కేసీఆర్ తత్వం మానవత్వం

Wed,December 5, 2018 11:00 PM

ఆశావర్కర్లు, అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, హోంగార్డులు, బీడీ కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడిపే పద్ధతిలో కేసీఆర్ పింఛన్లను, వేతనాలను సమకూర్చటంతో ఆయా వర్గాల్లోని 80 శాతం గృహిణులు తమ కుటుంబాల్లోని ఆబాలవృద్ధుల సంక్షేమానికి కృషిచేస్తున్నారు. దీంతో కుటుంబ తగాదాలు తగ్గి ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వరంగంలో 33 శాతం ఉద్యోగాలతో కుటుంబాలను తీర్చిదిద్దుకుంటున్న మహిళలకు వీరు కూడా తోడైతే మరో ఐదేండ్లలో తెలంగాణ సమాజంలో స్త్రీ నాయకత్వం స్థిరపడే అవకాశాలున్నాయి. ఈ అంశం మీద ఔత్సాహిక పరిశోధకులు పరిశోధన చేయవలసిన అవసరం ఉన్నది.

కాళేశ్వరం ప్రాంతంలోని ఏ శమీవృక్షం నీడలోనో తపస్సు చేసిన ఒక క్షత్రియ రుషి మరుజన్మలో కేసీఆరై జన్మించి ఉంటారు. లేని పక్షంలో ప్రజాహితం కోసం ఇన్ని పథకాలు, ప్రణాళికలు రచించటం సాధ్యం కాదు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌తో పోల్చిచ చూసుకున్నా కేసీఆర్ ఎంత ముందున్నారో ఊహించటం కష్టం కాదు. సాధారణంగా ప్రజలు వేరు, ఓటర్లు వేరు. కానీ కేసీఆరే విద్యుదీకరించే తన ప్రసంగాలతో ఓటు హక్కులేని వాళ్లను కూడా తన అయస్కాంత క్షేత్రంలోకి ఆకర్షించగలిగారు. ఎం తైనా రెప్పపాటు కూడా పోని కరెంటు ఇచ్చి దేశం దృష్టిని తనవైపు మళ్లించుకున్న వారు కదా! రైతులకు బీమా పథకాన్ని కేసీఆర్ ప్రారంభించిన రోజు సంబంధిత ఎల్‌ఐసీ ఉన్నతాధికారి కూడా ఇట్లాంటి పథకాన్ని అమలుపరుచటానికి ఎంతో దార్శనికత అవసరమన్నాడు. Administration with hum -an touch అన్నారు. ఒంటరి మహిళలకు నెలవారీ పింఛన్ కల్పించాలన్న ఆలోచన అత్యంత మానవీయం. మహిళలు ఎన్నో విషాదాలకు లోనై, ఊహకందని పరిణామాల మూలంగా ఒంటరి మహిళలుగా మిగిలిపోయి కుటుంబాలు లేక కుమిలిపోతుంటారు. అట్లాంటి వారిని ఆదుకుంటున్న కేసీఆర్ అనాథల పాలిట చిన్నాన్న కాగలిగారు. స్త్రీవాదుల ప్రశంసలు కూడా పొందగలిగారు. వృద్ధాప్యమనే రోగం ముసలివాళ్లను అం దరూ దిక్కులేనివాళ్లను చేస్తుంది. తన కుటుంబమే నిరాదరిస్తున్నా దశ వల్లకాడు కూడా నిరాకరించే దుర్దశ. అట్లాంటి చోట ఆసరా పేరుతో అస లు సిసలు పెద్దకొడుకుగా రంగప్రవేశం చేస్తున్నారు కేసీఆర్. కొందరిది అనుదిన సమస్య అయితే వికలాంగులది అనుక్షణ సమస్య. పదిహేను వందల నుంచి మూడువేల రూపాయలకు పింఛన్ పెరుగనుండటంతో వారిలో బతుకుపట్ల భరోసా ఏర్పడుతుంది.

కేసీఆర్ కిట్లు నిరుపేద మాతృమూర్తుల పాలిట వరాలు పుట్టిన పసిబిడ్డలకు నగదు మంచి పోషకాహారం సమకూర్చే వనరు లేడీ డాక్టర్లు నర్సుల అంకితభావం వల్ల కూడా ఈ పథకం నవజాత శిశువు కేంద్రంగా ఉండే కుటుంబాల్లో వెలుగులు నింపింది. అక్షరాస్యత పెరిగినా సం స్కారం పెరుగకపోవటం వల్ల మన సమాజం నుంచి వరకట్న రాక్షసిని తరిమికొట్టలేకపోయాం ఈ స్థితిలో నిరుపేద పెళ్లీడు ఆడపిల్లల విమోచనం కోసం కంకణధారి అయిన కేసీఆర్ కళ్యాణలక్ష్మీ ప్రారంభించి, లక్షా నూట పదహారు రూపాయల కట్నంతో మేనమామగా పెండ్లి పందిట్లోకి ప్రవేశిస్తున్నారు! ఇది ఆ రెండు కుటుంబాల వారికే కాదు ఆ పెండ్లికి హాజరయ్యే బంధుమిత్రులందరికీ చిరస్మరణీయ ఘట్టం కాగలుగుతున్నది ఈ పథకాన్ని మతాతీయ దృష్టితో అమలుపరిచినట్లే, గురుకుల వ్యవస్థను కూడా మతాతీయ దృష్టితో ప్రోత్సహించిన కేసీఆర్ నాణ్యమైన విద్యకు మంచి పునాదులు వేశారు. ఆశావర్కర్లు, అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, హోంగార్డులు, బీడీ కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడిపే పద్ధతిలో కేసీఆర్ పింఛన్లను, వేతనాలను సమకూర్చటంతో ఆయా వర్గాల్లోని 80 శాతం గృహిణులు తమ కుటుంబాల్లోని ఆబాలవృద్ధుల సంక్షేమానికి కృషిచేస్తున్నారు. దీంతో కుటుంబ తగాదాలు తగ్గి ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వరంగంలో 33 శాతం ఉద్యోగాలతో కుటుంబాలను తీర్చిదిద్దుకుంటున్న మహిళలకు వీరు కూడా తోడైతే మరో ఐదేండ్లలో తెలంగాణ సమాజంలో స్త్రీ నాయకత్వం స్థిరపడే అవకాశాలున్నాయి. ఈ అంశం మీద ఔత్సాహిక పరిశోధకులు పరిశోధన చేయవలసిన అవసరం ఉన్నది. కేసీఆర్ 31 చిన్న జిల్లాలను ఏర్పరిచిన తర్వాత పాలనారంగంలో వికేంద్రీకరణ సాధ్యమైంది. అప్పటిదాకా అందని చందమామగా ఉన్న ప్రభుత్వం సామాన్యుని ప్రాంగణంలో వెన్నెల కాస్తున్న వైనం మీద కూడా పరిశోధనలు అవసరం.
Ammangi-Venugopal
కేసీఆర్ సాహిత్యజీవి. సాంస్కృతిక రాయబారి, సాంస్కృతికవేత్తల కన్నా ముందునుంచే పాల్కుర్కి సోమన తెలంగాణ ఆదికవి. అని నినదిం చి, ఆ సృజనాత్మక పరిశోధనను వ్యాపింపజేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు వారి ఆలోచనాధారలో రూపుదిద్దుకున్న రేన్ చైల్డ్ (Ra -in Chaild). దీంతో తెలంగాణ సాహితీ తేజస్సు హరివిల్లులా వ్యాపించింది. బతుకమ్మనే కాదు, బోనాలు వంటివి తెలంగాణకే ప్రత్యేకమైన సాం స్కృతిక పర్వదినాలు. ఇవి విశ్వాస సంపుటిలో భద్రంగా వుంటూనే వైభవోపేతంగా ప్రదర్శితమవుతున్నాయి. జానపద కళారూపాలు కళాకాంతుల గజ్జెనకట్టి వినోదంతోపాటు అస్తిత్వ చేతనను పంచిపెడుతున్నాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషాసాంస్కృతిక శాఖలు చేస్తున్న నిర్విరామ కృషి వెనుక స్ఫూర్తిదాక కేసీఆరే టూరిజం శాఖ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ వివిధ జిల్లాల ప్రజల మధ్య విజ్ఞాన వినోదాల వంతెనలను నిర్మిస్తున్నది. ఎన్నివున్నా సమాజంలో కులాతీత మతాతీత ప్రశాంతత నెలకొని వున్నప్పుడే విద్యావైద్య పారిశ్రామిక వాణిజ్యాది రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. మత కలహాలు లేని ఆదర్శ సమాజ నిర్మాణం దిశగా కేసీఆర్ జాతిని నడిపిస్తున్న తీరు రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు అందుకుంటున్నది. తెలంగాణ రాష్ర్టానికి ఆయువు పట్టు తెలంగాణ వాదం. ఈ వాదాన్ని రక్షించుకోవటమంటే జాతి అస్తిత్వాన్ని పరిరక్షించటమే.

318
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles