లబ్ధిదారుల ఓట్లు టీఆర్‌ఎస్‌కే

Tue,December 4, 2018 10:48 PM

యువత భవితవ్యం కేసీఆర్ చేతిలో భద్రంగా ఉంది. జవాబుదారీతనం, విజన్ లేని ప్రతిపక్షాల మాటలు నమ్మితే మోసపోయేది విద్యార్థులు, యువతే. పొరపాటున మాయకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ యాభై ఏండ్లు వెనక్కి వెళ్తుంది.
trs-car
చరిత్రలోకి తొంగిచూస్తే కాకతీయుల తర్వాత గత ఏడు శతాబ్దా ల్లో ప్రజల కష్టాల గురించి పట్టించుకొని, ఒక మంచి భవిష్య త్తును ప్రజలకు అందించడానికి కేసీఆర్‌లా శ్రమించిన పాలకుడు మరొకరు కనిపించరు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ పార్టీ కూడా తాము రాసుకున్న మ్యానిఫెస్టోలోని అంశాలను కానీ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ పట్టించుకున్నట్లు కనపడదు. మహా అయితే కొన్ని తాయిలాలు, సంక్షేమ పథకాల అమలుకే ఆయా పార్టీలు పరిమితమైపోయాయి. మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు చేసిన పనులు చూపి మళ్లీ మాకే ఓటేయండి అనిఓట్లడిగిన పార్టీలు కనిపించవు. ప్రతిపక్షాలు ఎన్నికల్లో గెలువడానికి అధికార పార్టీ వైఫల్యాలను, అవి నీతిని ప్రధాన అజెండాగా చేసుకునేవి. అధికార పార్టీలు మరోసారి గెలువడానికి తమను వ్యతిరేకించే ప్రజల ఓట్లు ఎలా చీల్చాలి లేదా ఏ పార్టీల తో పొత్తు పెట్టుకోవాలి, ప్రజలను ప్రభావితం చేయగల నాయకులను ఎలా తమ పార్టీల్లో చేర్చుకోవాలని ఆలోచించాయి. వివిధ కులాలను, మతాలను ఎలా ప్రభావితం చెయ్యాలని ఆలోచించేవి. డబ్బుపై, మద్యం పై ఆధారపడేవి. పోలింగ్ బూత్‌లను వశం చేసుకొని దొంగ ఓట్లు వేసుకునేవారు. పార్టీలు గెలుపు గుర్రాల పేరుతో ధనబలం ఉన్న వారినే నిలుపడానికి సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించేవి. కానీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ఇందుకు భిన్నం. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్- ఉద్యమ కాలంలో ప్రజలకు బాగా సన్నిహితంగా మెలిగిన అనుభవం కావచ్చు లేదా సిద్దిపేట ప్రజలతో సుదీర్ఘకాలం ఉన్న అనుబంధమేమో- తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే వారి బతుకుల్లో వెలుగులు నింపవచ్చునో బాగా అర్థం చేసుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇచ్చిన నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌కే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లోని అన్ని పార్శ్వాలను టచ్ చేశారు. కేసీఆర్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలోనే తనలోని దార్శనికుడిని తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించారు.

ప్రజల సమస్యల పట్ల అవగాహన, వాటి పరిష్కారం పట్ల స్పష్టత, దశాబ్దాలు సొంతగడ్డపైనే రెండవ శ్రేణి పౌరులుగా అవమానాలు పొందిన తెలంగాణ ప్రజలకు గౌరవప్రదమైన జీవితాలనివ్వాలనే తపన గల కేసీఆర్ గత ఎన్నికల్లో తదనుగుణమైన ప్రణాళికను సమాజం ముందుంచారు. అందులోని ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేశారు. స్వతంత్ర భారతంలో అమలైన తొలి ఎన్నికల మ్యానిఫెస్టో టీఆర్‌ఎస్‌దేనేమో! టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన కొన్ని పథకాల అమలు నాలుగైదేండ్లలో పూర్తిచేసేవి కావు. ఉదాహరణకు రెండు పడక గదుల ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ విద్య వీటి అమలుకు ఏ పాలకులకైనా సుదీర్ఘకాలం పట్టవచ్చు. పెద్దల మాట విజయం గమ్యంలో కాదు గమనంలో ఉంటుంది. కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకాలు ఏ పాలకులైనా భవిష్యత్‌లో సుదీర్ఘకాలం అమలుచేయాల్సిందే. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన పథకాలతో పాటు ప్రజలు కోరకుండానే వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేసీఆర్ అమలుచేశారు. ప్రజల ఓట్లు పొందడానికి ఏ జిమ్మిక్కులు, కుట్రలు, కుతంత్రాలు, నీతిబాహ్య పొత్తులు టీఆర్‌ఎస్‌కు అవసరం లేదని కేసీఆర్ నిరూపించారు. చేసిన పను లు చూపి ఓట్లడుగుతున్న తొలి ముఖ్యమంత్రి చరిత్రలో కేసీఆర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇన్ని పథకాలను, ఇంత తక్కువకాలంలో అమ లుచేయడం మరే ముఖ్యమంత్రికైనా సాధ్యమా? ప్రజలపై ప్రేమ, సమయపాలనపై అవగాహన వల్లనే కేసీఆర్‌కు ఇది సాధ్యమైంది. కేసీఆర్ పథకాల్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజె క్టు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ వంటి కొన్ని పథకాలు ఐరాస, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వరల్డ్ వాటర్ కౌన్సెల్, వరల్డ్ బ్యాంక్ వంటి ప్రపంచస్థాయి సంస్థలతో పాటు ఇండియా టుడే, ఎకనమిక్ టైమ్స్ వంటి జాతీయ పత్రికల, జాతీయ టీవీ ఛానెళ్ల, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మన్ననలు పొందాయి. ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ, విద్యార్థులను, యువకులను రెచ్చగొట్ట యత్నిస్తున్నాయి. నిరుద్యోగ సమస్య తెలంగాణకే పరిమితమైంది కాదు.

అన్నిరాష్ర్టాల్లో, అన్ని దేశాల్లో పాలకులకు కునుకు లేకుండా చేస్తున్న ప్రధాన సమస్య. నిరుద్యోగులు అంటే డిగ్రీలు పాసై పోటీ పరీక్షలు రాస్తున్నవారే కాదు. ఉపాధి లేని ప్రతి ఒక్కడినీ నిరుద్యోగి గానే పరిగణించాలి. పీజీ, డిగ్రీలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల వేటలో ఉన్నవారు తెలంగాణలో ఇరువై లక్షలదాకా ఉన్నట్లు టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 2014లో టీఆర్‌ఎస్ అధికార పగ్గాలు చేపట్టిన నాటికి లక్షా ఎనిమిది వేలు.ఈ నాలుగేండ్లలో పదవీ విరమణ చేసిన లేదా కొత్తగా నియామకాలు చేయాలనుకున్న ఖాళీలు మరో ఇరువై వేలు. ఇప్పటికే ముప్ఫై వేలకు పైగా నియామకాలు పూర్తికాగా మరో 80 వేలకు పైగా నియామకాలకు ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్‌మెంట్ బోర్డ్ లు తమ పని చేసుకుంటూ పోతాయి. రేపు ఏ పార్టీ అధికారం చేపట్టినా ఈ నియామకాల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఆలోచించాల్సింది ఈ ఎనభై వేల ఉద్యోగ ఖాళీల గురించి కాదు. ఏ ఉపాధి అవకాశాలు లేకుండా నిరాశా నిస్పృహలకు గురవుతున్న లక్షలాది మంది గురించి! ఏ దేశంలోనైనా జనాభాలో ఒక్క శాతానికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగాలు అందరికి ఇవ్వలేకపోయినా, ప్రభుత్వం తన ఆర్థిక విధానాల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతుంది. 2004 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి పదేండ్ల పాలనలో పదివేల ఉద్యోగా లు ఇవ్వలేదు. కానీ టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఈ నాలుగేండ్లలో ముప్పై వేల కు పైగా ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు, 22 వేల విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసింది. సింగరేణి బొగ్గు గనుల్లో డిపెండబుల్ ఉద్యోగాల కల్పన చేయగలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అనేక ఇం జినీరింగ్ కళాశాలలకు అనుమతులు ఇచ్చారు. ఈ కళాశాలలు రీయింబ ర్స్‌మెంట్ పేర డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడ్డాయి తప్ప, విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పలేదు. అధ్యాపకులను నియమించక పోయే వి, ప్రమాణాలు పాటించకపోయేవి. దీంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రమా ణాలు పాటించేలా చర్యలు తీసుకున్నది.
Veeramal
పాత విద్యార్థులకు ఇంక్యుబేషన్ సెంటర్లను పెట్టి అనేకమందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించింది. ఈ వాస్తవాలను నిరుద్యోగ యువత, విద్యార్థులు అర్థం చేసుకోవాలి. కోటి ఎకరాలకు సాగునీరు, వ్యవసాయరంగంలో అమలవుతున్న విప్లవాత్మక నిర్ణయాలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, టీఎస్ ఐపాస్ ద్వారా వస్తున్న వేలాది పరిశ్రమలు, విస్తరిస్తున్న ఐటీ, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్ రంగాలు భవిష్యత్‌లో లక్షలాదిమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. యువత భవితవ్యం కేసీఆర్ చేతిలో భద్రంగా ఉంది. జవాబుదారీతనం, విజన్ లేని ప్రతిపక్షాల మాటలు నమ్మితే మోసపోయేది విద్యార్థులు, యువతే. పొరపాటున మాయకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ యాభై ఏండ్లు వెనక్కి వెళ్తుంది. గత రెండు వారాలపాటు గద్వాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పరిశీలకునిగా సుమారు రెండువేల మంది అభిప్రాయాలు తెలుసుకున్నప్పుడు ప్రభుత్వ పథకాల ప్రభావం 90 శాతం ఓటర్లలో స్పష్టంగా కనిపించింది. విదేశాల్లో ఉన్న వందలాది మంది తెలంగాణ ఎన్నారైలు గత రెండు నెల ల్లో లక్ష మందికిపైగా వివిధ పథకాల లబ్ధిదారులకు ఫోన్‌చేసి అడిగితే - 90 శాతం ఓటర్లు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని వెల్లడైంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, తమ జీవితాల్లో వచ్చిన మార్పు లు, కేసీఆర్ సమర్థతపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. ఒక నిశ్శబ్ద వెల్లువ ను మనం డిసెంబర్ 11 ఉదయాన్నే చూడబోతున్నం!

246
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles