బలం లేకనే రాజీబాట

Wed,November 14, 2018 11:02 PM

కాంగ్రెస్, టీడీపీల సుదీర్ఘ పాలనలు, దోపిడీలు, అక్రమాల కారణంగానే ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు సాగించగా, ఆ పార్టీలు ఇప్పుడేదో పరిశుద్ధంగా మారిపోయాయన్నట్లుగా, తిరిగి అవే పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయమనటం ప్రజలను వంచింపజూడటమే. మరీ ముఖ్యంగా తెలంగాణకు విభజన తర్వాత సైతం హాని చేస్తున్న చంద్రబాబుతో కలువటం ఎంతమాత్రం క్షమించదగిన విషయం కాదు.

సీపీఐ ఈ బూర్జువా వ్యవస్థకే ప్రత్యామ్నాయాన్ని సాధించగలమంటూ తన యాత్రను ఆరంభించింది. ఒక రోజున రైతాంగ పోరాటంతో తెలంగాణ భూస్వాములను గడగడలాడించిన ఆ పార్టీ, ఈ రోజున అదే భూస్వామ్య వర్గాల నుంచి కేవలం 3 అసెంబ్లీ సీట్లను భిక్షగా పొంది ప్రత్యామ్నాయ పాలన ఇవ్వగలమని ప్రజలను నమ్మిస్తున్నది. మరొకవైపు టీజేఎస్ మొత్తం 119 సీట్లకు పోటీ ద్వారా ప్రత్యామ్నాయం కాగలమని అట్టహాసాలు చేసి, చివరకు కేవలం 8 సీట్లతో ప్రత్యామ్నాయమంటున్నది. ఇంతకూ ఈ 3+8=11లో వీరు గెలిచేది ఎన్నో తెలియదు. ఒకవేళ టీఆర్‌ఎస్ తిరిగి అధికారానికి వచ్చినట్లయితే, ఈ గెలిచిన కొద్దిమందిలో మిగిలి ఉండేది ఎవరో అంతకన్నా చెప్పలేము. తెలంగాణలో ప్రస్తుత పరిపాలన సరిగా లేదని, తాము ప్రత్యామ్నాయం కాగలమని చెప్పే రెం డు పార్టీల ఘనమైన స్థితి ఈ విధంగా ఉంది. అంతకన్న, ఈ స్థాయికి పతనమైందనటం సరిగా ఉంటుంది. ఈ పతన క్రమం మొత్తాన్ని మనం మనకళ్ల ముందే చూశాము. అంతా కొన్నివారాల వ్యవధిలో ముగిసిపోయింది. ఈ రెండింటిలో సీపీఐ కథ మరింత దయనీయమైనది. మొత్తం 119 స్థానాల్లో, మహాకూటమి నాయకత్వం వహిస్తున్న కాం గ్రెస్‌ను అట్లుంచితే టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 3 సీట్లు లభించాయి. గత చరిత్రను చూసినా, ప్రస్తుత బలాన్ని బట్టి అయినా సీపీఐ పార్టీకి టీడీపీ, టీజేఎస్‌ల కన్నా ఎక్కువ సీట్లు రావాలి. గత చరిత్రలోకి వెళితే, సీపీఐ ఒక జాతీయ పార్టీ అన్న దానిని బట్టి చూస్తే, వారికి టీడీపీ, టీజేఎస్‌లు ఎక్కడా సరిపోలవు. ప్రస్తుత బలాన్ని బట్టి ఆలోచిస్తే సీపీఐకి సుమారు 25 చోట్ల నికరమైన బలం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సం బంధించి వారిపై ఎటువంటి ఎటువంటి వివాదం లేదు. వామపక్షమనే జనరల్ సానుభూతి ఉంది. తాము నిలిచిన చోట ఓటు వేయగలమని సీపీఎం ప్రకటించింది. తగు సానుకూలత గల ప్రజా సంఘాలు కొన్ని ఉన్నాయి. దీనితో పోల్చితే టీడీపీ ఈ రోజున ఎంతో అప్రతిష్ఠపాలై గణనీయంగా బలహీనపడిన పార్టీ. కాకపోతే చంద్రబాబు ద్వారా ధన బలం ఉంది. ఆయన రెచ్చగొట్టడం వల్ల ఇక్కడి సీమాంధ్రుల ఓట్లు కొన్ని లభించవచ్చు. ఇక టీజేఎస్‌కు ఒక గుర్తింపు అన్నది మినహా నికరమైన బలం ఎంతో తెలియదు.

టీజేఎస్ అన్న ప్రత్యామ్నాయానికి కాంగ్రెస్‌తో కలయిక మొదట దెబ్బకాగా, టీడీపీతో కలయిక చావుదెబ్బ వంటిది అయింది. ఇక సీట్ల కోసం సాగిన రాయబారాలు, ఆ క్రమంలో ఎదురైనా అనుభవాలు, అవమానాలు, టీజేఎస్‌ను అపహాస్యం పాలు చేశాయి. ఈ దశ మొదలు కావటంతో ఇక ప్రత్యామ్నాయం అనే మాటనే వదిలివేశారు. మీకు బలం ఎక్కడుందనే కాంగ్రెస్ ప్రశ్నకు సమాధానమివ్వలేక రాజీ బేరాలకు దిగారు.

వారు ఎప్పుడూ ఎక్కడా పోటీ చేయలేదు. అందువల్లనే తమకు ఎక్కువ సీట్లు ఇవ్వలేమన్నది సాక్షాత్తూ కాంగ్రెస్ అన్న మాట లు. అనగా, ఏ విధంగా చూసినా టీడీపీ, టీజేఎస్‌ల కన్నా సీపీఐకి ఎక్కు వ సీట్లు లభించవలసింది. కానీ ఏమైంది? టీడీపీ సీట్లలో సుమారు 20 శాతం, టీజేఎస్ సీట్లలో సుమారు 33 శాతాన్ని కాంగ్రెస్ పార్టీ సీపీఐకి విదిల్చింది. ఎంత అవమానకరం ఇది. ఈ దయనీయమైన పతన క్రమం ఏ విధంగా సాగిందో కూడా చూసి అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. అదంతా ఇక్కడ రాసుకోవలసిన అవసరం లేదు. వారు తమ సీట్లు కనీసం మరొక్కటైనా (కొత్తగూ డెం) పెరిగేందుకు కాంగ్రెస్‌ను ప్రాధేయపడటమే కాదు. చివరకు టీడీపీ, టీజేఎస్‌ల ద్వారా పైరవీలు చేసుకోవలసి వచ్చిందంటే ఇక చెప్పవలసింది లేదు. ఇన్నిన్ని పరాభావాలతో కాంగ్రెస్ వద్ద పడి ఉండటం కన్న, అం తకంటే సీపీఎం కూటమి వద్దనే పడి ఉండటం ఎక్కువ గౌరవప్రదం అయ్యేదని వారికి తోచి ఉండకపోవచ్చు. సీపీఎంకు దాదాగిరీ లక్షణాలు ఎక్కువని, వామపక్ష కూటమి విచ్ఛిన్నతకు అది ప్రధాన కారణమని తెలిసిందే. ఈ విషయమై సీపీఐ ఫిర్యాదుకు విలువ ఉంది. కానీ, అదే సమయంలో సీపీఐ నాయకత్వానికి కాంగ్రెస్ ఎందువల్ల మెరుగైనదిగా తోచిందో, ఇప్పుడు ఈ 3 సీట్ల అనుభవం తర్వాత ఏమని భావిస్తున్నా రో వారు మాత్రమే ఆత్మపరిశీలన చేసుకుని చెప్పగలరు. ప్రజలకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలమని ఎవరు, ఎవరిని దృష్టిలో ఉంచుకొని, ఎప్పుడు అన్నా ఆహ్వానించవలసిందే. కానీ అందు కు సరైన వివరణ ఇస్తూ, తగిన ప్రాతిపదికలను సిద్ధం చేసినట్లయితే ప్రజలకు ఆలోచించే వీలు ఏర్పడుతుంది. కానీ ఆ పనిని, ఇంతటి ఘనమైన సిద్ధాంతాలు, అనుభవం, అవగాహన, చరిత్ర గల సీపీఐ గత నాలుగేండ్ల కాలంలో ఎన్నడూ చేయలేదు. వారినుంచి నిత్యం వినవచ్చినవి గాలి విమర్శలు, నోటికి వచ్చిన వ్యాఖ్యలు మాత్రమే. ఉదాహరణకు వ్యవసాయమనే ఒక ముఖ్య రంగాన్ని తీసుకుంటే, ఈ నాలుగేండ్లకు ముందు పరిస్థితి ఏమిటి, నాలుగేండ్ల చర్యలు ఒక్కొక్కటిగా ఏమిటి, అందువల్ల జరిగిన మంచి చెడులు ఏమిటి, ఇంకా జరుగవలసిందేమిటనే పరిశీలన ను వారు ఒక పద్ధతి ప్రకారం, గణాంక వివరాలు, క్షేతస్థాయి అధ్యయనాలతో ఏమైనా చేశారా? అదేమీ లేక చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలను వ్యక్తిగత కక్షలా అనిపించే స్థాయికి తీసుకువెళ్లారు.

పోనీ తాము అయినా తమతో ఏకీభావం ఉన్నవారితో కలిసి తాము అనే ప్రత్యామ్నాయాలను సృష్టించారా అంటే, చివరకు ఎవరెవరి వద్ద సాగిల పడి, కూటమిలో అందరికన్న అధమమైన స్థానానికి చేరి, గుడ్లలో నీరు కుక్కుకుని ఉన్నారో కనిపిస్తున్నదే. పెక్కు భంగుల్ వివేక భ్రష్ఠ సంపాతముల్ అని ఒక కవి ఊరకనే అనలేము. సీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడిన తర్వాత అదే ఆగస్టు లో మరికొన్ని వామక్షాలతో కలిసి సమావేశమై, ప్రత్యామ్నాయ సృష్టికి ఒక సంకల్పం చెప్పుకుంది. అప్పటినుంచి నాలుగేండ్లు గడిచేసరికి పరిస్థితి ఏ విధంగా తయారైందో కల్పిస్తున్నదే. ప్రత్యామ్నాయం దేవుడెరు గు, ఎవ్వరి దృష్టిలోనూ కనీసపు పరువు మిగులకుండా చేసుకున్నారు. తెలంగాణను ఇంతగా పీడించి దోపిడీ చేసిన కాంగ్రెస్, టీడీపీలతో కలిసి ప్రత్యామ్నాయాన్ని స్థాపించగలమంటూ నమ్మించజూస్తున్నారు. ఇప్పుడైనా ఏమి గెలిచేదీ భరోసా లేని స్థితిలో, ఒంటరిగా పోటీచేసి ఉంటే తమ కార్యకర్తలకు, అనుయాయులకు, అభిమానులకు ఓటమితో నిరుత్సా హం కలిగినా కనీసం తలవంపుల దుస్థితి ఎదురయ్యేది కాదు. ఇక టీజేఎస్ హామీ ఇచ్చిన ప్రత్యామ్నాయపు కథ కూడా సారాంశం లో ఇంతకన్న భిన్నమైనది కాదు. కాంగ్రెస్, టీడీపీల సుదీర్ఘ పాలనలు, దోపిడీలు, అక్రమాల కారణంగానే ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు సాగించగా, ఆ పార్టీలు ఇప్పుడేదో పరిశుద్ధంగా మారిపోయాయన్నట్లుగా, తిరిగి అవే పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయమనటం ప్రజలను వంచింపజూడటమే. మరీ ముఖ్యంగా తెలంగాణకు విభజన తర్వాత సైతం హాని చేస్తున్న చంద్రబాబుతో కలువటం ఎంతమాత్రం క్షమించదగిన విష యం కాదు. మరెందుకు అయినా కాకపోయినా చంద్రబాబుతో చేతులు కలుపుతున్నందుకు టీజేఎస్‌ను తెలంగాణ ప్రజలు శిక్షించాలి. టీజేఎస్ నాయకత్వం ఒక కొత్త ప్రత్యామ్నాయ పాలనను తేగలమని, అందుకు వీలుగా మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయగలమని మొదట ప్రకటించింది. అదే మాట కొంతకాలం పాటు అంటూ పోవటంతో దాని ని నమ్మినవారు తగినంత మంది ఉన్నారు. కానీ, అకస్మాత్తుగా ఏమైందో గాని ఆ పార్టీ కాంగ్రెస్ సర్పపరిష్వంగంలోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్ వారు టీడీపీతో కలిసిన తర్వాత బయటకు వచ్చినట్లయితే ఎట్లుండేదో గాని, ఆ కలయిక టీజేఎస్‌కు ఏ మాత్రం అభ్యంతరకరంగా తోచలేదు.
t-ashok
అది ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. టీజేఎస్ పట్ల ఎవరికైనా కొంత గౌరవం, నమ్మకం ఉంటే అది ఈ పరిణామంతో హరించుకుపోవటం మొదలైంది. టీజేఎస్ అన్న ప్రత్యామ్నాయానికి కాంగ్రెస్‌తో కలయిక మొదట దెబ్బకాగా, టీడీపీతో కలయిక చావుదెబ్బ వంటిది అయింది. ఇక సీట్ల కోసం సాగిన రాయబారాలు, ఆ క్రమంలో ఎదురైనా అనుభవాలు, అవమానాలు, టీజేఎస్‌ను అపహాస్యం పాలు చేశాయి. ఈ దశ మొదలు కావటంతో ఇక ప్రత్యామ్నాయం అనే మాటనే వదిలి వేశారు. మీకు బలం ఎక్కడుందనే కాంగ్రెస్ ప్రశ్నకు సమాధానమివ్వలేక రాజీ బేరాలకు దిగారు. సీపీఐకి వలెనే వీరికి కూడా టీఆర్‌ఎస్ నాయకత్వంపై వ్యక్తిగత కక్షలు, గద్దె దించటంలే లక్ష్యంగా మారాయి. ప్రత్యామ్నాయం అనే మాటకు అదే అర్థం, పరమార్థంగా మారింది.

476
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles