తెలంగాణ అస్తిత్వంపై బాబు కుట్ర

Mon,December 3, 2018 11:17 PM

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడుకోవటం ప్రధానం. పెట్టుబడిదారీ వ్యవస్థపై శ్రామికవర్గ నియంతృత్వాన్ని సాధించుకున్న తర్వాత కూడా దాని పవర్ లేకపోతే మింగేస్తారని మార్క్స్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌లాంటి గట్టి కాపలాదారుడు లేకపోతే తెలంగాణను రక్షించేవారు లేరు. ఎందుకంటే రాష్ట్రసాధన ఉద్యమాన్ని నడిపినవాడు కేసీఆరే. రాష్ట్రం వచ్చాక పాలకుడిగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూ పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి కూడా కేసీఆరే. ఈ విషయం తెలంగాణ సమాజం గుండెల్లో భద్రంగానే ఉన్నది. ఈ ఎన్నికల్లో అధికారం తెలంగాణ స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడేందుకు ఓటు వేయక తప్పదు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. కొందరు పెత్తందార్లకు అధికారం కోసం ఆగలేని తనం కనిపిస్తుంది. కానీ, స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడే కేసీఆర్ లేకపోతే తెలంగాణలోని సహజవనరులపై ఆంధ్ర పాలకవర్గం, ఆంధ్ర పెట్టుబడిదారుల పట్టు పెరుగుతుంది. తెలంగాణ వనరులపై పట్టుకోసం జరుగుతున్న ప్రయత్నంలో చంద్రబాబు రూపంలో దాడి కొనసాగిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఆ సోయి లేదు. కొన్ని అధికార కుర్చీలు దొరుకుతాయని ఆరాటపడుతున్నారు.
nbn-Kanakadurga
ఈ నేల మీద పుట్టినవాళ్లంతా ఈ భూమి బిడ్డలే. ఈ మట్టి సం స్కృతితో కలిసిపోయిన ప్రతి బిడ్డా తెలంగాణ బిడ్డే. తెలంగాణను దోచుకునే దుష్మన్‌లను వెంటాడినం కానీ, బతుక టం కోసం వచ్చి కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్న వాళ్లు ఎవ్వరైనా, ఏ రాష్ట్రం వారైనా, ఏ దేశం వారైనా వాళ్లంతా ఈ నేల పుత్రులే అవుతారని ఉద్యమ సమయంలోనే స్పష్టం చేయటం జరిగింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏనాడూ సీమాంధ్ర ప్రజలను ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. తెలంగాణ వనరులను, ఇక్కడి సంపదలపై కన్నేసి దోచుకునేవారి ని మాత్రం విడిచిపెట్టేది లేదన్నది నిజం. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో అడ్డుపడాలనే శక్తులు సీమాంధ్ర ప్రజల భద్రతపై భయాందోళనలకు గురిచేసేవిధంగా ప్రకటనలు చేశాయి. ఆ ప్రకటనలకు తెరవెనుక ఆజ్యం పోసిన శక్తుల్లో చంద్రబాబుది కీలకపాత్ర. నాటి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వైఎస్ దగ్గరి నుం చి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు చేయని ప్రచారం లేదు. తెలంగాణ రాష్ట్రం వసే హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు కనీస రక్షణ ఉండదని విష ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా దీన్ని ప్రధానాంశంగా మార్చేశారు. పునర్విభజన చట్టంలో కూడా సెక్షన్ 8ని పెట్టించి హైదరాబాద్ శాంతి భద్రతలను పరిరక్షించే అధికారం గవర్నర్‌కే ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ, 51 నెలల కేసీఆర్ పాలనలో ఒక్కసారి కూడా సెక్షన్ 8ని ఉపయోగించే స్థితి తెలంగాణ ప్రభుత్వానికి రాలేదు. మున్నెన్నడూ లేనివి ధంగా హైదరాబాద్ మహా నగరంలో శాంతిభద్రతలు పరిరక్షించబడినా యి. ఈ ఎన్నికల సందర్భంగా వాటిని కెలికే ప్రయత్నాలు కూటమి శక్తు లు చేస్తున్నాయి. తెలంగాణ డబ్బుకు లొంగేది కాదు, ప్రేమకు మాత్రమే లొంగుతుం ది. ఆత్మాభిమానం విషయంలో తేడా వస్తే తెలంగాణ పోరాడుతుంది. దేశం మొత్తం కలిసివున్న మినీ ఇండియా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినవాళ్లు ఒక భాగం. వాళ్లంతా బేసికల్‌గా హైదరాబాదీయు లే. ఈ ఎన్నికల్లో ఎక్కడో మూలాలను ైక్లెవ్‌ు చేసే నాయకులు ఇక్కడి హైదరాబాద్ ఇంట్రెస్ట్‌ను దెబ్బకొడుతున్నారు. దాన్ని మహానగర ప్రజ లు గుర్తిస్తారనడంలో సందేహం లేదు.

తెలంగాణను పునర్నిర్మించుకుంటున్న ఈ దశలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే పని అత్యంత కీలకమైనదిగా కేసీఆర్ భావించా రు. అందుకోసం 51 నెలలుగా కృషి మొదలైంది. హైదరాబాద్ నగరం అంటే పేరుపడ్డ వ్యాపారాలు మాత్రమే కాదు. ఇక్కడున్న ప్రజల జీవనప్రమాణాలు పెంచేపనికి కేసీఆర్ తపన చెందుతున్నారు. ప్రధానంగా నగరానికి వచ్చిన పేదల జీవితాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇందుకు ఎంతో కృషిచేయవలసి ఉన్నది. ఆ పనిని కేసీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. విషం కక్కుతున్న చంద్రబాబు: తెలంగాణపై, హైదరాబాద్ నగరంపై చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల పేరుతో కుట్రపూరితమైన దాడి చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్ షో పేరిట జరిగిన ప్రజాఫ్రంట్ ఎన్నికల సభ ల్లో చంద్రబాబు మాటల ధోరణి చూస్తుంటే తెలంగాణ పునర్నిర్మాణంపై చేస్తున్న దాడి స్పష్టంగా కనిపిస్తున్నది. ఆధునిక తెలంగాణ నిర్మాతను నేనే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తే తెలంగాణ స్వయం నిర్ణయాధికారంపై దాడి చేస్తున్నట్లుగా ఉన్నది. హైదరాబాద్ నగరానికి తెలంగాణకు తాను లేకపోతే పురోగతే లేదన్నట్లుగా బాబు అవాకులు చెవాకులు పేలుతున్నాడు. రాష్ట్రసాధన ఉద్యమం సమయం లో ఏ రకంగా చంద్రబాబు విషం గక్కాడో ఇపుడు తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియపైన కూడా అదేవిధంగా దాడికి పాల్పడుతున్నాడు. చంద్రబాబు మాటలు వింటుంటే తెలంగాణ పౌర సమాజం మళ్లొక్కసారి ఆం దోళనకు గురయ్యే స్థితి వచ్చింది. చంద్రబాబు చేస్తున్న అసత్యాల ప్రచా రం, అబద్ధాలతో చేస్తున్న దాడి చూస్తుంటే తెలంగాణను ఇప్పుడు కాపాడుకోవల్సిన స్థితి మళ్లీ వచ్చిందనిపిస్తుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబుతో యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రాంతాలుగా, రాష్ర్టాలుగా విడిపోయినా తెలుగు వాళ్లుగా కలిసే ఉండవచ్చునని ఉద్యమ సమయంలో అనుకున్న మాటలు చంద్రబాబు మాటలు చూస్తే అవి తిరుగబడుతున్నట్లుగా అనిపిస్తుంది. తెలంగాణలో 51 నెలలుగా జరిగిన పునర్నిర్మాణ పనులను గెలిచేసి బాబు దాడికి దిగుతున్నారు. ఇది దుర్మార్గమైన విషయం.

ఏపీలో పాలన జరుగటం లేదు. వ్యాపారం మాత్రమే జరుగుతుందని, తెలంగాణలో పాలన జరుగుతున్నదని ఆంధ్రా మిత్రులే చెబుతున్నారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్లు యథేచ్ఛగా చెప్పుకోవచ్చు. విమర్శ ప్రతి విమర్శలు సహజం. కానీ, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ స్వాభిమానానికి దెబ్బతగిలే విధంగా మాట్లాడితే మాత్రం ఎవ్వరూ సహించరు. తెలంగాణ సమాజం అందరూ మాట్లాడే మాటలు వింటున్నది. కానీ, తెలంగాణకు ఎవరు మేలు చేయగలరో, ఎవరు కీడు చేయగలరో గమనించగలరు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో చేసిన కుట్రలకు గుండె పగిలిన యువకులు ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఆత్మగౌరవంపై దాడికి దిగిన బాబు: ఎన్నికల రణరంగంలో నిజాలు, అబద్ధాలు, సత్యాసత్యాలు, కోటలు దాటే మాటలు ఎన్నో ఉంటాయి. అదేపని ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో చూస్తూనే ఉన్నాం. ఎవరు చెప్పే విషయాలు వాళ్లు చెప్పుకోవచ్చు. కానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం ఈ సమాజం క్షమించదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇప్పటికీ ప్రతి తెలంగాణీయుడి గుండెల్లో పదిలంగా ఉన్నది. దాన్నెవ్వరూ చెరిపేయలేరు. కానీ, ఈ ఎన్నికల పేరు తో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొడుతున్న మాట లు చూస్తుంటే మళ్లొక్కసారి తెలంగాణ సమాజం రక్తం మరుగుతున్నంత పనైంది. నేరుగా తెలంగాణ ఆత్మగౌరవంపై చంద్రబాబు దాడి చేస్తున్నా డు. తాను లేకుంటే తెలంగాణ సమాజమే లేదన్నట్లుగా మాట్లాడుతూ ఆధునిక తెలంగాణ నిర్మాతను తానేనని, చంద్రబాబు హైదరాబాద్ నడిగడ్డపై మాట్లాడటంతో తెలంగాణ సమాజం ఆలోచనలో పడింది. ఈ ఎన్నికల సందర్భంలో బాబు మాట్లాడే మాటలు చూస్తే ఎన్నికల బ్యాలెట్ కనిపించాలి కానీ, తెలంగాణ సమాజానికి మాత్రం తెలంగాణ సాధన ఉద్యమం కన్పిస్తున్నది.

ఉద్యమం కోసం పొంగుకొచ్చిన పౌరుషంతో తెలంగాణ సమాజమం ధూమ్‌ధామ్ చేస్తుంటే అప్పుడు ఇదే బాబు నక్కరాజకీయాలు చేస్తూ ఉద్యమాన్ని కూల్చే ప్రయత్నాలు చేశా డు. నాడు కనీసం రోడ్డు మీదికొచ్చి మాట్లాడే స్థితి లేక కుట్రలు, కుతంత్రాలతో ఉద్యమంపై విషం కక్కాడు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్లీ ఎన్నికల పేరుతో మహాకూటమి పేరుతో తెలంగాణ అస్తి త్వం గుండెలపై గుద్దుతూ మాట్లాడటం చూస్తుంటే తెలంగాణవాదులం తా ఒక్కసారి ఆలోచనలో పడ్డారు. ఆత్మగౌరవంపై దాడిచేసి కవ్విస్తూ సవాల్ చేస్తున్న బాబు మాటలకు మొత్తం తెలంగాణ సమాజమే ఆగ్రహించి సమాధానం చెప్పే స్థితికి వస్తున్నది. దొంగ చేతికి తాళం ఇస్తామా?: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడుకోవటం ప్రధానం. పెట్టుబడిదారీ వ్యవస్థపై శ్రామికవర్గ నియంతృత్వాన్ని సాధించుకున్న తర్వాత కూడా దాని పవర్ లేకపోతే మింగేస్తారని మార్క్స్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌లాంటి గట్టి కాపలాదారుడు లేకపోతే తెలంగాణను రక్షించేవారు లేరు. ఎందుకంటే రాష్ట్రసాధన ఉద్యమాన్ని నడిపినవాడు కేసీఆరే. రాష్ట్రం వచ్చాక పాలకుడిగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూ పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి కూడా కేసీఆరే. ఈ విషయం తెలంగాణ సమాజం గుండెల్లో భద్రంగానే ఉన్నది. ఈ ఎన్నికల్లో అధికారం తెలంగాణ స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడేందుకు ఓటు వేయక తప్ప దు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. తెలంగాణలోని పాత ఆధిపత్య శక్తులు అధికారం పిచ్చిగా కూటమి అని అరుస్తున్నారు. కానీ, ఈ ఎన్నికలు దోచుకొనే శక్తులకు చాలా అవసరం. ఇప్పుడు తెలువకపోతే ఐదేం డ్లు తమ దోపిడీ ఆగిపోతుంది. కొందరు పెత్తందార్లకు అధికారం కోసం ఆగలేని తనం కనిపిస్తుంది. కానీ, స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడే కేసీఆర్ లేకపోతే తెలంగాణలోని సహజవనరులపై ఆంధ్ర పాలకవర్గం, ఆంధ్ర పెట్టుబడిదారుల పట్టు పెరుగుతుంది.
j-saidulu
తెలంగాణ వనరులపై పట్టుకోసం జరుగుతున్న ప్రయత్నంలో చంద్రబాబు రూపంలో దాడి కొనసాగిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఆ సోయి లేదు. కొన్ని అధికార కుర్చీ లు దొరుకుతాయని ఆరాటపడుతున్నారు. తెలంగాణలోని మెజార్టీ పరిశ్రమలపై, ట్రాన్స్‌ఫోర్ట్, సినిమా, విద్యా రంగం అన్నింటిపై పాత పెట్టుబడిదారులే తిరిగి కంట్రోల్ చేస్తారు. ప్రధాన వ్యాపారవర్గాలు ఈ ఎన్ని కల్లో తహతహలాడుతున్నారు. ఇలాంటి దొంగల చేతికి తాళం ఇస్తా మా? అన్నది అసలు ప్రశ్నగా బ్యాలెట్ దగ్గరకు వస్తున్నది. ఈ ప్రమాదం పసిగట్టడంలో తెలంగాణ విజ్ఞులు ఆలోచిస్తారు. మన అంతర్గత వ్యవహారాలను మనకు మనం తేల్చుకున్నాం. కానీ, బయటిశక్తులు ముంచుకొస్తున్నప్పుడు తెలంగాణ సమాజం ఏకం కాక తప్పదు.
(వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు)

344
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles