తెలంగాణ జాతి పునర్నిర్మాణం

Tue,November 13, 2018 11:00 PM

తెలంగాణ స్వరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ భాషా, సంస్కృతి, తెలంగాణ మహనీయులు, సంఘ సంస్కర్తల గురించిన చరిత్ర వెలికి తీయబడుతున్నది. మలి తెలంగాణ ఉద్యమంలో భాగంగా మొదలైన ఈ ఉద్యమం, వెతుకులాట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సాధికారికతతో వేనోళ్లుగా వెలికితీయబడుతున్నది. వందలాది గ్రంథాలు వెలువడ్డాయి. వేలాది రచయితలు, కళాకారులు, సంస్కర్తలు, మహనీయుల చరిత్ర పుటల నుంచి వెలికితీయడం జరుగుతున్నది. పాఠ్య పుస్తకాలకు ఎక్కడం జరుగుతున్నది.

నేడు జరుగుతున్నది తెలంగాణ జాతి పునర్నిర్మాణం. ఇంగ్లీషు భాష ఒక్కటే అయినప్పటికీ ప్రాంతాలు, జాతులు వేరు కావటం వల్ల ఐర్లాండ్, ఇంగ్లాండ్ ప్రత్యేకంగా కొనసాగుతున్నా యి. అనేక దేశాల్లో ఇంగ్లీషు అధికార భాషగా ఉన్నప్పటికీ సం స్కృతి, స్వీయ అస్తిత్వం స్వపరిపాలన కోసం ఎక్కడికక్కడ దేశాలుగా కొనసాగుతున్నాయి. 1985లో సోవియెట్ యూనియన్ కూడా పదిహే ను దేశాలుగా స్వతంత్రం ప్రకటించుకున్నాయి. స్వీయ అస్తిత్వం, భాష, సంస్కృతి, ప్రాంతీయ అభివృద్ధి, ఆత్మగౌరవం, స్వేచ్ఛా సమానత్వం, సమాన అవకాశాలు అందుకోవడానికి, ఎదుగడానికి ఇలా ఎక్కడికక్కడ ప్రాంతాలు, దేశాలు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నాయి. జాతుల విముక్తిని, దేశాల విముక్తిని, భాషా సంస్కృతిని ఏ సిద్ధాంతాల ద్వారా మభ్యపెట్టలేం. అవి తరతరాలుగా కొనసాగుతూ వచ్చిన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, చారిత్రక, భాషా పర్యవసానాలు. తెలంగాణ ప్రాంతం కూడా శతాబ్దాల పరంపరలో భాషా, సంస్కృతి, సామాజిక పరిణామాల రీత్యా ఒక జాతిగా లేక ఒక ఉప జాతిగా కొనసాగుతూ వస్తున్నది. బతుకమ్మ పండుగ ఒక్కటే కాదు. సంక్రాంతికి సకినాల పండుగ ఒక్కటే కాదు, దసరా పండుగ, దీపావళి పండుగ జరుపుకోవడంలోనూ, పురుడు, పెండ్లిలోనూ, వ్యవసాయంలోను, కులవృత్తిలోను, నైపుణ్యాల్లోనూ, సొంత ముద్ర తెలంగాణది. చెరువు పారకం, కొండలు, గుట్టలు, వన మూలికలు, శాతవాహనుల నుంచి కాకతీయు లు, కుతుబ్‌షాహీలు, నిజాం, వంశ పరిపాలన దాకా దక్కన్ పీఠభూమి లో తెలంగాణ ప్రత్యేక భాషలతో, సంస్కృతితో, వైద్య విధానాలతో, చిరుధాన్యాల పంటలతో విరాజిల్లుతూ వచ్చింది. కట్టు, బొట్టు నగలు, గుడిసెలు, ఇండ్ల నిర్మాణం కూడా ప్రత్యేకంగా కొనసాగుతూ వచ్చాయి. జానపద సాహిత్య కళారీతులు, ఆశ్రిత కులాలు, కళాకారుల కులాల ప్రత్యేక అస్తిత్వాన్ని, ప్రత్యేక కులాలు, కళలు అందరిని అక్కున చేర్చుకోవడం, వలసలు మొదలైనవి తెలంగాణ గడ్డ ప్రత్యేకత. తెలంగాణ ఒక జీవగడ్డ. శతాబ్దాల తరబడి ఎందరో రాజులు, విదేశీ యాత్రికులు, తెలంగాణను సందర్శించారు.

తెలంగాణ గ్రంథాలయాల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీల చరిత్ర, సంస్కృతి, జీవనం శతాబ్దాలుగా వారు నిర్మించిన భాష, సంస్కృతి, కళలు, ఉత్పత్తి, నగలు, సమస్థ సంపద సృష్టికర్తలుగా నిర్వహించిన పాత్ర గురించి పట్టుమని వంద పుస్తకాలైనా లేవంటే ఎంత దౌర్భాగ్యమో. అందుకని తొలి విడుతగా తెలంగాణ, భాషా సంస్కృతి సంస్థ, తెలంగాణ సాహిత్య అకాడమీ, కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా కలిసి కొన్ని వందల పుస్తకాలను ఈ నాలుగున్నరేండ్ల కాలంలో ప్రచురించాయంటే తెలంగాణ రాష్ట్రంలోని స్వీయ అస్తిత్వ చైతన్యం కారణంగానే.

తెలంగాణలోని బౌద్ధ, జైన, తాంత్రిక, ఆరాధనలను, జీవన విధానాన్ని, సంస్కృతిని నిక్షిప్తం చేశారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సామాజిక, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, కాంట్రాక్ట్, రియల్ ఎస్టేట్, భాష, సాహిత్య, సంస్కృతి కళా రంగాల్లో నూతన నాయకత్వం ఎంతో ఎదిగివచ్చింది. తెలంగాణలో ఈ నూతన నాయకత్వం, నూతన కోణాలతో సమస్థ రంగాల్లో వేగంగా అభి వృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు సాగుతున్నది. పాత ముఖాలు పాచిపోయిన ముఖాలు, పాచిపోయిన సిద్ధాంతాలతో, పాచిపోయిన నాయకత్వాలు పెరిగి కొత్త ముఖాలు, కొత్త నాయకత్వాన్ని వెనక్కినెట్టాలని చూసే దౌర్భాగ్య దశ ఇంత తొందరగా రావడం దురదృష్టకరం. తెలంగాణ స్వరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ భాషా, సం స్కృతి, తెలంగాణ మహనీయులు, సంఘ సంస్కర్తల గురించిన చరిత్ర వెలికితీయబడుతున్నది. మలి తెలంగాణ ఉద్యమంలో భాగంగా మొదలైన ఈ ఉద్యమం, వెతుకులాట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సాధికారికతతో వేనోళ్లుగా వెలికితీయబడుతున్నది. వందలాది గ్రంథాలు వెలువడ్డాయి. వేలాది రచయితలు, కళాకారులు, సంస్కర్తలు, మహనీయుల చరిత్ర పుటల నుంచి వెలికితీయడం జరుగుతున్నది. పాఠ్య పుస్తకాలకు ఎక్కడం జరుగుతున్నది. ఇలా తెలంగాణ, భాష, సంస్కృతి, మహనీయులు సమస్త పార్శ్వాల్లో, ఆత్మగౌరవంతో తలెత్తుకొని ముందు కు సాగుతున్నది తెలంగాణ. రవీంద్రభారతి తెలంగాణ కళలకు, తెలంగాణ సినిమాకు, సాహిత్యానికి, సంస్కృతికి నిర్విరామంగా కృషిచేస్తున్న ది. శిల్పారామం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, త్యాగరాయ గానసభ, ప్రెస్‌క్లబ్, నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ కళ్యాణ మండపం వంటి అనేక సాహిత్య, సాంస్కృతిక భవనాలు తెలంగాణ మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలకు సంస్కృతి, భాష పరిరక్షణతో సామాజిక, ఆర్థిక జీవన పునర్నిర్మాణ ఆలోచనలతో సంఘటిత శక్తికి వేదికలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాజకీయాల్లో సమీకరణలు, వర్గీకరణలు సమూలంగా పునరేకీకరణకు గురయ్యాయి. ఇది పక్కనపెడితే.. అసలు తెలంగాణ ఉద్యమం మొదలైంది మొదట భాష, సంస్కృతి, అణిచివేతలకు వ్యతిరేకంగా! భాష, సంస్కృతి అనేది భావ వ్యక్తీకరణకు, స్వీయ అస్తిత్వానికి సంబంధించినది. భాష పోతే అన్నీ పోయినట్టే అం టాడు కాళోజీ.

అలాంటి భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డగించడం అంటే ప్రజాస్వామ్య మూల సూత్రమైన హక్కును హరించడమే. దశాబ్దాలుగా ఈ అణిచివేత, భావ వ్యక్తీకరణను అడ్డుకోవడం కొనసాగుతూ వచ్చా యి. ఇప్పుడు తలెత్తుకొని ఇది మా భాష అంటూ కనుమరుగవుతున్న, ప్రజల్లో ఇంకా నిలిచి ఉన్న తెలంగాణ ప్రజల భాషను వేలాది పదాలను సేకరించి, నిఘంటువులను తయారు చేసుకుంటున్నాం. నలిమెల భాస్క ర్, రవ్వా శ్రీహరి, కాలువ మల్లయ్య, కపిలవాయి లింగమూర్తి మొదలై న వ్యక్తిగత కృషి కొన్ని వేల పదాలను వెలికితెచ్చింది. తెలంగాణ రచయితలు తమ ప్రక్రియల్లో కొన్ని వేల పదాలను అక్షరబద్ధం చేశారు. వీటన్నింటిని ఒక్కచోట సమీకరిస్తూ, తెలుగు విశ్వవిద్యాలయం నేతృత్వంలో లక్షపదాల తెలంగాణ నిఘంటువు రూపుదిద్దుకుంటున్నది. ఇలా తెలంగాణ భాష శతాబ్దాల తర్వాత తిరిగి తలెత్తుకుంటున్నది. నాగార్జునసాగర్‌లో బుద్ధ విహారం ఒక జ్ఞాపికగా కొత్త హంగులతో వందల కోట్లతో దేశ విదేశాల ఆరామాలు, విహారాలతో విరాజిల్లుతున్న ది. వేములవాడ, యాదగిరిగుట్ట వందల కోట్లతో సువిశాలంగా అత్యంత సుందరంగా పవిత్ర పుణ్యక్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా, సెలవుల విడిది గా రూపుదిద్దుకుంటున్న తీరు గతంలో ఎన్నడూ ఊహించలేనిది. వందలాది దేవాలయాలు ఇవాళ దీపం, చమురుతో పూజారుల జీతభత్యాల తో నిత్యం కళకళలాడుతున్నది. తారామతి, బారాదరి, గోల్కొండ, కాకతీయ కట్టడాలు, భద్రకాళి, కాళేశ్వరం, భద్రాచలం, నూతన శోభతో వెలుగొందుతున్నాయి. సమక్కసారక్క జాతర లక్షలాది ప్రజలకు చక్కని ఏర్పాట్లతో కొనసాగుతున్నది. ఆదిలాబాద్ కేస్లాపూర్ నాగోబా జాతర, మెదక్ ఏడుపాయల జాతర, ఖానాపూర్ ఏడుపాయల జాతర, ధర్మపు రి, మంథని, బాసర, గోదావరి, కృష్ణానది పుష్కరాలు ఆత్మగౌరవంతో ఈ నదులు మావే అనే విశ్వాసాన్ని కలిగించే విధంగా స్వీయ అస్తిత్వం, ఆత్మగౌరవం పెరుగుతూ వస్తున్నది. ఇవన్నీ సాంస్కృతిక చైతన్యంలో భాగంగా ముందుకువచ్చాయి. సాంస్కృతిక చైతన్యం, భాషా చైతన్యం లేని, స్వీయ ఆత్మగౌరవ నినాదం లేని రాజకీయ క్రీడ బానిసత్వంలోకి నెట్టివేస్తున్నది.
bs-ramulu
తెలుగు అకాడమీ తరఫున గతంలో ఉన్న పాలకులు తెలంగాణ గురించి, తెలంగాణలోని బహుజనుల గురించి వేసిన పుస్తకాలు ఎన్నెన్ని అని అన్వేషించినప్పుడు కనీసం వంద పుస్తకాలు కూడా లేకపోవడం ఒక విషాదం. తెలంగాణ గ్రంథాలయాల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీల చరిత్ర, సంస్కృతి, జీవనం శతాబ్దాలుగా వారు నిర్మించిన భాష, సంస్కృతి, కళలు, ఉత్పత్తి, నగలు, సమస్థ సంపద సృష్టికర్తలుగా నిర్వహించిన పాత్ర గురించి పట్టుమని వంద పుస్తకాలైనా లేవంటే ఎంత దౌర్భాగ్య మో. అందుకని తొలి విడుతగా తెలంగాణ, భాషా సంస్కృతి సంస్థ, తెలంగాణ సాహిత్య అకాడమీ, కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా కలిసి కొన్ని వందల పుస్తకాలను ఈ నాలుగున్నరేండ్ల కాలంలో ప్రచురించాయంటే తెలంగాణ రాష్ట్రంలోని స్వీయ అస్తిత్వ చైతన్యం కారణంగానే. ఈ స్వీయ అస్తిత్వ చైతన్యం కారణం నేడు సామాజిక వర్గాలు, రాజకీయ క్రీడలు, కొందరి అధికార వాంఛనం, మరికొందరి వలసాధిపత్య పునరేకీకరణ ను, పునర్‌వైభవాన్ని పొందడానికి ఉపయోగపడవచ్చేమో. తెలుగు అకాడమీ వేలాది ప్రచురణల్లో వంద పుస్తకాలైనా తెలంగాణ మెజార్టీ ప్రజల గురించి లేకపోవడం దేన్ని తెలియజేస్తుంది. అందుకని తొలి విడుతగా బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించిన, వారు చరిత్రలో నిర్వహించిన, సమస్థ సం పద సృష్టించిన, తరతరాలుగా సామాజిక ఉద్యమాల్లో, రాజకీయ ఉద్యమాల్లో, సంస్కృతిలో నిర్వహించిన పాత్ర గురించిన గ్రంథాలు ప్రచురించడం అవసరం. అందుకు ప్రత్యేకంగా ఒక అకాడమీ, ప్రచురణ సం స్థల స్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగడం అవసరం.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)

475
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles