మూడు అంశాలే గెలుపు బాటలు

Fri,December 7, 2018 12:45 AM

ఒక పాపులర్ గవర్నమెంట్ పట్ల ప్రజల్లో పాజిటివ్‌నేస్ రావాలంటే పై ముడు అంశాలే కీలకమవుతాయి. ఈ మూడు అంశాల్లో విఫలమైన ప్రతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. మూడు సా ర్లు తెలుగుదేశం ఓటములు, ఐదుసార్లు కాంగ్రెస్ ఓటములే అందుకు సాక్ష్యం. తెలంగాణ చరిత్రలో ఆ మూడు సమస్యలను తీర్చిన మొదటి పాలకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. కేసీఆర్ పాజిటివ్ పాలకుడనే పేరు ఇవాళ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉన్నది.శాంతిభద్రతలు, విద్యుత్, తాగునీరు అనేవి ప్రజలు కనీస అవసరాలుగా చూస్తారు. వాటిని ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు నిర్ధాక్ష్యిణ్యంగా ఓడిస్తారని చరిత్ర చెబుతున్నది. ఆ మూడు సమస్యలను శాశ్వతంగా తీర్చిన పాలకుడికి బ్రహ్మరథం పడుతారు. ఆ పాలకుడి పట్ల ప్రజల్లో ఆపార విశ్వసనీయత ఏర్పడుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ సాధించుకున్నది అదే.

ఒక పాపులర్ గవర్నమెంట్ విజయం దేనిపై ఆధారపడి ఉంటుం ది? సమాధానం మూడు ముచ్చట్లలో చెప్పొచ్చు. అవి శాంతి భద్రతలు, విద్యుత్తు, తాగునీరు అని. ఈ మూడు అంశాలే ప్రజలను మౌలికంగా ప్రభావితం చేస్తాయి. ఒక ప్రభుత్వ పనితీరుకు ఆ మూడింటినే కొలమానంగా తీసుకొని ఆ ప్రభుత్వం పట్ల ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తారు. ఆ తర్వాతనే సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలను పరిగణిస్తారు. నాలుగున్నరేండ్ల కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఓటరు పాజిటివ్‌గా ఉండడానికి ప్రధానంగా ఆ మూడు అంశాలే కారణం. సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలు అదనపు కారణాలు.2004లో చంద్రబాబు ఓటమికి పైన పేర్కొన్న మూడు అంశాలే ప్రధాన కారణాలు. బాబు ప్రభుత్వంలో తెలంగాణ పల్లెల స్థితిగతులను ఒకసారి వెనక్కివెళ్లి గుర్తుచేసుకుందాం. అంతులేని కరెంట్ కోతలు, భయంకరమైన కరువు, దండుగగా మారిన వ్యవసాయం. ఉపాధి కోల్పోయిన ఊర్లు. సాగు, తాగునీటి సమస్య. సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయి. ఇక తాగునీటి గురించి చంద్రబాబు ఎన్నడూ ఆలోచించిన పాపాన పోలేదు. ఆ రోజుల్లో తెలంగాణ పల్లెల్లో రాజస్థాన్ ఎడారుల వలె దుర్భర పరిస్థితులు తాండవించాయి. అదే నేపథ్యంలో విద్యుత్ కోతలపై కేసీఆర్ చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీకి రాజీనా మా చేశారు, తెలంగాణ అస్థిత్వ రాజకీయానికి పురుడుపోశారు. 2004 లో బాబుకు ప్రజలే కరెంట్ షాక్ ఇచ్చి అధికారం నుంచి దించేశారు.

కరెంట్ కొరత తెలంగాణకు వారసత్వంగా లభించింది. ఈ సమస్య ను అధిగమించడమే కేసీఆర్ ప్రభుత్వానికి ఒక సవాల్‌గా మారింది. ఒక ప్రభుత్వ ప్రతిష్టతో ముడిపడిన సమస్య అది. ఆరు నెలల్లోనే ఆ సమస్య ను అధిగమించారు. నిజంగా మరో ప్రభుత్వమే ఉంటే అధిగమించేవారు కాదు. సమస్య మీద పట్టుదల, సమర్థత తోడైతేనే ఏదైనా సాధ్యం. కేసీఆర్‌లో ఆ రెండు లక్షణాలూ బలంగా ఉన్నాయి కాబట్టే కరెంట్ కష్టాల నుంచి తెలంగాణ బయటపడింది. ఇవాళ దేశంలోనే విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 స్థానాన్ని సాధించింది. ఈ విషయం ఎవరో చెబుతున్నది కాదు. స్వయాన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అధికారికం గా ప్రకటించింది. విద్యుత్ నిత్యావసర వస్తువు జాబితాలో చేరిపోయిం ది. విద్యుత్ లేకుంటే బతుకులే ఆగిపోయే కాలమిది. అలాంటి సమస్య ను దాదాపు శాశ్వతంగా తీర్చిపెట్టిన ఘనత కేసీఆర్ సాధించుకున్నారు. వ్యవసాయరంగంపై 60 శాతం జనాభా ఆధారపడింది. పరిశ్రమలు, సేవల రంగాలపై జనాభాలో 40 శాతం ప్రజలు ఆధారపడి బతుకుతున్నారు. ఇటు పరిశ్రమలు, సేవల రంగానికి, అటు వ్యసాయరంగానికి నిరంతర విద్యుత్ అందించి తెలంగాణ ప్రజల ఉపాధులకు భద్రత కల్పించారు. ఒక ప్రభుత్వ పనితీరుకు అదొక గొప్ప విజయం.

ప్రజల ఉపాధికి భద్రత కల్పించగలిగితే.. సమాజం ప్రశాంత జీవతాన్ని అనుభవిస్తుంది. ఇవాళ తెలంగాణలో ఉన్నది అన్‌రెస్ట్ కాదు, బిజీ వర్క్. ఉత్పత్తుల పెరుగుదల, జీవన ప్రమాణాల పెరుగుదల వెనుకాల ఉన్న నిజమై న హీరో ఎవరంటే కేసీఆర్ సాధించిన విద్యుత్తే. విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన కేసీఆర్ పాలన పట్ల సహజంగానే ఓటర్ పాజిటివ్ గా ఉంటాడు. కేసీఆర్ పాలనకు అది మొదటి గీటురాయి.గత చరిత్ర నిండా కాంగ్రెస్ ఓటములకు కూడా ఆ మూడు అంశాలే కారణాలయ్యాయి. ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమంటే, కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంతిభద్రతల విషయంలో ఘోరంగా విఫలమైనాయి. శాంతిభద్రతలు దురుపయోగం కావడం కాంగ్రెస్ ప్రభుత్వాల హయంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. శాంతిభద్రతల విషయంలో ప్రజలకు ఎప్పుడు విశ్వాసం పోయినా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటముల పాలైందని చరిత్ర చెబుతున్నది. కాంగ్రెస్ కర్ఫ్యూల పాలనను ప్రజలు మరువలేరు. పదవుల కోసం మత కలహాలు సృష్టించుకున్న కాంగ్రెస్ చరిత్ర తుడిచేసినా పోయేది కాదు. శాంతిభద్రతల విషయంలో కాంగ్రెస్ అలసత్వ పాలనలను ప్రజలు ఎప్పుడూ ఓడిస్తూ వచ్చారు. ప్రజలు ఎలాంటి శాంతిభద్రతలు కోరుకుంటారో అంతకు మించిన శాంతి భద్రతలను కేసీఆర్ ప్రభు త్వం అందించగలిగింది. అందుకు ఉదాహరణలు అనేకం. మైనార్టీలు జీవించే ప్రాంతాల్లో ఎన్నడూ చూడనంత స్థాయిలో మత సామరస్యం ఇవాళ మనకు కనిపిస్తున్నది. మెజార్టీ, మైనార్టీ భావన కరిగిపోయింది. సోషల్ కెమిస్ట్రీలో కేసీఆర్ విజయం సాధించారు. మత పోకడల స్థానం లో సామరస్యం సాధించిన ఘనత తప్పక కేసీఆర్‌దే. మత వాదానికి సైతం మానవీయ కోణాన్ని నేర్పిన ఘనత ఆయనదే.

మోజమ్‌లకు, అర్చకులకు, బిషప్‌లకు జీతాలివ్వడాన్ని కొందరు సిం పుల్‌గా అర్థం చేసుకోవచ్చు. కానీ అది సమాజానికి గొప్ప సందేశాన్ని అందించిదని మారిన సామాజిక పరిస్థితులే చెపుతున్నాయి. తెలంగాణలో మావోయిస్టుల ఉనికి ఒకప్పటి మాట. తెలంగాణ వచ్చాక ఆ అన్‌రెస్ట్ నుంచి సమాజాన్ని మరల్చడంలోనూకేసీఆర్ విజయం సాధించారు. ఈవ్‌టీజింగ్‌లు, పేకాట క్లబ్బులు, మట్కాలు, గుడుంబా ఖానాలు బంద్ చేయించడం గత ప్రభుత్వాలకు ఎందుకు చేతకాలేకపోయాయో తెలియంది కాదు. రాజకీయ నేతలకు అవి వ్యాపారంగా మారడం తెలియని విషయం కాదు. కానీ ఆ విషయంలో కాంగ్రెస్, టీడీపీల కన్నా టీఆర్‌ఎ స్ ఎంతో మేలనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. పోలీసు వ్యవస్థను సం స్కరించారు. క్రైమ్ రేటు, తగ్గడం, దొంగతనాలూ తగ్గడం చెప్పుకోదగ్గ విషయాలు. చైన్ స్నాచింగ్‌లు 90 తగ్గాయని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. దొంగల బెడద 60 శాతం తగ్గింది. గత ప్రభుత్వాల కాలంలో నేరాలు పెరుగడం తప్ప తగ్గడం చూసిన దాఖలా లేదు. నేరాలు తగ్గడమనేది ఇపుడే చూస్తున్నాం. తీవ్రవాదులకు నగరం ఒకప్పుడు అడ్డా అనే పేరుండింది. రాజకీయాల కతీతంగా తీవ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించారు. రాజకీయాలకు,అసాంఘిక శక్తులకు ఉండే బంధాన్ని తెంచడంలో కేసీఆర్ చాలామేరకు విజయం సాధించారు. ఇవాళ తెలంగాణ సమాజం ప్రశాంత వాతావరణంలో బతుకుతున్నది. శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు అది మరో గీటురాయి.

ఇక తాగునీరు విషయంలో తెలంగాణ యాభై ఏండ్లుగా తండ్లాడుతూనే వచ్చింది. గత పాలకులు సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించినట్లే తాగునీటి సమస్యనూ గాలికి వదిలేశారు. ఏ ప్రభుత్వమూ శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించింది లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా సుమారుగా 22 వేల గ్రామాల్లో ప్రతి ఇంటికి శుద్ధమైన మంచినీరు అం దించే పథకాన్ని చేపట్టడం ఒక సాహస నిర్ణయమనే చెప్పాలి. గడిచిన నాలుగేండ్లలో ఈ పథకం శరవేగంగా సాగుతుండటం గమనార్హం. ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తయ్యాయి. ప్రతి గ్రామం బయట భగీరథ వాటర్ ట్యాంకుల నిర్మాణం మనం ఏ ఊరికి వెళ్లినా కనిపిస్తున్నాయి. ఇంటింటికి పైపులైన్ పనులూ కనిపిస్తున్నాయి. మేజర్ పనులూ వేగవంతంగా నడుస్తున్నాయి. వేలాది గ్రామాలకు భగీరథ నీళ్లు ఇప్పటికే అందుతున్నాయి. మిగిలిన ప్రాంతాలకూ వచ్చే ఆరు నెలల్లో అందే అవకాశాలున్నాయి. ప్రతి ఇంటికీ తాగునీరు అందబోతుందనే నమ్మకం ప్రజల్లో ఇప్పటికే ఏర్పడింది. ఎందుకంటే జరుగుతున్న పనులు వాళ్ల కండ్ల ముం దు కనిపిస్తున్నాయి. ఈ విధంగా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనతనూ కేసీఆర్ దక్కించుకున్నారు. కేసీఆర్ పాలనకు ఇది మూడో గీటురాయి.
KSR
ముందే చెప్పుకున్నట్లు ఒక పాపులర్ గవర్నమెంట్ పట్ల ప్రజల్లో పాజిటివ్‌నేస్ రావాలంటే పై ముడు అంశాలే కీలకమవుతాయి. ఈ మూడు అంశాల్లో విఫలమైన ప్రతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. మూడు సా ర్లు తెలుగుదేశం ఓటములు, ఐదుసార్లు కాంగ్రెస్ ఓటములే అందుకు సాక్ష్యం. తెలంగాణ చరిత్రలో ఆ మూడు సమస్యలను తీర్చిన మొదటి పాలకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. కేసీఆర్ పాజిటివ్ పాలకుడనే పేరు ఇవాళ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉన్నది.సంక్షేమ పథకాలకు ఏటా 40 వేల కోట్లు ఖర్చుచేయడం, అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడం, పూర్తి చేయడం, పరిశ్రమలకు పెట్టుబడులు సాధించడం లాంటి లెక్కకు మించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను.. ప్రజల పాజిటివ్‌కు అదనపు ఆకర్షణలుగా భావించాలి. ప్రజలు జీవించడానికి ముందుగా మౌలిక వసతులను కోరుకుంటారు. శాంతిభద్రతలు, విద్యుత్, తాగునీరు అనేవి ప్రజలు కనీస అవసరాలుగా చూస్తా రు. వాటిని ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు నిర్ధాక్ష్యిణ్యంగా ఓడిస్తారని చరిత్ర చెబుతున్నది. ఆ మూడు సమస్యలను శాశ్వ తంగా తీర్చిన పాలకుడికి బ్రహ్మరథం పడుతారు. ఆ పాలకుడి పట్ల ప్రజ ల్లో ఆపార విశ్వసనీయత ఏర్పడుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ సాధించుకున్న విశ్వసనీయత అదే.

401
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles