మేకపోతు గాంభీర్యం

Tue,December 11, 2018 12:54 AM

పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టించినట్లు ఉన్నది కాం గ్రెస్ వైఖరి. ఇంకా ఫలితాలే విడుదల కాలేదంటే ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న దని, తమనే ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేయ డానికి గవర్నర్ ఆహ్వానించాలని గవర్నర్ కలువ డం హాస్యాస్పదం. వీరి పోకడలు చూస్తా ఉంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్లు కనిపిస్తున్న ది. ఓ వైపు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్లు ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులను చూస్తుంటే ఓటమిని అంగీకరించినట్లే అర్థమవుతున్నది. లగడ పాటి సర్వే మొదలు నిన్నటి గవర్నర్ కలువడం వరకు అన్ని సంఘటనలు కాంగ్రెస్ భయాన్ని తెలుపుతున్నది. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ప్రజా తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనున్నది. కేసీఆ ర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉండబోతు న్నదన్నది నగ్న సత్యం.
- పుల్కం సంపత్‌కుమార్, రాములపల్లి, పెగడపల్లి

కాంగ్రెస్ వక్రబుద్ధి

టీఆర్‌ఎస్‌కు చెందిన గెలువబోయే ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేక ఎత్తులు వేస్తున్నది. ప్రలోభాలతో ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలనే వారి వైఖరి గర్హనీయం. ఈ సందర్భంలో టీఆర్‌ఎస్ పార్టీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రజలు అధికారపార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేసినట్టు జాతీయ సర్వేల బట్టి తెలుస్తున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది.
- బోడపట్ల కిషన్, కురిక్యాల, గంగాధర, కరీంనగర్

అభినందనలు

ఆడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించడం అభినందనీయం. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ ముందున్నది. ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై నెగ్గిన భారత్ ఇదే జోరు కొనసాగించి మిగతా టెస్టుల్లో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలి.
- బి. రామాంజనేయులు, హైదరాబాద్

259
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles