖండ గెలుపుపై..)

168
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles