విమర్శించడమే వారి పని

Thu,November 15, 2018 11:15 PM

నాలుగున్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎం తో మార్పు వచ్చింది. దశాబ్దాలుగా పట్టించుకోని సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరిస్తున్న ది. నేడు ఎన్నో గ్రామాల్లో చెరువులు బాగుపడినా యి. అనేక వ్యాధులకు కలుషిత నీళ్లే కారణమని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే మిషన్ భగరీథ ద్వారా ఇప్పటికే అనేక గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. మిగ తా రాష్ర్టాలు కూడా వీటిని ఆదర్శంగా తీసుకోవాల ని నీతిఆయోగ్ లాంటి సంస్థలు సూచించాయి. కానీ ప్రతిపక్ష నేతలకు మాత్రం ఇవి కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
- ఎం. మోహన్, పెద్దపల్లి

కుట్రల కూటమి

ఇప్పుడు మహాకూటమిలో ఉన్న కాంగ్రెస్ నేతలు నాడు తెలంగా ణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఎవరి పక్షా న ఉన్నారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వారు తాము అధికారంలోకి వస్తే తెలంగాణను అన్నివిధాల అభివృద్ధి చేస్తామంటే ప్రజలెలా నమ్ముతారు? అంతేకాదు పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే కూటమి నడుస్తున్నదని జరుగుతున్న పరిణామాలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బట్టి తెలుస్తున్నది. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాస్తున్న బాబు రేపు ఇక్కడి ప్రభుత్వాన్ని స్వతంత్రంగా పనిచేయనిస్తాడని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్నే కూల్చడానికి బాబు అండ్ కో చేసిన కుట్రలను తెలంగాణ ప్రజలంతా చూశారు. అలాగే తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపరుచడానికి అనేకవిధాలుగా ప్రయత్నించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల కు అనుగుణంగా పనిచేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడమే పనిగా పెట్టుకున్నారు. అందుకే రేపు మహాకూటమి వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
- బి.రాజేందర్, మెదక్

80
Tags

More News

VIRAL NEWS