ప్రగతికే పట్టం

Wed,November 14, 2018 11:00 PM

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడైనా రాజకీయ పార్టీల అభివృద్ధి వాగ్దానాలు, మ్యానిఫెస్టోల్లో ఇచ్చే హామీల ఆధారంగా ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ విధానాలు పునాదిగా కాకుండాఅభివృద్ధి కాముకులకు అవకాశవాదులకు మధ్య పోటీ జరుగుతున్నది. టీఆర్‌ఎస్ తన నాలుగున్నరేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు, చేపట్టిన ప్రాజెక్టులను పరిపూర్తి చేసుకోవటంపై ప్రజలంతా దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నికల్లో తెలంగాణ సోయి లేని పార్టీలు చెప్పే మాటలను, అబద్ధపు ప్రచారాలను ప్రజలు విశ్వసిం చే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లాంటి పార్టీ లు తెలంగాణ అభివృద్ధిపై స్పష్టమైన భవిష్యత్ దృష్టితో ఎన్నడూ పనిచేయలేదు. రాష్ట్ర సాధనోద్యమంలో కూడా ఆ పార్టీలు గోడమీది పిల్లి వాటంగా ప్రవర్తించి ఉద్యమాని కి అనేక విధాలుగా ద్రోహం చేశాయి. టీడీపీ, అధినేత చం ద్రబాబునాయుడు అయితే రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్నడు. తన రెండు కండ్ల సిద్ధాంతంతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేశాడు.

తెలంగాణకు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలోనూ టీడీపీ తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించింది. కాంగ్రెస్ కూడా తక్కువ తినలేదు. కడుతున్న ప్రాజెక్టులను ఆపేందుకు నానా యాగీ చేసింది. కోర్టుల్లో ఎన్నో కేసులు వేసింది. తెలంగాణ ప్రగతిని అడ్డుకోజూసింది. ఇలాంటి పార్టీలు ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీపై అనేక అబద్ధపు విషప్రచారాలు చేస్తున్నాయి. ఈ పార్టీల మాటలు నమ్మి మోసపోయేటం త అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు. రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు కాబట్టే ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కాముకులకు, అవకాశవాద రాజకీయాలకు మధ్య జరుగుతున్న పోటీగా భావిస్తున్నారు. అవకాశవాద కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని మోసపూరిత కుట్రలు చేసినా ప్రజలను వంచించలేరు. తెలంగాణ ప్రజలు రాష్ట్రసాధనోద్యమంలో చూపిన చైతన్యంతో, ఐకమత్యంతో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌నే గెలుపించుకుంటారు. అవకాశవాద కూటములకు గోరీ కడుతారు.
- బత్తిని లక్ష్యయ్య, మిర్యాలగూడ

81
Tags

More News

VIRAL NEWS