ఏమి నటన! ఎంత గొప్ప నాటకం!!

Sun,December 9, 2018 02:59 AM

తెలంగాణ సమాజమంతా ఎటువైపు ఉన్నదో కనిపిస్తూనే ఉన్నది. అయినా సరే, ఆంధ్రా నాటకాలు సాగుతూనే ఉంటాయి. నాటకాలను నాటకాలుగానే చూడాలె. పాత్రధారులను నటులుగానే అర్థం చేసుకోవాలె.

కొద్దిరోజుల కింద ఒక దోస్తు అడిగిండు. నువ్వు సినిమాలు ఎందుకు చూడవ ని. గత ముప్ఫై ఏండ్ల కాలం తీసుకు న్నా, కనీసం మూడు సినిమాలైనా చూసి ఉండ ను. నాకు ఈ ఆంధ్రా సినిమాలు చూడబుద్ధి కాదు. ఒక్కడికీ మొహంలో హావభావాలు ఉం డవు. మాటలు పెగలవు. పాఠం అప్పగించిన ట్టు మాట్లాడుతరు. అందులో చూడటానికి ఏముంటుంది, మన భాష రాని ఒక హీరోయి న్ తప్ప! ఏ కష్టం లేకుండానే మనకు బోలెడంత వినోదం దొరుకుతున్నప్పుడు, ఇంక ఈ సినిమాలు చూడటానికి కష్టపడి క్యూలో నిలబడి టికెట్ కొనుక్కోవడం ఎందుకు! అసలైన ఆంధ్రా నటులు సినిమాల్లో లేరు, బయటనే ఉన్నరు. అసలైన నాటకాలు డైలీ సీరియల్ మాదిరిగా మన కండ్లముందు వరుసపెట్టి నవరసాలు పండిస్తున్నాయి. ఆంధ్రా రాజకీయ నాయకులు, సినిమారంగం నుంచి దిగుమతైన బుల్‌బుల్ బాబాయిలు, అబద్ధాలు పండించే టీవీ ప్రెజెంటర్లు బోలెడంత వినో దం అందిస్తూనే ఉన్నరు. ఆంధ్రా భృత్యువర్గం నాయకులుగానే కాదు, కొందరు మేధావులు, ఉద్యమకారుల రూపంలోనూ ఉన్నది. వీరూ నాటకాలను రక్తి కట్టించగలరు. చార్లీ చాప్లిన్ సినిమా చూసినట్టు ఒకింత వినోదం, మరింత విషాదంగానూ ఉంటుంది. కొంతకాలంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ పేర ఎంత గొప్ప నాటకం సాగుతున్నదో చూస్తూనే ఉన్నాం. ఈ నాటకంలో సినిమా నటులను కూడా దింపారు. ఏ మాటకామాట చెప్పుకోవాలె. లగడపాటి మాదిరిగా వినోదాన్ని పండించే వ్యాపారవేత్త ఎవరుంటారు చెప్పండి! నిరాహారదీక్ష ముద్దు ముచ్చట్లు, నిమ్స్‌లోకి పరుగెత్తి మం చంలో డభాల్‌న పడటం, మళ్ళా బయటకు వచ్చి నిరాహార దీక్ష(?)ను విరమిస్తున్నట్టు నిమ్మరసం తాగడం- ఒక మంచి క్యారెక్టర్ నటుడిని మరిపింపజేసిండు. ఇదే తెలంగాణ వాది అయితే ఆంధ్రా మీడియా ఎంతగా పరువు తీసేదో. మళ్లా అతడు కనిపిస్తే ఆ నిరాహారదీక్ష గురించి ఎన్ని అడ్డమైన ప్రశ్నలు వేసేదో. కానీ ఇప్పటికీ అతడి మాటలకు పవిత్రతను ఆపాదించడం ఆంధ్రా మీడియా గొప్పతనం.

అతడొక గొప్ప రాజకీయ విశ్లేషకుడా.. కాదు. అతడు శాస్త్రీయంగా సర్వేలు జరుపుతాడా, అతడి అంచనాలు నిజమయ్యాయా అంటే అదీ లేదు. తమిళనాడులో డీఎంకే గెలుస్తుందన్నాడు. కర్ణాటక ప్రజలు బీజేపీకి పట్టం కడుతారన్నడు. తాజా ఎన్నికలలోనైనా సర్వే ఎట్లా జరిపాడనేది ఎవరికి తెలువదు. అతడిలో నిజాయితీ ఉందా అంటే అసలే లేదు. అయినా సరే, అతడినొక ఉత్తమోత్తముడు, మేధావి అన్నట్టుగా చూపిస్తున్నాయి. ఆంధ్రా చానెల్స్ ఎన్ని నాటకా లు ఆడినా, రేపటి ఫలితాలు మారవు కదా? మరి ఈ అబద్ధపు ప్రచారం చేయడమెందు కు అని ఒక మిత్రుడు ఆశ్చర్యపోయాడు. వారు ఈ రెండు రోజుల గురించే ఆలోచించ డం లేదు. వారికి కావలసింది తెలంగాణ వారిలో ఎప్పుడూ నైరాశ్యాన్ని నింపుతూ ఉం డటం. తెలంగాణ ప్రజల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బకొట్టడం.జీరోలను హీరోలుగా చూపించడమెట్లా అనేది అర్థం కావాలంటే, ఓటుకు నోటు కేసు మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల ఘట్టం వరకు రేవంత్‌రెడ్డి కేంద్రం గా చంద్రబాబు అండ్ కో, ఆంధ్రా మీడియా నడిపి న నాటకాలను చూడాల్సిందే! ఇదే తెలంగాణ పక్షం ఉండే నాయకుడైతే అతడి నిర్వాకాన్ని పదేపదే ప్రశ్ని స్తూ చీల్చి చండాడేవారు. కానీ ఆంధ్రనాయకుల మనిషి కదా! అతడు జైలు నుంచి విడుదలై వస్తే, కుటుంబం కన్నీళ్లు పెట్టే దృశ్యాలతో సహా ఎంత కరు ణ రసం పండించారు. కెమెరాల ముందు నగ్నంగా దొరికిన వ్యక్తికి ఇంకేమి మిగిలి ఉంటుంది. నాలాగా అన్ని విలువలు వదిలి నడిరోడ్డు మీద నిలబడగల రా అనే రీతిలో సవాల్ చేస్తుంటే, టీవీ చానెల్స్ దాని ని రేవంత్ వీరత్వంలా చూపిస్తుంటాయి. కొడంగల్ లో అతడు ఓడిపోతున్నాడనే వార్తలు వ్యాపించడం తో, తలపండిన పాత్రికేయులు నడిపే టీవీ చానెల్స్ ఎంతో మర్యాద ఉట్టిపడేరీతిలో అతడి ఇంటర్వ్యూ లు ప్రసారం చేస్తూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయత్నం చేశాయి. ముఖ్యమంత్రి సభలు జరుగకుండా ధర్నాలు చేస్తామని రేవంత్‌రెడ్డి అనడంలో తప్పులేదంటూ, ఒక పెంపుడు మేధావి చేత మాట్లాడించారు. ఆంధ్రా పాలకవర్గానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మద్దతు ఇవ్వడానికి మేధావులు వీళ్ళ జేబులో సిద్ధంగా ఉంటారు. బాబు డ్రామా కంపెనీలో రేవంత్‌రెడ్డి చిన్న పాత్ర నుంచి ప్రధాన పాత్ర వరకు ఎదిగాడు.

2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మెజార్టీ సాధిస్తుందని బాబు ఊహించలేదు. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని రెండు రాష్ర్టాలను పాలించడానికి స్క్రిప్టు రెడీ అయిం ది. ఈ స్క్రిప్టు ప్రకారం- తెలంగాణ ప్రజలు విడిపోవడం వల్ల ఎదురైన కష్టాలు భరించలేక, మళ్ళా కలి సి ఉం దామని బావురుమంటారు. కానీ కథ వేరే మలుపు తిరిగింది! టీఆర్‌ఎస్ మెజార్టీ సాధించి కేసీఆర్ సీఎం అయ్యారు. దీంతో ఇంకో స్క్రిప్టు తయారైంది. అందులో రేవంత్‌రెడ్డి పాత్ర చిన్నదే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కూడగట్టడానికి బాబు ఉపయోగించుకున్న సంధానకర్తలలో ఒకరు. ఆ బండారం బట్టలైంది. కానీ నోట్ల కట్టలు ముందు పెట్టుకొని దొరికిన సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరుకు చంద్రబాబు, ఔరా ఇతడిలో ఇంత గొప్పతనం దాగి ఉన్నదా అని అబ్బురపడి ఉంటాడు. తెలంగాణ సమాజాన్ని విభజించి పాలించే నాటకంలో ఇతడి ప్రధాన పాత్ర అని అప్పుడే గుర్తించి ఉంటా డు. ఇంతకూ ఆ నాటకం ఏమిటి? అందులో రేవం త్ రెడ్డి పాత్ర ఏమిటి? ప్రజల మద్దతు పొందడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి- నిజంగా అభివృద్ధి పనులు చేసి ఓట్లు అడుగడం. రెండవది- సమాజంలో కులాల వారిగా విభేదాలు సృష్టించి, ఆయా కులాలకు, ఉపకులాలకు తగవులు పెట్టడం. ఈ కులాలకు ప్రతినిధులుగా తమ తాబేదారులను ప్రతిష్ఠించి, వారిని తమ గుప్పిట పెట్టుకోవడం. ఈ రెండవ మార్గమే ఆంధ్రా పాలకవర్గం ఆడే నాటకం. ఒకే కులంలోని రెండు ఉపకులాల మధ్య చిచ్చుపెడుతరు. ఈ రెండు ఉప కులాలకు చంద్రబాబు కీలుబొమ్మలు నాయకులుగా ఉంటారు. ఈ ఇరువురు నాయకులు తమ వర్గాన్ని రెచ్చగొడుతూ, చంద్రబాబు ఎజెండా అమ లుచేస్తుంటారు. ఇటువంటి నాటకాలు ఆంధ్రలో, తెలంగాణలో చాలా ప్రదర్శనలకు నోచుకున్నాయి. ఆంధ్రాలో ఒక కులం వారు టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ఈ కులం వారు ఏకతాటిపైకి వస్తున్నారని పసిగట్టగానే, మీడియా ద్వారా సరికొత్త నాటకం మొదలవుతుంది. వీరిలో ఒక నాయకుడిని సృష్టించి, మీడియా ద్వారా అతడికి ప్రచారం కల్పిస్తారు.

ఆ సామాజిక వర్గం నాయకుల చేత పరస్పర ఆరోపణలు చేయించి గందరగోళం సృష్టిస్తారు. ఆ అయోమయంలో వారు దిక్కుతోచకుండా పోతా రు, వారి ఆవేశం చల్లారిపోతుంది. ఈ మధ్య తాప కో సినిమా యాక్టర్‌ను రంగంలోకి దింపుతున్నారు. అతడు చంద్రబాబును తిడుతూనే, చంద్రబాబుకు అనుకూలమైన వ్యూహం నడుపుతుంటాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్‌కన్నా ఇది మరింత సుదీర్ఘమైన నాట కం. ఈ ఆంధ్రా నాటకమే కొత్త టైటిల్, కొత్త నటులతో ఇప్పుడు తెలంగాణలోనూ ప్రదర్శితమవుతున్నది. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రేవంత్‌రెడ్డిని ఒక సామాజికవర్గానికి ప్రతినిధిగా చూపిస్తున్నారు. ఇం దులో భాగంగా అత్యంత కుట్రపూరితంగా అతడిని టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. చంద్రబాబు మొహం చూసి ఓటేయబుద్ధి కానివారికి, ఎదురుగా రేవంత్‌రెడ్డిని మహావీరుడులాగా చూపిస్తున్నారు. ఆంధ్రలో చంద్రబాబు వ్యూహంలో చిక్కుకున్న కులాలన్నీ గిలగిలలాడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడి కులాలను కూడా తమ వ్యూహంలో బందీలుగా చేయడానికే ఈ నాటకమంతా! చంద్రబాబు అండ్ కో రేవంత్‌రెడ్డిని, మరికొంద రు తాబేదారులను ముందుపెట్టి భారీ బడ్జెట్ సినిమానే నిర్మించింది. అది విజయవంతమవుతుందా అనేది అర్థంకాక ఆంధ్రా మీడియాకు పిచ్చెక్కిపోతున్నది. తెలంగాణ సమాజం కులాలవారిగా చీలిపో యి, అధికారాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాలనే ది వాళ్ళ ఆశ! కానీ తెలంగాణ సమాజం ఏకతాటిపై ఉన్నదని, కేసీఆర్ అభివృద్ధి పథకాలకు, పాలనావిధానాలకు పూర్తి మద్దతు ఉన్నదని సర్వేలు సూచిస్తున్నాయి. అయినా సరే, వాస్తవాన్ని అంగీకరించే నైజం వారికి లేదు కదా! కొత్త నాటకాలకు తెరలేపుతూనే ఉంటారు. పాత నటులు కాలం చెల్లిపోతే, కొత్త పాత్రధారులను వెదుక్కుంటారు. ఈ రోజు మధ్యాహ్నం మా బంధువు ఇంటికి భోజనానికి వెళ్ళాను. అక్కడ సంభాషణ ఎన్నికల ఫలితాలపైకి మళ్ళింది. రేవంత్‌రెడ్డి ఓడిపోతే ఐదు కొబ్బరికా యలు కొడుతానని మొక్కాను అన్నాడు మా అన్నయ్య.
PVS
రేవంత్‌తో పాటు టీడీపీకి చెందిన అభ్యర్థులు కనీసం సగంమంది ఓడిపోయినా నేను దేవుడికి ఐదు కొబ్బరికాయలు కొడుతానని మరో బంధువు అన్నా డు. ఇంతలో మా ఊరు రేకొండ నుంచి మా కజిన్ ఫోన్ చేసిండు. పోలింగ్ సరళి ఎట్లా ఉందని అడిగిన. పోలింగ్ బూత్‌లో వృద్ధులు కారు గుర్తు చూపించు బిడ్డా కనిపిస్తలేదు అంటూ అడిగివేస్తుంటే, ఇతర పార్టీ ఏజెంట్లు ఆశ్చ ర్యపోయారని చెప్పిండు. తెలంగాణ సమాజమంతా ఎటువైపు ఉన్నదో కనిపిస్తూనే ఉన్నది. అయినా సరే, ఆంధ్రా నాటకాలు సాగుతూనే ఉంటా యి. నాటకాలను నాటకాలుగానే చూడాలె. పాత్రధారులను నటులుగానే అర్థం చేసుకోవాలె. తెలంగాణ వారు ఇవన్నీ నిజమని నమ్మవద్దు, నైరాశ్యం చెందవద్దు.

760
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles