తెలంగాణపై మూకుమ్మడి దాడి

Tue,December 4, 2018 10:49 PM

ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా జ్ఞాపకం చేసుకోండి.. ఈ చంద్రబాబు, ఆయన తైనాతీలు, ఇప్పుడు ఎన్నికల సమయాన ఆయనను నెత్తికెక్కించుకున్న కొందరు కూటమి నాయకులు, తెలంగాణ ఉద్యమకాలంలో ఎంత అసహనంతో ఊగిపోయిన వాళ్లే! తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రభుత్వం ఈ నాలుగున్నరేండ్ల కాలంలో సాధించిన అద్భుత విజయాలను చూసి, అంతకు పది రెట్ల అసహనాన్ని వీళ్లు ప్రదర్శిస్తున్న విషయాన్ని గమనించండి! అటు ఢిల్లీ, ఇటు అమరావతి బాసులు ఆసీనులై ఉంటే, ద్వితీయ శ్రేణి పౌరుల లాగ వెనుక జీ హుజూర్ భంగిమల్లో నిలబడి ఉన్న తెలంగాణ నాయకుల తీరును చూసి తెలంగాణ సమాజం విస్తుపోతున్నది. ఎటువంటి ఆత్మగౌరవ పరిపాలనను విస్మరించి, ఏ బానిస పాలనకు ఓటు వెయ్యమని ఉపన్యాసాలు ఇస్తున్నారో ఈ నాయకులకు అర్థమవుతున్నదా? అని వింతగా చూస్తున్నది తెలంగాణ సమాజం.
telangana-victory
పేరు మోసిన బందిపోట్లు దొంగతనాలు చేసే పద్ధతుల పట్ల తెలివైన పోలీసులకు అవగాహన ఉంటుంది. పెద్ద దొంగతనం జరిగినప్పుడు, అక్కడి పరిస్థితులను చూసి, ఈ దోపిడీకి పాల్పడింది ఫలానా చెడ్డీ గ్యాంగ్ అనో మరొకటనో ఒక నిర్ధారణకు వస్తారు. వాళ్లు దోపిడీకి ఎంచుకున్న స్థలాల్లో సదరు బందిపోట్లు నేరాలు చేసే పద్ధతులను మోడస్ ఆపరాండి అని పిలుచుకుంటారు. తెలంగాణ నేలమీ ద ఈ ఎన్నికల సమయాన తెలంగాణ రాష్ట్రంతో, ఉద్యమంతో సంబం ధం లేని తెలంగాణ వ్యతిరేకుల మాటలు, చేతలు ఒక్కసారి పరిశీలించండి. వీరి మోడస్ ఆపరాండి అర్థమై పోవడం లేదా? ఉదాహరణకు తెలంగాణ వ్యతిరేకిగా పరిగణించిన చంద్రబాబు విషయమే చూడండి. మీకెందరు కొడుకులు అనీ, కొబ్బరి చిప్పలు అనీ ఏవేవో ప్రేలాపనలతో అటు ఢిల్లీ లాబీల్లో, ఇటు హైదరాబాద్ గ్రూపుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి బాబు పడ్డ పాట్లనూ, వేసి న వింత వేషాలనూ, జాతీయ మీడియాకు ఆయన పంచిన వినోదాన్ని తెలంగాణ సమాజం ఇప్పుడప్పుడే మరిచిపోతుందా? చివరికి అలుపెరుగని ప్రజల ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఇక్కడి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక తప్పుడు నిర్ణయమని నిరూపించేందుకు ఇదే చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ నాకూ ఏసీబీ ఉంది తరహా కుట్రలకు తెరలేపిన సంగతులను తెలంగాణవాదులూ, తెలంగాణ సమాజం అంత సులభంగా మరిచిపోతారా? పేరుకు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి సీమాంధ్ర నేతలు తెలంగాణ వ్యతిరేక మాటలతో చేతలతో తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించిన ఆ రోజులు ఇప్పటికీ మన కళ్లముందు కదులుతున్నాయి కదా! ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని అర్థమైన తర్వాత, రాయల తెలంగాణ అనీ హైదరాబాద్ యూటీ అనీ రకర కాల వదంతులతో తెలంగాణ సమాజాన్ని ఒక పెద్ద గందరగోళంలోకి నెట్టివేసే కుతంత్రాలను వీళ్లంతా నిస్సిగ్గుగా అమలుచేసిన గడ్డుకాలం అం త సులభంగా తెలంగాణ ప్రజల నుంచి అంతర్థానమైపోతుందా? వీళ్లూ, వీళ్ల లాంటి మనుషులే కదా తెలంగాణ వాళ్లకు తెలుగు భాష రాదు అని వెక్కిరించింది.

తెలంగాణ ప్రజలదే నిఖార్సయిన తెలుగు భాష అని వీళ్లకు దీటైన సమాధానం ఇచ్చింది ఎవరి నాయకత్వంలో సాగిన ఉద్యమం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగరంగ వైభవంగా నభూతో న భవిష్యతి అన్న చందంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిపింది ఎవరి నాయకత్వంలోని ప్రభుత్వం? వీళ్లూ, వీళ్ల లాంటి మనుషులే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అటు మావోయిస్టులతో, ఇటు మతపరమైన గొడవలతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనీ, తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రజలకు రక్షణ ఉండదనీ గోబెల్స్ ప్రచారాలు చేసింది. మరి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క అవాంఛనీయ సంఘటనకు కూడా అవకాశం ఇవ్వకుండా మొత్తం దేశమంతా మెచ్చుకునే స్థాయిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విలసిల్లుతున్నయంటే అందుకు ఏ నాయకుని ఆధ్వర్యంలోని ప్రభుత్వం కారణం? ఒక శక్తివంతమైన ప్రభుత్వం లేకుండానే, ఆ ప్రభు త్వం అహర్నిశలూ పని చేయకుండానే ఈ నాలుగున్నరేండ్ల కాలంలో అనేకానేక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సులకు మన హైదరాబాద్ వేదికైందా? ఒక్క ఓటుకు నోటు మాత్రమేనా? తెలంగాణ ఏర్పడగానే రాష్ట్రం ఏర్పడితే కరెంటు కొరతతో తెలంగాణ చీకటిమయమైపోతుంది అన్న ఆ కిరణ్‌కుమార్ రెడ్డి మాటలను నిజం చెయ్యడానికి చంద్రబాబు విద్యు త్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం ఆంధ్ర నుంచి తెలంగాణకు రావల్సిన కరెంట్‌ను బంద్ పెట్టలేదా? ఇవాళ చిన్న అంతరాయం లేకుండా రైతులతో సహా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలూ 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో సంబురంగా ఉన్నయంటే, సంస్కారవంతులెవరైనా అందుకు మొదటగా ప్రశంసించవలసింది ప్రభుత్వ పనితీరునూ, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతనూ! అంతెందుకు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే చంద్రబాబు తైనాతీ టీవీ ఛానళ్లు తెలంగాణ ప్రజాప్రతినిధులను అవహేళన చేస్తూ ప్రసారం చేసిన జుగుప్సాకరమైన కార్యక్రమాలు ఈ ఎన్నికల సమయానికి తెలంగాణ ప్రజలంతా మరిచిపోయి ఉంటారనే భ్రమలో ఉన్నారా ఈ తెలంగాణ వ్యతిరేకులు? ఈ నాలుగున్నరేండ్ల కాలంలో ప్రజాపక్ష పరిపాలనకు గుర్తింపుగా మొన్నటికి మొన్న ప్రతిష్ఠాత్మక ఇండియా టుడే పురస్కారం దక్కడాన్ని కూడా చూడలేని స్థితిలో ఈ తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారా?

ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా జ్ఞాపకం చేసుకోండి.. ఈ చంద్రబా బు, ఆయన తైనాతీలు, ఇప్పుడు ఎన్నికల సమయాన ఆయనను నెత్తికెక్కించుకున్న కొందరు కూటమి నాయకులు, తెలంగాణ ఉద్యమకాలం లో ఎంత అసహనంతో ఊగిపోయిన వాళ్లే! తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రభుత్వం ఈ నాలుగున్నరేండ్ల కాలంలో సాధించిన అద్భుత విజయాలను చూసి, అంతకు పది రెట్ల అసహనాన్ని వీళ్లు ప్రదర్శిస్తున్న విషయాన్ని గమనించండి! ఎన్నికల సమయంలో తెలంగాణ బద్ధ వ్యతిరేకులకు కూడా తెలంగాణ గడ్డ మీద నిలబడి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి పుర్రెకు తట్టింది, నోటికి వచ్చింది ఏదేదో మాట్లాడేస్తున్నారు. తెలంగాణ సమాజానికి ఎంతో కీలకమైన ఇటువంటి పరీక్షా సమయాల్లో తెలంగాణ ప్రజల రాజకీయాల పక్షాన, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి ఉన్న నాయకత్వం పక్షాన నిలబడవలసిన కొందరు తెలంగాణ మేధావి నాయకులు కొన్ని వ్యక్తిగతమైన ఈగో సమస్యలతో ఈ తెలంగాణ వ్యతిరేకుల కూటమి పంచన చేరి, తమకు తెలంగాణ సమాజంలో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు. మన ఇంటి మనుషులతో ఏవైనా సమస్యలుం టే ఇంటి లోపలే ఉండి పరిష్కరించుకోవాలన్న కనీస అవగాహనను వది లి, మన ఇంటిని మొత్తంగా పక్కింటి వాడి పెత్తనం కిందకి తీసుకుపోయే దౌర్భాగ్య స్థితిలో కొందరు తెలంగాణ ఆలోచనాపరుల ఆలింగనాలు కరచాలనాలు వేదిక పంచుకోవడాలు చూసి, మొత్తం తెలంగాణ సమాజం ఆశ్చర్యపోతున్నది! అటు ఢిల్లీ, ఇటు అమరావతి బాసులు ఆసీనులై ఉంటే, ద్వితీయ శ్రేణి పౌరుల లాగ వెనుక జీ హుజూర్ భంగిమల్లో నిలబడి ఉన్న తెలంగాణ నాయకుల తీరును చూసి తెలంగాణ సమాజం విస్తుపోతున్నది. ఎటువంటి ఆత్మగౌరవ పరిపాలనను విస్మరించి, ఏ బానిస పాలనకు ఓటు వెయ్యమని ఉపన్యాసాలు ఇస్తున్నారో ఈ నాయకులకు అర్థమవుతున్న దా? అని వింతగా చూస్తున్నది తెలంగాణ సమాజం. ఏదేమైనా, ఒక్కసారిగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆత్మగౌరవ పతాక వంటి నాయకత్వాన్ని చుట్టుముట్టి అబద్ధపు మాటలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ తెలంగాణ వ్యతిరేకుల కూటమి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన సమయం - ఈ ఎన్నికల సమయం!
k-mallaiah
అమాయక బాటసారి-ఏటి పక్క ముసలి పులి-బంగారు కడియం కథలో లాగ ఈ తెలంగాణ వ్యతిరేకుల మాయమాటల వలలో చిక్కి ఈనగాసి నక్కల పాలు చేసిన చందంగా తెలంగాణకు తెరలు చేసుకుందా మా లేక ఎత్తుపల్లాలను సైతం అధిగమిస్తూ విజయవంతంగా ముందుకు వెళుతున్న ప్రయాణాన్ని గమ్యం ముద్దాడేవరకూ బ్రేకులు వేయకుండా వెళ్లనిద్దామా అన్నది తేల్చుకోవలసింది తెలంగాణ ప్రజలే! ఎన్నికల రణ రంగంలోని పరిస్థితులను చూస్తే అర్థమయ్యే సంగతేమంటే, ఉద్యమ కాలంలో ఎవరెన్ని తెలంగాణ దుకాణాలు తెరిచినా, తమ నిజమైన నాయకుడెవరో గుర్తించి వెంట నడిచిన తెలంగాణ ప్రజలు, నాలుగేండ్లు గా ఒక ఉద్యమంలా కొనసాగుతున్న ప్రగతి వాహనానికి బ్రేకులు వేయకుండా ముందుకునడిపించడానికే నిశ్చయించుకున్నారు!

353
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles