కేసీఆర్‌ది విలక్షణ వ్యక్తిత్వం

Tue,December 11, 2018 12:59 AM

మొదటగా చెప్పుకోవాల్సినది కేసీఆర్ భాషాభిమానం, సాహి త్యం పట్ల వారి ఆసక్తి. నోమ్ చామ్‌స్కీ అనే అమెరికన్ భాషావేత్త అంటాడు. ఒక వ్యక్తి భాషా నైపుణ్యాలు, అతని ఇతర నైపుణ్యాలన్నింటినీ నిర్ణయిస్తాయి అంటే భాష మీద పట్టు అనేది ఒక వ్యక్తిని భావనాత్మకంగా, ఊహాశక్తి కలిగేటట్టు, అతని సృజనాత్మకత పెరిగేటట్టు చేస్తుంది. ఈ సృజనాత్మకత కొత్త ఆలోచనలకు బీజం వేస్తే, ఊహాశక్తి ఆలోచనల పట్ల అవగాహన పెంచుతుంది. దానికి భావనాశక్తి తోడైతే ఏ సమస్యకైనా పరిష్కారం కనుక్కునే శక్తి కలుగుతుంది.ఉద్యమకాలంలో ప్రజలను ఉత్తేజపరిచే తిరుగుబాటు నాయకుడిగా ఎంత విజయవంతమయ్యారో, రాష్ట్ర అవతరణ తర్వాత పరిపక్వ, పరిణతి చెందిన పాలకుడిగా తన ఇంకో కోణాన్ని చూపించారు కేసీఆర్. దీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నామని డబ్బా కొట్టుకునే వాళ్ల ఊహలకు అందనటువంటి పథకాలు రచించారు, ప్రవేశపెట్టారు. ధైర్యంగా ప్రణాళికాబద్ధంగా, అతి వేగంగా పథకాలన్నీ పూర్తిచేస్తున్నారు. ఇంత వేగంగా నాలుగున్నరేండ్లలో ఒక రాష్ర్టాన్ని దేశంలోనే మొట్టమొదటి ప్రగతి రాష్ట్రంగా నిలబెట్టే విజయం ఒక ముఖ్యమంత్రికి ఉన్న అధికారం ఉంటే సరిపోదు.

తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక విలక్షణ వ్యక్తి. ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని వర్ణించడం వారి వ్యక్తిత్వంలోని ఒక చిన్న పార్శా న్ని సృజించడమే! రాజకీయ రంగం వారు ఎంచుకున్న మార్గం, అంతే. నిజానికి ఒక సమాజానికి, ప్రాంతానికి సేవ చేయాలన్న దృక్పథం ఉన్నవారికి సరైన రంగం అది. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజా సేవ చేయాలంటే అధికారం ఉండటం అత్యావశ్యకం. పాలనాధికారం, ప్రాంత వనరుల మీద అవగాహన ఉంటేనే ఆ ప్రజలకు ఏమైనా చేయడానికి సాధ్యమవుతుంది. అందుకే కేసీఆర్ దశాబ్దాల తరబడి పీడించబడిన తెలంగాణ ప్రాంతాన్ని వలస పాలకుల బారి నుంచి రక్షించి, స్వతంత్రంగా నిలుపాలని ఉద్యమం నడిపి విజయులయ్యారు. వారి చేతికి అధికారం వచ్చాకే, వారి వ్యక్తిత్వంలోని ఇతర పార్శాలను అందరూ చూడగలిగారు.

నాయకత్వం, దార్శనికత, సాహిత్య పిపాస, సేవాతత్పరత, పట్టుదల, అసాధ్యాలని సుసాధ్యం చేయగలిగిన పరిశోధనా ఆసక్తి, తెలివి, మేధ, మానవ సంబంధాల అవగాహన, బలహీనుల పట్ల ఆదరణ, ధర్మానురక్తి, స్త్రీల పట్ల గౌరవం, సంప్రదాయాల పట్ల నమ్మకం, ఆధ్యాత్మికత, అచంచల భక్తి, విలువలు కాపాడాలనే సంకల్పం, అనుకున్నది సాధించేదాకా పట్టువిడువని తత్వం, మానవ జీవితాన్ని పొందినందుకు దానిని ధన్యం చేసుకోవాలనే ఆత్రం, పెద్దలు గురువుల పట్ల గౌరవాదరాలు, భవిష్యత్ తరాలనూ రక్షించాలనే తపన, ముందుచూపు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొక ఇన్ని కనపడుతాయి వారి వ్యక్తిత్వంలో.
మొట్టమొదటగా చెప్పుకోవాల్సినది కేసీఆర్ భాషాభిమానం, సాహిత్యం పట్ల వారి ఆసక్తి. నోమ్ చామ్‌స్కీ అనే అమెరికన్ భాషా వేత్త అంటాడు. ఒక వ్యక్తి భాషా నైపుణ్యాలు, అతని ఇతర నైపుణ్యాలన్నింటినీ నిర్ణయిస్తాయి అంటే భాష మీద పట్టు అనేది ఒక వ్యక్తిని భావనాత్మకంగా, ఊహాశక్తి కలిగేటట్టు, అతని సృజనాత్మకత పెరిగేటట్టు చేస్తుంది. ఈ సృజనాత్మకత కొత్త ఆలోచనలకు బీజం వేస్తే, ఊహాశక్తి ఆలోచనల పట్ల అవగాహన పెంచుతుంది. దానికి భావనాశక్తి తోడైతే ఏ సమస్యకైనా పరిష్కా రం కనుక్కునే శక్తి కలుగుతుంది. ఇవన్నీ పుష్కలంగా ఉండబట్టే కేసీఆర్ కు పరిష్కరించలేని సమస్య ఉండదు.

భాషాభిమానం, పట్టు ఉండటంతో పాటు కేసీఆర్ రచయిత, కవి కూడా. శాస్త్రజ్ఞులు ఒక విషయం చెప్తారు. భౌతికమైన జీవితానికి పైస్థాయిలో ఉండే భావనాత్మక, సృజనాత్మక కళలు పెంపొందిన కొద్దీ మనిషిలో కరకుదనం తగ్గి సునితత్వం పెరుగుతుంది. కేసీఆర్ చాలా సున్నితమైన మనసు, ఇతరుల కష్టాలకు చలించే హృదయం ఉన్నవారు. శ్రీకాంతాచారి మరణించినప్పుడు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ భౌతిక దేహం చూసినప్పుడు, నిన్న మొన్న విద్యాసాగర్ మరణ సమయంలో నూ చిన్న పిల్లవాడిలా రోదించిన కేసీఆర్‌ను చూసిన వారికి తెలంగాణ ఉద్యమకారుడు ఈయనేనా అనిపించింది. జీవితానుభవాలకు స్పందించిన తీరే ఒక మనిషి వ్యక్తిత్వానికి అద్దంపడుతుంది.

ఇంకొక ముఖ్య లక్షణం అందరూ కేసీఆర్‌లో చూసేది ఆత్మవిశ్వాసం. దశాబ్దన్నర కాలంలో ప్రజల్లో అనుమానాలు కలిగాయే కానీ, రాష్ర్టావతరణ గురించి కేసీఆర్‌కు ఏ సందేహం లేదు. అంత దీర్ఘకాలం ఒక్క విష యం మీద జీవితాన్ని కేంద్రీకరించి పనిచెయ్యడమే వారి అపారమైన ఆత్మవిశ్వాసం తెలుపుతుంది. తనకు ఉండటమే కాదు, చుట్టుపక్కల వారికి కూడా ఆ విశ్వాసాన్ని కలిగించడం, ధైర్యం వచ్చేటట్టు చెయ్యడం నాయకుడి ముఖ్య లక్షణం. అది వారి ఉద్యమకాలంలో కంటే, ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా సమయంలో ఇంకా విస్తృతంగా అందరికీ తెలిసింది. ఆత్మవిశ్వాసానికి అమడాల లక్షణం పట్టుదల. ఇక కేసీఆర్ పట్టుదల గురించి చెప్పుకోవటం మహాత్మాగాంధీ స్వాతంత్య్రం తెచ్చారనటం వంటిది. అందరికీ వారి పట్టుదల తెలుసు. డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయటం దగ్గరి నుంచి ఆమరణ నిరహారదీక్షతో రాష్ట్ర ప్రకట దాకా ప్రతి చర్యలోనూ వారి పట్టుదల ప్రస్ఫుటమైంది. రాష్ట్ర పాలనలో అది సామాన్యులకు కూడా తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు వంటిది, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం, రైతు బంధు పథకాల రూపకల్పన వారి సృజనాత్మకతకు అద్దం పడితే, అవి రూపుదిద్దుకుంటున్న తీరు, ఆ వేగం కేసీఆర్ అకుంఠిత దీక్ష, పట్టుదలకు తార్కాణాలు.

కేసీఆర్ ఇంకొక గొప్ప లక్షణం వారి దార్శనికత. నాయకత్వం అంటే అధికారం, ఎన్నికలు కాదనీ, ఈ తరమే కాక, వచ్చేతరానికి కావాలిసినవి చేసే బాధ్యత అన్నది వారి భావాలు వారి మాటలలో పథకాల్లో ప్రతిబింబిస్తాయి. విజయాలు వచ్చినకొద్దీ వినయం పెరుగడం గొప్ప నాయకుల లక్షణం. అది కేసీఆర్‌లో చూసినవారు ఆశ్చర్యం చెందుతారు. తనకు ప్రాథమిక పాఠశాలలో పాఠాలు బోధించిన గురువుల పట్ల, తన కు చేయూతనిచ్చిన సహచరుల పట్ల, అధికారాన్ని ప్రసాదించిన ప్రజల పట్ల ఆర్ద్రత, వినయం, వినమ్రత ప్రతి మాటలో ప్రస్ఫుటమవుతాయి. కృతజ్ఞత అన్నది ఒక్కటే ఈ ప్రకృతిలో మానవుడికి ఇచ్చిన లక్షణం. అది వారు ఎప్పుడూ వారి చర్యల ద్వారా ప్రకటిస్తూనే ఉం టారు.

కేసీఆర్ తెలివి ఉద్యమం నిర్వహణ ద్వారా, ఆ తరువాత వారి ప్రణాళికల ద్వారా ప్రజలందరికీ తెలిసింది. అయితే వారి మేధో శక్తిని మాత్రం ఉద్యమకాలంలో ఎవరూ ఈ స్థాయిలో గమనించలేదు. అది కేవలం రాజకీయ చతురతగానూ, వాక్చాతుర్యంగానూ వర్ణించేవారు. కానీ అధికారంలోకి వచ్చిన యాడాది లోపలే, కరెంట్ కష్టాలు తీర్చడం, మహారాష్ట్ర ప్రభుత్వంతో నీటి పారుదల ఒప్పందాలు సాధించటంతో అంద రూ విస్తుపోయారు. దిగువ సీలేరు ప్రాజెక్టు లాక్కొని, విభజన చట్టంలో ఉన్న నిబంధనలు కూడా పాటించకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక విఫల చర్య అని నిరూపిద్దామనుకున్న వారు నోట మాట పడిపోయేటట్టు చేయడం, రాష్ర్టానికి వచ్చిన ఆపదలు తీర్చగలుగడం మామూ లు తెలివి ఉంటే సాధ్యం కాదు. కేసీఆర్ వంటి మేధస్సు ఉంటేనే అటువంటి పరిష్కారాలు అంత త్వరగా సాధ్యమవుతాయి.
kanakadhurga
ఉద్యమకాలంలో ప్రజలను ఉత్తేజపరిచే తిరుగుబాటు నాయకుడిగా ఎంత విజయవంతమయ్యారో, రాష్ట్ర అవతరణ తర్వాత పరిపక్వ, పరిణతి చెందిన పాలకుడిగా తన ఇంకో కోణాన్ని చూపించారు కేసీఆర్. దీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నామని డబ్బా కొట్టుకునే వాళ్ల ఊహలకు అం దనటువంటి పథకాలు రచించారు, ప్రవేశపెట్టారు. ధైర్యంగా ప్రణాళికాబద్ధంగా, అతి వేగంగా పథకాలన్నీ పూర్తిచేస్తున్నారు. ఇంత వేగంగా నాలుగున్నరేండ్లలో కొత్త రాష్ర్టాన్ని దేశంలోనే అత్యంత పురోగామి రాష్ట్రం గా నిలబెట్టడం ఒక అధికారం ఉంటేనే సరిపోదు. అర్ధ శతాబ్దం పాటు విధ్వంసానికి గురైన రాష్ట్రంలో, ప్రజలను అర్థం చేసుకోవటం, ప్రాంత వనరుల మీద అవగాహనతో, ప్రజలకు ఏది వెంటనే అవసరమో, ఏది భవిష్యత్తులో అవసరమో తెలుసుకొని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక పథకాలు రచించి పూర్తిచేయటం, ఏ విషయాన్ని అయినా అర్థం చేసుకునే నైపు ణ్యం, దానికి తగిన మనుషులని నియమించి పనిచేయించటం, ముఖ్యంగా దానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవటం.. ఇవన్నీ చేయాలంటే నిబద్ధత, నైపుణ్యం, ప్రజల మీద ప్రేమ, పట్టుదల, దీక్ష అన్నీ కలిస్తేనే సాధ్యం. ఇవన్నీ కేసీఆర్‌లో మూర్తీభవించి ఉన్నందు వల్లనే ఇన్నరకాల పథకాలు అమలవుతున్నాయి. నాలుగేండ్లలో ఒక్క భవనానికి ప్రణాళిక రచించలేని వారికి ఇది అర్థం కాదు.

ఈ లక్షణాలన్నింటినీ మించి కేసీఆర్ గాఢంగా వాంఛించేది మనుషులు మానవీయత కలిగి ఒక గుణాత్మకమైన, సంస్కారవంతమైన ధార్మిక జీవనం గడుపాలన్న వారి ఆశయం. భౌతికావసరాలు తీర్చటం ఏ నాయకుడికైనా సాధ్యపడుతుంది. కానీ మానసిక ఔన్నత్యంతో తేడాలను మరిచి ప్రజలందరూ కలిసి మెలిసి జీవించాలన్న వారి ఆశయం వారిలోని నిజమైన లౌకికవాదిని ప్రపంచానికి ప్రదర్శిస్తోంది. తన సంప్రదాయాలను ఎంత గౌరవిస్తారో, వేరేవారి సంప్రదాయాలనూ అంతే గౌరవించి, లెట్ ఎవిరిబడీ లివ్ హాపిలీ అన్నదే వారి దృక్పథం. మతాల పేరు తో అసహనం పెరుగుతున్న ఈ కాలంలో కేసీఆర్ వంటి ధార్మికత కలిగి న గొప్ప నాయకుడు దేశానికి చాలా అవసరం. మినీ ఇండియా లాంటి తెలంగాణ ప్రాంతాన్ని పాలించగలిగిన కేసీఆర్ తన విశాలతత్వంతో దేశానికి కూడా సేవ చేస్తారని ఆశిస్తున్నది తెలంగాణ ప్రజ.

579
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles