యుగానికొక్కడు చంద్రబాబు

Mon,November 12, 2018 11:04 PM

చరిత్ర సృష్టించేవాళ్లని చారిత్రక అవసరాలు తీర్చే అద్భుత వ్యక్తులు యుగానికి ఒక్కరే వస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో శ్రీ చంద్రబాబు! వీరు చారిత్రక అవసరాలు తీర్చే సందర్భంలో ఎవరికీ అలవికాని త్యాగాలు చేస్తారు. రాముడు తన తల్లిదండ్రులను, అయోధ్య ప్రజలను, రాజ్యాన్ని త్యాగం చేశాడు. కృష్ణుడు తన చిన్నతనంలో కన్న తల్లిదండ్రులను, పెద్దయ్యాక రాధని, పెంచిన తల్లిదండ్రులను త్యాగం చేశాడు. మరి చంద్రబాబు వెనక్కి తగ్గుతాడా?

ప్రతి యుగంలో సామాన్య జనాలు లక్షల కోట్లల్లో పుట్టి గిట్టుతుంటారు. ఇరుగు పొరుగులకు, సంఘానికి సేవచేసేవారు వేలల్లో కొందరుంటారు. నెపోలియన్, అబ్రహాం లింకన్ వం టివారు లక్షల్లో ఒకరుంటారు. హిట్లర్ లాంటివారు కోట్లలో ఒక్కరుంటారు. వారు తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టబడి చరిత్ర సృష్టిస్తారు. కాని యుగానికి ఒకే ఒక్కరు పుట్టి చరిత్ర కుంటుపడినప్పుడల్లా సహా యం చేసి ఆ చారిత్రక అవసరాలు తీరుస్తుంటారు. దానికోసం ఎవరి నీ, ఏమీ పట్టించుకోకుండా, అన్నీ త్యాగం చేస్తారు. అంత త్యాగధనులు వీరు! ఇటువంటివారికి సమకాలీనులవడం మనం ఎన్నో జన్మల నుంచీ చేసుకున్న పుణ్యఫలం! ఈ యుగానికి ఆ ఒక్కరూ ఎవరో తెలుసుకుందాం! భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రానంతరం జరిగిన అతిపెద్ద సంఘటన 1975లో ఎమర్జెన్సీ విధింపు. పాపం ఇందిరాగాంధీకి చాలామంది విరోధులయ్యారు. ఆ సమయంలో చిత్తూరుకు చెందిన ఒక చిన్నవాడు తారాజువ్వలా లేని సంజయ్ గాంధీ స్థాపించిన యువ కాంగ్రెస్‌లో సభ్యుడై ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని నిర్దందంగా బలపరిచాడు. ఆ పాతికేళ్ల యువకుడి బలమైన మద్దతుతో ఎమర్జెన్సీ నిరాటంకంగా రెం డేండ్లు కొనసాగింది. అది ఆ అబ్బాయి తీర్చిన మొట్టమొదటి చారిత్రక అవసరం అతనే ఇప్పుడు కాకలుతీరిన రాజకీయ దురంధరుడు నారా చంద్రబాబు నాయుడు. అందరికంటే సీనియర్ రాజకీయనాయకుడు ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ! అలా భారతదేశరాజకీయ రంగంలో అడుగుపెట్టిన చంద్రబాబు సంజయ్‌గాంధీ బతిమిలాడటంతో కాంగ్రెస్ పార్టీని చరిత్రలో బలపరుచటానికి 1978లో ఆ పార్టీ టిక్కెట్టు మీద చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలిచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొట్టమొదటిసారి అడుగుపెట్టాడు. ఏం అడుగు అది! చరిత్ర పులకించింది. బ్రహ్మ కడిగిన పాద మూ అని పాడుకుంది. ఇక ఈ అద్భుతాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 28 ఏండ్ల ఆ నవ యువకుడి సాంకేతికత, సినిమాటోగ్రఫీ విభాగానికి మంత్రిని చేసి తరించింది. చరిత్ర చమత్కారం చూడండి.

చంద్రబాబు గురించి ఒక విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అది వారి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఒక్క ఉదాహరణ చూడండి మీకే అర్థమవుతుంది. మొన్న ఒక మాట సెలవిచ్చారు ఆయన గంభీరంగా. కాళ్ళరిగేట్టు తిరిగి, కష్టపడి హైదరాబాద్‌ను నిర్మించి, బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే, కేసీఆర్ పాలన చేయడం చాతకాకపోతే నేనం చేయను? అని. నవ్వకండి! నవ్వితే తెలుగుదేశం పార్టీ మీద ఒట్టు!

కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించటానికి తీసుకున్న ఆ పదవి ద్వారా నట సార్వభౌమ ఎన్టీఆర్‌కు పరిచయమయ్యాడు చిన్నబాబు. భవిష్యత్ జ్ఞానం పుష్కలం గా ఉన్నవాడు కాబట్టి ఆయన కూతురిని వివాహం చేసుకొని ఇంకొక చారిత్రక అవసరాన్ని తీర్చాడు. కాంగ్రెస్ మీద జాలితో 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసినా, చంద్రబాబును వదులుకోవటానికి చరిత్ర ఒప్పుకోలేదు. అతనికి అసలైన దారి చూపింది. ఆ చారిత్రక అవసరాన్ని గమనించి వెంటనే కాంగ్రెస్ పార్టీని వదిలి మామగారి తెలుగుదేశం పార్టీలో చేరాడు చురుకైన చంద్రబాబు. ఇక చరిత్ర ఆయన బాటలో మల్లెపూలు పరుస్తూపోయింది. 1983లో ప్రభంజనం సృష్టించి గెలిచిన ఎన్టీఆర్‌ను దించి తను సీఎం అవ్వాలని నాదెండ్ల భాస్కరరావు కుట్ర చేయటంతో అల్లుడు బాబు తన రాజకీయ చతురత్వంతో పార్టీ శాసనసభ్యులకు కాపాడుకుని మామగారి పదవి నిలిపాడు. ఇది మరో చారిత్రక అవసరం తీర్చడమే! అయితే ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారంలో ఆయన మీదికి లంఘించి గాయపరిచిన మల్లెల బాబ్జీ అనే అతను తర్వాత అనుమానాస్పదంగా మరణించిన తర్వాత ఒక నిజం బయటపడింది. మామగారి పరువు పెంచటానికి చంద్రబాబే బాబ్జీచేత ఆ నాటకం ఆడించాడని తెలిసినప్పుడు మాత్రం అసలు నాదెం డ్ల నాటకం కూడా చారిత్రక అవసరం అని చంద్రబాబు రచించాడా అని కొందరు అనుమానించారు తర్వాతి కాలంలో. అప్పటికి ఈ యుగ పురుషుడికి పట్టుమని పదేండ్ల అనుభవం కూడా లేదు రాజకీయ రంగంలో. కానీ కారణజన్ములకు ఏం అనుభవం కావాలి చెప్పండి. ఇక 1989లో టీడీపీ ఓడిపోయినా చంద్రబాబు చరిత్ర రాస్తూనే ఉన్నారు. అయితే ఐదేండ్లు కాకుండా చరిత్ర మళ్లీ చంద్రబాబును ఆశ్రయించింది. తాను రక్షించిన మామగారి జీవితంలో ప్రవేశించని స్త్రీని చరి త్ర సహించలేక చంద్రబాబును తనను రక్షించమని వేడుకుంది. ఇక అది చారిత్రకంగా తప్పనిసరి అని గ్రహించిన బుద్ధిజీవి, త్యాగజీవి చం ద్రబాబుకు తనకు పిల్లనిచ్చిన మామగారిని త్యాగం చేయక తప్పలేదు. ప్రపంచమంతా తనను వెన్నుపోటుదారుడు అని నినదించినా, తాను చేసిన త్యాగాన్ని కుట్రగా చిత్రించినా ఈ యుగకర్త వెరవలేదు.

వెనక్కి తగ్గలేదు. 1994 డిసెంబర్‌లో రెండవ సారి ఎన్నిక గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌గారు తప్పుకోవలసిన చారిత్రక అవసరాన్ని శాసనసభ్యులకు, కుటుంబ సభ్యులకు చెప్పి, వారిని ఒప్పించి తను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 1995 సెప్టెంబర్ నుంచి మే 2004 దాకా కష్టపడి ప్రపంచమం తా తిరిగి ఎంతో పకడ్బందీ ప్రణాళికతో మూలబడి ఉన్న హైదరాబాద్ నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే 5వ గొప్ప నగరంగా నిలిపారు సీఎంగా చంద్రబాబు. నాలుగు వందల ఏండ్లు నిజాముల పాలనలో మగ్గి అనామకంగా ఉన్న ఈ నగరానికే కాక అజ్ఞానంతో ఆంధ్ర ప్రాంతంలో కలవనన్న ఈ తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఊపిరి పీల్చుకునేట్టు చేశారు. ఆ తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా ఎన్ని చారిత్రక అవసరాలు తీర్చాడో చూడండి. రైతులకు వ్యవసాయం చేసి కష్టపడే అవసరం తప్పింది, ఈ ప్రాంతంలో నీళ్లు లేక. చిన్నచిన్న వ్యాపారస్తులకు కష్టాలు తప్పాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి చంద్రబాబు స్నేహితులు, బంధువులు హైదరాబాద్, తెలంగాణ అంతా విస్తరించి వ్యాపారాలన్నీ వారే కష్టపడి చేసి ఇక్కడి వ్యాపారులకు సెలవిచ్చారు. ఇక పిల్లల చదువు ల భారం తల్లిదండ్రలుకు లేకుండా, ఆంధ్ర వారి పాఠశాలలూ, కళాశాలలు పిల్లలను పొద్దున్న 8 నుంచి రాత్రి 8 దాకా వారి దగ్గరే అంటిపెట్టుకుని చూసుకున్నారు. ఇలా అందరూ ఆంధ్ర బాబుగారి పాలనలో వారు ప్రపంచబ్యాంక్ నుంచి అప్పు తీసుకుని పరిచిన రోడ్ల మీద, సుందరీకర ణ చేసిన పార్కుల్లోనూ సేదతీరారు. చేసి పనిలేక అందరూ సుఖంగా, తీరికగా కాలం గడిపారు. అయితే అప్పుడప్పుడు చరిత్ర కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. అలా పదేండ్ల పాటు 2014 దాకా ఏ రకమైన చారిత్రక అవసరమూ రాలేదు. మళ్ళీ ఏపీలోంచి తెలంగాణ విడిపడి రాష్ట్రమయ్యాక, ఆంధ్రప్రాంతానికి సీనియర్ మోస్ట్ రాజకీయ నేత అవసరాన్ని ఎన్నికల్లో గెలిచి ముఖ్యమం త్రి అయి తీర్చారు చంద్రబాబు. ఇక ఇంద్రుడు పాలించిన అమరావతి నగరాన్ని హైదరాబాద్‌ను మించేటట్టు ప్రణాళికలు ప్రారంభించారు. ఇం కా డిజైన్లు చేస్తున్నారు.

మళ్ళీ గెలువడమంటూ జరిగితే ఈ అయిదేండ్లు, మరో నాలుగేండ్లు, తొమ్మిదేండ్లలో హైదరాబాద్‌ను నిర్మించినట్టే అఖండంగా, అద్భుతంగా నిర్మిస్తాడు. మరి రాజధాని నిర్మాణం చారిత్రక అవసరం కదా! ఇక ఇప్పుడు చరిత్ర మళ్లీ చంద్రబాబు కోసం ఆక్రోశిస్తోంది. ఇది చిన్న రాష్ర్టాల కోసం కాదు, దేశం కోసం. రాజకీయరంగంలో అందరికంటే సీనియర్ అయిన నేత కోసం తపిస్తోంది. 2014లో స్కాంగ్రెస్ భవిష్యత్తు చూసిన చంద్రబాబు మోదీని ప్రధాని చేసి, ఈ నాలుగేండ్లు పరిపాలన ఎలా చేయాలో ఆయనకు నేర్పాడు. ఇక ఇప్పుడు కలిగిన చారిత్రక అవసరం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చరిత్ర ఆదేశించినట్టే రాహు ల్ సరసన చేరాడు. అయినా 1975 నుంచీ ఎనిమిదేండ్లు కాంగ్రె స్ మనిషేగా ఆయన! అందుకే రాహుల్ చంద్రబాబుకు ఇంకో ప్రామిస్ చేశారు. ఈ మధ్య లోకేష్ బాబు ఏం మాట్లాడినా తప్పుపట్టి పరిహసిస్తున్నారు కిట్టనివాళ్లు, చంద్రబాబు చరిత్ర తెలియన వాళ్లు. ఆయన బాధ చూసి రాహుల్ లోకేశ్‌కు తానే స్వయంగా శిక్షణనిస్తానని భరోసా ఇచ్చాడట. మరి భవిష్యత్ ముఖ్యమంత్రి కూడా చారిత్రక అవసరాలు తీర్చాలి కదా! చరిత్ర సృష్టించేవాళ్లని చారిత్రక అవసరాలు తీర్చే అద్భుత వ్యక్తులు యుగానికి ఒక్కరే వస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో శ్రీ చంద్రబాబు! వీరు చారిత్రక అవసరాలు తీర్చే సందర్భంలో ఎవరికీ అలవికాని త్యాగాలు చేస్తారు. రాము డు తన తల్లిదండ్రులను, అయోధ్య ప్రజలను, రాజ్యాన్ని త్యాగం చేశా డు. కృష్ణుడు తన చిన్నతనంలో కన్న తల్లిదండ్రులను, పెద్దయ్యాక రాధ ను, పెంచిన తల్లిదండ్రులను త్యాగం చేశాడు. మరి చంద్రబాబు వెనక్కి తగ్గుతాడా? ఆదరించిన మామను, అవసరమైనప్పుడల్లా పార్టీలని, సిద్ధాంతాలను, వ్యక్తులను.. ఎన్నింటినో త్యాగం చేశాడు.
prof-kanaka-durga
మరి యుగానికొక్కడు కదా! చంద్రబాబు గురించి ఒక విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అది వారి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఒక్క ఉదాహరణ చూడండి మీకే అర్థమవుతుంది. మొన్న ఒక మాట సెలవిచ్చారు ఆయన గంభీరంగా. కాళ్ళరిగేట్టు తిరిగి, కష్టపడి హైదరాబాద్‌ను నిర్మించి, బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే, కేసీఆర్ పాలన చేయడం చాతకాకపోతే నేనం చేయను? అని. నవ్వకండి! నవ్వితే తెలుగుదేశం పార్టీ మీద ఒట్టు! ఇంకా వీరిద్దరి పాలన మీద సందేహాలుంటే ఒక్క ట్రిప్పు వేయండి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి, అమరావతి నగరానికి.

652
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles