మేధావులు ‘దివాంధులు’ కావద్దు

Thu,November 8, 2018 10:51 PM

మనం 21వ శతాబ్దంలోకి ప్రవేశించిన తర్వాత తెలంగాణలో రెండు దశలు కన్పిస్తాయి. 2000 నుంచి 2014 వరకు మొదటిది. 2014 తర్వాతది రెండవది. మొదటిది ఉద్యమ దశగా ఉన్నప్పుడు మేధావులు అధ్యయనాలు చాలానే చేశారు. అవన్నీ గొప్పవి అనలేముగాని తగినంత మంది ప్రయత్నాలు మాత్రమే చేశారు.

మేధావులు తమ సమాజంలో జరుగుతున్న మంచి చెడులు రెండింటిని కూడా అధ్యయనం చేయాలి. మంచిని ప్రోత్సహించాలి. చెడును ఎత్తి చూపాలి. అది మారేందుకు నిర్మాణాత్మక సూచనలు చేయాలి. ఇవన్నీ సమాజం దృష్టికి తీసుకువెళ్లాలి. ఇం దులో పాలకులు దేనినెట్లా స్వీకరించినా ప్రజల అవగాహనలు పెరుగుతాయి. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు వారే. తెలంగాణ మేధావు లు ఈ విధమైన తమ పాత్రను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు? వారిలో కన్పిస్తున్నది అధిక భాగం అధ్యయనాలు లేకపోవటం, సినిసిజం, నెగెటివిజమే. ఇది విచారాన్ని కలిగిస్తున్న స్థితి. మనం 21వ శతాబ్దంలోకి ప్రవేశించిన తర్వాత తెలంగాణలో రెండు దశలు కన్పిస్తాయి. 2000 నుంచి 2014 వరకు మొదటిది. 2014 తర్వాతది రెండవది. మొదటిది ఉద్యమ దశగా ఉన్నప్పుడు మేధావులు అధ్యయనాలు చాలానే చేశారు. అవన్నీ గొప్పవి అనలేముగాని తగినంత మంది ప్రయత్నాలు మాత్రమే చేశారు. వారి స్ఫూర్తితో హైదరాబాద్ నుంచి కిందిస్థాయి వరకు మామూలు చదువులు చదివినవారు కూడా విషయ పరిశీలనకు ప్రయత్నించారు. అందులో లోతు ఉండకపోవచ్చు. కానీ గుర్తించవలసింది ఏమంటే అధ్యయనం అన్నది మేధావుల నుంచి మామూలు చదువుల వారిదాకా ఒక సంస్కృతిగా మారింది. రెండవ దశ వచ్చేసరికి ఈ సంస్కృతి ఏమైంది? చాలావరకు బలహీనపడిపోయింది. మేధావులు అయినవారు తమ చుట్టూ అందుబాటులో ఉండే సమాచారాన్ని, సరిగా, శ్రద్ధగా చదువటం తో పాటు, స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలనలు చేయాలి. సమాచారాలు అందుబాటులోకి అనేక విధాలుగా వస్తుంటాయి. అవి ప్రభుత్వం ద్వారా కావచ్చు, మీడియా నుంచి కావచ్చు, పలువురి నుంచి విన్నవి కావచ్చు, ప్రతిపక్షాల విమర్శల రూపంలో కావచ్చు.

నికరమైన, నికార్సయిన పరాన్న భుక్కులుగా జీవితాలను వృథా చేసుకుంటున్నవారితో తెలంగాణ నెమ్మదిగా ఒక మేధో ఎడారిగా మారుతున్నది. ఆత్మపరిశీలన చేసుకొని మారండని వారికి విజ్ఞప్తి చేయటం ఒక్కటే ఈ దశలో మిగిలిన విషయం.

వీటిలో ఏది కూడా పూర్తి సత్యమో, పూర్తి అసత్యమో అయ్యే అవకాశం లేదన్నది మనకు ఇంగితజ్ఞానం చెప్పేమాట. ఈ విషయం సామాన్యుల కన్న మేధావులైన పరిశోధకులకు ఇంకా బాగా తెలుసు. అటువంటి స్థితిలో ఆయా సమాచారాల్లోని నిజానిజాలు తెలియగలది క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా మాత్రమే. లేదా అధమ పక్షంలో, భిన్న సమాచారాలను సరిపోల్చుతూ తమ వైపు నుంచి క్లిష్టమైన విచారణలు, విశ్లేషణలు చేయటం. పరిశోధనారంగంలో ఈ రెండు పద్ధతులను కూడా అనుసరిస్తుంటారన్నది తెలిసిన విషయమే. వీరిలో మొదటిది అత్యుత్తమం కాగా, రెండవది ఉన్నంతలో ఉత్తమం. మొత్తం మీద, ఈ రూపాల్లో అధ్యయనాలు జరిపి అభిప్రాయాలను ప్రకటించటమే మేధావితనానికి గీటురాయి అవుతుంది. అటువంటి పని జరిగినప్పుడు అందువల్ల రెండు విధాలైన మేళ్లు కలుగుతాయి. ప్రజలకు విషయాలపై తగిన దృక్పథం, అవగాహన ఏర్పడి వారు తమ అభిప్రాయానికి తాము స్వేచ్ఛగా రాగలగటం వాటిలో ఒకటి. మేధావులు జరిపే అటువంటి అధ్యయనాల ప్రేరణతో, మామూలు చదువుల వారు కూడా విషయాలను అదే పద్ధతిలో పరిశీలించేందుకు అలవాటు పడటం రెండవది. ఇటువంటివి ఎంతగా జరిగితే సమాజం, ప్రజాస్వామ్యం అంతగి పరిపుష్టమవుతారు. ప్రజలు స్వేచ్ఛగా, చైతన్యంతో, సరైన ప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 2014 నుంచి తెలంగాణ రెండవ దశలోకి ప్రవేశించినప్పుడు, విషయాలు క్రమంగా ఈ దిశగా వెళ్లవచ్చునని ఒక ఆశ కలిగింది. లేదా వెళ్లాలనే కోరిక కలిగింది. మన జీవిత కాలంలోనే తెలంగాణకు ముందు మూడు రాష్ర్టాలు ఉద్యమాల ద్వారా ఏర్పడ్డాయి. అవి ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, వీటిలో ముఖ్యంగా ఝార్ఖండ్ అయితే బ్రిటిష్ వల స పాలనపై సంతాలులు తిరుగబడినప్పటి నుంచి మొదలుకొని, స్వాతంత్య్రానంతరం తమ సహజ వనరులను ఇతరులు కొల్లగొట్టి తమకు పేదరికాన్ని మిగల్చటంపై రకరకాల ఉద్యమాలు జరుపటం వరకు ఒక ఉజ్వలమైన చారిత్రక వారసత్వం గల ప్రాంతం.

కాని కొత్త రాష్ర్టాలుగా ఏర్పడిన తర్వాత అన్ని ఉద్యమ వారసత్వాలూ ఉఫ్‌మని ఊదిన దీపాల్లా ఆరిపోయాయి. మన ప్రస్తుత చర్చ మేధావుల పాత్ర గురించి అయినందున, అది కూడా అంతే నిరాశాజనకంగా మారింది. ఇప్పుడక్కడ అధ్యయనా లు జరుపుతున్న మేధావులు, ప్రజలకు వాటిని అందజేస్తున్నవారు ఒక చేతివేళ్లకు మించి ఉన్నట్లు లేరు. అదే నిస్పృహకరమైన వాతావరణం మేధావులు కాకుండా మామూలు చదువులు చదివిన వర్గాల్లోనూ వ్యాపించింది. అయినా, మేధావులు అనే వర్గీకరణలోకి వచ్చేవారి పరిస్థితే ఆ విధంగా ఉన్నప్పుడు ఇతరులను నిందించబూనటం అవివేకమవుతుంది. మేధావులు ఏవో ఉద్యమాలు చేయాలని ఇక్కడ ప్రత్యేకంగా అనటం లేదు. పైన పేర్కొన్న మూడు రాష్ర్టాల్లో ఒక అధ్యయన సంస్కృతిని, ప్రజాస్వామిక చైతన్యాన్ని సృష్టించే కనీస పాత్ర నుంచి కూడా వారు తప్పుకున్నారు. అదొక పెద్ద విషాదం. ఆ స్థితితో పోల్చినప్పుడు తెలంగాణలో ఏం జరుగుతున్నది? యథాతథంగా పరిపాలనారంగా, సామాజికంగా అనేకం కన్పిస్తున్నాయి. పరిపాలనను చూసినప్పుడు ప్రకటిస్తున్నవి, జరుగుతున్నవి, జరుగనివి. సామాజికంగా చూసినప్పుడు మెరుగుపడుతున్న లక్షణాలు, క్షీణిస్తున్న ధోరణులు. గతంలో లేనివిధంగా వస్తున్న రకరకాల హీన సంస్కృతులు. బలహీనపడటమే గాక వికృతం గా మారుతున్న కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, నైతికతలు. వ్యక్తిగత నైతికతా రాహిత్యాలు సామూహిక నైతికతా రాహిత్యాలుగా మారుతూ భయం గొలుపుతుండటం.

వీటన్నింటి మధ్య తెలంగాణ మేధావులు ఏం చేస్తున్నారు? పరిపాల న గురించి గాని, సామాజిక ధోరణుల గురించి గాని అందుబాటులో గల సమాచారాలను సరిగా, శ్రద్ధగా చదువుతున్నారా? అంతకుమించిన సమాచారాల కోసం పట్టణాలలోని, గ్రామాలలోని సమాజం వద్దకు కూడా ఏమైనా వెళుతున్నారా? తాము నేర్చిన వివిధ అకడమిక్ థియరీలు, సిద్ధాంతాలు, చదివిన లోకజ్ఞానాల వెలుగులో వాటినేమైనా పరిశీలిస్తున్నారా? క్లిష్టమైన దృష్టితో విశ్లేషించి సామాజికులకు తెలియజెప్తున్నారా? మినహాయింపులు కొద్దిగా ఉండవచ్చుగాని అధిక సంఖ్యాకులు ఇదేమీ చేయటం లేదు. ఇటు పరిపాలనలో, అటు సమాజంలో ఏమి జరుగుతున్నదో తెలుసుకునేందుకు వారిలో అధికులు అసలు పత్రికలు సరిగా చదువటం లేదు. వార్తలు పైపైన చూస్తారు. అప్పటికే తమకు గల అభిప్రాయాలతో కలిపిచూసి ఒక తుది అభిప్రాయానికి వచ్చి వేస్తారు. ఒకటికి మించిన పత్రికలతో పోల్చిచూడటం ముఖ్యమైన పరిణామాలకు సంబంధించి కూడా ఉండదు. తమకు తమ ఉద్యోగాలు, ఇతర పనులు ఉంటాయి గనుక ఇదంతా మరీ కూలంకషంగా వీలు కాదని ఒప్పుకోవచ్చు. కాని ముఖ్యమైన విషయాల్లోనైనా అటువంటి పనిని ఒక విధంగా చేయటం మేధావులుగా వారికి గల తప్పనిసరి బాధ్యత. విచిత్రమేమంటే ఇదంతా తమ బాధ్యత అని వారు అనుకోవటమైనా లేదు. ఆ బాధ్యతలో భాగంగా ఏమేమీ తెలుసుకొని, ఏ విధంగా అధ్యయనాలు జరిపి, సమాజానికి ఏమేమి తెలుసుకుని, ఏ విధంగా అధ్యయనాలు జరిపి, సమాజానికి ఏ విధంగా చేరవేయాలనే ఆలోచన, ప్రణాళిక ఏవీ వారికి లేవు. అది ఉంటే, అవి చేయనందుకు ఆ లోపాన్ని తమకు తాము గుర్తించుకునేవారు. అటువంటి లోపంతో వ్యవహరిస్తున్నందుకు తమను తాము దోషులుగా భావించుకునేవారు. అటువంటి గుర్తింపు, భావన గలవారు ఆ స్థితి నుంచి బయట పడేందుకు ఏదో ఒకరోజు, ఎంతో కొంత ప్రయత్నాన్ని పశ్చాత్తాపంతో ఆరంభిస్తారు.
t-ashok
ఇక వీరి క్షేత్రస్థాయి పరిశీలన గురించి అయితే మాట్లాడకపోవటం మంచి దేమో. ఆర్థిక వనరులకు, సమయానికి కొంత ఏమీ లేకున్నా ఈ తరహా మేధావి వర్గాలకు వాటితో జీవితానందాలను అనుభవించటం మినహా, వాస్తవాలను కనుగొని అధ్యయనం చేయకుండా యథేచ్ఛగా తమ అజ్ఞానాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శించటాన్ని కూడా అటువంటి జీవితానందంలో ఒక భాగంగా తీసుకోవటం తప్ప వీరు మరొకటి చేస్తున్నట్లు కన్పించదు. ఆ విధంగా నికరమైన, నికార్సయిన పరాన్న భుక్కులుగా జీవితాలను వృథా చేసుకుంటున్నవారితో తెలంగాణ నెమ్మదిగా ఒక మేధో ఎడారిగా మారుతున్నది. ఆత్మపరిశీలన చేసుకొని మారండని వారికి విజ్ఞప్తి చేయ టం ఒక్కటే ఈ దశలో మిగిలిన విషయం.

520
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles